Skip to main content

Posts

Showing posts from June, 2021

రేపటి ఉద్యమానికి నేటి నుంచే సిద్ధం కావాలి: చెల్లోజు రాజు

ఉపాధి దెబ్బతిని, కుటుంబాలు అల్లకల్లోలమవుతున్న తరుణంలో విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటోందని, ప్రభుత్వాలు తమవైపు దృష్టి సారించేదాకానైనా తమ జాతిలో ఔదార్యం గలవారు ముందుకు రావాలని, వృత్తిపనులకు దూరమైన పేద విశ్వబ్రాహ్మల్ని ఆదుకోవాలని విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెల్లోజు రాజు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పలు పేద కుటుంబాలకు విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఆర్థికసాయం అందించినట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి ఆదేశాల మేరకు, కరీంనగర్ జిల్లా కమిటీ తరఫున ఇల్లంతకుంటలో సమావేశం నిర్వహించామని, ఈ సమావేశానికి మండల విశ్వబ్రాహ్మల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.  తమ జాతి ప్రజలు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో మగ్గిపోతున్నారని, తెలంగాణ వచ్చిన తరువాత అనేక కులాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నా.. విశ్వబ్రాహ్మలు మాత్రం వివక్షకు గురవుతున్నారన్నారు. ఎందరో విశ్వబ్రాహ్మణ సోదరులు ఆత్మహత్యలకు పాల్పడ్డా వారి కుటుంబాలకు కనీస పరామర్శ సైతం దక్కడం లేదన్నారు. మ...