Skip to main content

Posts

Showing posts from October, 2021

ఈటల కోటలో గెల్లు గెలుపు ఖాయమేనా?

అంచనాలకు అందనిదే రాజకీయం. ఊహించని పరిణామాలు జరిగే వేదికే ఎన్నికల రణక్షేత్రం. అందులోనూ తెలంగాణ ఉద్యమకారుడిగా పరిచయమై, టీఆర్ఎస్ లో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈటల రాజేందర్ ను ఢీకొట్టడం అంటే ఆషామాషీ కాదు. అలాంటి ఈటలను హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎదుర్కొనేందుకు అత్యంత సామాన్యుడైన గెల్లు శ్రీనివాస్ ను కేసీఆర్ ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే అనూహ్యమైన పాచికలు వేసి శత్రువు అంచనాలు తల్లకిందులు చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఆయన మస్తిష్కమే వినూత్న ఆలోచనల కర్మాగారం. ఏ ఆలోచన వెనుక ఏ పరమార్థం దాగి ఉందో తెలుసుకోవడం సాధారణ రాజకీయ నాయకులకు సాధ్యం కాదు. అలాంటి ఓ వినూత్నమైన ఎన్నికల ఎత్తుగడే గెల్లు శ్రీనివాస్ ఎంపిక.  టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సాధనకు అసలు సిసలు చిరునామా. ఆ ఉద్యమ తోటలో పూసిన ఒక పువ్వే గెల్లు శ్రీనివాస్. అత్యంత సామాన్యమైన యాదవ కుటుంబం నుంచి వచ్చిన గెల్లు శ్రీనివాస్ ను ఈటల మీదికి పోటీకి దింపడం, హుజూరాబాద్ లో ప్రజాభిప్రాయాన్ని టీఆర్ఎస్ కు క్రమంగా అనుకూలంగా మార్చుకోవడం, అందుకోసం తన పార్టీ పరివారం యావత్తునూ హుజూరాబాద్ కు రప్పించడం, ఈటల క్యాంపులో అతిశయించిన ఆత్మవిశ్వాసం వెన్ను విరవడం