Skip to main content

Posts

Showing posts with the label సాహిత్యం

హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం

హైదరాబాద్ లో జ్యోతిష్యం, యోగ శాస్త్రం నేర్పేందుకు ఓ కొత్త యూనివర్సిటీ ప్రారంభమైంది. జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీ పేరుతో అమెరికాలోని ఫ్లోరిడాలో ఇప్పటికే నడుస్తున్న ఆ యూనివర్సిటీకి హైదరాబాద్ లో అనుబంధ శాఖ ఏర్పడింది. జేకేఆర్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించి గత 12 ఏళ్లుగా ఔత్సాహికులకు జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన విజ్ఞానాన్ని అందిస్తున్న ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ కు ఫ్లోరిడా యూనివర్సిటీవారు గుర్తింపునిచ్చారు. దీంతో ఫ్లోరిడాలోని జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీకి అనుబంధంగా హైదరాాబాద్ లో ఓ బ్రాంచ్ ఏర్పడిందని, ఆ బ్రాంచ్ కార్యకలాపాలను విజయదశమి శుభ సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ప్రకటించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో గల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో యూనివర్సిటీ లోగో, బ్యానర్ ను ఓపెన్ చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు రాజా చెప్పారు.  Read This: పవన్ మాజీ భార్య తాజా కామెంట్లు Read This:  కాంగ్రెస్ లో రేవంత్ "రెడ్ రాజకీయం" జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన శాస్త్రాలను ఔత్సాహికులకు ప్రపంచ స్థ...

ఆదిపురుష్ కాదు.. ఆద్యంతం వికార పురుష్

నాలుగు దశాబ్దాల క్రితం దూరదర్శన్లో మహాభారత్ వచ్చినప్పుడు ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయి చూశారు. ఆ తరువాత రామాయణం వచ్చినప్పుడూ అంతే మైమరచిపోయి ఆస్వాదించారు. కొన్నేళ్లుగా వస్తున్న తాజా మహాభారత్ కు కూడా ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. ఇతిహాస ఇతివృత్తాలపై ఎందరు ఎన్నిసార్లు సినిమా తీసినా ఆదరించే భారతీయులు.. తాజా ఆదిపురుష్ పై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఇంత బతుకూ బతికి ఇంటెనక చావడాన్ని ఎవరూ ఇష్టపడరు. వినడానికి చేదుగా ఉన్నా, జీర్ణించుకోవడానికి కఠినంగా ఉన్నా.. ఆదిపురుష్ సినిమా దేశవ్యాప్తంగా వెలగబెడుతున్న నిర్వాకం మాత్రం ఇదే విషయాన్ని రూఢి చేస్తుందంటున్నారు సినీ అభిమానులు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ డిజాస్టర్ ను జీర్ణం చేసుకోలేకపోతున్నారు. బాహుబలి వంటి సినిమాతో తెలుగు సినిమా రేంజ్ ని, తన ఇమేజ్ ని అమాంతం పెంచుకున్నాడు ప్రభాస్. ఆదిపురుష్ కూడా అంతకుమించి అనేంతగా ఉంటుందని అంతా ఊహించారు. సనాతన భారతీయ సాహితీ సాంస్కృతిక విలువలకు ఆదిపురుష్ లో పట్టం కడతారని.. అంతర్జాతీయ రేంజ్ కు ఎదిగిన తెలుగు సినిమా.. తాజా సినిమాతో కొత్తపుంతలు తొక్కుతుందని ఆశపడ్డారు. అయితే అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి అన్నట్టుగా ఆదిపురుష...

భక్తుల డిమాండ్‎కు తలొగ్గిన శ్రావణభార్గవి

ఒకసారి పాపులారిటీ వస్తే.. దానికి బోనస్ గా నిర్లక్ష్యం కూడా వస్తుందా? అయితే ప్రజల నుంచి నిరసన ఎదురైతే.. ఎంతో కష్టపడి సంపాదించుకున్న పాపులారిటీ కూడా పేకమేడల్లా కూలిపోక తప్పదు. గాయని శ్రావణభార్గవి విషయంలో కూడా అదే జరిగిందంటున్నారు.. శ్రీవారి భక్తులు. ఇటీవల ఆమె పాడి నటించిన అన్నమయ్య కీర్తన వివాదానికి కేంద్ర బిందువైంది. ఆమె పాటపై అన్నమయ్య వంశీకులు తీవ్ర్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీడియోను డిలీట్ చేయాలని కోరారు. అయినా ఆమె మాత్రం వెనక్కు తగ్గలేదు. తన పాటలో అసభ్యత ఏముందని ఎదురు ప్రశ్నించింది కూడా. ఆ వివాదం చినికిచినికి గాలివానగా మారి... అన్నమయ్య కుటుంబ సభ్యులు న్యాయపోరాటానికీ సిద్ధమయ్యారు. అటు వెంకన్న భక్తులు కూడా శ్రావణభార్గవికి వార్నింగ్ ఇచ్చారు. ఆమెను తిరుమలలో అడుగుపెట్టనీయం అంటూ హెచ్చరించారు. ఇలా అన్ని వైపుల నుంచీ విమర్శలు రావడంతో శ్రావణ భార్గవి ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు. ఆలస్యంగానైనా తన యూట్యూబ్ చానల్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేయాల్సి వచ్చింది. ఆమె మంచి గాయని కావడంతో వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అది కాస్తా వివాదాస్పదం అయ్యాక మరింత వ్యూస్ వచ్చే అవకాశం పెరిగింది. కానీ తప్పనిసరి పరిస్థి...

వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి

మహా మహోపాధ్యాయ, బహుభాషావేత్త, వేద వేదాంగవేత్త, రాష్ట్రపతి సన్మాన విభూషిత, శతాధిక గ్రంథకర్త, ప్రాచీన వాఙ్మయ వ్యాఖ్యత పెదపాటి నాగేశ్వరరావు సహస్ర పూర్ణ చంద్ర దర్శన మహోత్సవం చూడముచ్చటగా ముగిసింది. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన పెదపాటి వేయి పున్నముల దర్శన మహోత్సవానికి తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చివరి రోజు ఘట్టం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో సంప్రదాయబద్ధంగా జరిగింది. 1941లో గుంటూరు జిల్లాలో జన్మించిన పెదపాటి.. ఆనాడు ఉన్న అనేక వ్యతిరేక పరిస్థితులను ఎదురీది.. భాషలో, వేదాధ్యయనంలో, శిల్పశాస్త్రంలో ఎంతో కృషి చేశారని మధుసూూదనచారి కొనియాడారు. ఈనాటి యువకులను చదివించడానికి, అన్ని అవసరాలూ సమకూర్చడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నా పిల్లలు మాత్రం ఓ లక్ష్యం అంటూ లేకుండా ఉన్నారని ఆవేదన చెందారు. అందుకు భిన్నంగా పెదపాటి నాగేశ్వరరావు.. అననుకూల పరిస్థితులను అధిగమించి మహా పండితుడై కేవలం విశ్వబ్రాహ్మణ కులస్తులు మాత్రమే గాక యావత్ తెలుగుజాతి గర్వించే స్థాయికి ఎదిగారన్నారు.  Also Read:  విమోచనమా? విద్రో...

కవిసార్వభౌముడు కలలో కనిపించి...

సహధర్మచారిణి గంగాదేవితో నాగేశ్వరరావుగారు చరిత్ర అనేది మంచి-చెడుల సమ్మిశ్రమం. మంచి చేసినవారిని అనుసరించాలని పాజిటివ్ థింకర్స్ చెప్తే... చెడు చేసినవారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని, వాళ్లు ఈ భూమ్మీద ఉండటానికి అర్హులు కారని అందుకు విరుద్ధమైన వర్గమంతా చెప్తుంది. ప్రపంచమంతా ఈ రెండు మార్గాల్లోనే ప్రయణిస్తోంది. అయితే ఆ రెండు మార్గాలు  సర్వకాలాల్లోనూ పరిపూర్ణమైనవి  కాకపోవచ్చు. ఎందుకంటే వాటిలో ఎవరి ఆచరణ మార్గం వారిదే. ఒకరితో ఒకరికి పని ఉండదు. ఎవరి ఫాలోయర్లను వారు తయారు చేసుకుంటారు.  ఎవరి శిబిరాన్ని వారు పోటాపోటీగా భర్తీ చేసుకుంటారు. దీనివల్ల సమాజం "వర్గ విభజన"కు గురవుతుందే తప్ప.. సామాజిక సమరసతకు అవకాశం ఉండదు. ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రజలు మంచి, చెడుల గురించి మాట్లాడుకునే అవకాశం ఉండదు. మరి అది ఎలా సాధ్యం? అది జరగాలంటే ఏం చేయాలి? దానికి ఒకటే పరిష్కారం. అదేంటంటే.. అందరికీ అన్నీ తెలియజేయడమే.  Also Read:  భాగ్యలక్ష్మి ఆలయానికి ఇంపార్టెన్స్ అందుకేనా? ఎవరు ఏ మంచి చేశారో ప్రజలకు తెలియాలి? ఎవరి ద్వారా చెడు జరిగిందో కూడా ప్ర...

కవులకు, సామాజికవేత్తలకు ఉగాది పురస్కారాలు

నటనం, నాట్యం... కళారూపం ఏదైనా దానికి ప్రేరణ మాత్రం కవిత్వమే. కవి హృదయం ఆవిష్కరించిన పొందికైన మాటలే కళాకారులు కట్టిన గజ్జెలకు ప్రాణం పోస్తాయి. నాట్యగత్తెలకు ప్రేరణనిస్తాయి. అలాంటి కవిత్వానికి పెద్దపీట వేసే ఉద్దేశంతో, కవులను సన్మానించుకునే సంకల్పంతో చిదంబర నటరాజ కళానిలయం వ్యవస్థాపకురాలు, నృత్యగురువు మంజుల ఉగాది పురస్కారాలు అందజేశారు. ప్రముఖ కవులకు, ప్రముఖులైన కవితాభిమానులకు శాలువాలు కప్పి సన్మానించి తన కవిత్వ సేవను చాటుకున్నారు. చిదంబర నటరాజ కళానిలయం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పలువురు కవులు, సామాజిక కార్యకర్తలకు ఉగాది పురస్కారాలు అందజేశారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సముద్రాల వేణుగోపాలాచారి, ప్రముఖ సినీ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ నటుడు  సమీర్, నిలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ (రిటైర్డ్) డాక్టర్ రామకృష్ణ, బి.కేశవులు, మురహరి,  విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు   చేపూరి లక్ష్మణాచారి, కేశంపేటకు చెందిన ఎం.సతీశ్ హా...

'తానా' కవి సమ్మేళనానికి ఎంపికైన జె.వి.కుమార్ చేపూరి

తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు"  పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత”  అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.  Also Read:  కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, మ...

ఎల్లూరి శివారెడ్డికి వరప్రసాదరెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారం

స్వయంగా రచనలు చేయడం ద్వారానే కాకుండా తెలుగు, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు, తెలంగాణ సారస్వత పరిషత్ వంటి సంస్థల ద్వారా తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి అత్యున్నతమైన సేవలందించిన డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి ఎంతో అభినందనీయులని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శాంతా బయోటెక్నిక్స్ అధినేత, పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ.వరప్రసాదరెడ్డి ఆధ్వర్యంలోని శాంతా-వసంతా ట్రస్టు తెలంగాణ సారస్వత పరిషత్తులోని  డా. దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డికి డా.వరప్రసాదరెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి అందజేశారు. అలాగే పరిషత్ ప్రధాన కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్యకు తెలుగు భాషా సేవారత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా, వరప్రసాదరెడ్డి సభాధ్యక్షులుగా పాల్గొని పురస్కార గ్రహీతలకు లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, సన్మానపత్రం అందజేశారు. శాలువాలతో సత్కరించారు.  ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ శాంతా బయోటెక్నిక్స్ ద్వ...

కరోనా - ఓ కవి శత కంద పద్య ప్రహేళిక

కవుల మస్తిష్కాల్లోని భావ ప్రపంచం కదిలితే ఏ  రసమైనా ఏరులై పారాల్సిందే. ఆనందమైనా, అద్భుతమైనా, బీభత్సమైనా, కారుణ్యమైనా.. ఆఖరుకు ఇప్పటి కరోనా విసురుతున్న అదృశ్య ఖడ్గ విచలిత విషాదమైనా.. అది ఏ రసమైనా కానీ.. కాలువలు కట్టి ప్రవహింపజేయగలడు కవి. ఆ రస ప్రవాహంలో పఠితలను అలవోకగా తేలియాడించగలడు. భావానందంలో ముంచి బ్రహ్మానంద సీమల మేరువుల వైపు కొనిపోగలడు. అందుకే కవి మనసు పడితే కావ్యకన్యక అందాలు కందాలై పూల తేనియల మకరందాలై కస్తూరికా కదంబాలై కట్టిపడేస్తాయి. అదే జరిగింది ఇక్కడ. సుధాశ్రీ పేరుతో బస్వోజు సుధాకరాచారి కరోనా ప్రస్థానాన్ని, దాని ప్రయాణంలో విశృంఖలత్వాన్ని, సాంస్కృతికంగా అది మోసుకొస్తున్న చైతన్య వీచికలను కందపద్యాల్లో వ్యక్తపరిచారు.    కందం రాయగలవాడే కవి అన్న నానుడిని బట్టి తెలుగు సాహితీ లోకంలో కందానికి ఉన్న కాఠిన్యత, సంక్లిష్టత, విశిష్టతలు ఎలాంటివో గ్రహించవచ్చు. అలాంటి కఠినమైన సాహితీ ప్రక్రియను ఎంచుకొని శతాధిక పద్యాలతో కూడిన అమృత కలశాన్ని సాహితీ ప్రియులకు అందిస్తున్నారు. అయితే కందం రాసేవారికే కష్టం గానీ.. చదువరులకు చాలా తేలిక. అందుకే తెలుగునాట ప్రాచీన కవులు ఈ ప్రక్రియనే ఎక్కువగా ఎంచుక...