Skip to main content

Posts

Showing posts from January, 2021

భారత్ ఆక్రమణలో మావో జెడాంగ్ థియరీనే చైనా అమలు చేస్తోందా?

అరుణాచల్ ప్రదేశ్ లోని భూభాగాన్ని చైనా ఆక్రమించడం, అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేయడం సంచలనం రేపుతోంది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడం ఇవాళ కొత్త కాదు. కానీ భారత్ చైనాను విజయవంతంగా నిలువరిస్తోంది. ఈ విషయం పక్కన పెడితే చైనా అరుణాచల్ మీద ఎందుకు కన్నేసిందనేదే ముఖ్యాంశం.  ఎలా బయటపడింది? అమెరికాలోని ప్లానెట్ ల్యాబ్స్ తీసిన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఈ విషయం వెలుగుచూసింది. ఆ ఇమేజెస్ గత నవంబర్ లోవి. తాజా ఫొటోల్లో కొత్త ఇళ్ల సముదాయం కనిపించింది. అదే చోట 2019 ఆగస్టులో ఇళ్లేవీ లేవు. ఇళ్లు నిర్మించిన ప్రాంతం భారత్-చైనా సరిహద్దు నుంచి అరుణాచల్ భూభాగంలో దాదాపు 5 కి.మీ. లోపలికి వచ్చేసింది. అంటే ఏడాదిలో చైనా అక్కడ శాశ్వత మానవ నివాసాలను నిర్మించిందన్నమాట. సారీ చూ అనే నది ఒడ్డున చైనా పౌరులకు శాశ్వత నివాసాలు నిర్మిస్తోంది. చైనా పౌరులు కూడా ఇప్పుడక్కడ తరచుగా కనిపిస్తున్నారు. దీనిపై స్థానిక బీజేపీ ఎంపీ కూడా కేంద్రాన్ని అలర్ట్ చేశాడు.  చైనా ఎందుకిలా చేస్తోంది? చైనా భారత భూభాగం మీద కన్నేయడమనేది కొత్త కాదు. ఆక్రమించడానికి చైనా ఎప్పట్నుంచో కాచుకొని ఉంది. నెహ్రూ హయాంలోనే చైనా భారత భూభాగాన్ని ఆక్రమించడం మొదలుపెట్ట

వీకెండ్ స్టోరీ-ఏపీలో విగ్రహాల విధ్వంసకాండ ఆపాల్సింది ఎవరు?

ఏపీలో ఏ జిల్లా చూసుకున్నా విధ్వంసకాండ మాత్రం కామన్ గా మారింది. జ్యోతిర్లింగ రూపంలో పరమశివుడు కొలువుదీరిన శ్రీశైలం నుంచి దేశప్రజలందరికీ ఆరాధ్య దైవమైన రామతీర్థం రాములవారి క్షేత్రం దాకా ఎక్కడ చూసినా మత విద్వేషం బుసలుకొడుతోంది. హిందువుల సెంటిమెంట్లను పనిగట్టుకొని గాయపరచడమే ప్రధానమైన ఎజెండాగా కనిపిస్తోంది. అయినా పాలకులకు గానీ, అధికారులకు గానీ ఆ విషయాలేవీ పట్టటం లేదు. ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగానూ అదే రిపీటైంది.  Also Read:   తక్కువ తేడాతో ఎక్కువ సీట్లు: ఇదెలా సాధ్యం? ఎవరి కుట్ర? Also Read:   ఒవైసీ వ్యూహం వెనుక ఏముందంటే.. పిల్లి కళ్లు మూసుకుంటే ఎలుకొచ్చి వెక్కిరిస్తుందని సామెత. ఆ ఎలుక ఇంకా ఏం చేస్తుందో మాటల్లో చెప్పడం బాగుండదు కానీ.. ఆంధ్రాలో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయి, ఆనందం అనుభవిస్తున్న సమయంలో.. ఏపీలో మాత్రం దుండగుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరికొద్ది సమయంలో తెల్లవారుతుందనగా రాజమండ్రిలోని సుబ్రమణ్యేశ్వరస్వామి చేతులు విరిచేశారన్న వార్త మీడియా ద్వారా ప్రపంచానికి చేరింది. అంతకు కొద్ది గంటల ముందే, డిసెంబర్ 30న విజయనగరం జిల్లా రామతీర్థం కొండమ