Skip to main content

Posts

Showing posts with the label NATIONAL

చేతులు కడిగారా? చేతులు కలిపారా?

ఊరక రారు మహానుభావులన్నట్లు ఢిల్లీ నుండి ఓ పెద్దాయన వచ్చాడు. చాలా పెద్ద రాచకార్యానికి వచ్చిన ఆ పెద్దాయన.. జూనియర్ ను పిలిపించుకొని ముచ్చటించాడు. పెద్దవాళ్లు పెద్దపెద్ద టాపిక్‎లు మాట్లాడుకోవాలి గానీ.. కుర్రాళ్లతో మాట్లాడుకునే టాపిక్స్ ఏముంటాయబ్బా.. అని గల్లీ లెవల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. అసలే ఆ పెద్దాయనకు అగ్గిపుల్ల స్వామి అనే పేరొకటి ఉంది. మరి అలాంటప్పుడు కాక మీదున్న కుర్రాణ్ని అగ్గిపుల్ల స్వామి కలిస్తే.. అగ్గి రాజుకోకుండా ఎలా ఉంటుంది?  Also Read:  పవన్‎కు, చంద్రబాబుకు చెక్ పెట్టేశారా? Also Read:  వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి కేంద్రహోంమంత్రి అమిత్ షా.. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ల భేటీపై తెలుగు రాజకీయాల్లో రేగిన చర్చ రచ్చ రచ్చ అవుతోంది. ఈ మీటింగ్ పై ఎవరికి తోచినవిధంగా వారు మాట్లాడుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు అబ్బురపడి ఆయన్ని పిలిపించుకుని అమిత్ షా శెభాష్ అంటూ కితాబిచ్చారని పైకి చెబుతున్న మాటలు.. కామెడీగా తేలిపోతున్నాయి. అదే నిజమైతే మరి రామ్‎చరణ్ ను, సినిమా దర్శకుడు రాజమౌళిని ఎందుకు పిలవలేదన్న ప్రశ్నలకు బీజేపీ నేతల దగ్గర సమాధానం దొరకటం లేదట. ఏమో మాకేం తెలుస

పవన్‎కు, చంద్రబాబుకు చెక్ పెట్టేశారా?

జూనియర్ ఎన్టీఆర్, బీజేపీ నేత అమిత్ షా భేటీ రాజకీయవర్గాల్లో చాలా ఆసక్తి రేపుతోంది. వారేం మాట్లాడుకున్నారన్నది బయటకు పొక్కకపోయినా.. కచ్చితంగా రాజకీయ ప్రాధాన్యమైన అంశాలు చర్చకు వచ్చి ఉంటాయని అంతా భావిస్తున్నారు. అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధహస్తుడనే పేరున్న అమిత్ షా.. తన విలువైన సమయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో షేర్ చేసుకోవడం అనేక కోణాల్లో చర్చనీయాంశంగా మారింది.  బీజేపీ టాప్ లీడర్, టాప్ స్ట్రాటజిస్ట్ అమిత్ షా.. నోవోటెల్ హోటల్లో ప్రముఖ తెలుగు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తో డిన్నర్ చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. టీడీపీ గెలుపు కోసం, దగ్గరి బంధువైన చంద్రబాబు కోసం ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీతో పాటు చంద్రబాబునాయుడుతో కూడా ఆయన ఎడం పాటిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఎన్టీఆర్ ను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టాకే.. పవన్ కల్యాణ్ తో చెట్టపట్టాలు వేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఈ క్రమంలో తన సినిమా ప్రాజెక్టుల్లో బిజీగా ఉంటూ.. రాజకీయాల్లో పూర్తి నిశ్శబ్దం పాటిస్తున్న ఎన్టీఆర్.. అమిత్ షా ను కలవడం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపు

లేటు వయసులో రతన్ టాటా కొత్త ప్రాజెక్టు

లాభాపేక్షతో కాకుండా మానవీయ కోణంలో ఆలోచించే ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరో కొత్త కాన్సెప్టును అనౌన్స్ చేశారు. ఒంటరిగా బతుకులు వెళ్లదిస్తూ.. తమకోసం ఎవరూ లేక, తాము ఎవరికీ పట్టక తమలో తామే కుమిలిపోయే సీనియర్ సిటిజన్ల కోసం ఓ స్టార్టప్ సంస్థను ప్రారంభించారు. గుడ్ ఫెలోస్ పేరుతో ఈ స్టార్టప్ సంస్థ ఇప్పటికే ముంబైలో ప్రారంభమైంది. ముంబైలో పైలట్ ప్రాజెక్టు మాదిరిగా 20 మంది వృద్ధులకు సపర్యలు చేస్తూ.. వారికి శేష జీవితం ఎంతో ఆనందంగా సాగేలా ప్రాజెక్టు పనిచేస్తోంది. తదుపరి ఫేజ్ లో పుణే, చెన్నై, బెంగళూరుల్లో సేవలు ప్రారంభిస్తామన్నారు రతన్. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా వృద్ధుల కోసం పని చేసే యువకుల్ని తీసుకుంటారు. వారితో ఎంజాయ్ చేస్తూ, ఆడుతూ పాడుతూ.. మెరుగైన సమయం కేటాయించడం ఈ వర్క్ లో ముఖ్యోద్దేశం. క్యారమ్స్, చెస్ లాంటి ఇన్-హౌజ్ గేమ్స్ ఆడించడం, అవసరమైతే సీనియర్ సిటిజన్ల పక్కనే నిద్రించడం చేయాల్సి ఉంటుంది. ఈ స్టార్టప్ కోసం రతన్ టాటా పెద్దమొత్తంలోనే పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఎంతమొత్తం పెడుతున్నారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఆలనాపాలనాకు నోచుకోని వీధికుక్కల పట్ల కూడా రతన్ టాటా ఎంతో శ్రద్ధ చూపిస

భారతీయుడి శౌర్య 'ప్రతాపం'.. స్పెషల్ స్టోరీ

భారతీయ దేశభక్తుల్లో మహారాణా ప్రతాప్‎కు బహుశా ఎవరూ సాటిరారు. జననీ జన్మభూమిశ్చ.. అనే మాటను కలియుగంలో అక్షరాలా పాటించిన మహా సేనాని ఆయన. లంకలోని అందాలకు మోహితుడైన లక్ష్మణుడు.. రావణ సంహారం తరువాత అక్కడే ఉండిపోదామని అన్నతో అంటే.. అప్పుడు రాముడి నోటి నుంచి వచ్చిన వాక్యమే "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ". కన్నతల్లి, జన్మనిచ్చిన భూమి.. ఆ రెండూ కూడా స్వర్గం కన్నా మహిమాన్వితమైనవి అంటాడు రాముడు. అలాంటి రాముడి వంశానికి చెందిన రాణాప్రతాప్.. చివరి శ్వాస వరకూ మాతృభూమి రక్షణ కోసమే పోరాడాడు. స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా.. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీరుడి గాథ.  రాణాప్రతాప్.. కాదుకాదు.. మహారాణా ప్రతాప్. ఆయన పేరు చెప్పగానే దేశాన్ని ప్రేమించేవారికి ఎక్కడా లేని చైతన్యం ఆవహిస్తుంది. జాతీయతా స్ఫూర్తి ప్రదర్శనలో ఎన్ని కష్టాలు ఎదురైనా సహించే ఓర్పు సమకూరుతుంది. మనదేశ పాఠ్యపుస్తకాల్లో ఆయనకు పెద్దగా చోటు దక్కకపోవచ్చు. ఎడారి దేశాల నుంచి వచ్చిన దారిదోపిడీగాళ్లకే వారి పేర్ల ముందు 'ద గ్రేట్' అన్న తోకలు తగిలించుకొని ఉండవచ్చు. కానీ చరిత్ర పుటల్లో రాణాప్రతాప్‎కు దక్కిన స్థానం అజరామరం. దేశం కోసం ఆయన చే

ఉర్రూతలూగించే ఉయ్యాలవాడ వీరగాథ (సచిత్రంగా)

భార‌త స్వ‌ాతంత్ర్య పోరాట‌ తొలి గ‌ర్జ‌న ఆయన‌ది. సీమ పౌరుషానికి ప్ర‌తీక ఆయ‌న‌. ఆయ‌న పేరు చెబితే ఇంకా మీసం మొలవని కిశోరాలు కూడా మూతి మీద చెయ్యేసుకుని పొంగిపోతారంటే అతిశయోక్తి కాదు. ఆయనే.. ర‌వి అస్త‌మించ‌ని బ్రిటిష్ సామ్రాజ్య‌పు కోట‌ల‌కు బీట‌లు పెట్టిన సీమ సింహం ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. అద్భుతమైన ఆయన పోరాటానికి చ‌రిత్ర‌లో ప్రముఖ స్థానం దక్కకపోవచ్చు గానీ.. రాయల‌సీమ గ్రామాల్లో ఆయ‌న కీర్తి అజ‌రామ‌రం. ఆజాదీ అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఆ వీరుడి వీర‌గాథ ప్రస్తుత కాలానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. Also Read: వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి Also Read:  భారతీయుడి శౌర్య ప్రతాపం మహారాణా ఉయ్యాలవాడ పేరు చెబితేనే నరనరానా ఉద్యమ స్ఫూర్తి రగులుతుందంటారు రాయలసీమ ప్రజలు. ఆయన పోరాట పటిమ, పౌరుష పరాక్రమాల గురించి స్థానిక భాషలో పాటలు కట్టి పాడుకుంటారు. ఇప్పటికీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పతనంపై పాటలు వినిపిస్తుంటాయి. భ‌ర‌త‌మాత దాస్య‌శృంఖ‌ల విముక్తి కోసం తెల్ల దొర‌ల‌పై తెగ‌బ‌డిన ఖ‌డ్గం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది. తెల్ల‌టి గుర్రం.. చేతిలో నాట్య‌మాడే క‌త్తి.. పౌరుషానికి ప్ర‌తీక‌గా మెలితిరిగిన మీసం.. సీమ‌లో పౌరుషాగ

రాష్ట్రపతి విలాసాలు.. రాష్ట్రపతి భవన్ విశేషాలు

ఒక్క భారతదేశంలోనే కాదు.. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికవడం అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అత్యంత దిగువ స్థాయి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తొలి గిరిజన మహిళగా.. ఆమె దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహిస్తున్నారు. అంతేనా? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రథమ పౌరురాలిగా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ముకు లభించబోయే అధికారాలేంటి? ప్రభుత్వం నుంచి అందుకునే జీతభత్యాల వివరాలేంటి? ఇతర ప్రత్యేకమైన సదుపాయాలేంటో ఓసారి చూద్దాం. దేశంలో అత్యంత వెనుకబడ్డ గిరిజన తెగ నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము గురించే ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దేశం అనుసరిస్తున్న అత్యున్నతమైన ప్రజాస్వామ్య విధానానికి ఆమె ఎన్నికే ఓ గీటురాయిగా నిలుస్తోందంటున్నారు రాజ్యాంగ నిపుణులు. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాకు చెందిన ద్రౌపది ముర్ము ఎన్నో అవరోధాలు అధిగమించి ఈ స్థాయికి ఎన్నికవడంతో యావత్ గిరిజన జాతి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆమె రాష్ట్రపతిగా వేతనం ఎంత అందుకుంటారనేది ఓ ఆసక్తికరమైన అంశంగా మారింది. భారత రాష్ట్రపతి నెలకు 5 లక్షల వేతనం అందుకుంటారు. నెల వ

భాగ్యలక్ష్మి ఆలయానికి ఇంపార్టెన్స్ అందుకేనా?

బీజేపీ నేతలు చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించుకోవడం చాలా ఇంట్రస్టింగ్ అంశంగా మారింది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచే హైదరాబాద్ ఓటర్లకు, బీజేపీ మద్దతుదార్లకు, హిందూ సమాజాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కూడా యోగి అమ్మవారిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఈసారి ప్రధాని మోడీ కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ దర్శించుకుంటారని భావించినా.. సమయాభావం వల్ల అది కుదరలేదని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. అంతకుముందు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా వినాయక నవరాత్రుల సమయంలో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. మరి.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. భాగ్యలక్ష్మి అమ్మవారినే ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకున్నారన్న ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.  బీజేపీ నేతల హిడెన్ ఎజెండాలో హైదరాబాద్ పేరు మార్చే ప్రక్రియ ఉందన్న అభిప్రాయాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ నేతల సందర్శన కూడా అదే విషయాన్ని రుజువు చేస్తోంది. హైదరాబాద్ ను భాగ్యనగరంగ

బలపరీక్ష జరిగితే అంతా తారుమారే

దాదాపు వారం రోజులుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న  మహా రాజకీయంలో ఇవాళ చాలా కీలకమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. గౌహతిలో క్యాంపు నిర్వహిస్తున్న రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనుకున్న శివసేనకు సుప్రీంకోర్టు నుంచి భంగపాటు ఎదురైంది. రెబల్ ఎమ్మెల్యేలంతా ఇవాళ సాయంత్రం ముంబైకి రావాలని, వారిపై చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలంటూ.. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ నోటీసులు పంపారు. మరోవైపు శాసనసభా పక్ష నేతగా ఉన్న రెబల్ ఎమ్మెల్యే ఏక్‎నాథ్ షిండే స్థానంలో అజయ్ చౌదరిని నియమిస్తూ డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ షిండే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో కోర్టులో పిటిషన్ ఎదుర్కొంటున్న డిప్యూటీ స్పీకర్‎కు అనర్హత వేటు వేసే అధికారం లేదంటూ.. దానిపై వివరణ ఇవ్వడానికి జులై 11 వరకు సుప్రీంకోర్టు గడువు విధించింది. దీంతో రెబల్ ఎమ్మెల్యేలపై తక్షణమే వేటు పడకుండా ఊరట లభించినట్లయింది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వానికి, శివసేన శాసనసభాపక్ష నేతకు, చీఫ్‌ విప్‌కు, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వారందరూ తన నోటీసులకు 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు రెబల్ ఎ

ఢిల్లీలో చైనీయుడి భారీ కుట్ర

ఢిల్లీలో రెండేళ్లుగా అక్రమంగా ఉంటున్న ఓ చైనీయుడి ఉదంతం వెలుగుచూసింది. జు-ఫీ అనే చైనా దేశీయుడు రెండేళ్లుగా గ్రేటర్ నోయిడాలో అత్యంత విలాసవంతమైన ఓ క్లబ్ నిర్వహిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్‎కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వాధికారుల కళ్లు కప్పి నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఓ ఐపీఎస్ అధికారి అనుమానంతో దాని మీద అధికారులు రైడ్ చేయడంతో విషయం వెలుగుచూసింది. జు-ఫీతో పాటు నాగాలాండ్ కు చెందిన పెటిఖ్రినో అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మరో ముగ్గురు ఇండియన్స్, ఒక చైనీయుడు తప్పించుకొని పారిపోయారు. క్లబ్బులో 70 రూములు, అత్యాధునిక సీసీటీవీలు అమర్చారు. ఫేక్ వీసా డాక్యుమెంట్లతో జు-ఫీ ఇక్కడే తిష్టవేసి ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సైన్యాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి దేశ రహస్యాలు సేకరించే పనిలో జు-ఫీ ఉన్నాడన్న అనుమానాలతో విచారిస్తున్నారు. అయితే మూడు రోజులుగా విచారణ సాగుతున్నా జు-ఫీ నోరు విప్పడం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి ఇప్పటికే విలువైన సమాచారం చేరవేసి ఉంటాడని భావిస్తున్నారు. చైనా నుంచి ఇండియాకు, ఇండియా నుంచి చైనాకు రావాలంటే

ఉద్ధవ్ ను రాజీనామా చేయొద్దన్న పవార్... అయినా..

మహా రాజకీయం మహా సంక్షోభాన్ని తలపిస్తోంది. ఏక్‎నాథ్ షిండే క్యాంపులో ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుండగా.. ఉద్ధవ్ శిబిరం వెలవెలపోతోంది. ఉద్ధవ్ థాక్రే నిన్ననే అధికార నివాసాన్ని ఖాళీ చేయడంతో ఆయన రాజీనామా చేయడం ఇక లాంఛనమే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికారికంగా శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు, ఎన్సీపీకి 53 మంది, కాంగ్రెస్ కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారానికి మేజిక్ ఫిగర్ 144 సంఖ్య సరిపోతుండగా.. ఇండిపెండెంట్లు, స్థానిక పార్టీలు కలుపుకొని.. 169 సంఖ్యతో మహా వికాస్ అఘాడీ పేరుతో కూటమి సభ్యులు అధికారాన్ని ఎంజాయ్ చేశారు. అయితే అసంతృప్త నేత ఏక్‎నాథ్ షిండే తిరుగుబావుటా ఎగరేయడంతో.. సంక్షోభానికి తెర లేచింది. 42 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పాలిత అసోంలోని గౌహతిలో ఆతిథ్యం పొందుతూ.. క్షణక్షణం అధికార శివసేనలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. శివసేన రెబల్ ఎమ్మెల్యే షిండే చాలా కీలకంగా మారిపోయారు. తన దగ్గరున్న సంఖ్యతో బీజేపీతో పాటు శివసేన రెబల్ అభ్యర్థులతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులభమైపోయింది. ఈ సంక్షోభాన్ని ఆలస్యంగా గుర్తించిన శివసేన, ఎన్సీపీ నేతలు.. నష్టనివారణ చర్యలకు పూనుకున్నా ఆ ప్రక్రియలేవీ సుసాధ్యంగా కనిపించడం

కొత్తగా తయారవుతున్న మావోయిస్టుల హిట్ లిస్ట్

ఎన్.ఐ.ఎ... నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అంతర్గత శాంతిభద్రతల కోసం నిరంతరం పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ. తీవ్రవాదులు, ఉగ్రవాదుల కదలికలపై పూర్తి నిఘా పెట్టి వారిని మట్టుపెట్టే పకడ్బందీ సంస్థ. దాని వెబ్ సైట్ లో వివరాలు కూడా ఎప్పటికప్పుడు అప్-డేట్ చేస్తూంటారు. అయితే కొందరు కీలకమైన మావోయిస్టు నేతలు చనిపోయి చాలాకాలం అవుతున్నా.. వారి పేర్లను మాత్రం ఇంకా తొలగించలేదు. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్.కె... ఆయన మావోయిస్ట్ కేంద్రకమిటీ సభ్యుడిగా పని చేశారు. ఇక యాపనారాయణ అలియాస్ హరిభూషణ్. ఈయన మావోయిస్ట్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. అయితే గత సంవత్సరమే వారు చనిపోయారు. అయినా ఎన్.ఐ.ఎ మాత్రం వారి పేర్లను ఇంకా మోస్ట్ వాంటెడ్ జాబితాలోనే ఉంచింది.  ఆర్కే, హరిభూషణ్ తో పాటు మరికొందరు తెలుగువారు కూడా ఎన్.ఐ.ఎ. హిట్ లిస్టులో ఉన్నారు. ఈ సంవత్సరం మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నవారిపై రివార్డులు పెరుగుతాయని పోలీసు శాఖ చెబుతోంది. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్లవారీగా తాజా లిస్టును ఎన్.ఐ.ఎ. సేకరిస్తోంది. తాజా లిస్టులో ఇంకా ఎవరున్నారనేది ఆసక్తికరంగా మారింది. యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌.. తెలంగాణలోని మహ

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

18 రోజుల్లో 5 కేసులు సీబీఐకి అప్పగించిన హైకోర్టు

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ముఖ్యంగా శాంతిభద్రతల విషయంలో అక్కడి ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని, అందుకనే కేవలం 18 రోజుల్లో 5 కేసులను హైకోర్టు సీబీఐకి అప్పగించిందంటున్నారు నిపుణులు. ఫైర్ బ్రాండ్ సీఎం మమతా బెనర్జీ పరిపాలనా శైలి వివాదాస్పదంగా మారుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ అధ్వానంగా తయారైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన 18 రోజుల్లో కోల్ కతా హైకోర్టు 5 కేసులను సీబీఐకి అప్పగిస్తూ విచారణకు ఆదేశించడం అరుదైన విషయమని, ఇలాంటి పరిస్థితి గతంలో ఏ రాష్ట్రంలో కూడా తలెత్తిన దాఖలాల్లేవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 వరకు 5 కేసులను కోల్ కతా హైకోర్టులోని వేర్వేరు డివిజన్ బెంచ్ లు సీబీఐకి అప్పగిస్తూ దర్యాప్తుకు ఆదేశించాయి. ఆ 5 కేసుల్లో కొన్ని గతంలో సింగిల్ జడ్జి విచారించిన కేసులు కూడా ఉండండం గమనార్హం. తాజాగా మంగళవారం నదియా జిల్లాలో ఓ మైనర్ పై జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసును హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐకి అప్పగిస్తూ ఆదేశించడం మమతకు రాజకీయంగా ఇబ్బందికరంగా పరిణమించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 14 ఏళ్ల బాలికపై

ఇమ్రాన్ ఇండియాను ఎందుకు పొగిడాడు?

పాపం.. పాక్ లో ఇమ్రాన్ పరిస్థితి పైనే ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. తాను గెలిచి దేశాన్ని ఓడించాడా? లేక తాను ఓడి దేశాన్ని గెలిపిస్తున్నాడా? ఈ చిక్కు ప్రశ్నలకు మూలాలెక్కడున్నాయో మనకే కాదు.. ఇమ్రాన్ కి కూడా అర్థం కావడం లేదు. అలాగే ఇండియా మీద ప్రశంసలు ఆయనకు కలిగిన జ్ఞానోదయాన్ని సూచిస్తున్నాయా.. లేక పాము చచ్చినా పగ మాత్రం చావదన్న జాతి నైజాన్ని సూచిస్తున్నాయా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి. భారత రాజకీయాలపై పాకిస్తాన్ కు ఆసక్తి ఉన్నట్టే.. పాక్ రాజకీయాలపై కూడా భారత ప్రజల్లో ఆసక్తి ఉంటుంది. పాక్ ను పక్కలో బల్లెంలా సగటు భారతీయుడు ఎలా భావిస్తాడో.. భారత్ ను డిస్టర్బ్ చేయాలన్న దుర్బుద్ధి అక్కడి ఎక్కువ మంది పౌరుల్లో ఉంటుంది. దీనిక్కారణమేంటో అందరికీ తెలిసిందే. ద్విజాతి సిద్ధాంతం మీద దేశాన్ని బలవంతంగా విడగొట్టారన్న ఫీలింగ్ భారతీయుల్లో బలంగా పాతుకుపోయి ఉండడమే. అటు వాళ్లూ అంతే. ఇండియాను వాళ్లు ఏనాడూ పొరుగుదేశంగా చూడలేదు. ఇండియాతో శాశ్వత జాతివైరమే వారి దృష్టిలో శాశ్వతమైన ఎజెండా. కాబట్టి ఈ రెండు పొరుగు దేశాల వ్యవహారాల్లో శత్రుబద్ధమైన వైఖరి అలా దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. ఇమ్రాన్ కూడా అందుకు మినహాయింప

బీ అలర్ట్.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో లక్షలాది కేసులు

ప్రపంచ మానవాళిని కరోనా ఓ కుదుపు కుదిపింది. దాని ప్రభావం 2022 వరకు ఉంటుందని, కేవలం ఐదారు నెలలకే ఈ సమస్య సమసిపోయేది కాదని అప్పట్లోనే కొందరు నిపుణులు అన్నారు. అదే నిజమవుతోందిప్పుడు. అయితే థర్డ్ వేవ్ గా చెప్పుకునే ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతి గురించి ఆరోగ్య నిపుణులు కాసింత పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ప్రముఖ విద్యావేద్ద, మెడికల్ ఆంత్రోపాలజీ నిపుణుడు వాసిరెడ్డి అమర్నాథ్ ఏమంటున్నారో చూడండి.  ముంబై , ఢిల్లీ నగరాల్లో ఓమిక్రాన్ వేవ్ మొదలయ్యింది. తెలంగాణ లో కూడా కేసులు పెరగడం ప్రారంభం అయ్యింది. ఎన్ని టెస్ట్ లు చేస్తారు అనే దాన్ని బట్టి కేసులు రోజుకు కొన్ని రెట్లు పెరుగుతూ జనవరి చివరి కల్లా లక్షల్లోకి చేరవచ్చు. ఒమిక్రాన్ ఎవరినీ వదలదు . అందరికీ సోకుతుంది.  ప్రపంచ వ్యాప్తంగా డేటా చూస్తే..   1. ఓమిక్రాన్ సోకిన వారిలో నూటికి తొంబై మందికి ఎలాంటి లక్షణాలు వుండవు . మిగతా పదిమందికి అతి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటాయి . ఇది సూపర్ మైల్డ్.  2. ఓమిక్రాన్ చంపదు. ఎలాంటి మందులు వాడకుండానే లక్షలాది మంది ఓమిక్రాన్ సోకిన వారు కోలుకున్నారని దక్షిణాఫ్రికా డాక్టర్ లు తెలియచేసారు . తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ లు ఓమిక్రాన్

లీగల్ అండ్ క్రైమ్ రిపోర్టింగ్ పై ముగిసిన 2 రోజుల వర్క్ షాప్

ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులకు లీగల్, క్రైమ్ రిపోర్టింగ్ లో మరింత లోతైన అవగాహన కల్పించేందుకు నిర్వహించిన రెండు రోజుల వర్క్ షాప్ కు మంచి రెస్పాన్స్ లభించింది. న్యాయ పంచాయతీలు మొదలుకొని కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులు, కోర్టు హియరింగ్స్ లో వెల్లడయ్యే ఆసక్తికరమైన అంశాలు, క్రైమ్ రిపోర్టింగ్ లో కీలకమైన అంశాలు, వివిధ రాష్ట్రాల పోలీసింగ్ లో ప్రజలకు కనిపించని కోణాలు, వాటిని వెలికి తీయాల్సిన పద్ధతులపై ఇండియా జస్టిస్ రిపోర్ట్స్-101 రిపోర్టర్స్ సంయుక్తంగా శని, ఆదివారాల్లో ఆన్ లైన్ వర్క్ షాప్ నిర్వహించాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల్లో పనిచేసిన పలువురు జర్నలిస్టులు, ఎన్జీవో సంస్థల నిర్వాహకులు, మాజీ డీజీపీ స్థాయి అధికారులు, సీబీఐ అధికారులు ఫ్యాకల్టీలుగా పాల్గొని జర్నలిస్టులకు మార్గదర్శనం చేశారు.  దేశంలో సుమారు 44 మిలియన్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, అవి పరిష్కారానికి నోచుకోవాలంటే కోర్టు వ్యవహారాల డిజిటైజేషన్ తో పాటు పెద్దసంఖ్యలో స్టాఫ్ రిక్రూట్ మెంట్ చేసుకోవాల్సి ఉందని రిటైర్డ్ జడ్జి అజయ్ కుమార్ కుహర్ అన్నారు. అలాగే న్యాయమూర్తుల మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని, ఇది

మొబైల్ జర్నలిజం-రూరల్ డెవలప్మెంట్ పై ముగిసిన శిక్షణ తరగతులు

రూరల్ డెవలప్మెంట్ అండ్ మీడియా కవరేజి,  డాక్యుమెంటేషన్ పై ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్) ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగిన ఆన్లైన్ శిక్షణా తరగతులు ముగిశాయి. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో గల సెంటర్ ఫర్ డాక్యుమెంటేషన్ అండ్ కమ్యూనికేషన్ కు సారథ్యం వహిస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆకాంక్ష ఏడు రోజుల శిక్షణా తరగతులను విజయవంతంగా నిర్వహించారు. ఇలా దేశ స్థాయిలో జరగడం ఇదే తొలిసారి. రూరల్ రిపోర్టింగ్, అభివృద్ధి కార్యక్రమాల డాక్యుమెంటేషన్ పై వివిధ విభాగాల్లో నిపుణులైన ప్రొఫెసర్ల చేత క్లాసులు ఇప్పించామని ఆకాంక్ష చెప్పారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, రూరల్ డెవలప్మెంట్, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఫ్యాక్ట్ చెకింగ్, వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులపై గ్రామీణులకు అవగాహన కల్పించడం, జియో ఇన్ఫర్మేటిక్స్ అప్లికేషన్స్ ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టడం,  మహిళా సాధికారతను ఏ విధంగా త్వరితగతిన సాధించాలి, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను ఉపయోగించుకోవడం ఎలా, గ్రామాల్లో మీడియా పోషించాల్సిన పాత్ర, కొత్త పుంతలు తొక్కుతున్న మొ