Skip to main content

Posts

Showing posts from August, 2019

ఆలయం అంటే ఏమిటో ఎందరికి తెలుసు?

  దేవుణ్ని నమ్మేవాళ్లు అందరూ ప్రతిరోజూ కాకపోయినా సందర్భానుసారమైనా ఆలయ దర్శనం, దైవ దర్శనం చేసుకుంటారు. అయితే గర్భగుడి అనే మాట గురించి అందరికీ తెలిసిదే. అసలు గర్భగుడి అంటే ఏమిటనేది చాలా మందికి తెలియదు. గర్భగుడి అనగానే విగ్రహాన్ని రక్షిస్తూ నాలుగు వైపులా గోడలు ఉండడం.. పైనేమో ఊర్వం.. అంటే విమానం గుర్తుకు వస్తుంది. విగ్రహ రూపంలో భగవంతుడు నెలకొని ఉన్న చోటే గర్భగుడి అని కొందరు.. గుడి గర్భం.. అంటే మధ్యభాగంలో భగవంతుడుంటాడు కాబట్టి గర్భగుడి అని మరికొందరు భావిస్తారు. అయితే ఆ గుడిగర్భంలో లేదా.. గర్భగుడిలో ఏముంటుంది? ఈ పేరు ఎలా ప్రచారంలోకి వచ్చిందనేది చాలా మందికి తెలియదు. అదే ఇప్పుడు తెలుసుకుందాం.    ఆగమ,శిల్పశాస్త్రాల్లో గర్భగుడిని.. ప్రాసాదం, సందనం,ధామం, నికేతనం, మందిరం, సౌధం, ఆలయం, నీలయం, ఆయతనం అనే పేర్లతో పిలుస్తారు. అవే గాక దాదాపు ఇంకా ముప్పైకి పైగా పేర్లున్నాయి. అదొక విశేషం. అయితే ప్రాచీనకాలంలో ఆలయాన్ని నిర్మించే ముందు ఆ ప్రదేశంలో గర్పన్యాసం అనే ప్రక్రియ నిర్వహించేవారు. ఒక రాగి కలశం తీసుకొని అందులో నవరత్నాలనూ, పంచలోహాలనూ, ఇంకా కొన్ని ధాతువులను, కొన్ని ఔషధమూలికలనూ ఉంచి పూజాదికాలు నిర్వహించి...

జగన్ ను, కేసీఆర్ ను నడిపిస్తున్న అదృశ్య శక్తులు

మఠాధిపతులు, పీఠాధిపతులు రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారన్నది రాచరిక వ్యవస్థలో రాజ్యమేలిన సంగతి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న నేటి వ్యవస్థలో కూడా ఆనాటి పోకడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే వ్యవస్థకు మంచిదా? కాదా? మంచి,చెడుల ప్రభావం పాజిటివ్ గా కనిపిస్తోందా, నెగెటివ్ గానా? అన్న విషయాన్ని వివరించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం.  తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో స్వామీజీలే చక్రం తిప్పుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో వేలు పెట్టకపోయినా... పాలకుల ప్రతీ అడుగులో అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు రాజగురువులు పోషించిన పాత్రను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పీఠాధిపతులే నిర్వహిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య సయోధ్య నుంచి నదీ జలాల పంపిణీ వరకు ఎన్నో కీలక నిర్ణయాల వెనుక పీఠాధిపతుల చొరవ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వాలున్న రాష్ట్రాల మధ్య కూడా లేని సఖ్యత, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ఉందంటే... ఆ క్రెడిట్ తప్పకుండా పీఠాధిపతులకే దక్కుతుంది.  రాజరిక వ్యవస్థలో చక్రవర్తుల కీలక నిర్ణయాల్లో నాటి రాజగురువుల పాత్ర అద్భుతమైనది. నాడు రాజగురువుల దిశానిర్ధేశం వల్లనే సుభీక్షమైన పాలన చేపట్టగ

రియల్ లైఫ్ జేమ్స్ బాండ్ కథ తెలుసుకోవాలనుందా?

తొంభయ్యవ దశకంలో వచ్చిన ద్రోహి సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. రక్షక దళాలకు పెనుసవాలుగా మారడమే గాక దేశ ఆంతరంగిక భద్రతకూ ప్రమాదకరంగా మారిన  తీవ్రవాదుల్ని తుదముట్టించే ఇతివృత్తంతో 1990ల్లో వచ్చిన ద్రోహి సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. నక్సలైట్ల ఆనుపానులు, రక్షణపరమైన రహస్యాలు, భారీ దాడుల కోసం చేసే వ్యూహాలు తెలుసుకొనేందుకు.. పోలీసు అధికారులే రహస్యంగా నక్సలైట్ గ్రూపులోకి సిబ్బందిని పంపించి.. వారిని మట్టుపెట్టడం అందులోని ట్విస్ట్. అచ్చంగా అలాంటి అండర్ కవర్ ఆపరేషన్నే రియల్ లైఫ్ లో ఇప్పటికీ నిర్వహిస్తున్న ఇండియన్ జేమ్స్ బాండ్ గా.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రజల మన్ననలు పొందుతున్నారు.  మోడీ ప్రధాని అయిన నాటి నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న రక్షణ పరమైన నిర్ణయాల్లో దోవల్ పాత్రే కీలకం. సర్జికల్ స్ట్రైక్స్‌ నుంచి డోక్లాం సమస్యలో చర్చలు, నిన్న మొన్నటి ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో భద్రత వరకు ఆయనే అన్నీ తానై నడిపారు. అంతేకాదు కశ్మీర్‌లో పౌరులకు ఎలాంటి ఢోకా లేదని చెప్పేందుకు సాధారణ పౌరుడిగా కశ్మీర్ వీధుల్లో తిరుగుతున్నారు. అజిత్ దోవల్‌ తీరు ముందు నుంచి భిన్నమే. ఆయన కుటుంబ నేపథ్య

మోడీ తీసుకున్న టాప్ టెన్ సంచలన నిర్ణయాలు

ఆయనో మహోన్నత వ్యక్తి. ఆయన నామ స్మరణతో యావద్దేశం ఊగిపోతోంది. ఆయనో సమ్మోహన శక్తి. ప్రవాహంలా సాగే  ప్రసంగానికి సభికులు మంత్రముగ్ధులైపోతారు. ఆయన చేసే ప్రతీ పని ఓ సంచలనమే. ఆయనే భారత ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని పదవికే వన్నె తెచ్చిన వజ్ర సంకల్పుడు. పదవి చేపట్టిన నాటి నుంచి ప్రతి నిర్ణయంలో తనదైన ముద్ర వేస్తూ ..  ప్రత్యేకత చాటుకుంటున్నారు. పొరుగు దేశాలతో పాటు ప్రపంచ దేశాలతో  అసమాన దౌత్య విజయాలను అందించడం  ఆయన చతురతకు నిదర్శనం. ఆయన పాలనలో తీసుకున్న సంచలనాత్మక విజయాలు మచ్చుకు ఓ పది.    జమ్ము కశ్మీర్ పై  కొద్ది రోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. అయితే ఇది అందరూ అనుకున్నట్లు కొద్దిరోజుల్లో జరిగిన ప్రక్రియ ఎన్నటికీ  కాదు. ప్రతినిత్యం తుపాకుల మోతతో ..కంటి నిండా నిద్ర కరువైన జమ్ము కశ్మీర్ కు శాశ్వత పరిష్కారం కోసం బీజేపీ ఏనాడో ప్రతిన బూనింది. ఏక్‌ దేశ్‌ మే.. దో విధాన్‌, దో ప్రధాన్‌, ఔర్‌ దో నిశాన్‌ నహీ చలేగీ అని మాజీ ప్రధాని వాజపేయి నినదించారు. ఇది జనసంఘ్‌ కాలం నుంచి బీజేపీ  మౌలిక సిద్ధాంతం. 370 అధికరణపై బీజేపీ తొలినుంచి ఒకే పంథా అనుసరిస్తూ వస్తోంది. మోడీ పాలనలో భారతీయుల  

స్వరాష్ట్రమే శ్వాసగా బతికిన జయశంకర్ సార్

పుట్టుక నీది, చావు నీది...బ్రతుకంతా దేశానిది. కాళోజీ చెప్పిన ఈ మాటలు అచ్చుగుద్దినట్లు ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కు సరిపోతాయి. ఆయన జీవితం తెలంగాణకే అంకితం అన్నట్లు సాగింది. తెలంగాణ కోసమే సార్ పుట్టారా? అన్నట్లు జీవించారాయన. నీళ్లు, నిధుల, నియామకాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించారు. స్వయంపాలనతోనే తెలంగాణ అభివృద్ది చెందుతుందని, భావజాల వ్యాప్తితోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమని నమ్మరాయన. చివరి వరకు అందుకోసమే పోరాడారు. అలాంటి తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్‌కు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సమున్నత గౌరవం లభించలేదని వాదనలున్నాయి. అధికారికంగా ఆయన జయంతి, వర్ధంతులను నిర్వహిస్తున్నప్పటికీ...సార్‌కు దక్కాల్సిన గౌరవం ఇది కాదంటున్నారు. ఆచార్య కొత్త పల్లి జయంశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంత కర్త. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటి....జాతి మొత్తాన్ని చైతన్య పరిచిన వ్యక్తి. భావజాల వ్యాప్తితోనే తెలంగాణ సాధించుకోవచ్చని గట్టిగా నమ్మి...అందుకోసం జీవితమంతా ధారపోసిన మహోన్నతుడు. స్వరాష్ట్రం కోసం ప్రజలను పోరుబాట దిశగా జాగృతం చేసిన స

ఏపీలో న్యూ ప్రొడక్షన్ విత్ మోడీ డైరెక్షన్

ఏపీలో జనసేన ఇకపై క్రియాశీల పాత్ర పోషించబోయే అవకాశం కనిపిస్తోంది. అందుకు బీజేపీ నేతల డైరెక్షన్ చాలా కీలకంగా మారుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి పవన్ నేర్చుకున్న పాఠాలతో బీజేపీతో దోస్తీ కట్టడం తప్పదన్న సంకేతాలు ఆ పార్టీ పరివారం నుంచి పొక్కుతున్నాయి. అయితే ఎన్నికల్లో పార్టీ విఫలమైనా తామేం కుంగిపోలేదని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రశ్నిస్తూనే ఉంటామన్న పవన్... భవిష్యత్తు ప్రణాళికలను ఢిల్లీ పెద్ద కనుసన్నల్లోనే రచించుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం.  ఎన్నికల్లో ఓటమి అనంతరం జనసేన ఇపుడిపుడే కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే పార్టీ ఓటమి నుంచి తేరుకుంటున్న పవన్ కు మరో నాలుగేళ్లు పార్టీని నడపడం మాత్రం కత్తి మీద సామే అవుతుంది. పార్టీ నేతలు, కార్యకర్తలతో నియోజకవర్గాలవారీగా నిర్వహిస్తున్న సమీక్షలో పార్టీ నేతల వ్యాఖ్యలు కూడా దీనికి అద్దం పడుతున్నాయి.  ఏపీలో అధికార పార్టీ దూకుడుని తట్టుకుని నిలబడటం పవన్ కు సాధ్యమయ్యే పనికాదని, దీనికితోడు పవన్ కు ఆర్థికంగా అండదండలు కూడా లేకపోవడం అందుకు మరోకారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షానికి పరిమితమైన టీడీపీ క్య