Skip to main content

Posts

Showing posts from June, 2022

కవిసార్వభౌముడు కలలో కనిపించి...

సహధర్మచారిణి గంగాదేవితో నాగేశ్వరరావుగారు చరిత్ర అనేది మంచి-చెడుల సమ్మిశ్రమం. మంచి చేసినవారిని అనుసరించాలని పాజిటివ్ థింకర్స్ చెప్తే... చెడు చేసినవారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని, వాళ్లు ఈ భూమ్మీద ఉండటానికి అర్హులు కారని అందుకు విరుద్ధమైన వర్గమంతా చెప్తుంది. ప్రపంచమంతా ఈ రెండు మార్గాల్లోనే ప్రయణిస్తోంది. అయితే ఆ రెండు మార్గాలు  సర్వకాలాల్లోనూ పరిపూర్ణమైనవి  కాకపోవచ్చు. ఎందుకంటే వాటిలో ఎవరి ఆచరణ మార్గం వారిదే. ఒకరితో ఒకరికి పని ఉండదు. ఎవరి ఫాలోయర్లను వారు తయారు చేసుకుంటారు.  ఎవరి శిబిరాన్ని వారు పోటాపోటీగా భర్తీ చేసుకుంటారు. దీనివల్ల సమాజం "వర్గ విభజన"కు గురవుతుందే తప్ప.. సామాజిక సమరసతకు అవకాశం ఉండదు. ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రజలు మంచి, చెడుల గురించి మాట్లాడుకునే అవకాశం ఉండదు. మరి అది ఎలా సాధ్యం? అది జరగాలంటే ఏం చేయాలి? దానికి ఒకటే పరిష్కారం. అదేంటంటే.. అందరికీ అన్నీ తెలియజేయడమే.  Also Read:  భాగ్యలక్ష్మి ఆలయానికి ఇంపార్టెన్స్ అందుకేనా? ఎవరు ఏ మంచి చేశారో ప్రజలకు తెలియాలి? ఎవరి ద్వారా చెడు జరిగిందో కూడా ప్రజలకు తెలియాలి. నిజానికి ఇది చాలా బాధ్యతతో కూడుకున్న పని. తమ పూర్వీకుల

బలపరీక్ష జరిగితే అంతా తారుమారే

దాదాపు వారం రోజులుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న  మహా రాజకీయంలో ఇవాళ చాలా కీలకమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. గౌహతిలో క్యాంపు నిర్వహిస్తున్న రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనుకున్న శివసేనకు సుప్రీంకోర్టు నుంచి భంగపాటు ఎదురైంది. రెబల్ ఎమ్మెల్యేలంతా ఇవాళ సాయంత్రం ముంబైకి రావాలని, వారిపై చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలంటూ.. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ నోటీసులు పంపారు. మరోవైపు శాసనసభా పక్ష నేతగా ఉన్న రెబల్ ఎమ్మెల్యే ఏక్‎నాథ్ షిండే స్థానంలో అజయ్ చౌదరిని నియమిస్తూ డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ షిండే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో కోర్టులో పిటిషన్ ఎదుర్కొంటున్న డిప్యూటీ స్పీకర్‎కు అనర్హత వేటు వేసే అధికారం లేదంటూ.. దానిపై వివరణ ఇవ్వడానికి జులై 11 వరకు సుప్రీంకోర్టు గడువు విధించింది. దీంతో రెబల్ ఎమ్మెల్యేలపై తక్షణమే వేటు పడకుండా ఊరట లభించినట్లయింది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వానికి, శివసేన శాసనసభాపక్ష నేతకు, చీఫ్‌ విప్‌కు, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వారందరూ తన నోటీసులకు 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు రెబల్ ఎ

ఢిల్లీలో చైనీయుడి భారీ కుట్ర

ఢిల్లీలో రెండేళ్లుగా అక్రమంగా ఉంటున్న ఓ చైనీయుడి ఉదంతం వెలుగుచూసింది. జు-ఫీ అనే చైనా దేశీయుడు రెండేళ్లుగా గ్రేటర్ నోయిడాలో అత్యంత విలాసవంతమైన ఓ క్లబ్ నిర్వహిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్‎కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వాధికారుల కళ్లు కప్పి నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఓ ఐపీఎస్ అధికారి అనుమానంతో దాని మీద అధికారులు రైడ్ చేయడంతో విషయం వెలుగుచూసింది. జు-ఫీతో పాటు నాగాలాండ్ కు చెందిన పెటిఖ్రినో అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మరో ముగ్గురు ఇండియన్స్, ఒక చైనీయుడు తప్పించుకొని పారిపోయారు. క్లబ్బులో 70 రూములు, అత్యాధునిక సీసీటీవీలు అమర్చారు. ఫేక్ వీసా డాక్యుమెంట్లతో జు-ఫీ ఇక్కడే తిష్టవేసి ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సైన్యాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి దేశ రహస్యాలు సేకరించే పనిలో జు-ఫీ ఉన్నాడన్న అనుమానాలతో విచారిస్తున్నారు. అయితే మూడు రోజులుగా విచారణ సాగుతున్నా జు-ఫీ నోరు విప్పడం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి ఇప్పటికే విలువైన సమాచారం చేరవేసి ఉంటాడని భావిస్తున్నారు. చైనా నుంచి ఇండియాకు, ఇండియా నుంచి చైనాకు రావాలంటే

ఉద్ధవ్ ను రాజీనామా చేయొద్దన్న పవార్... అయినా..

మహా రాజకీయం మహా సంక్షోభాన్ని తలపిస్తోంది. ఏక్‎నాథ్ షిండే క్యాంపులో ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుండగా.. ఉద్ధవ్ శిబిరం వెలవెలపోతోంది. ఉద్ధవ్ థాక్రే నిన్ననే అధికార నివాసాన్ని ఖాళీ చేయడంతో ఆయన రాజీనామా చేయడం ఇక లాంఛనమే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికారికంగా శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు, ఎన్సీపీకి 53 మంది, కాంగ్రెస్ కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారానికి మేజిక్ ఫిగర్ 144 సంఖ్య సరిపోతుండగా.. ఇండిపెండెంట్లు, స్థానిక పార్టీలు కలుపుకొని.. 169 సంఖ్యతో మహా వికాస్ అఘాడీ పేరుతో కూటమి సభ్యులు అధికారాన్ని ఎంజాయ్ చేశారు. అయితే అసంతృప్త నేత ఏక్‎నాథ్ షిండే తిరుగుబావుటా ఎగరేయడంతో.. సంక్షోభానికి తెర లేచింది. 42 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పాలిత అసోంలోని గౌహతిలో ఆతిథ్యం పొందుతూ.. క్షణక్షణం అధికార శివసేనలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. శివసేన రెబల్ ఎమ్మెల్యే షిండే చాలా కీలకంగా మారిపోయారు. తన దగ్గరున్న సంఖ్యతో బీజేపీతో పాటు శివసేన రెబల్ అభ్యర్థులతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులభమైపోయింది. ఈ సంక్షోభాన్ని ఆలస్యంగా గుర్తించిన శివసేన, ఎన్సీపీ నేతలు.. నష్టనివారణ చర్యలకు పూనుకున్నా ఆ ప్రక్రియలేవీ సుసాధ్యంగా కనిపించడం

సేవా పతకానికి వన్నె తెచ్చిన రాజ్ కుమార్

పోలీసు విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా, బాధ్యతగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న ఎస్.రాజ్ కుమార్ ను స్టేట్ పోలీస్ సేవా పతకం వరించింది. కరీంనగర్ జిల్లా ఎల్ఎండి కాలనీ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ రాజ్ కుమార్ పోలీస్ సేవా పతకానికి ఎంపికయ్యారు. జూన్ 2, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా కరీంనగర్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా పతకాన్ని, ప్రశంసలను అందుకున్నారు.  రాజ్ కుమార్ రక్షకభటుడిగా చేరినప్పటి నుంచీ వృత్తికే మొదటి ప్రాధాన్యతనిస్తూ పైఅధికారుల ఆదేశాలు పాటిస్తూ.. ప్రజల అవసరాలు గుర్తిస్తూ మెలగుతున్నారు. జమ్మికుంట, కోరుట్ల, కరీంనగర్, హుజూరాబాద్, ఎల్.ఎం.డి కాలనీ.. ఇలా తాను ఎక్కడ విధులు నిర్వహించినా.. స్థానిక ప్రజల మన్ననలు పొందుతూ శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన ప్రజాసంబంధాలు పటిష్టంగా కొనసాగిస్తూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన సేవా నిరతిని, బాధ్యతల పట్ల ఉన్న అంకితభావాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు.. రాజ్ కుమార్  ను సేవా పతకానికి ఎంపిక చేశారు. విధి నిర్వహణలో తన అంకిత భావాన్ని గుర్తించిన అధికారులందరికీ రాజ్ కుమార్ పేరుపేరునా ధ