Skip to main content

Posts

Showing posts with the label SCIENCE

గురుపూజలో పాల్గొనండి విజ్ఞానాన్ని ఆర్జించండి

సనాతన ధర్మంలో గురుపూజకు ఉన్న ప్రాశస్త్యాన్ని నేటి తరం ప్రజలు గుర్తించాలని, సద్గురువుల కృపకు పాత్రులు కావాలని జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా కోరారు. జేకేఆర్ జ్యోతిష్య విజ్ఞాన పరిశోధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్, వెస్ట్ మారేడ్ పల్లిలోని కళాసాగరంలో గురుపూజా ఉత్సవం జరుగుతుందని రాజా తెలిపారు. భారతీయ గురు పరంపర ఎప్పుడూ విజ్ఞానాన్ని విస్తరించిందని.. వారి కృషి వల్లే అనేక రకాల ఖగోళ, వాస్తు, యోగ విజ్ఞానం వంటి శాస్త్రాలు జన బాహుళ్యంలోకి చొచ్చుకు వెళ్లాయన్నారు రాజా. ఆ పరంపరలో భాగంగానే జేకేఆర్ ఫౌండేషన్ కృషి చేస్తోందని.. అంతటి అద్భుతమైన విజ్ఞానాన్ని అందిస్తున్న గురు పరంపరకు కృతజ్ఞతలు తెలుపుకోవడం ద్వారా మరింత విజ్ఞానాన్ని ప్రజలంతా అందుకోవాలని తాము కోరుకుంటున్నామన్నారు.  కళాసాగరంలో ఉదయం 10 గంటలకు నిపుణులైన జ్యోతిష్య శాస్త్రవేత్తల ప్రసంగాలు మొదలవుతాయని రాజా చెప్పారు. స్పిరిచ్యువల్ ఆస్ట్రాలజీ, ఫార్మా ఇండస్ట్రీలో ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, పామిస్ట్రీ, సుఖవంతమైన వివాహ జీవితం కోసం ఆస్ట్రాలజీని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. జేకేఆర్ ఫౌండేషన్ కు ఫ్...

హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం

హైదరాబాద్ లో జ్యోతిష్యం, యోగ శాస్త్రం నేర్పేందుకు ఓ కొత్త యూనివర్సిటీ ప్రారంభమైంది. జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీ పేరుతో అమెరికాలోని ఫ్లోరిడాలో ఇప్పటికే నడుస్తున్న ఆ యూనివర్సిటీకి హైదరాబాద్ లో అనుబంధ శాఖ ఏర్పడింది. జేకేఆర్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించి గత 12 ఏళ్లుగా ఔత్సాహికులకు జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన విజ్ఞానాన్ని అందిస్తున్న ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ కు ఫ్లోరిడా యూనివర్సిటీవారు గుర్తింపునిచ్చారు. దీంతో ఫ్లోరిడాలోని జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీకి అనుబంధంగా హైదరాాబాద్ లో ఓ బ్రాంచ్ ఏర్పడిందని, ఆ బ్రాంచ్ కార్యకలాపాలను విజయదశమి శుభ సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ప్రకటించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో గల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో యూనివర్సిటీ లోగో, బ్యానర్ ను ఓపెన్ చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు రాజా చెప్పారు.  Read This: పవన్ మాజీ భార్య తాజా కామెంట్లు Read This:  కాంగ్రెస్ లో రేవంత్ "రెడ్ రాజకీయం" జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన శాస్త్రాలను ఔత్సాహికులకు ప్రపంచ స్థ...

నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ప్రారంభం

ప్రాచీన వైదిక విజ్ఞానం అయిన ఆస్ట్రాలజీ (జ్యోతిష్య శాస్త్రం)కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడెవరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపటిపౌరులు ఏ రంగాన్ని ఎంచుకోవాలన్నా, ప్రస్తుత తరం అన్ని రంగాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాణించాలన్నా అందరూ ఆశ్రయించేది ఆస్ట్రాలజీనే. దేశ భవిష్యత్తును, ఆర్థిక స్థితిగతులను సమూలంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకులందరూ ఆస్ట్రాలజీనే ఫాలో అవుతారంటే అతిశయోక్తి కాదు. వ్యక్తిగత నమ్మకాలతో పని లేకుండా ఆస్ట్రాలజీలోని శాస్త్రీయ దృక్పథం విషయంలో అవగాహన పెంచుకుంటే ప్రతిఒక్కరూ దీన్నుంచి పూర్తి ప్రయోజనాలు పొందడం సాధ్యమేనని ఆ రంగంలోని నిపుణులు చెబుతూ ఉంటారు.  ఈ  క్రమంలో ఆస్ట్రాలజీలో దశాబ్దాలుగా కృషి చేయడంతోపాటు... అందులోని శాస్త్రీయ దృగ్విషయాలను ప్రజలందరూ అందుకోవాలనే సత్సంకల్పంతో డాక్టర్ రాజా (పి.హెచ్.డి) ఉచిత కోర్సులను అందిస్తున్నారు. వారి తండ్రి అయిన రాఘవాచార్యుల నుంచి వారసత్వంగా లభించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఔత్సాహికులందరికీ అందించే ఉద్దేశంతో ఉచిత జ్యోతిష్య శాస్త్ర బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్ర...

రైతు సమస్యలు పరిష్కరించకపోతే పెను ప్రమాదమే

రైతు సమస్యలు పరిష్కరించకపోతే సమాజం అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అది జరగకుండా ఉండేందుకు మీడియా చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని, రైతుల కోసం పనిచేసే సంస్థలు సంఘాలు ముఖ్యంగా బి కే ఎస్ - భారతీయ కిసాన్ సంఘ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు రైతుల కోసం ఎంతో శ్రమించాల్సి ఉందని సీనియర్ జర్నలిస్ట్ తాటికొండ రమేష్ బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రచార ఆయామ్ సమావేశము BKS రాష్ట్ర కార్యాలయం రాజపుత్ రెసిడెన్సి లో *ప్రాంత ప్రచార ప్రముఖ్  ల్యాగల శ్రీనివాస్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ శ్రీ సుదర్శన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ రమేష్ బాబు రాకల్లోకం యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ రాక సుధాకర్ హాజరయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ సమాచార విప్లవం వచ్చిన తర్వాత ప్రజలకు నేరుగా సమాచారం అందడం వలన ప్రజలు విజ్ఞానవంతులైనారు, కానీ సమాచారం అనేది పుస్తకాల రూపంలో పత్రికలు రూపంలో ఇంటర్నెట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నేడు అవసరమైన దానికంటే ఎక్కువ అందుబాటులో ఉన్నది. కానీ సరియైన సమాచారం  వినియోగించుకొని...

ఇష్టంగా చదివాడు - గోల్డ్ మెడల్ కొట్టాడు

డాక్టర్ కొడుకు డాక్టర్.. యాక్టర్ కొడుకు యాక్టర్.. లాయర్ కొడుకు లాయర్ అవడంలో వింతేం లేదు. అలా కాకుండా తాను పూర్తిగా కొత్తదారిని ఎంచుకొని  తమ కుటుంబంలో ఓ కొత్త ట్రెండును సృష్టించాడు ఓ కొడుకు. సొంతూరి ప్రజల పొగడ్తలు పక్కనపెడితే, తల్లిదండ్రుల కళ్లలో కళ్లలో ఆనందాన్ని చూడగలిగాడు. ఆ కుర్రాడే మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నందారానికి చెందిన రాజమూరి నితిన్ కుమార్ రెడ్డి. తండ్రి వకీలు కావడంతో ఆయన ప్రాక్టీసుతో పాటు కొడుక్కి మంచి చదువు చెప్పించాలని మహబూబ్ నగర్ షిఫ్టయ్యారు. చిన్నప్పటి నుంచే చదువుల మీద పూర్తి ఏకాగ్రత కనబరిచే నితిన్.. కష్టాన్ని ఇష్టంగా చేసుకొని చదివితే ఫలితం వచ్చి తీరుతుందని, అందుకు తానే ఓ ఉదాహరణగా నిలిచాడు.  పెద్దయ్యాక ఎవరేం కావాలో చిన్నప్పుడే తల్లిదండ్రుల మాటల రూపంలో పిల్లల చెవుల్లో బీజాలు పడతాయంటారు. ఆ బీజాలే వారిని చదువుల మీద నిలబెడతాయి. ఉన్నతమైన లక్ష్యాల వైపు నడిపిస్తాయి. సమాజంలో తన పాత్రేంటో తెలియజేస్తాయి. తల్లిదండ్రుల రుణమే కాదు.. సమాజ రుణం కూడా తీర్చుకోవాలనే అవగాహన కలిగిస్తాయి. అలాంటి నేపథ్యం నుంచి వచ్చినందుకు తాను...

జనవరి ఫస్టు రోజున చలో రామప్ప - బొడ్డుపల్లి బాలబ్రహ్మం

ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన రామప్ప దేవాలయ చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఫస్టున  ఓ భారీ యాత్రను తలపెట్టారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా ఖ్యాతికెక్కిన రామప్ప దేవాలయ యాత్రను శనివారం (జనవరి ఫస్టు) తలపెట్టామని మంగళంపల్లి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి బాలబ్రహ్మాచారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒకటవ తేదీ శనివారం రాత్రి‌ BHEL నుండి ఓ లగ్జరీ బస్సు బయలుదేరి రెండవతేదీ ఆదివారం ఉదయానికల్లా దక్షిణ  కాశీగా అందరూ పిలుచుకునే కాళేశ్వరం చేరుకుంటారు. గోదావరి త్రివేణి సంగమంలో పుణ్యనదీ స్నానం  ఆచరించి, ఆ తరువాత ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒకే ప్రాణవట్టం పై (కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు) యముడు, శివుడి దర్శనం చేసుకుంటారు. అనంతరం బ్రహ్మశ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈశ్వరీమాత నిత్యాన్నదాన కార్యక్రమంలో భోజనం ముగించుకొని మద్యాహ్నం 2 గంటలకు ప్రపంచ ప్రఖ్యాత రామప్ప గుడిని చేరుకుంటారు. రామప్ప గుడి శిల్పసంపద, ముఖ్యమైన ప్రదేశాలు, వాటి గొప్పతనం తెలిపే విషయ...

మన ఆయుర్వేదాన్ని బతికించుకునే సమయమిదే

భారతీయ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని బతికించుకునే సమయం ఆసన్నమైందని హైదరాాబాద్ కు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ ఎంబీఆర్ కామేశ్వరరావు అంటున్నారు. గతేడాదికి పైగాా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్న సమయం నుంచీ శాస్త్రీయ వైద్యంగా భుజకీర్తులు తగిలించుకున్న అల్లోపతి వైద్యం ఇప్పటివరకు దాని స్వభావాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయిందని, అయినా పాలకులు, ప్రపంచ దేశాలు, డబ్ల్యు.హెచ్.ఒ వంటి వ్యవస్థలన్నీ ఇప్పటికీ పునరాలోచన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నాానికి చెందిన ఆనందయ్య ఇప్పటికే 20 వేల మందికి పైగా కరోనా పేషెంట్లకు ప్రాణభిక్ష పెడితే దాన్ని నాటువైద్యంగా అభివర్ణిస్తున్న ఆధునిక మీడియా పోకడలను ఆయన ఖండించారు.  ఏది నాటు వైద్యం? ఏది శాస్త్రీయ వైద్యం? శాస్త్రీయ వైద్యం పేరుతో లక్షల్లో ఫీజులు గుంజుతూ, పేషెంట్ ప్రాణాలు పోతే తమకు సంబంధం లేదని సంతకం చేయించుకుని మరీ ట్రీట్మెంట్ మొదలుపెట్టే కార్పొరేట్ దవాఖానాాల్లో జరిగేది శాస్త్రీయ వైద్యం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ప్రాణాలు పోతే ప్రశ్నించే అవ...

వీకెండ్ స్టోరీ: హండ్రెడ్ పర్సెంట్ హరామ్

ఈ మధ్య కొద్ది నెలలుగా టెండర్ కట్స్ పేరుతో ఓ భారీ వ్యాపార ప్రకటన ఖరీదైన ఇంగ్లిష్ పేపర్లో, ఫ్రంట్ పేజ్‍లో దర్శనమిస్తోంది. త్వరలో హైదరాబాద్ లో మటన్, చికెన్, ఎగ్స్, ఫిష్, ప్రాన్స్.. ఇలా మాంసాహార ఉత్పత్తులు మీరు కోరుకున్న చోటికి డోర్ డెలివరీ అంటూ ఊదరగొడుతోంది. ఇప్పుడైతే హైదరాబాద్ లోని 11 సెంటర్లలో టెండర్ కట్స్ దుకాణాలు రెడీ అయ్యాయని కూడా తాజాగా మరో ప్రకటన వెలువడింది. అది వ్యాపార ప్రకటన కాబట్టి అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేం లేదు. ఈ యాడ్ లో చక్కగా బొట్టు పెట్టుకున్న ఈ హిందూ మహిళ చేత ఎంతో గర్వంగా పోజిప్పించి టెండర్ కట్స్ మాంసానికి బ్రాండ్ అంబాసిడర్ లెవెల్లో ప్రొజెక్ట్ చేశారు. ఇక ఎడమవైపు పైన 100 PER CENT HALAL అంటూ స్టార్ గుర్తులో హైలైట్ చేయడమే ఈ నాలుగు మాటలు మాట్లాడుకోవడానికి దారితీస్తోంది.  హలాల్ అనేది ముస్లింల విశ్వాసాల ప్రకారం దేవునికి సమర్పించుకునే నైవేద్యం. ముస్లిమేతరులు ముస్లిమేతర పద్ధతుల్లో సమర్పించుకునే నైవేద్యాన్ని సంప్రదాయ ముస్లింలు ఎవరూ ముట్టుకోరు. మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా చెబుతున్న షరియా సూత్రాలను ఇండియన్ ముస్లింలు పెద్దసంఖ్యలో తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. బయటి ...

ఆవు పేడతో చెప్పులు.. త్వరలో మార్కెట్‍లోకి

Main Story:   జానారెడ్డికి గవర్నర్‍గిరీ? Also Read:   పాక్ మెడలు వంచిన రోజు ఇదే   Also Read:   ఎంఐఎంతో పొత్తుకు తహతహ ఇందుకేనా? Weekend story:  హండ్రెడ్ పర్సెంట్ హరామ్ Weekend Story:   ఇలాంటి పెళ్లిళ్లతో హిందూ వ్యవస్థకు ఢోకా లేదు ఆవు పేడ ఏంటి.. చెప్పుల తయారీ ఏంటి.. అనుకుంటున్నారు కదా. మీరు వింటున్నది నిజమే. దీన్నిబట్టి చూస్తే రానున్న రోజుల్లో ఆవుకు మంచి డిమాండే ఉంటుందని ఊహించవచ్చు. హైదరాబాద్ లో ఉంటున్న అమిత్ భట్నాగర్ దాదాపు 20 ఏళ్లకు పైగా పంచగవ్య చికిత్స విషయంలో పని చేస్తున్నారు. తాను తలపెట్టిన ఈ మహాయజ్ఞంలో చాలా మంది గో ప్రేమికులు, ఆత్మీయ సహచరులు పాలుపంచుకుంటున్నారని భట్నాగర్ చెబుతారు . ఆవు విసర్జితాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సద్వినియోగం చేయాలన్నదే అమిత్ భట్నాగర్ సంకల్పం. హైదరాబాద్ తో పాటు పాత కరీంనగర్ జిల్లాలోని మంథనిలో వీరి ఆధ్వర్యంలో గోశాలలు నడుస్తున్నాయి. అంతేకాదు.. రాజస్తాన్ లో వీరి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో గో ఉత్పాదనల ప్రాజెక్టు నడుస్తోంది.  వీరి రీసెర్చ్ వల్లే ఆవు పేడ నుంచి అనేక కొత్త రకాల ఉత్పాదనలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే ఆవు పేడ నుంచి అందరూ ఆ...

కరోనా కొమ్ములు విరిచే కిల్లర్- వీడియో

భారతీయ ఆయుర్వేదం అనే అమ్ములపొదిలో గాండీవాల్లాంటి అనేక చిట్కాలున్నాయి. అందులో ఒకటే పసుపుకొమ్ముల ఆవిరి. పసుపుకొమ్ముల ఆవిరి ఎలా చేయాలంటే.. ఒక పాత్రలో నీళ్లు తీసుకొని అందులో తగినన్ని పసుపుకొమ్ములు వేసి బాగా మరిగించాలి. ఆ ఆవిరిని బాగా పట్టాలి. కరోనా రాకుండా నిరోధించడానికి ఇది అద్భుతంగా పని చేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.  ఆవిరి పట్టడం ఇలా.. ఆవిరి పట్టడంలోనే మనకు మంచి రిలీఫ్ వస్తుంది. ముక్కునుండి పీల్చుకొని నోటిద్వారా 3 సార్లు, నోటి నుంచి పీల్చుకొని ముక్కుద్వారా 3 సార్లు.. ఇలా మార్చి మార్చి ఒక పదిసార్లు పడితే యాంటీ బ్యాక్టీరియాతో కూడిన వేడిఆవిరి ఊపిరితిత్తుల్లోకి, ముక్కు నాళాలు, శ్వాసకోశ నాళాల గుండా వెళ్తుంది. ఆవిరి వేడికి కరోనా వైరస్ చనిపోతుంది. వాస్తవానికి కరోనా అనేది వైరస్ కూడా కాదని, అది కేవలం ప్రొటీన్ మాత్రమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. అది సింగిల్ గా ఉన్నప్పుడు నిర్జీవం.. ఏమీ చేయదు. ఆ వైరస్ కాస్తా మన చేతుల నుంచి ముక్కు, నోరు, కళ్లు.. ఇలాంటి అవయవాల ద్వారా లోపలికి వెళ్తే అది శ్వాసకోశ నాళాలు లేదా ఆహారవాహిక ద్...

2022 వరకు సామాజిక దూరం పాటిస్తేనే మనుగడ - హార్వర్డ్ యూనివర్సిటీ

Photo Credit: Shiksha.com సామాజిక దూరాన్ని పూర్తి నిక్కచ్చిగా అమలు చేస్తేనే కరోనా వైరస్ ను శాశ్వతంగా నిర్వీర్యం చేయగలమని, పరిమిత దినాల పాటు లాక్ డౌన్ పాటించి ఆ తరువాత పాత పద్ధతుల్లోనే ఉంటామంటే కుదరదని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు నిర్వహించిన తాజా అధ్యయనం చెబుతోంది. హార్వర్డ్ యూనివర్సిటీ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇమ్యూనాలజీ అండ్ ఇన్పెక్షియస్ డిసీసెస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు ఎం.కిస్లర్, యోనాతన్ హెచ్. గ్రాడ్ అనే ఇద్దరు ప్రొఫెసర్లు కరోనా విజృంభణ, వ్యాప్తి, దాని జీవితకాలంపై అధ్యయనం చేశారు.  వైరస్ సోకిన వ్యక్తి కేవలం 14 రోజులో, లేక 21 రోజులో క్వారంటైన్ లో ఉన్నంతమాత్రాన వైరస్ పూర్తిగా పోవడం సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడు మందు గానీ, టీకా గానీ రానందువల్ల అది రావడానికి నెలల నుంచి ఏళ్లు  కూడా పట్టే అవకాశం ఉన్నందువల్ల వైరస్ వ్యాప్తి జరగకుండా చూడడమే మార్గం తప్ప.. పాజిటివ్ బారిన పడి కోలుకున్న వ్యక్తిలో వైరస్ లేనట్టు భావించరాదని హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 పై పనిచేసే మందుకోసం ఇప్పుడే పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి.. అది రావడానికి చాలా టైమ్ పడుతుంది. దాదాపు ఏడాది ...

చంద్రుడి మీద మైనింగ్ కి ట్రంప్ గ్రీన్ సిగ్నల్

Photo- GETTY (మానవ సహిత మిషన్ కోసం నాసా సిద్ధమవుతోంది. 2020లో మినీ రోవర్లు పంపాలని నిర్ణయించింది) ఆస్తులు పోగేసుకోవడానికి, ఆధిపత్యం నిలుపుకోవడానికి సరిహద్దులతో పనేంటి? భూగోళం మీద ఆధిపత్యాన్ని ఎప్పుడో సాధించిన అమెరికా చంద్ర మండలాన్ని కూడా కబ్జా చేసుకోవాలని చూస్తోంది. ప్రపంచమంతా ఇల్లు కదలకుండా కరోనా గురించి కథలుకథలుగా చెప్పుకుంటుంటే... ట్రంప్ ఆలోచన చంద్రమండలాన్ని చుట్టేస్తోంది. చంద్రుడి మీద మైనింగ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు ముహూర్తం కూడా ఖరారైనట్లు ఫోర్బ్స్ వెబ్ సైట్ ఓ కథనాన్ని డొమైన్లో పోస్ట్ చేసింది.  ఆ కథనం ప్రకారం 2024లో ఆర్టెమిస్ 3 (Artemis 3 mission) చంద్రుడి దక్షిణ ధ్రువం మీద కాలుమోపుతుంది. 55 ఏళ్ల క్రితం చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాములు అడుగుపెట్టినట్టుగానే మళ్లీ 2024లో కూడా అడుగు పెట్టబోతున్నారు. ఈసారి ఒక మహిళా వ్యోమగామి కూడా తొలిసారిగా అడుగు పెట్టి చరిత్ర సృష్టించబోతోంది. అలాగే ఒక మేల్ ఆస్ట్రొనాట్ కూడా ఈ మిషన్లో భాగం పంచుకోబోతున్నారు. నాసా ఇందుకోసం పూర్తి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. అయితే ఈసారి చంద్రమండల యాత్రలో అమెరికా కాకుండా మరో దేశం ఏదీ కూడా భాగం పంచుకోవడం లేదు. ఈ ...