Skip to main content

ఉద్ధవ్ ను రాజీనామా చేయొద్దన్న పవార్... అయినా..

మహా రాజకీయం మహా సంక్షోభాన్ని తలపిస్తోంది. ఏక్‎నాథ్ షిండే క్యాంపులో ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుండగా.. ఉద్ధవ్ శిబిరం వెలవెలపోతోంది. ఉద్ధవ్ థాక్రే నిన్ననే అధికార నివాసాన్ని ఖాళీ చేయడంతో ఆయన రాజీనామా చేయడం ఇక లాంఛనమే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికారికంగా శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు, ఎన్సీపీకి 53 మంది, కాంగ్రెస్ కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారానికి మేజిక్ ఫిగర్ 144 సంఖ్య సరిపోతుండగా.. ఇండిపెండెంట్లు, స్థానిక పార్టీలు కలుపుకొని.. 169 సంఖ్యతో మహా వికాస్ అఘాడీ పేరుతో కూటమి సభ్యులు అధికారాన్ని ఎంజాయ్ చేశారు. అయితే అసంతృప్త నేత ఏక్‎నాథ్ షిండే తిరుగుబావుటా ఎగరేయడంతో.. సంక్షోభానికి తెర లేచింది. 42 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పాలిత అసోంలోని గౌహతిలో ఆతిథ్యం పొందుతూ.. క్షణక్షణం అధికార శివసేనలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. శివసేన రెబల్ ఎమ్మెల్యే షిండే చాలా కీలకంగా మారిపోయారు. తన దగ్గరున్న సంఖ్యతో బీజేపీతో పాటు శివసేన రెబల్ అభ్యర్థులతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులభమైపోయింది. ఈ సంక్షోభాన్ని ఆలస్యంగా గుర్తించిన శివసేన, ఎన్సీపీ నేతలు.. నష్టనివారణ చర్యలకు పూనుకున్నా ఆ ప్రక్రియలేవీ సుసాధ్యంగా కనిపించడం లేదు. గౌహతిలోని రాడిసన్ హోటల్లో ఉత్తేజంతో నినాదాలిస్తున్న రెబల్ ఎమ్మెల్యేల నినాదాలే అందుకు రుజువుగా చెబుతున్నారు. 

ఈ ఎపిసోడ్ నుంచి శివసేన పూర్తిగా చేతులెత్తేసినట్టే కనిపిస్తోంది. ఇంతకన్నా ఏం జరుగుతుంది.. అధికారం పోతుంది.. అంతేకదా.. పోయిన అధికారం మళ్లీ వస్తుంది అంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అసహనంగా వ్యాఖ్యానించారు. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలు చేసింది చాలా తప్పిదమని, మహా వికాస్ అఘాడీలో ఉండడం ఇష్టం లేకపోతే.. అదే విషయాన్ని తమ ముందుకు వచ్చి చెప్పవచ్చన్నారు. ఇప్పటికీ వారు వెనక్కి రావాలని కోరుతున్నట్టు చెప్పారు. ఈ ఆటలో అసలు ఎవరూ పట్టించుకోని క్యారెక్టర్ ఎవరూ అంటే... అది కాంగ్రెస్. రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటేల్ తూతూ మంత్రంగా మీటింగ్ పెట్టి ఎన్సీపీని, శివసేనను తిట్టిపోశారు. అక్కసు వెళ్లగక్కారు. 

ఇటు శివసేన అధికారిక నేతగా ఉద్ధవ్ థాక్రే పెట్టిన సమావేశానికి కేవలం 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. దీంతో శివసేన చేతులెత్తేసినట్లే అయిపోయింది. మరోవైపు ఈ అలయెన్సుకు రూపకల్పన చేసిన శరద్ పవార్.. ముఖ్యమంత్రిగా షిండేకే పగ్గాలు అప్పజెబుతామని బేరసారాలు చేసినా.. ఇక్కడిదాకా వచ్చాక ఇప్పుడెలా వెనక్కి వస్తామంటూ బెట్టు చేస్తున్నారు. వెనక్కి రాకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ సంజయ్ రౌత్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. రౌత్ విజ్ఞప్తులను గానీ, ఆయన హెచ్చరికలను గానీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా హాస్యాస్పదంగా కొట్టిపారేస్తున్నారు. ఇదే సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ భారీ కటౌట్ ను ఆయన ఇంటిముందు పెట్టి ముఖ్యమంత్రిగా పేర్కొంటూ బీజేపీ కార్యకర్తలు ప్రదర్శిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేలు ఏకమొత్తంలో పార్టీ మారినా యాంటీ డిఫెక్షన్ లా వర్తించదని న్యాయ నిపుణులు అంటున్నారు. దీంతో శివసేన చాప్టర్ కూడా క్లోజ్ అయ్యిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కూటమికి రూపకర్త అయిన శరద్ పవార్ ను మించిన చాణక్యుడిగా ఇప్పుడు మహా రాజకీయాల్లో దేవేంద్ర ఫడ్నవీస్ కనిపిస్తున్నాడంటున్నారు రాజకీయ నిపుణులు.

సంక్షోభం పతాకస్థాయికి చేరింది. అయితే ఫిరాయింపుదార్ల చర్యలతో మహా రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. ఉద్ధవ్ శిబిరం నుంచి మరో ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు.. ఏక్‎నాథ్ షిండేతో చేతులు కలిపారు. వారు గౌహతి బాట పట్టారు. మరోవైపు షిండే క్యాంపు నుంచి ఓ ఎమ్మెల్యే మహారాష్ట్ర పయనమైనట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఎన్సీపీలో ఉత్సాహం కనిపించింది. ఎన్సీపీ ఎమ్మెల్యేల మీటింగ్ తరువాత ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడారు. శివసేనకు తమ మద్దతు కొనసాగుతుందని, ఈ సంక్షోభానికి త్వరలోనే తెర పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలు రెబల్స్ ను రెచ్చగొట్టగా.. అజిత్ పవార్ వ్యాఖ్యలు.. తప్పు దిద్దుకునేలాగా కనిపిస్తున్నాయంటున్నారు. ఇక ఆఖరు దశలో శరద్ పవార్ ఎంటరయ్యారు. దీనికంతటికీ కారణం బీజేపీయేనని... శివసేన వెంట తాము కొనసాగుతామన్నారు. రాజీనామాకు సిద్ధపడ్డ ఉద్ధవ్ ను పవార్ వారించినట్లుగా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

రైతు సమస్యలు పరిష్కరించకపోతే పెను ప్రమాదమే

రైతు సమస్యలు పరిష్కరించకపోతే సమాజం అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అది జరగకుండా ఉండేందుకు మీడియా చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని, రైతుల కోసం పనిచేసే సంస్థలు సంఘాలు ముఖ్యంగా బి కే ఎస్ - భారతీయ కిసాన్ సంఘ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు రైతుల కోసం ఎంతో శ్రమించాల్సి ఉందని సీనియర్ జర్నలిస్ట్ తాటికొండ రమేష్ బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రచార ఆయామ్ సమావేశము BKS రాష్ట్ర కార్యాలయం రాజపుత్ రెసిడెన్సి లో *ప్రాంత ప్రచార ప్రముఖ్  ల్యాగల శ్రీనివాస్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ శ్రీ సుదర్శన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ రమేష్ బాబు రాకల్లోకం యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ రాక సుధాకర్ హాజరయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ సమాచార విప్లవం వచ్చిన తర్వాత ప్రజలకు నేరుగా సమాచారం అందడం వలన ప్రజలు విజ్ఞానవంతులైనారు, కానీ సమాచారం అనేది పుస్తకాల రూపంలో పత్రికలు రూపంలో ఇంటర్నెట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నేడు అవసరమైన దానికంటే ఎక్కువ అందుబాటులో ఉన్నది. కానీ సరియైన సమాచారం  వినియోగించుకొని నూతనంగా

బీజేపీ విశ్వబ్రాహ్మణ అధికార ప్రతినిధిగా చెన్నయ్య.. మీడియా ఇంచార్జ్ గా రవికిరణ్

క్షేత్రస్థాయిలో బీజేపీని పటిష్టం చేసే క్రమంలో హైదరాబాద్ లో పలు కీలకమైన బాధ్యతలను క్రియాశీలమైన కార్యకర్తలకు అప్పగించారు. బ్రహ్మశ్రీ తల్లోజు చెన్నయ్యాచారిని విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం నుంచి అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ విశ్వబ్రాహ్మణ మీడియా సెల్ కన్వీనర్ పూసాల బ్రహ్మచారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బ్రహ్మశ్రీ వలబోజు రవికిరణ్ ఆచారికి తెలంగాణ మీడియా కో కన్వీనర్ గా బాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రం అందించారు. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయాలని, పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలని కొత్తగా బాధ్యతలు అందుకున్నవారిని బ్రహ్మచారి కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఓబీసీ ప్రెసిడెంట్ ఆలె భాస్కర్, భాగ్యనగర జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పెండం లక్ష్మణ్, కౌలే జగన్నాథం, రుద్రోజు శివలింగాచారి తదితరులు పాల్గొన్నారు.