Skip to main content

కొత్తగా తయారవుతున్న మావోయిస్టుల హిట్ లిస్ట్

ఎన్.ఐ.ఎ... నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అంతర్గత శాంతిభద్రతల కోసం నిరంతరం పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ. తీవ్రవాదులు, ఉగ్రవాదుల కదలికలపై పూర్తి నిఘా పెట్టి వారిని మట్టుపెట్టే పకడ్బందీ సంస్థ. దాని వెబ్ సైట్ లో వివరాలు కూడా ఎప్పటికప్పుడు అప్-డేట్ చేస్తూంటారు. అయితే కొందరు కీలకమైన మావోయిస్టు నేతలు చనిపోయి చాలాకాలం అవుతున్నా.. వారి పేర్లను మాత్రం ఇంకా తొలగించలేదు. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్.కె... ఆయన మావోయిస్ట్ కేంద్రకమిటీ సభ్యుడిగా పని చేశారు. ఇక యాపనారాయణ అలియాస్ హరిభూషణ్. ఈయన మావోయిస్ట్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. అయితే గత సంవత్సరమే వారు చనిపోయారు. అయినా ఎన్.ఐ.ఎ మాత్రం వారి పేర్లను ఇంకా మోస్ట్ వాంటెడ్ జాబితాలోనే ఉంచింది. 

ఆర్కే, హరిభూషణ్ తో పాటు మరికొందరు తెలుగువారు కూడా ఎన్.ఐ.ఎ. హిట్ లిస్టులో ఉన్నారు. ఈ సంవత్సరం మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నవారిపై రివార్డులు పెరుగుతాయని పోలీసు శాఖ చెబుతోంది. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్లవారీగా తాజా లిస్టును ఎన్.ఐ.ఎ. సేకరిస్తోంది. తాజా లిస్టులో ఇంకా ఎవరున్నారనేది ఆసక్తికరంగా మారింది. యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌.. తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామానికి చెందిన కోయతెగకు చెందిన మావోయిస్టు నేత. రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరించిన ఆయన గతేడాది జూన్‌ 21న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ అడవుల్లో కోవిడ్‌తో మరణించారు. ఇక అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ.. అలియాస్ ఆర్కే.. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమకోటకు చెందిన ఆయన.. అనారోగ్యంతో గతేడాది అక్టోబర్‌ 14న బస్తర్‌ అటవీ ప్రాంతంలో చనిపోయారు. 

Also Read: కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా?

ఈ ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు చనిపోయి నెలలు గడుస్తున్నా.. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ వారి పేర్లను ఇంకా మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలోనే ఉంచింది. ఎన్‌ఐఏ వెబ్‌సైట్‌లో దేశవ్యాప్తంగా ఉగ్రవాద, తీవ్రవాద, వేర్పాటువాద, తీవ్ర ఆర్థిక నేరాలతో సంబంధమున్న 328 మంది పేర్లతో మోస్ట్‌ వాంటెడ్ జాబితాను రూపొందించింది. అందులో ఇప్పటికే చనిపోయిన మావోయిస్టు నేతల పేర్లు ఉండటం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల రిక్రూట్‌మెంట్‌ పెరిగిందన్న ఇంటెలిజెన్స్‌ సమాచారం మేరకు.. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నేతల వివరాలను జిల్లాలు, పోలీస్‌స్టేషన్ల వారీగా సేకరిస్తున్నారు. హనుమకొండ, జేఎస్‌ భూపాలపల్లి, జనగామ జిల్లాల నుంచి ఇలాంటి డేటా తీసుకున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్‌ సహా 11 రాష్ట్రాల్లో పనిచేస్తున్న మావోయిస్టు నేతల వివరాలు, వారిపై ఉన్న రివార్డులపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ రివార్డులు పెంచనున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన 54 మంది ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నట్టు తేలిందని సమాచారం. ఎన్‌ఐఏ జాబితాలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్.. గంగన్న, ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి పేర్లను టాప్‌ వాంటెడ్‌ లిస్టులో చేర్చగా.. ఆ తర్వాత మడావి హిడ్మా, మరికొందరి పేర్లున్నట్టు తెలిసింది. గణపతిపై ఇప్పటికే రూ. 2.52 కోట్ల రివార్డు, బస్వరాజ్‌పై రూ.1.25 కోట్లు, కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న నేతలపై కోటి రూపాయల చొప్పున రివార్డులున్నాయి. తెలంగాణ నుంచి 9 మంది మావోయిస్టులు కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇందులో మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ భూపతి, కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్‌ సాధు, కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్, మల్లా రాజిరెడ్డి, గంకిడి సత్యనారాయణరెడ్డి, మోడం బాలకృష్ణ, పుల్లూరు ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న, గాజర్ల రవి అలియాస్‌ గణేశ్, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న, తిప్పిరి తిరుపతి తదితర అగ్రనేతల పేర్లు ఈ జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఇక ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 40 మందిని మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. 

Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

'తానా' కవి సమ్మేళనానికి ఎంపికైన జె.వి.కుమార్ చేపూరి

తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు"  పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత”  అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.  Also Read:  కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, ముఖపుస్తకం (ఫేస్ బుక్) ఛానల్ ల