Skip to main content

Posts

Showing posts from November, 2019

అఖిలప్రియపై సొంత తమ్ముడు కోర్టుకెక్కడంలో అసలు కారణం ఇదే

భూమా అఖిలప్రియ మరో వివాదంలో  చిక్కుకున్నారా......ఆస్తికోసం సొంత తమ్ముడు .....సోదరిపైనే కోర్టుకెక్కాడా..... ఎప్పుడో 2016 లో  తండ్రి విక్రయించిన స్థలంపై  వాటా కోసం అఖిలప్రియ తమ్ముడు ఇప్పుడెందుకు కోర్టును ఆశ్రయించినట్టు....ఒకవేళ నిజంగా  ఆస్తికోసం  అక్కపై  కోర్టుకెక్కితే ఆమె ఇంట్లోనే ఎందుకు ఉంటారు.... ఆమె కుటుంబంతో కలిసి విహారయాత్రలకు ఎందుకు వెళతారు........దీని వెనుక ఎదైనా  హిడెన్ అజెండా  ఉందా....... అక్కపై తమ్ముడు  నిజంగా   కేసు పెట్టారా.... లేక ఫ్యామిలీ డ్రామానా?  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీద ఆమె సోదరుడు కోర్టుకు వెళ్లారు. భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూమా కుటుంబానికి హైదరాబాద్ శివారు గండిపేట వద్ద 1000 గజాల స్థలం ఉంది. అయితే, ఆ ఆస్తిని 2016లో విక్రయించారు. ఆ సమయంలో తాను మైనర్ అని తన తండ్రి భూమా నాగిరెడ్డి చెప్పడంతో వేలిముద్రలు వేశానని జగత్ విఖ్యాత్ రెడ్డి చెబుతున్నాడు. అప్పట్లో సుమారు రూ.2కోట్లకు ఆ భూమిని విక్రయించినట్టు తెలుస్తోంది. అయితే, మూడేళ్ల నాడు అమ్మిన ఆస్తిలో తనకు వాట...

ఆంధ్రాలో కాపులకు బీజేపీ ఎందుకు గాలం వేస్తోంది?

ఆంధ్రప్రదేశ్ లో సీఎం పదవిని కాపులు ఎందుకు అందుకోలేకపోతున్నారు? అంతటి సమర్ధులు లేరా? ఆర్థికంగా స్థితిమంతులు కారా? వంగవీటి రంగా, దాసరి నారాయణ రావు, కన్నా లక్ష్మీ నారాయణ, చిరంజీవి, ముద్రగడ పద్మనాభం సీఎం అయ్యే అర్హతలు ఉన్నా ఆ పదవిని ఎందుకు అందుకోలేకపోయారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గం నుంచి ఇపుడు సీఎం రేసులో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రాలో కాపులకు ఉన్న అడ్వాంటేజెస్ డిజాడ్వంటేజెస్ ఏమున్నాయో ఓసారి చూద్దాం.  తెలుగు రాష్ట్రాల్లో సీఎం పదవి కాపులకు అందని ద్రాక్షలానే మిగిలింది. కాపు సామాజికవర్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నా....సీఎం పదవిని మాత్రం అందుకోలేకపోవడంతో  వారు తీవ్ర నిరాశా నిస్ప్రుహలకు గురవతున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్,  బీజేపీలలో కాంగ్రెస్ పార్టీ గతంలో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసి ఏకఛత్రాధిపత్యంగా ఏలింది. అయితే బీజేపీ మాత్రం దక్షిణాది రాష్ట్రాలలో తన ముద్ర వేయలేకపోతోంది. ప్రాంతీయ పార్టీల పొత్తులతో అరకొర సీట్లు సాధిస్తోంది. ఒక్క కర్ణాటకలోనే అధికారం దక్కించుకోగలిగింది. 2014 నుంచి ఉత్తరాదిలో తి...

తెలంగాణ ఖజానా ఖాళీ.. కారణాలు ఇవే

రైతు బంధు పథకం రెండో దఫాకు  నిధులు లేవా...నవంబర్ నెల సగం గడిచినా ఈ పథకంపై  ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు...... ఖజానా నిండుకుందా.... ఆర్ధిక భారం తగ్గించుకోవడానికి  పథకంలో మార్పులు చేసి పది ఎకరాల పరిమితి  విధించబోతున్నారా.....రైతు బంధు నిధుల విడుదల ఆలస్యంపై ప్రత్యేక కథనం... తెలంగాణా ప్రభుత్వ ప్రతిష్టాత్మక రైతుబంధు పథకానికి నిధుల కొరత ఏర్పడిందని సమాచారం..ఇంతవరకు రెండో దఫా నిధుల విడుదల పై ప్రభుత్వంలో కదలికే లేదు.ఈ పథకం మొదటి విడతను మే, జూన్ నెలలో, రెండో విడతను అక్టోబర్, నవంబర్ లలో విడుదల చేస్తామని ప్రకటించారు..అయితే మొదటి దఫా నిధులే ఇంకా పూర్తిగా విడుదల చేయలేదు.హుజుర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో సూర్యాపేట జిల్లాలో పెండింగులో ఉన్న నిధులు ఒకేసారి విడుదల చేశారు. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.ఒక విడత రైతుబంధు కు ఆరు వేల కోట్లు ఖర్చవుతుంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఐదు వేల ఐదు వందల కోట్లే విడుదలయ్యాయి... నిధుల కొరత కారణంగా ఒకేసారి ఇవ్వలేక దశల వారిగా విడుదల చేస్తున్నారు..మరో ఐదు వందల కోట్లు ఇంకా విడుదల కావాల్సి ఉంది.   మొదటి దఫా పూర్తి కాకుండానే రెండో విడత సమయం వచ్చింది.గత ఏడాద...

ఆ రాష్ట్రంలో ఆ కులం వర్సెస్ ఈ కులం

రాజకీయాలంటే కులాల పోరాటమా? విభిన్న వర్గాల మధ్య సమరమా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏం జరిగింది? అంతకుముందు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కులాలకు రాజకీయ ప్రాధాన్యత లభించింది? ఇప్పుడు ఏపీ సీఎంగా ఉన్న జగన్ ఏ వర్గాలకు కొమ్ము కాస్తున్నాడు? తాజాగా రోజా చేసిన అతిశయింపు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.    రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.   అవి కదిలే ప్రవాహంలా సాగిపోతుంటాయి. ఈ నిముషానికి సుఖం అనుకుంటే మరు నిముషంలో పెద్ద సంక్షోభం పుడుతుంది. సాగరంలో బడబాగ్ని దాగున్నట్లుగా బయటకు వచ్చి ఎపుడు ఎగిసి పడతాయో తెలియదు.  ఈ నిమిషానికి ఉన్న రాజకీయాలు మరునిమిషం మారిపోగలవు. అందుకే రాజకీయాలు హ్యాపీ అని ఎవరూ తీరిగ్గా కూర్చోవడానికి వీల్లేదు. కార్తీక మాసం వనభోజనాల సందర్భంగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఏపీ రాజకీయాల్లో  ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గత ప్రభుత్వం రెడ్లను రాజకీయంగా, ఆర్థికంగా అణచివేసిందని రోజా గతాన్ని తవ్వారు. అంతేకాదు గత ప్రభుత్వం రెడ్లను అవమానాలను గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలను రాజకీయాల్లో ఎదగనీయలేదని ఆ...