Skip to main content

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా? 

మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి. 

మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతోంది. ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం 14 శాతం ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు బదిలీ చేస్తోంది. ఈ విధానం ఐదేళ్లకు తీరిపోతుంది. అంటే ఈ సంవత్సరం జూన్ వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ వల్ల కలిగే నష్టాలను బ్యాలెన్స్ చేసే వాటా లభిస్తుంది. జులై నుంచి ఆ 14 శాతం బదిలీ ఇక జరగదన్నమాట. లెక్క ప్రకారం రాష్ట్రాలకు అందాల్సిన వాటా మాత్రమే అందుతుంది. కేంద్రం నుంచి అదనంగా వచ్చే 14 శాతం అందదు. ఇదే అదునుగా రాష్ట్రాలు జీఎస్టీ సవరణకు పట్టుబడుతున్నాయి. ఇప్పుడు జీఎస్టీలో 4 శ్లాబులు ఉన్నాయి. మార్కెట్లో ఉన్న వస్తువుల కేటగిరీని బట్టి ఆయా వస్తువులపై 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కేంద్రం నుంచి ఆగిపోనున్న 14 శాతం ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు రాష్ట్రాలు 5 శాతం శ్లాబు రేటును ఎత్తేసి దాని స్థానంలో 8 లేదా 9 శాతం పన్ను వసూలు చేయాలని ప్రతిపాదిస్తున్నాయి. 5 శాతం జీఎస్టీ శ్లాబు కింద ఉన్న కొన్ని వస్తువులతో పాటు పన్ను పరిధిలో లేని అన్-ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ తో 3 శాతం జీఎస్టీ శ్లాబును సృష్టించాలని సూచిస్తున్నాయి.

5 శాతం శ్లాబులో 1 శాతం పెరిగితే అది ఏడాదికి 50 వేల కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూరుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే 3 శాతం పెరిగితే.. లక్షా 50 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందన్నమాట. ఈ ఆదాయం మీద కన్నేసిన రాష్ట్ర ప్రభుత్వాలు.. 5 శాతం జీఎస్టీ శ్లాబును 8 లేదా 9 శాతానికి పెంచాలని పట్టుబడుతున్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు... మరో రెండు నెలల్లో సామాన్యులు వాడే అనేక వస్తువులపై పన్ను భారం ఏ మేరకు పడుతుందో. 

జీఎస్టీ కాంపెన్సేషన్ ను ఐదేళ్ల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచేది లేదని కేంద్రం ఇప్పటికే తేల్చి చెప్పింది. కేంద్రం మీద ఆధారపడకుండా రాష్ట్రాలే ఆదాయ మార్గాలు సమకూర్చుకోవాలని కూడా అప్పుడే సూచించింది. తొలినాళ్లలో 28 శాతం శ్లాబు కింద ఉన్న 228 వస్తువుల జాబితాను క్రమంగా సవరిస్తూ ఇప్పుడు 35గా కుదించింది కేంద్రం. మరి.. రేపు జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ భేటీ తరువాత ఏ వస్తువుల మీద పన్ను బాదుతారు.. ఏ వస్తువుల మీద కనికరం చూపిస్తారనేది వేచి చూడాల్సిందే. 

Also Read: కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా?

Comments

Popular posts from this blog

రైతు సమస్యలు పరిష్కరించకపోతే పెను ప్రమాదమే

రైతు సమస్యలు పరిష్కరించకపోతే సమాజం అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అది జరగకుండా ఉండేందుకు మీడియా చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని, రైతుల కోసం పనిచేసే సంస్థలు సంఘాలు ముఖ్యంగా బి కే ఎస్ - భారతీయ కిసాన్ సంఘ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు రైతుల కోసం ఎంతో శ్రమించాల్సి ఉందని సీనియర్ జర్నలిస్ట్ తాటికొండ రమేష్ బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రచార ఆయామ్ సమావేశము BKS రాష్ట్ర కార్యాలయం రాజపుత్ రెసిడెన్సి లో *ప్రాంత ప్రచార ప్రముఖ్  ల్యాగల శ్రీనివాస్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ శ్రీ సుదర్శన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ రమేష్ బాబు రాకల్లోకం యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ రాక సుధాకర్ హాజరయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ సమాచార విప్లవం వచ్చిన తర్వాత ప్రజలకు నేరుగా సమాచారం అందడం వలన ప్రజలు విజ్ఞానవంతులైనారు, కానీ సమాచారం అనేది పుస్తకాల రూపంలో పత్రికలు రూపంలో ఇంటర్నెట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నేడు అవసరమైన దానికంటే ఎక్కువ అందుబాటులో ఉన్నది. కానీ సరియైన సమాచారం  వినియోగించుకొని నూతనంగా

బీజేపీ విశ్వబ్రాహ్మణ అధికార ప్రతినిధిగా చెన్నయ్య.. మీడియా ఇంచార్జ్ గా రవికిరణ్

క్షేత్రస్థాయిలో బీజేపీని పటిష్టం చేసే క్రమంలో హైదరాబాద్ లో పలు కీలకమైన బాధ్యతలను క్రియాశీలమైన కార్యకర్తలకు అప్పగించారు. బ్రహ్మశ్రీ తల్లోజు చెన్నయ్యాచారిని విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం నుంచి అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ విశ్వబ్రాహ్మణ మీడియా సెల్ కన్వీనర్ పూసాల బ్రహ్మచారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బ్రహ్మశ్రీ వలబోజు రవికిరణ్ ఆచారికి తెలంగాణ మీడియా కో కన్వీనర్ గా బాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రం అందించారు. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయాలని, పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలని కొత్తగా బాధ్యతలు అందుకున్నవారిని బ్రహ్మచారి కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఓబీసీ ప్రెసిడెంట్ ఆలె భాస్కర్, భాగ్యనగర జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పెండం లక్ష్మణ్, కౌలే జగన్నాథం, రుద్రోజు శివలింగాచారి తదితరులు పాల్గొన్నారు.