Skip to main content

Posts

Showing posts from July, 2023

మన గురువునే మరచిపోతే ఎలా?

ప్రపంచానికి అఖండమైన, అనిర్వచనీయమైన విజ్ఞానాన్ని అందించిన గురు పరంపర కలిగిన దేశం భారతదేశం. ఈ దేశానికి ఈ గుర్తింపు రావడానికి కారణం గురువులు మాత్రమే. యుగయుగాలుగా ఎందరో యోగి పుంగవులు, ఎందరో గురువులు ఈ దేశానికే కాదు.. ఈ ప్రపంచానికే దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. అందుకే ఈ దేశాన్ని యోగులు సాగిన మార్గంగా చెబుతారు. మరి అలాంటి యోగుల్ని, అతుల్య గురువుల్ని స్మరించుకోవడం కనీస ధర్మం కాదా? భారతదేశంలో విస్తరించింది ఏమంటే.. యోగమే. ప్రపంచమంతటికీ విస్తరిస్తున్నది కూడా యోగమే. అందుకే దీన్ని యోగులు నడిచిన నేలగా, యోగులు నడిపిస్తున్న దేశంగా పేర్కొంటూ ఉంటారు. ఈ దేశానికి వన్నె తెచ్చింది యోగులే. ఈ దేశానికి ఆభరణాలుగా మారిందీ.. యుగాలపాటు సాధన చేసిన గురువులే. ఈ దేశాన్ని నిలబెట్టంది ఎవరో ఒక గురువని ఎవరు చెబుతారు? ఎందరో గురువులున్నారు. ఒక్కో రుషి, ఒక్కో యోగి వేర్వేరు విషయాల్లో నిష్ణాతులయ్యారు. ప్రపంచానికి వేర్వేరు అంశాల్లో జ్ఞానామృతాన్ని అందించారు.  ఇది కూడా చదవండి: హైదరాబాద్ రెండో రాజధాని? మనిషి అంటే వేరే కాదు.. వీడు కూడా ఒక జంతువే.. కాకపోతే మాటలు నేర్చిన జంతువు అంటూ శాస్త్రీయంగా నిర్వచించిన పాశ్చాత్య పండితులకు..