Skip to main content

Posts

Showing posts with the label NATIONAL

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

ఆనాడు బూర్గుల.. నేడు రేవంత్

ఆధునిక పోకడలకు దూరంగా ఉండే వెనుకబడ్డ కొడంగల్ నుంచి.. రాష్ట్ర అత్యున్నత పదవికి ఎన్నికైన రేవంత్ రెడ్డి ప్రస్థానం చాలాచాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అంతేకాదు.. పాత మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రికి ఎన్నికైన రెండో సీఎం రేవంత్ కావడం మరో విశేషం. ఆయన రాజకీయ జీవితంలోని ముఖ్యాంశాల గురించి ఓసారి చూద్దాం.  తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికైన సందర్భం ఒక ముఖ్యాంశమైతే.. పాలమూరు జిల్లా నుంచి సీఎంగా ఎన్నికవుతున్న రెండో వ్యక్తి కూడా రేవంతే కావడం మరో ముఖ్యాంశం. ఆంధ్రాలో విలీనం కాక ముందు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు బూర్గుల రామకృష్ణారావు. ఆయన అప్పటి కల్వకుర్తి తాలూకాలోని పడకల్లు గ్రామంలో జన్మించారు. గొప్ప మేధావి, రచయిత, నిజాంపై పోరాడిన ధీరుడిగా కీర్తి గడించిన బూర్గుల తరువాత.. ఇంత కాలానికి మళ్లీ పాలమూరు ప్రాంతం నుంచి రేవంత్ రూపంలో మరో వ్యక్తి సీఎం అవుతున్నాడు. కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ ముఖ్యమంత్రిగా ఎన్నికవుతుండడంతో ఆ ప్రాంతానికి మరోసారి ఆ ఖ్యాతి దక్కినట్టయింది. పాలమూరు నుంచి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర పుటల్లోకి ఎక్కుతున్నారు.  ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోత

థాంక్స్ టు సోనియమ్మ

తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు రేవంత్ రెడ్డి. పట్టిన పట్టు వదలడు అనే పేరున్న రేవంత్ రెడ్డి.. తన రాజకీయ ప్రస్థానాన్ని కూడా అలాగే మలుచుకున్నారు. రాజకీయ జీవితాన్ని తాము కోరినట్టుగా మలుచుకున్న అతికొద్ది మంది నాయకుల్లో రేవంత్ ఒకరు. చాలా మందికి అదృష్టవశాత్తూ సీఎం కుర్చీ దొరకవచ్చు. కానీ రేవంత్ కు ఆ సీటు అదృష్టవశాత్తూ దొరకలేదు. తన ప్రయాణాన్నే సీఎం కుర్చీ దిశగా టార్గెట్ చేసి పెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే సాధించారు. ఆ విషయాల గురించి మరింత డీటెయిల్డ్ గా మాట్లాడుకునే ముందు.. రేవంత్ తెలంగాణ సీఎం అయిన సందర్భం గురించి చెప్పుకోవాలి.  నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చారు తెలంగాణ ప్రజానీకం. ఈ కృషిలో రేవంత్ పాత్రను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఇతర కాంగ్రెస్ నేతలెవరూ చేయని పనిని రేవంత్ చేసిపెట్టారు. ప్రజల్లో నమ్మకం కలిగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తామేం చేస్తారో రేవంత్ చెప్పారు. ఆయన మాటల్ని ప్రజలు నమ్మారు. రాష్ట్ర కాంగ్రెస్ సైన్యాన్ని నడిపించే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్.. టీ-పీసీసీ చీఫ్ గా అనుకున్న లక్ష్య

కాంగ్రెస్ ను తలెత్తుకునేలా చేసిన టఫ్ మ్యాన్

తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది. బీఆర్ఎస్ కార్డు సైడ్ అయిపొయ్యి.. కాంగ్రెస్ కార్డు ముందుకొచ్చింది. దీనికంతటికీ కారణం ఒకే ఒక్కడు. ఆయనే టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సింగిల్ హ్యాండెడ్ గా పార్టీని, సీనియర్లను, శ్రేణులను, కేడర్ ను నడిపించి ఉన్నతాసనాన్ని ఖరారు చేసుకున్నారు రేవంత్. మరి.. ఈ ఉన్నతమైన స్థానం ఆయనకు ఊరికే లభించిందా? ఆయన కృషి ఎలాంటిది?  తెలంగాణ ప్రభుత్వ మార్పిడిలో కీలకమైన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారూ ఉంటే అది రేవంత్ రెడ్డి. టీ-పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టడం వెనుక.. కాంగ్రెస్ కు కాకతాళీయమైన అవసరమేం లేదంటారు నిపుణులు. రేవంత్ ను టీ-పీసీసీ చీఫ్ గా తీసుకోవడం వెనుక ఉభయుల ప్రయోజనాలూ ఉన్నాయట. అందుకే కాంగ్రెస్ ను తనకు అప్పగిస్తే.. కొన్ని కీలకమైన నిర్ణయాలు తనకు కట్టబెడితే.. పార్టీని నడిపిస్తానని.. హైకమాండ్ నిశ్చింతగా ఉండొచ్చని.. కచ్చితంగా రిజల్ట్ రాబడతానని ఎంతో నమ్మకంగా చెప్పారట రేవంత్. ఆయన మాటల్లో కనిపించిన కాన్ఫిడెన్స్ చూసే.. సోనియా, రాహుల్ టీ-పీసీసీ చీఫ్ పగ్గాలు అప్పగించేందుకు ముందుకొచ్చారు. దానిపై టీ-కాంగ్రెస్ సీనియర్ల నుంచి ఎన్ని ఫిర్యాదులు, ఎన్ని అసంతృప్తులు వచ్చినా డోంట్ కేర్

చంద్రబాబు ప్రయత్నాలు ఢిల్లీలో ఫలించలేదా?

చంద్రబాబుకు అక్కడ ఢిల్లీలో ద్వారాలు మూసుకుపోయాయా? ఆయన ఎంత ప్రయత్నించినా అమిత్ షా మనసు కరగలేదా? తన కష్టాలు తీరాలన్నా, పార్టీ మీద నీలినీడలు తేలిపోవాలన్నా బలమైన జాతీయ పార్టీ అండ కావాలని కోరుకున్న బాబుకు.. కమలనాథుల నుంచి సరైన రెస్పాన్స్ రాలేదట. ఆ విషయం కన్ఫామ్ అయ్యాకనే ఆయన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ వైపు మళ్లీ ప్రయాణం మొదలుపెట్టడం ఖాయంగా మారిందట. మరి ఆ విశేషాలేంటి? మొక్క ఎదగాలంటే పందిరి కావాలి. పందిరి లేకపోతే ఎంత మంచి మొక్క అయినా కూడా ఎదగడం ఆగిపోతుంది. అయితే ఒకప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు అచ్చం మొక్కలాగే మారిపోయిందట. మరి మొక్కలాంటి పార్టీకి ఎవరో ఒకరు నీరు పోయాల్సిందే. ఎవరో ఒకరి చెయ్యి అందించాల్సిందే. బాబు అందుకోసమే కొన్ని నెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ప్రాంతీయ పార్టీగా తెలంగాణలోనే కాదు.. అటు ఆంధ్రాలోనూ ఇప్పుడు టీడీపీ తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోయింది. తెలంగాణలో అయితే దాదాపుగా అదృశ్యమయ్యే పరిస్థితి నెలకొంది. తెలంగాణ టీడీపీలో అసలు కీలక నేతలెవరూ లేకుండా పోయారంటే అతిశయోక్తి కాదు. పట్టణాల్లో, గ్రామాల్లో అక్కడక్కడా సానుభూత

పొగ తాగడానికి పొగ పెడుతున్న రుషి సునాక్

ఈ ప్రపంచం కరోనా అనే ఓ మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొంది. కానీ అంతకుమించిన మరో మహమ్మారి ప్రతి దేశాన్నీ పీడిస్తోంది. అయితే ఇప్పటిదాకా ఆ మహమ్మారిని ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు.  ఆ మహమ్మారిని తరిమేయడానికి, ఇంగ్లాండ్ నుంచి తరిమేయడానికి ఆ దేశ ప్రధాని రిషి సునాక్ కంకణం కట్టుకున్నారు. త్వరలో ఓ చట్టం కూడా తేబోతున్నారు. మరి రిషి తేబోతున్న చట్టానికి.. ఏపీలో మన జగన్ తీసుకొచ్చి వెనక్కి వెళ్లిన చట్టానికి తేడా ఏంటి?  Read this also: నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ప్రారంభం పొగ తాగుడు కారణంగా ప్రపంచంలో యేటా 80 లక్షల మంది చనిపోతున్నట్టు డబ్ల్యు.హెచ్.ఒ లెక్కలు కట్టింది. అందులో డైరెక్టుగా పొగాకు వినియోగం కారణంగా సంభవిస్తున్న మరణాలు ఏటా 70 లక్షలట. అంటే సిగరెట్ తాగని, పొగాకు బారిన పడనివారు కూడా దాని పరోక్ష ప్రభావం చేత ఏటా 10 లక్షల మంది చనిపోతున్నారన్నమాట. అంటే ఈ 70 లక్షల మంది స్మోకర్ల కారణంగా వారు వదిలే పొగ పీల్చి.. పాపం అమాయకులైన నాన్ స్మోకర్లు మరో 13 లక్షల మంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు ప్రపంచం తీవ్రంగా భయపడాల్సిన అతిపెద్ద పాండమిక్ ఇదే అయిందంటున్నారు ప్రపంచ క్యాన్సర్ నిపుణులు. కోవిడ

భారతీయ నారీ శక్తిని బయటపెట్టిన తాజా రిపోర్ట్

ఆడపిల్లలు అనేక సందర్భాల్లో నిరూపించుకున్నారు... తాము ఎందులోనూ, ఎవరితోనూ తీసిపోమని. అయినా పురుషాధిక్య సమాజం.. మహిళల మీద ఆంక్షలు విధించింది. మహిళల మేలు కోసమేనని ఒకసారి.. మహిళలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇస్తే గనక మగాళ్ల పని ఖతం.. అనే పేరుతో ఇంకోసారి.. ఇలా అనేక కోణాల్లో మహిళల్ని అణచివేయడమే పనిగా పెట్టుకున్నారు. అయితే తాజాగా విడుదలైన ఓ సర్వే మాత్రం.. మహిళల్లో దాగున్న పారిశ్రామిక నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆ రిపోర్టు ఏం చెబుతోంది? దాన్నుంచి మనవాళ్లు నేర్చుకోవాల్సిన అంశాలేంటి?  ఆడవాళ్లకు చెప్పించే చదువు దగ్గర నుంచి, వారికి సొంతంగా ఏదైనా బాధ్యతలు అప్పగించేదాకా.. ప్రతిచోటా వారికి ద్వితీయ ప్రాధాన్యమే దక్కుతోంది. అయితే ఈ మధ్య ఇలాంటి అభిప్రాయాల్లో మార్పులు జరిగినా.. ఆ మార్పులు రావాల్సిన స్థాయిలో మాత్రం రాలేదు. అందువల్ల ఆకాశంలో సగం అని గౌరవించుకునే మనమే.. వారి అవకాశాలకు గండి కొట్టేశాం. ఫలితంగా దేశ ఆర్థిక ఎదుగుదలలో వారి పాత్ర తగ్గిపోయింది. దాని ప్రభావం కొన్ని తరాల దాకా పాకిందంటే అతిశయోక్తి కాదు. అయితే మహిళలను ప్రోత్సహించే వ్యక్తులు, సంస్థల సంఖ్య క్రమంగా పెరుగుతున్నా.. వారికి ఇవ్వాల్సిన ప్రాధ

సెప్టెంబర్ 17.. మోడీ జన్మదినం.. విశ్వకర్మ యోజన ప్రారంభం

సెప్టెంబర్ 17కు ఓ పాపులారిటీ ఉంది. తెలంగాణ ప్రజలకు గతం నుంచీ వస్తున్న విమోచన దినం ఒకటైతే.. మరోటి భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం కూడా అదే కావడం. దీంతో మొదట్నుంచీ విమోచనానికే ఓటేస్తున్న బీజేపీ నేతలు.. మోడీ జన్మదినం కూడా కావడంతో ఆ రోజును చాలా ప్రత్యేకంగా జరుపుకునే ఆనవాయితీ ఏర్పడింది. ఇది రాన్రానూ మరింత పకడ్బందీగా జరుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు కేంద్ర సర్కారు బలమైన పునాదులు కూడా వేస్తోంది.  సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రకంగా విమోచనా దినమైతే.. భారత ప్రజలకు ప్రస్తుత ప్రధాని మోడీ జన్మదినం కావడం విశేషం. దీంతో సెప్టెంబర్ 17న బీజేపీ నేతలు చేసే జరిగే కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బడుగు, బలహీన వర్గాల తరగతికి చెందిన మోడీ.. అసలు సిసలు ఉత్పాదక వర్గాలైన ఆ ప్రజల స్వావలంబన కోసం కొద్దికాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న పంద్రాగస్టు రోజున పీఎం విశ్వకర్మా కౌశల్ సమ్మాన్ యోజన కింద చేతి వృత్తులు చేసుకునేవారి ఆత్మగౌరవం పెంచేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామని ప్రకటించారు. అందుకోసం కేటాయించే బడ్జెట్ 13 నుంచి 15 వేల కోట్ల మధ్య ఉంటుందని కూడా చెప్పారు. దీంతో

హైదరాబాద్ రెండో రాజధాని కాక తప్పదా?

అప్పుడెప్పుడో తెలంగాణ ఏర్పాటుకు ముందు సెకండ్ క్యాపిటల్ అన్న మాట బాగా వినిపించింది. అప్పుడు ఉద్యమ సమయం కాబట్టి.. ఒక వర్గంవారు సమర్థిస్తే.. తెలంగాణ ఉద్యమకారుల నుంచి తీవ్రమైన విమర్శలు వినిపించాయి. ఇప్పుడు మరోసారి కూడా ఓ ప్రముఖ వ్యక్తి నుంచి హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అవుతుందన్న ధీమా బలంగా వినిపిస్తోంది. అందుకు కారణాలేమై ఉంటాయి? దేశ రాజధానిగా ఢిల్లీ సేఫే కదా? అన్ని రకాల అంతర్జాతీయ హంగులూ అక్కడ ఉన్నాయి కదా? అయినా హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాలన్న ఆలోచన మళ్లీ ఎందుకు ఊపిరి పోసుకుంటోంది? తెలుగు రాష్ట్రాల్లో బీజేపీలో అత్యంత సీనియర్ నేతగా ఉండడమే గాక.. మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన చెన్నమనేని విద్యాసాగర్ రావు నోటి నుంచి హైదరాబాద్ రెండో క్యాపిటల్ అన్న మాట వినిపించడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ కావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని.. 1956లో అంబేద్కర్ కూడా అలాంటి అభిప్రాయమే వెలిబుచ్చారని.. అది ఈనాడు సాకారమయ్యే అవకాశాలు ఉన్నాయని సాగర్జీ చెప్పుకొచ్చారు.  Also Read: తెలంగాణ జాతిపిత యాదిలో.. Also Read: ఆద్యంతం "వికార పురుష్" ఇది కూడా చదవ

రైతు సమస్యలు పరిష్కరించకపోతే పెను ప్రమాదమే

రైతు సమస్యలు పరిష్కరించకపోతే సమాజం అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అది జరగకుండా ఉండేందుకు మీడియా చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని, రైతుల కోసం పనిచేసే సంస్థలు సంఘాలు ముఖ్యంగా బి కే ఎస్ - భారతీయ కిసాన్ సంఘ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు రైతుల కోసం ఎంతో శ్రమించాల్సి ఉందని సీనియర్ జర్నలిస్ట్ తాటికొండ రమేష్ బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రచార ఆయామ్ సమావేశము BKS రాష్ట్ర కార్యాలయం రాజపుత్ రెసిడెన్సి లో *ప్రాంత ప్రచార ప్రముఖ్  ల్యాగల శ్రీనివాస్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ శ్రీ సుదర్శన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ రమేష్ బాబు రాకల్లోకం యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ రాక సుధాకర్ హాజరయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ సమాచార విప్లవం వచ్చిన తర్వాత ప్రజలకు నేరుగా సమాచారం అందడం వలన ప్రజలు విజ్ఞానవంతులైనారు, కానీ సమాచారం అనేది పుస్తకాల రూపంలో పత్రికలు రూపంలో ఇంటర్నెట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నేడు అవసరమైన దానికంటే ఎక్కువ అందుబాటులో ఉన్నది. కానీ సరియైన సమాచారం  వినియోగించుకొని నూతనంగా

అన్ని సర్వేలూ అదే చెబుతున్నాయి.. ఒక్కటి తప్ప

ఓటరన్న తన పని తాను కానిచ్చేశాడు. తనను సంప్రదించిన పార్టీలతో ఏం మాట్లాడాలో అదే మాట్లాడాడు. మీట నొక్కాల్సిన చోట నొక్కాడు. నిశ్శబ్దంగా తన రొటీన్ వర్క్ లోకి వెళ్లిపోయాడు. మరి ఆ ఓటరు ఏ మీట నొక్కాడు.. ఎవరి మీటరు మార్చబోతున్నాడు.. ఎవరి తలరాత మారబోతుంది? మునుగోడులో ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏం చెబుతున్నాయి? ఆ కీలకమైన విషయాలు మీకోసం.  మునుగోడులో పరుగుపందెంలా మారిన ఉపఎన్నికలో హుజూరాబాద్ ఫలితం రిపీట్ కాకూడదన్న పట్టుదలతో టీఆర్ఎస్... మరో హుజూరాబాద్ లా మార్చేయాలన్న వ్యూహంతో బీజేపీ శ్రేణులు పనిచేశాయి. సర్వే సంస్థలు కూడా ఈ పోటీ తీవ్రతను అర్థం చేసుకొని.. అదే స్థాయిలో ఓటర్ల నాడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాయి. అత్యధిక సర్వే సంస్థలు టీఆర్ఎస్ గెలుస్తుందని అంచనా వేయగా.. ఒకటీ, అరా సర్వే సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి. ఆయా సర్వే సంస్థల రిపోర్టును ఆసరా చేసుకొని పార్టీలు కూడా గెలుపు తమదేననే ధీమాలో ఉన్నాయి.  థర్డ్ విజన్ రీసెర్చ్ నాగన్న ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ 48 నుంచి 51 శాతం ఓట్లు సాధిస్తుంది. బీజేపీ 31 నుంచి 35 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంటుందని పేర్కొంది. 13 నుంచి 15 శాత

భారతదేశం పాములకు పాలు పోస్తోందా?

ఆఫ్ఘనిస్థాన్ మనకు శత్రు దేశమా.. మిత్రదేశమా? మిత్రదేశం అనడానికి ఎలాంటి బలమైన ఆధారాలూ లేవు. శత్రుదేశంగా పరిగణించడానికి అనేక కారణాలు కనిపిస్తాయి. మరి ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేకుండానే.. భారత్ పెద్దమొత్తంలో తిండిగింజలు, మెడిసిన్స్‎ను ఎందుకు పంపుతోంది? కనీసం అక్కడి తాలిబాన్ ప్రభుత్వాన్ని ఇప్పటివరకూ గుర్తించని భారత్.. భారతీయులు కూడా ప్రశ్నించేలా ఆ దేశానికి అంతపెద్ద మొత్తంలో ఆపన్నహస్తం ఎందుకు అందిస్తోంది?  యుగయుగాలుగా భారతీయులు చూపిస్తూ వస్తున్న ఔదార్యం ముందు ప్రపంచంలోని ఏ దేశమైనా దిగదుడుపేనంటారు. గతేడాది ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు కబ్జా చేసుకొని, అధికారం చేపట్టినప్పుడు ప్రపంచమంతా వణికిపోయింది. ముఖ్యంగా భారత ప్రభుత్వం తాలిబాన్ల కదలికల్ని నిశితంగా గమనిస్తూ అడుగులు వేస్తోంది. అమెరికా వెన్నుదన్నుతో కర్జాయ్ పరిపాలించినప్పుడు వెల్లివిరిసిన స్నేహ సంబంధాలు ఒక్కసారిగా అదృశ్యమైపోయి... తాలిబన్ల రాకతో మన దాపునే రాక్షస రాజ్యం పురుడుపోసుకున్నట్లయింది. అయితే తాలిబాన్ల వ్యవహార శైలి, పాలనలో షరియాను పక్కాగా అమలు చేయడం, మహిళలతో అనుసరించే విధానం వంటి అనేక కారణాలతో జనజీవనం స్తంభించింది. ప్రజల్లో భయాందోళనలు మరిం

విలీనమా? విమోచనమా? విద్రోహమా? సమైక్యతా దినోత్సవమా?

తెలంగాణలో రసవత్తరమైన రాజకీయ అంకానికి తెర లేచింది. భారత ఉపఖండంలో తెలంగాణ విలీనాంశం అనేది ఓ కీలకమైన ఘట్టం. అయితే ఆ ఘట్టాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు కొన్ని పక్షాలు ప్రయత్నిస్తుండగా.. అదే ఘట్టాన్ని ఆసరా చేసుకొని తమ రాజకీయ అవసరాలు తీర్చుకున్న పక్షాలు కూడా ఉన్నాయి. తెలంగాణ విలీనంతో కొన్ని వర్గాలు తమ ఉనికి కోల్పోతామని ఆందోళన చెందితే.. మరికొన్ని వర్గాలేమో సెంటిమెంట్లు గాయపడే అంశంగా పరిమితం చేస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణలో విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఉద్యమ నేతగా అనేక వేదికల మీద చెప్పిన కేసీఆర్.. తన మాట నిలుపుకోవడం లేదంటూ... బీజేపీ కేంద్ర సర్కారు ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తామని డిక్లేర్ చేయడంతో... ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది.  Also Read:  భారతీయుడి శౌర్య 'ప్రతాపం'.. స్పెషల్ స్టోరీ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని.. అధికారిక ఉత్సవంగా నిర్వహించాలన్న డిమాండ్.. ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. కేంద్రంలోని మోడీ సర్కారు సెప్టెంబర్ 17 రోజున పరేడ్ గ్రౌండ్స్‎లో విమోచన దినోత్సవాన్ని కేంద్ర సర్కారు ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తామని, ఆ కార్యక్రమానికి తమరు క