Skip to main content

Posts

Showing posts from December, 2020

ఒకే కాలనీలో 12 వేల మందికి నూతన గృహాలు

విజయనగరం జిల్లాలోని గుంకలామ్ లో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 12,301 ఇళ్లతో నిర్మించబోయే వై.ఎస్.ఆర్.జగనన్న కాలనీకి శంకుస్ధాపన జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైలాన్ ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎం.పి.లు వి. విజయసాయి రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ డా. ఎం.హరిజవహర్ లాల్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. 
ఈనెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల (జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం రూ.7,515 కోట్ల రూపాయలు పంటసాయంగా అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.  రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు – కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. సమావేశంలో మంత్రులు కేటీ రామారావు, ఎస్.నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా

వీకెండ్ స్టోరీ- ఆధునిక ఆదర్శ హిందూ వివాహం ఇదే

హిందూ సమాజ వ్యవస్థ ఎంత సంక్లిష్టమైందో... అంత సానుకూలమైంది కూడా. అయితే అనుకూలతలు అటుంచి కేవలం సంక్లిష్టతలు మాత్రమే ఎత్తిచూపే ప్రబుద్ధులు తమ దుర్బుద్ధిని మార్చుకోవాల్సిన సందర్భాలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. అందుకు కరీంనగర్‍లో జరిగిన తాజా పెళ్లే ఓ ఉదాహరణ.  డిసెంబర్ 23వ తేదీన కరీంనగర్ లో జరిగిన సహస్ర-మహేశ్‍ల పెళ్లి కులాతీత ఆధునిక హిందూ ఆదర్శ వివాహానికి ఓ ఆనవాలుగా నిలిచిపోతుంది. ఎందుకంటే పెళ్లికూతురు, పెళ్లికొడుకు, పెళ్లిపెద్దలు.. ఇలా ముగ్గురూ మూడు సామాజికవర్గాలకు చెందినవారు కావడం విశేషం. సహస్ర (ముదిరాజ్), మహేశ్ (మేరు)తో పాటు పెళ్లిపెద్దలైన రాజ్‍కుమార్-అన్నపూర్ణ (విశ్వబ్రాహ్మణ) వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవారు. వీరెవరూ రక్త సంబంధీకులు కాకపోయినా, అమ్మాయి-అబ్బాయిల కులపెద్దల మద్దతు కోసం ఎదురుచూడకుండా.. కేవలం అమ్మాయి-అబ్బాయి కుటుంబాలతో ఉన్న పాత పరిచయం, స్నేహాన్నే ఆత్మబంధంగా భావించి యువజంటను ఒక్కటి చేశారు. ఖర్చులకు వెనుకాడకుండా బంధువర్గం, ఉద్యోగ స్నేహితులు.. ఇలా అందరూ మెచ్చేలా అంగరంగ వైభవంగా సహస్ర పెళ్లిబాధ్యతలు పూర్తి చేశారు. నేటి కాలానికి అవసరమైన అసలైన హిందూ ఆదర్శ వివాహాన్ని ఆచరించి చూపారు.

weekend story- కృత్రిమ చికెన్: నేటి నుంచే మార్కెట్‍లోకి

Weekend Story:   ఇలాంటి పెళ్లిళ్లతో హిందూ వ్యవస్థకు ఢోకా లేదు IMP Story:   ఎంఐఎంతో పొత్తు కోసం తహతహ ఇందుకేనా? మానవ జిహ్వ చాపల్యానికి వీకెండ్స్ లో ఎన్ని మూగజీవాలు క్యూ కట్టి బలవుతున్నాయో ఊహించజాలం. అయితే మానవులు జిహ్వచాపల్యాన్ని అణచుకోకుండానే మూగజీవాలు సంతోషించే రోజు రానే వచ్చింది. దాదాపు పదేళ్లుగా జరుగుతున్న ప్రయోగాలకు ఎండ్ కార్డ్ పడుతోంది. మార్కెట్ లోకి కృత్రిమ చికెన్ వచ్చేసింది. భవిష్యత్తులో కోళ్లన్నీ ఆనందించే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఇవాళ్టి నుంచే (డిసెంబర్ 19) సింగపూర్లో కృత్రిమ చికెన్ "రెస్టారెంట్ 1880" లోకి అడుగు పెడుతోంది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించింది. చికెన్ సెల్స్ నుంచి మాంసకృత్తులను డెవలప్ చేసి ల్యాబ్ లో తయారుచేసిన చికెన్ సింగపూర్ రెస్టారెంట్లలో ఇవాళ్టి డిన్నర్ నుంచే ఘుమఘుమలాడుతుంది. 13 నుంచి 18 ఏళ్ల వయసున్న కుర్రాళ్లే ఈ కృత్రిమ చికెన్ తొలి వినియోగదారులు కావడం విశేషం. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన ఈట్ జస్ట్ కంపెనీయే సింగపూర్ లో దాని ఉత్పత్తిని తొలిసారిగా మార్కెటింగ్ చేస్తోంది. కంపెనీ సీఈఓ లీ-కా-షింగ్ సింగపూరియన్ కావడం గమ

తక్కువ తేడాతో ఎక్కువ సీట్లు: ఇదెలా సాధ్యం? ఎవరి కుట్ర?

Also Read:   ఆవు పేడతో చెప్పుల తయారీ Weekend Story:   కృత్రిమ చికెన్: నేటి నుంచే మార్కెట్‍లోకి Weekend story:  హండ్రెడ్ పర్సెంట్ హరామ్ Weekend Story:   ఇలాంటి పెళ్లిళ్లతో హిందూ వ్యవస్థకు ఢోకా లేదు ప్రభుత్వాలు కంటికి కనిపించని కుట్రలకు పాల్పడతాయా? అలాంటి అవకాశం ఉంటుందా? రాజకీయాలను, వాటి చుట్టూ పెనవేసుకున్న ప్రయోజనాలను అర్థం చేసుకుంటే ఏమైనా జరగొచ్చని అనిపించక మానదు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఫలితాలను కాస్త లోతుగా పరిశీలిస్తే లోపాలతో పాటు.. కొన్ని కుట్రలు కూడా జరిగాయన్న విషయం తెలుస్తుంది.  అధికార టీఆర్ఎస్, దూకుడు మీదున్న బీజేపీకి ఓట్ల శాతం చాలా తక్కువగా నమోదైంది. 35.73 శాతంతో 11,92,162 ఓట్లతో టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండగా.. 35.55 శాతంతో 11,86,096 ఓట్లు సాధించిన బీజేపీ రెండో స్థానంలో ఉంది. అంటే టీఆర్ఎస్ కు, బీజేపీకి 0.18 శాతం ఓట్ల స్వల్ప దూరం మాత్రమే ఉందన్నమాట. ఒక్క శాతం తేడా కూడా లేని ఓట్ల శాతంతో జీహెచ్ఎంసీలో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది. ఇక 18.91 శాతంతో 6,30,867 ఓట్లు మాత్రమే పొందిన ఎంఐఎం 44 డివిజన్లలో జెండా ఎగరేసి మూడో స్థానంతో తన పట్టు నిలుపుకోగలిగింది. ఇక కాంగ్రెస్ 6.61 శాత

విజయ్ దివస్: పాక్ మెడలు వంచిన రోజు ఇదే

పాకిస్తాన్ కుత్సిత బుద్ధికి భారత్ తిరుగులేని రీతిలో జవాబిచ్చింది. మానవత్వాన్ని మరచిన పాక్ సేనలు బంగ్లాదేశ్ మీద జరిపిన దారుణ కాండకు తగిన గుణపాఠం చెప్పింది. అవకాశం దొరికిన ప్రతిసారీ ముస్లిం దేశాల తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే పాక్ అసలు బండారం బయటపడింది. బంగ్లాదేశ్ ముస్లిం దేశమే అయినప్పటికీ.. తూర్పు పాకిస్థాన్ కు సంబంధించిన భూభాగపు ప్రజలపై విపరీతమైన కక్షతో పశ్చిమ పాకిస్తాన్ కు చెందిన సైనికులు వచ్చి కేవలం తమ భాషను ఆమోదించని కారణంగా వేలాది మందిని చంపడమే కాకుండా తమ మతానికే చెందిన అక్షరాల లక్షకుపైగా మహిళలను రేప్ చేసినట్లుగా తెలిసి... అప్పటి భారత ప్రభుత్వం ఈ రాక్షసత్వాన్ని చూస్తూ ఉండలేకపోయింది. బంగ్లాదేశ్ కు సహకారం అందించి, సైనికులను పంపించి దుర్మార్గాలకు పాల్పడిన పశ్చిమ పాకిస్తాన్ కు సంబంధించిన 93 వేల మందికిపైగా దుష్ట సైనికులను ప్రాణాలతో బంధించింది. భారతదేశపు గడ్డపై మోకాళ్ళపై కూర్చుండబెట్టింది.. పాక్ పాలకుల్ని తలదించుకునేలా చేసింది. ఆ రోజే డిసెంబర్ 16, 1971 "విజయ్ దివస్".  Also Read:   ఆవు పేడతో చెప్పుల తయారీ 1971లో జరిగిన ఆ నాటి యుద్ధం భారత ఉపఖండం రూపురేఖలనే మార్చేసింది. తూర్పు

జానారెడ్డికి గవర్నర్‍గిరీ?

జనమెరిగిన నాయకుడు జానారెడ్డికి….. రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉంటారనే పేరుంది. నియాజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి మనసుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే బలమైన కోరిక ఆయనలో ఉంది. కాంగ్రెస్ కు అధికారం వస్తే ముఖ్యమంత్రి రేసులో ముందుండే వ్యక్తి ఆయనే. గతంలోనే ఆయన తన కుమారుడికి మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ ఇప్పించాలని గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ అవకాశం రాలేదు. అలాంటి జానారెడ్డి బీజేపీలో చేరతారా? కమలనాథులు జానాకు గవర్నర్ పదవి ఆఫర్ చేశారా.. ? లేక జానారెడ్డినే తనకు గవర్నర్‍గిరీ కావాలని, తన కుమారుడికి నాగార్జునసార్ ఉపఎన్నిలల్లో టికెట్ ఇవ్వాలని అడిగారా? రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే టాపిక్ చర్చనీయాంశంగా మారింది.  నాగార్జునసాగర్ ఎంఎల్ఏ నోముల నరసింహయ్య ఆకస్మిక మరణంతో జానారెడ్డి భవిష్యత్ రాజకీయాలపై చర్చకు దారితీసింది. సాగర్ కు జరిగే ఉపఎన్నిలను తమకు అనుకూలంగా మార్చుకోవటం ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని మరోమారు చాటి చెప్పాలని చూస్తున్న బీజేపీ నేతలు.. అందుకు సాగర్లో తగిన నాయకుడు జానారెడ్డే కాబట్టి ఆయన్ను ఎలాగైనా తమ పార్టీలోకి లాగాలని గట

ఆవు పేడతో చెప్పులు.. త్వరలో మార్కెట్‍లోకి

Main Story:   జానారెడ్డికి గవర్నర్‍గిరీ? Also Read:   పాక్ మెడలు వంచిన రోజు ఇదే   Also Read:   ఎంఐఎంతో పొత్తుకు తహతహ ఇందుకేనా? Weekend story:  హండ్రెడ్ పర్సెంట్ హరామ్ Weekend Story:   ఇలాంటి పెళ్లిళ్లతో హిందూ వ్యవస్థకు ఢోకా లేదు ఆవు పేడ ఏంటి.. చెప్పుల తయారీ ఏంటి.. అనుకుంటున్నారు కదా. మీరు వింటున్నది నిజమే. దీన్నిబట్టి చూస్తే రానున్న రోజుల్లో ఆవుకు మంచి డిమాండే ఉంటుందని ఊహించవచ్చు. హైదరాబాద్ లో ఉంటున్న అమిత్ భట్నాగర్ దాదాపు 20 ఏళ్లకు పైగా పంచగవ్య చికిత్స విషయంలో పని చేస్తున్నారు. తాను తలపెట్టిన ఈ మహాయజ్ఞంలో చాలా మంది గో ప్రేమికులు, ఆత్మీయ సహచరులు పాలుపంచుకుంటున్నారని భట్నాగర్ చెబుతారు . ఆవు విసర్జితాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సద్వినియోగం చేయాలన్నదే అమిత్ భట్నాగర్ సంకల్పం. హైదరాబాద్ తో పాటు పాత కరీంనగర్ జిల్లాలోని మంథనిలో వీరి ఆధ్వర్యంలో గోశాలలు నడుస్తున్నాయి. అంతేకాదు.. రాజస్తాన్ లో వీరి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో గో ఉత్పాదనల ప్రాజెక్టు నడుస్తోంది.  వీరి రీసెర్చ్ వల్లే ఆవు పేడ నుంచి అనేక కొత్త రకాల ఉత్పాదనలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే ఆవు పేడ నుంచి అందరూ ఆశ్చర్యపోయేలా కాగితాన్ని తయారు చేశా

జానారెడ్డి బీజేపీలో చేరడం ఖాయమేనా?

కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జూనారెడ్డి బీజేపీలో చేరడం ఖాయమేనా అంటే.. పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటే అంతకంటే వేరే ఆప్షన్ కూడా ఆయనకు లేదని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. దేశమంతా కాంగ్రెస్ దెబ్బతిన్న క్రమంలో ఢిల్లీలో ఆయనకంటూ పెద్దదిక్కు ఎవరూ లేకపోవడం ఆయనకు పెద్దమైనస్ పాయింట్. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాక.. ఆ స్థానాన్ని రేవంత్ చేత భర్తీ చేద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ ఎంపిక కూడా దాదాపుగా ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే రేవంత్ దూకుడును, పోకడను, రాకడను ససేమిరా అంటున్న సీనియర్లు మాత్రం రేవంత్ వస్తే తాము పార్టీలో ఉండే ప్రశ్నే లేదని భీష్మించుక్కూర్చున్నారు. రేవంత్ వస్తే తమ ప్రాధాన్యత అసలు ఏమాత్రం లేకుండా పోతుందని, ఇన్నాళ్లూ ఉనికి చాటుకున్న పార్టీలో అసలు ఉనికే లేకుండా పడిఉండడం తమ వల్ల కాదని వారంటున్నారు. అందుకే దాదాపు గత ఏడాదిన్నరగా రేవంత్ టీ-పీసీసీ అనౌన్స్ మెంట్ ను తొక్కి పెట్టినట్లు సమాచారం. అయితే గ్రేటర్ ఫలితాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుపడే సూచనలేవీ కనిపించకపోవడంతో ఇదే అదనుగా ఉత్

30 సర్కిళ్లు.. 30 కౌంటింగ్ సెంటర్లు.. సీసీ టీవీ కెమెరాలు

గ్రేటర్ హైదరాబాద్ ను మొత్తం 30 సర్కిళ్లుగా విభజించి అందులో డివిజన్లు/వార్డులవారీ ఎన్నికలు నిర్వహించారు. ఒక్కో సర్కిల్లో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ వరకు ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్ కి 14 టేబుల్స్, ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. 30 సర్కిళ్లకు 30 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. హైదరాబాద్ లో ఉన్న సర్కిల్స్, డివిజన్ల వివరాలు ఇవీ..  1) కాప్రా సర్కిల్ : 1) కాప్రా 2) ఏఎస్ రావు నగర్ 3) చెర్లపల్లి 4) మీర్‍పేట్ హెచ్బీ కాలనీ 5) మల్లాపూర్ 6) నాచారం 2) ఉప్పల్ సర్కిల్ : 7) చిలుకనగర్ 8) హబ్సిగూడ 9) రామంతాపూర్ 10) ఉప్పల్ 3) హయత్‍నగర్ సర్కిల్: 11) నాగోల్ 12) మన్సూరాబాద్ 13) హయత్‍నగర్ 14) బీఎన్ రెడ్డినగర్ 4) ఎల్బీనగర్ సర్కిల్: 15) వనస్థలిపురం 16) హస్తినాపురం 17) చంపాపేట్ 18) లింగోజిగూడ 5) సరూర్‍నగర్ సర్కిల్: 19) సరూర్‍నగర్ 20) ఆర్కేపురం 21) కొత్తపేట 22) చైతన్యపురి 23) గడ్డిఅన్నారం 6) మలక్‍పేట్ సర్కిల్: 24) సైదాబాద్ 25) మూసారంబాగ్ 26) ఓల్డ్ మలక్‍పేట్ 27) అక్బర్‍బాగ్ 28) అజాంపురా 29) చావని 30) డబీర్‍పురా 7) సంతో

సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేటర్ ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్న సస్పెన్స్ వీడేందుకు మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ఇవాళ ఓల్డ్ మలక్ పేట డివిజన్లో జరుగుతున్న రీపోలింగ్ దృష్ట్యా క్షేత్రస్థాయిలో సర్వే చేసిన పలు ప్రైవేటు సంస్థలు కూడా 1వ తేదీన ఎగ్జిట్ పోల్ అంచనాలు విడుదల చేయలేకపోయాయి. అయితే ఈ సాయంత్రం 6 గంటలకు ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాల విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్నికలపై సర్వే నిర్వహిస్తున్న ఆరా సంస్థ ఈ సాయంత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం.  Also Read:   బీజేపీ కొత్త ఆపరేషన్                            గ్రేటర్ కౌంటింగ్.. వివరాలివే                          గ్రేటర్ పై పోల్ సర్వేలు ఏం చెప్తున్నాయి? మొన్న దుబ్బాక ఎన్నికల్లో కూడా ఆరా సంస్థ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి పోరు భీకరంగా జరిగినా కారు గెలుస్తుందని చెప్పింది. కానీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచారు. దీంతో గ్రేటర్ పోల్ విషయంలో మరింత పకడ్బందీగా అంచనాలు విడుదల చేయాలని ఆ సంస్థ అధిపతి మస్తాన్ వలీ భావిస్తున్నారు. అలాగే మరికొన్ని ప్రైవేటు సంస్థలు కూడా

న గల్లీ తుమ్హారా.. న ఢిల్లీ తుమ్హారా..

ఇది మా ఇలాకా.. ఇక్కడెవరి పప్పులూ ఉడకవు.. ఉడకనివ్వం అనుకొని విర్రవీగుతుంటే.. ఆ పప్పులు ఉడకబెట్టే మనిషెవరో  ఎక్కడి నుంచో దిగి వస్తాడు. రాక తప్పదు. అలా రాకపోతేనే ప్రమాదం. గల్లీ పేరు జెప్పి ఢిల్లీని కొడతానంటే.. ఢిల్లీలో కూర్చున్నవాడు గల్లీలో వేలు పెట్టక తప్పదు. దాన్ని సమర్థించినవాడు దీన్ని కూడా సమర్థించాలి. లేదు.. నా ఇష్టం నాదే అంటే.. ఎవరిష్టం వారిదే అని కూడా అంగీకరించాల్సిందే. అలాంటప్పుడు బలమున్నవాడిదే బడితె... బర్రె కూడా.  యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముంబైలో పర్యటిస్తున్నారు. పర్యటించడమే కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన వేలు కూడా పెట్టారు. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి అంతటి ఆయువుపట్టు తెచ్చింది సినిమా ఇండస్ట్రీనే. సినిమా ఇండస్ట్రీని అడ్డం పెట్టుకొనే అక్కడి రాజకీయాలు అధ్వానంగా తయారయ్యాయి. ప్రాంతీయ ప్రయోజనాలు, ఆత్మగౌరవం కోసం ఆవిర్భవించిన శివసేన కూడా హిందుత్వ ఎజెండాతో పాదుకొని సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకుంది. మొన్న కంగనా రనౌత్ ను ఇబ్బంది పెట్టినా, అంతకుముందు అర్నాబ్ గోస్వామిని వెంటాడినా ఆ బలుపు చూసుకునే అనేది అందరికీ తెలిసిందే. అంతేకాదు.. శివసేన మొన్నటి బిహార్ ఎన్నికల్లో క

గీ పట్నపోల్లకు ఏమైంది?

ఈ నగరానికి ఏమైంది.. అని తెలుగు ప్రజలంతా ఆశ్చర్యపోవాల్సిన సందర్భమిది. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీ పోరాడి మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని తహతహలాడాయి. గతంలో కంటే ఈసారైనా పోలింగ్ శాతం పెరుగుతుందని భావించారు. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. సగం కన్నా ఎక్కువ అనేదే ప్రజాస్వామ్యానికి మూల సూత్రం. మరి ప్రజల్లో 50 శాతం పోలింగ్ కానప్పుడు దాన్ని ప్రజాస్వామ్యంగా పరిగణించవచ్చా? అది మేలైన ప్రజాస్వామ్యమేనా అనే చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు? కేంద్రమో, రాష్ట్రాలో దీనికోసం పూనుకోవాల్సిన అవసరం లేదా? (పాఠకులు ఇబ్బంది అనుకోకుండా తెలంగాణ స్లాంగ్ లో చదువుకోవాలని మనవి) గీ పట్నపోల్లకు ఏమైంది? యూత్ పోరలు, సదువుకున్నోల్లు, జాబుల్ జేసేటోల్లు యాడ వోయిండ్రు? మొన్నటి సంది జెప్తనే ఉన్నం గదా... ఓట్లేసుడంటే ప్రజాస్వామ్య పండుగ అన్జెప్తన్నం గదా.. మల్లేమాయె. అరె.. మొన్న బీజేపీ పెద్దసార్లయితే ఓ మునుం బెట్టి పట్నానికచ్చిండ్రు గదా. అమిత్ సార్ గల్లీ మార్చ్ సౌండూ.. డిల్లీదాక పాకింది గదా. గా షో జూత్తెనైతే ఇగ హైదరాబాద్ జనం పోలింగ్ బూత్ ల కాడ లైన్ల మీద లైన్లు గట్టి ఓట్లకోసం

ఎగ్జిట్ పోల్ సర్వే లేనట్టే

Also Read:   సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్ గ్రేటర్ ఎన్నికల ఫలితాలెలా ఉంటాయని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలకు నిరాశ తప్పడం లేదు. అలాంటివారు 3వ తేదీ సాయంత్రం వరకు వేచిచూడాల్సిందే. ఓల్డ్ మలక్ పేట బ్యాలెట్ పేపర్లో సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తు (కంకి కొడవలికి బదులు సుత్తె కొడవలి) అచ్చయ్యాయి. ఈ వార్త మీడియాలో హైలైట్ గా మారింది. దీంతో సీపీఎం నేతలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఫలితంగా ఓల్డ్ మలక్ పేట ఎన్నికను అధికారులు రద్దు చేశారు. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ కూడా ఎవరూ విడుదల చేయరాదని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. దీంతో 3వ తేదీన రీపోలింగ్ తరువాతే ఎగ్జిట్ పోల్ సర్వేలు విడుదలవుతాయి.  Also Read:  గీ పట్నపోల్లకు ఏమైంది? వాస్తవానికి దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న హైదరాబాద్ ఎన్నికలపై వోటర్ నాడి రికార్డు చేసేందుకు పలు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. విడతలవారీగా సర్వేలు నమోదు చేస్తూ ఆసక్తికరంగా మారుతున్న గ్రౌండ్ వివరాలను అంచనా వేస్తూ తుది నిర్ణయం వెలువరించేందుకు కసరత్తు చేస్తున్నాయి.  Also Read:  హైదరాబాద్ పోల్ - హైటెన్షన్                          గ్రేటర్ పై సర్వేలు ఏం చెబుతున్నాయి?

హైదరాబాద్ పోలింగ్ - హై టెన్షన్

గ్రేటర్ ఎన్నికల్లో పోల్ పర్సంటేజ్ కన్నా టెన్షన్ వాతావరణం మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. పలు చోట్ల అధికార, విపక్షాల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇంకొన్ని చోట్ల పోలింగ్ సిబ్బంది మీద కూడా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సనత్ నగర్ పోలింగ్ స్టేషన్ లోని బూత్ నెంబర్ 13లో ఓటేయడానికి వచ్చిన ఓటర్లతో గుర్తు గుర్తుంది కదా.. మర్చిపోకండి అంటూ నర్మగర్భంగా మాట్లాడుతున్న సిబ్బందిని క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లు నిలదీశారు. సిబ్బంది మీద కంప్లయింట్ చేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. మాదాపూర్ లో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ రెండు పార్టీల మధ్య అక్కడ ఘర్షణ నెలకొంది. చాదర్ ఘాట్ లో ఆరు ఆటోల్లో బోగస్ ఓటర్లను తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఎంబీటీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఎంఐఎం, ఎంబీటీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓల్డ్ మలక్ పేటలోని బ్యాలెట్ పేపర్లో సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తు అచ్చవడంతో అక్కడ పోలింగ్ ను రద్దు చేశారు. 3వ తేదీన మళ్లీ పోలింగ్ నిర్వహిస్తామని ఎన్న