Skip to main content

Posts

Showing posts from August, 2020

చేపూరికి మాతృవియోగం

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ప్రముఖ విశ్వబ్రాహ్మణ నాయకుడు, ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ సంఘం వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చేపూరి లక్ష్మణాచారి తల్లిగారైన మాణిక్యమ్మగారు ఆగస్టు 21న పరమపదించారు. 90 ఏళ్లు పైబడ్డ మాణిక్యమ్మ చివరివరకు దైవచింతనలో గడిపారు. నిండైన ఆరోగ్యంతో తన పనులను తానే నిర్వహించుకున్నారు. అనేక ఆధ్యాత్మిక అంశాల్లో లక్ష్మణాచారికి మార్గదర్శనం చేశారు. తల్లిగారి మరణంతో లక్ష్మణాచారి, ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సెప్టెంబర్ 1న నల్గొండ జిల్లా చింతపల్లి (గ్రా, మం)లోని బీసీ కాలనీలో గల స్వగృహంలో ద్వాదశ దిన కర్మ జరుపుతున్నట్లు లక్ష్మణాచారి చెప్పారు. సన్నిహుతులు, బంధుమిత్రులు, హాజరై మాతృమూర్తికి ఆత్మశాంతి కలిగించాలని కోరారు.

జయశంకర్ సార్ స్ఫూర్తితో ముందుకు సాగాలి

తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ఉన్నతాశయాలను అనుసరిస్తూ ముందుకు సాగాలని హైదరాబాద్ ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, పీజేఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చేపూరి లక్ష్మణాచారి ఆకాంక్షించారు. నేటితరం విద్యార్థులు, యువకులు రేపటితరం యోగక్షేమాల కోసం పని చేసినప్పుడే ఆదర్శవంతమైన సమాజం సిద్ధిస్తుందని చేపూరి అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 86 జన్మదిన వేడుకలను చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని లలితా బాగ్ డివిజన్ తానాజీ నగర్ లో నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ సర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి చేపూరి లక్ష్మణాచారి, సి అనీశ్ ఆచారి, తోట శ్రీనివాసాచారి, సి అభిషేక్ ఆచారి, వేణు, అశోక్, బొడ్డుపల్లి యాదగిరి ఆచారి తదితరులు పాల్గొన్నారు.