Skip to main content

Posts

Showing posts from October, 2020

హైదరాబాద్ రెండో రాజధాని.. ఆంధ్రప్రభ కన్ఫర్మేషన్

మన దేశానికి ఇప్పటికైతే ఒకటే రాజధాని ఉంది. అది ఢిల్లీ. రెండో రాజధాని కూడా ఉందని, అది హైదరాబాదేనని ప్రముఖ దినపత్రిక ఆంధ్రప్రభ కన్ఫామ్ చేస్తోంది. గురువారం (29-10-2020) హైదరాబాద్ మెయిన్ ఎడిషన్ ఫస్ట్ పేజీ లోనే హైదరాబాద్ రెండో రాజధాని అంటూ కన్ఫామ్ చేసేసింది ఆ పేపర్ ఎడిటోరియల్ టీమ్. బుల్లెట్ ట్రెయిన్ ద్వారా "నాలుగు గంటల్లో ముంబైకి" అనే వార్తను హైలైట్ చేస్తూ దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి దేశ రెండో రాజధాని హైదరాబాద్ కు అతి తక్కువ సమయంలో చేరుకోవచ్చని, దీనిద్వారా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు మరింత ఊపందుకుంటాయని ఓ మంచివార్తను ప్రజెంట్ చేశారు. కానీ.. దేశ రాజధానిగా హైదరాబాద్ ఎప్పుడైంది అనేదే అంతుపట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ను రెండో రాజధానిగా ఎప్పుడు ప్రకటించింది? రాష్ట్రపతి ఏమైనా రాత్రికిరాత్రే ఉత్తర్వులిచ్చారా? లేదా పార్లమెంట్ తలుపులు మూసి రహస్యంగా ఏమైనా పని కానిచ్చేశారా? ఎందుకంటే అప్పట్లో తెలంగాణను పార్లమెంట్ తలుపులు మూసి బిల్లు పాస్ చేశారు కదా.. అదే పద్ధతిలో ఇప్పుడు బీజేపీ నేతలు అవే ఎత్తుగడలేమైనా వేశారా? సామాన్య పాఠకుడికి ఇలా పరిపరివిధాలా ఆలోచనల...

బీజేపీతో షురూ.. ఆల్ స్టేట్స్ ఫాలోయింగ్

బిహార్ ఎన్నికల పుణ్యాన కోవిడ్-19 వ్యాక్సిన్ ఎన్నికల హామీగా మారిపోయింది. రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బిహార్ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ అంటూ ప్రకటించడం దేశంలోనే కాక పలు ఇతర దేశాల్లో కూడా చర్చాంశంగా మారింది. మరుసటి రోజు ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. దీంతో ఇతర రాష్ట్రాలు కూడా ఫ్రీ-వ్యాక్సిన్ నినాదాన్ని ఎత్తుకున్నాయి. తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాలు వ్యాక్సిన్ ను ఫ్రీ అంటూ ప్రకటించాయి. అదే బాటలో తెలంగాణ కూడా ఫ్రీ-వ్యాక్సిన్ కు ఓటేసింది. ఈటల రాజేందర్ ఇదే అంశాన్ని కన్ఫామ్ చేస్తూ ప్రజలందరికీ ఫ్రీ-వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని, పౌరుల ఆరోగ్య భద్రత అనేది రాష్ట్రాల బాధ్యతే అయినా.. కోవిడ్ లాంటి మహమ్మారి నుంచి బయట పడాలంటే కేంద్ర, రాష్ట్రాలు కలిసి ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీ తీసుకొచ్చిన ఫ్రీ-వ్యాక్సిన్ నినాదం మీద పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తినా... ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు ఈ అంశాన్ని పాజిటివ్ తీసుకొని తమ విధానాలు ప్రకటించడం గమనించాల్సిన అంశం. తెలంగాణ మంత్రి ఈటల కూ...

డ్రాగన్ కంట్రీకి వ్యతిరేకంగా నాలుగు దేశాలు

గత ఆరో తేదీన టోక్యోలో అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రుల రెండో సమావేశం జరిగింది. అందులో అమెరికా తరఫున మైక్ పాంపియో, ఇండియా తరఫున జైశంకర్ పాల్గొన్నారు. దానికి కొనసాగింపుగా తాజాగా అమెరికా పాలకవర్గానికి చెందిన ఓ ప్రతినిధి చేసిన వ్యాఖ్య చైనాకు కళ్లెం వేసే అంశాన్ని తెరపైకి తెస్తోంది. వాషింగ్టన్ ఫారిన్ ప్రెస్ సెంటర్లో ఈ అంశాన్ని ఆయన రివీల్ చేశారు. పసిఫిక్ సముద్ర జలాల్లో, హిమాలయ పర్వతశ్రేణుల్లో చాలా దూకుడుగా ముందుకెళ్తున్న చైనాను అడ్డుకోవాలంటే భారత్ లాంటి దేశాలతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఇందుకోసం ఏ దేశం ముందుకొచ్చిన తలుపులు తెరిచే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా వ్యూహాత్మకంగా పలు దఫాలుగా చర్చలు జరపడం, దరిమిలా అమెరికా ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ నాలుగు దేశాలు ఓ కూటమిగా పని చేయడం లేదని, ఇందులో ఎవరికీ సభ్యత్వం లాంటిది లేదని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యల్ని బట్టి ఏ దేశ సార్వభౌమాధికారానికీ ఇబ్బందులు తలెత్తకుండా అదే సమయంలో కొన్ని దేశాల విస్తరణ కాంక్షకు కళ్లెం వేసే ఎత్తుగడతో ఇలాంటి దేశాలను ఒక్క అవగాహన కింద...

వాడవాడలా బతుకమ్మ సంబురాలు

తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ ఆడటం పురాతనంగా వస్తున్న సంప్రదాయం. ఈ క్రమంలో బొమ్మకల్ గ్రామంలోని పలు వీధుల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ ఆడారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటలవరకు ఆడపడుచులు బతుకమ్మ ఆడి ఆనందం పంచుకున్నారు. అనంతరం వాగుకు వెళ్లి అక్కడ కూడా భారీ సంఖ్యలో మహిళలు చాలాసేపు బతుకమ్మ పాటలు పాడుకొని గౌరీదేవికి వాయనాలు సమర్పించుకున్నారు. అనంతరం వాగులో నిమజ్జనం చేశారు.  తెలంగాణ అంతటా 9 రోజుల పాటు బతుకమ్మ పండుగ జరుగుతుండగా కరీంనగర్ పక్కనున్న బొమ్మకల్ లో మాత్రం 7 రోజులకే పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడు, కరీంనగర్ పక్కనే ఉన్న కొత్తపల్లి తదితర గ్రామాల్లో కూడా 7 రోజులకే సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు.   

ఆంధ్రాలో బతుకమ్మ-ఎస్సై ఓవరాక్షన్

బతుకమ్మ పండుగను కేవలం తెలంగాణలో మాత్రమే జరుపుకుంటారని అందరూ అనుకుంటారు. కానీ అదేంకాదు.. ఆంధ్రాలో కూడా జరుపుకుంటారని తాజా ఘటన రుజువు చేస్తోంది. అయితే సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఆడుకునే సమయంలో స్థానిక ఎస్సై ఓవరాక్షన్ చేయడం కలకలం రేపుతోంది. తాను అక్కడ ఉండగా బతుకమ్మ ఆడే అవకాశమే ఇవ్వనని పంతానికి పోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం జయంతి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గురువారం (22వ తేదీ సాయంత్రం) గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి ప్రాంగణంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసుకొని నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. ఇదే సందర్భంలో అమ్మవారి విగ్రహం సమీపంలో కరోనా నిబంధనలు పాటిస్తూ మహిళలు బతుకమ్మలు ఏర్పాటుచేసి ఆడుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న వీరులపాడు ఎస్ఐ హరి ప్రసాద్ మహిళలతో దురుసుగా ప్రవర్తించారు. సుమారు రెండు గంటలకు పైగా బతుకమ్మలతో వచ్చిన మహిళలను నిర్దాక్షిణ్యంగా అక్కడే నిలబెట్టారు. బతుకమ్మలు ఆడటానికి వీల్లేదని హుకుం జారీ చేశాడు.గ్రామస్తులపై దుర్భాషలాడుతూ ఈరోజు నుండి బతుకమ్మలు ఎలా ఆడతారో చూస్తాను అంటూ హరిప్రసాద్ బెదిరించారని గ్రామస్తుల...