Skip to main content

Posts

Showing posts with the label TELANGANA

ఇష్టంగా చదివాడు - గోల్డ్ మెడల్ కొట్టాడు

డాక్టర్ కొడుకు డాక్టర్.. యాక్టర్ కొడుకు యాక్టర్.. లాయర్ కొడుకు లాయర్ అవడంలో వింతేం లేదు. అలా కాకుండా తాను పూర్తిగా కొత్తదారిని ఎంచుకొని  తమ కుటుంబంలో ఓ కొత్త ట్రెండును సృష్టించాడు ఓ కొడుకు. సొంతూరి ప్రజల పొగడ్తలు పక్కనపెడితే, తల్లిదండ్రుల కళ్లలో కళ్లలో ఆనందాన్ని చూడగలిగాడు. ఆ కుర్రాడే మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నందారానికి చెందిన రాజమూరి నితిన్ కుమార్ రెడ్డి. తండ్రి వకీలు కావడంతో ఆయన ప్రాక్టీసుతో పాటు కొడుక్కి మంచి చదువు చెప్పించాలని మహబూబ్ నగర్ షిఫ్టయ్యారు. చిన్నప్పటి నుంచే చదువుల మీద పూర్తి ఏకాగ్రత కనబరిచే నితిన్.. కష్టాన్ని ఇష్టంగా చేసుకొని చదివితే ఫలితం వచ్చి తీరుతుందని, అందుకు తానే ఓ ఉదాహరణగా నిలిచాడు.  పెద్దయ్యాక ఎవరేం కావాలో చిన్నప్పుడే తల్లిదండ్రుల మాటల రూపంలో పిల్లల చెవుల్లో బీజాలు పడతాయంటారు. ఆ బీజాలే వారిని చదువుల మీద నిలబెడతాయి. ఉన్నతమైన లక్ష్యాల వైపు నడిపిస్తాయి. సమాజంలో తన పాత్రేంటో తెలియజేస్తాయి. తల్లిదండ్రుల రుణమే కాదు.. సమాజ రుణం కూడా తీర్చుకోవాలనే అవగాహన కలిగిస్తాయి. అలాంటి నేపథ్యం నుంచి వచ్చినందుకు తాను నిజంగా గర్విస్తున్నానంటారు నితిన్. పల్మనాలజీ-ఎండీ (శ్

వీకెండ్ స్టోరీ: కృషి ఉంటే యువకులు రమేశ్ లు అవుతారు

ఎవరైనా సెలవు రోజు ఏం చేస్తారు? ఆ వారం రోజులు పడిన శ్రమ అంతా మరచిపోవాలని చూస్తారు. "సేద" దీరే సమయం కోసం ఎదురుచూస్తారు. ఇక రేపటి గురించి కలలు కనేవారైతే వచ్చే వారం రోజుల్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఎవర్ని కలవాలో పక్కాగా ప్లాన్ వేసుకుంటారు. కూడికలు, తీసివేతల లెక్కల్ని గణించుకొని ముందడుగు వేస్తారు.  మరి.. కొడిచర్ల రమేశ్ ఏం చేస్తాడో తెలుసా? షేవ్ చేస్తాడు. అవును మీరు చదివింది నిజమే. సెలవు రోజుల్లో ఆయన సేవ చేస్తాడు. షేవింగ్, కటింగ్.. ఇలా తన కులవిద్య అయిన క్షవర వృత్తినే ప్రతి మంగళవారం సెలవు దినాన సేవ కోసం కేటాయిస్తాడు. ఉదయాన్నే 6 గంటలకల్లా ఇంటి నుంచి బయటపడి ఏ వృద్ధాశ్రమానికో,  అనాథాశ్రమానికో వెళతాడు. ప్రతి వారం ఏదో ఒక అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి బాబాయిల్ని, చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తాడు. జుట్టు బాగా పెరిగి చికాగ్గా కనిపించే అనాథలను ఎంతో నాగరికంగా తయారుచేసి ఆశ్రమ నిర్వాహకులకు ఎంతో ఆత్మీయ నేస్తంగా మారాడు.  డబ్బున్న మారాజులు తమ పేరెంట్స్ ని ఖరీదైన వృద్ధాశ్రమాల్లో చేర్పించి డాలర్లు పోగేసుకునేందుకు  విమానాల్లో విదేశాలు చెక్కేస్తుంటే.. చిల్లిగవ్వ కూడా పోగేసుకోవాలనే ధ్యాసే లేని  రమేశ్ మాత్ర

అరిగోస పెట్టి ఆపన్న హస్తం - అల్ప సంతోషంలో చిన్న పత్రికలు

ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దయ తలచారు. చిన్న, మధ్య తరహా స్థాయి పత్రికలు ఇంకా బతికే ఉన్నాయని గుర్తించారు. తామంతా బతికున్న విషయం కేసీఆర్ గుర్తించినందుకు పత్రికా యాజమాన్యాలు తెగ సంబరపడిపోతున్నారు. తమ ఆకలికేకలు తీరుతాయో లేదో తెలీదు కానీ, తమ పత్రికలకు మాత్రం  ఊపిరి పోసినందుకు, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాసిన్ని ఆనందబాష్పాలు కూడా రాల్చారు. తెలంగాణ కోసం పెద్దపత్రికలు ఏం చేశాయో ఇప్పుడు చెప్పుకుంటే బాగుండదు. మదపుటేనుగు లాంటి పెద్దపత్రికల వ్యవహార శైలికి సాక్షాత్తూ ముఖ్యమంత్రులే నిండు అసెంబ్లీల్లో ఏం అభిప్రాయాలు వెలిబుచ్చారో, ఎంత ఆగ్రహం వెళ్లగక్కారో ఇప్పుడు చెప్పుకోవడం అస్సలు బాగుండదు. కానీ చిన్న పత్రికలు మాత్రం తెలంగాణవాదం మినహా మరో మాటకు తావు లేకుండా పని చేశాయి. ఉడుతా భక్తిని ప్రదర్శించాయి. ఉద్యమ నాయకుడి వెంట ఉద్యమ గొంతుకలై చిన్న పత్రికల సంపాదకులు, విలేకర్లంతా కలాలతో కవాతులు చేయించారు. అయితే ప్రజలకు వాటి రీచ్ పెద్దగా లేకపోవచ్చు గానీ ఒకవేళ ఉంటే అప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలందరూ ఈ చిన్న పత్రికలనే అక్కున చేర్చుకొని ఉండేవారు. ఆ విషయం ఈనాడు అధికారంలో ఉన్న ఆనాటిి ఉద్యమ నాయకుల

వరంగల్-కొత్తగూడెం: సేమ్ ఇన్సిడెంటల్ అండ్ సేమ్ పొలిటికల్ సీన్

ఆరేళ్ల క్రితం ఏం జరిగిందో.. సరిగ్గా అలాగే కాకపోయినా.. అలాంటిదే రిపీటైంది. వరంగల్ లో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎస్. రాజయ్య ఇంట్లో నాలుగు నిండు ప్రాణాలు అగ్ని కీలలకు ఆహుతైపోతే.. కొత్తగూడెెం జిల్లా పాల్వంచలో అలాంటివే నాలుగు ప్రాణాలు బూడిదైపోయాయి. అక్కడ కాంగ్రెస్ నేత కొడుకు ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న భార్యను కట్నం పేరుతో రాచి రంపాన పెట్టి గ్యాస్ సిలిండర్ కుట్రకు బలిపెడితే.. ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే తనయుడు ఆస్తి తగాదాలు పరిష్కరించే నెపంతో ఓ అసహాయుడి అర్థాంగిపై కన్నేసి, హైదరాబాద్ లోని తన గడీకి పంపించుమని ఆర్డరేసి, గడి బయట కట్టుకున్న భర్తనే కాపలాగా ఉంచే నయా కీచక పర్వానికి తెరతీశాడు. అచ్చంగా ఆనాటి గడీల పాలనకు తాజా ఆనవాలుగా నిలిచాడు. భర్తకు విషయం చెప్పలేక, ఆమెను వదిలి తానొక్కడే తన దారి తాను చూసుకోలేక, పిల్లల దారుణ భవిష్యత్  చిత్రాన్ని ఊహించుకోలేక అందరినీ తన వెంటే తీసుకుపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు, అందాలొలికే భార్యను కర్కశ మంటల్లో కాల్చేశాడు. తానూ తగులబడిపోయాడు.  కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో నాగ రామకృష్ణ తన తల్లితో, సోదరితో ఆస్తుల పంపకాల విషయాన్ని తేల్చుకోలేకపోయాడు. దాదా

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

శ్యామ్ సింగ్ రాయ్ - ఏం ఖర్మ రా భాయ్

చిత్రం ఏమంత దరిద్రంగా వుంది??? బానే తీశారు కదా.... నటన, కథ, నాట్యం, సంగీతం, సాహిత్యం అన్నీ బానే వున్నాయి కదా.. గొప్ప చిత్రం కాకపోయినా అసహ్యంగా అయితే లేదు కదా అనే అనుమానం మనకు రాక మానదు.. నిజమే సాంకేతికంగా అన్నీ బానే వున్న చిత్రమే.... అందునా నాని చిత్రం....సాయి పల్లవి లాంటి నాట్యం నటన అద్భుతంగా చేసే నటి వున్న చిత్రం అన్నీ సమపాళ్లలో వున్న చిత్రమే. కాకపోతే వొచ్చిన చిక్కల్లా అనసరంగా పెట్టిన రెండు విషయాలు.  1. కమ్యూనిజం. 2. హిందూ ద్వేషం. అనవసరంగా పెట్టారు అనేకన్నా కావాలనే పెట్టినట్టు అనిపించింది. అందుకే పొరబాటు అయితే పోనీలే అని వొదిలెయ్యొచ్చు కానీ కావాలని చేస్తే మాత్రం తగ్గేదెలే.. అందుకే ఈ విశ్లేషణ.. అసలు నేను దీనికి విశ్లేషణ రాయకూడదు అనుకున్నా. రాసినా రెండే రెండు ముక్కల్లో ముగించెయ్యాలి న్యాయంగా.  కానీ మరీ రెండు ముక్కల్లో అయితే సదరు దర్శకుని సంగతి అంచనా వెయ్యటం కష్టం కదా, అందుకే ఇలా... మొట్ట మొదటగా కొన్ని విషయాలు చెప్పేసి తర్వాత చిత్రం గూర్చి చర్చించుకుందాం. 1. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద జోక్ ప్రజాస్వామ్య దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉండి, అది ఎన్నికల్లో పాలుపంచుకోవడం. 2. అసలు ఏ మత సిద్ధాంతానికి

12 ఏళ్ల లోపు పిల్లలకు టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్

రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థను (ఆర్టీసీ) కొత్తపుంతలు తొక్కిిస్తున్న ఎండీ సజ్జనార్ మరో కొత్త ఆఫర్ తో ముందుకొచ్చారు. ఆంగ్ల సంవత్సరాది, జనవరి ఫస్టును పురస్కరించుకొని 12 ఏళ్ల లోపువారికి  ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సజ్జనార్ కల్పించారు. ఆ ఒక్కరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పిల్లలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే పిల్లలతో పాటు తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా వారి వెంట ఉండాలి. ఆర్టీసీ ప్రయాణంలో ఉండే సౌకర్యం, భద్రతతో పాటు పెరిగిన పెట్రో ధరల కారణంగా ప్రైవేట్ సర్వీసుల్లో ప్రయాణం చాలా కాస్ట్ లీ గా తయారైన దరిమిలా ఈ సౌకర్యాన్ని పేరెంట్స్, పిల్లలు ఉపయోగించుకోవాలని సజ్జనార్ సూచించారు. పేద, మద్య తరగతి ప్రజలు జనవరి ఫస్టు  రోజున సెలబ్రేషన్స్ కోసం ఎక్కడికి వెళ్లినా ఆర్టీసీ సర్వీసును ఉపయోగించుకోవచ్చని కోరారు. ప్రభుత్వ అధికారులందరూ ఈ విషయాన్ని పెద్దస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. సజ్జనార్ ఇప్పటికే జంట నగరాల్లో రూ. 100 కే 24 గంటలు అన్ని సర్వీసుల్లోనూ తిరగగలిగేలా టీ-24 (ట్రావెల్ 24 అవర్స్) ఆఫర్ పరిచయం చేశారు. సిటీలోని ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక

బండీ.. నీ దొంగ దీక్ష ఢిల్లీలో చెయ్యి

- నిరుద్యోగ దీక్ష ఢిల్లీలో చేయి..మోడీ ఇస్తానన్న 14 కోట్ల ఉద్యోగాలు ఏవి..? - కేంద్రంలో ఖాళీగా ఉన్న 9 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదు..? - కేంద్రం భర్తీ చేసిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి - రేవంత్ రెడ్డి, బండి సంజయ్ రాజకీయ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు చేవెళ్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన వయసు కు మర్యాద ఇవ్వకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ ది నిరుద్యోగ దీక్ష కాదు దొంగ దీక్ష అని విమర్శించారు.నిరుద్యోగ దీక్ష ఢిల్లీలో చేయాలన్నారు. మోడీ ఇస్తానన్న 14 కోట్ల ఉద్యోగాలు ఏవన

జనవరి ఫస్టు రోజున చలో రామప్ప - బొడ్డుపల్లి బాలబ్రహ్మం

ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన రామప్ప దేవాలయ చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఫస్టున  ఓ భారీ యాత్రను తలపెట్టారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా ఖ్యాతికెక్కిన రామప్ప దేవాలయ యాత్రను శనివారం (జనవరి ఫస్టు) తలపెట్టామని మంగళంపల్లి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి బాలబ్రహ్మాచారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒకటవ తేదీ శనివారం రాత్రి‌ BHEL నుండి ఓ లగ్జరీ బస్సు బయలుదేరి రెండవతేదీ ఆదివారం ఉదయానికల్లా దక్షిణ  కాశీగా అందరూ పిలుచుకునే కాళేశ్వరం చేరుకుంటారు. గోదావరి త్రివేణి సంగమంలో పుణ్యనదీ స్నానం  ఆచరించి, ఆ తరువాత ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒకే ప్రాణవట్టం పై (కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు) యముడు, శివుడి దర్శనం చేసుకుంటారు. అనంతరం బ్రహ్మశ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈశ్వరీమాత నిత్యాన్నదాన కార్యక్రమంలో భోజనం ముగించుకొని మద్యాహ్నం 2 గంటలకు ప్రపంచ ప్రఖ్యాత రామప్ప గుడిని చేరుకుంటారు. రామప్ప గుడి శిల్పసంపద, ముఖ్యమైన ప్రదేశాలు, వాటి గొప్పతనం తెలిపే విషయాలను వీడియో షూట్ చేస్తారు. యాత్రలో పాల్గొన్నవారి అభిప్రాయాలు, అన

అద్భుతమైన సినిమా - చెత్త మెసేజ్

శ్యామ్ సింగారాయ్ సినిమా చాలా మంచి కళాత్మక విలువలున్న సినిమా. చిత్రీకరణ, ఫోటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. ఈ సినిమాలో నాని టైటిల్ రోల్ కు న్యాయం చేశాడు. హీరోయిన్ సాయి పల్లవి కూడా బాగా నటించింది. మంచి పాత్ర ను ఎంచుకోడంలో సాయి పల్లవి ఎప్పుడూ ముందుంటుంది. ఈ సినిమాకు హైలెట్ హీరో నాని పాత్ర శ్యామ్ సింగరాయి , చాలా హుందాగా ఉంది పాత్ర. హీరోయిన్ డాన్స్ బాగా చేసింది. కథక్ నృత్యం చేస్తూ ఒక సీన్ లో ఆమె చేసే నాట్యం ఎక్సలెంట్ గా ఉంది. ఆ పాత్రకు ఆమె సరిపోయింది.  కథ విషయానికి వస్తే, హీరో సినిమా డైరెక్టర్. 2020 లోమొదటి సినిమా తీసి హిట్ సాధిస్తాడు. అతను పేరు సాధిస్తాడు. అనుకోకుండా అతను ఒక కేసులో  ఇరుక్కుని పోతాడు. ఆ కేసు నుండి బయట పడడానికి అతన్ని, సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్తే, ఆమె అతని ద్వారా చాలా విషయాలు తెలుసుకొంటుంది. సినిమా 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళి శ్యామ్ సింగరాయ్ దగ్గరకు వెళుతుంది. అతను ఒక బెంగాల్ కవి, అతని తల్లి తెలుగామే, కాబట్టి తెలుగు కూడా వస్తుంది. హీరో , 4 అన్నతమ్ముల్లో చిన్నోడు. వారిది ఉన్నత కుటుంబం, అభ్యుదయ భావాలు కలిగిన అతడు నాస్తికుడు, దేవుని నమ్మడు. కులానికి, మతాలకు వ్యతిరేకంగా పోరాడుత

ఎల్లూరి శివారెడ్డికి వరప్రసాదరెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారం

స్వయంగా రచనలు చేయడం ద్వారానే కాకుండా తెలుగు, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు, తెలంగాణ సారస్వత పరిషత్ వంటి సంస్థల ద్వారా తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి అత్యున్నతమైన సేవలందించిన డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి ఎంతో అభినందనీయులని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శాంతా బయోటెక్నిక్స్ అధినేత, పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ.వరప్రసాదరెడ్డి ఆధ్వర్యంలోని శాంతా-వసంతా ట్రస్టు తెలంగాణ సారస్వత పరిషత్తులోని  డా. దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డికి డా.వరప్రసాదరెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి అందజేశారు. అలాగే పరిషత్ ప్రధాన కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్యకు తెలుగు భాషా సేవారత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా, వరప్రసాదరెడ్డి సభాధ్యక్షులుగా పాల్గొని పురస్కార గ్రహీతలకు లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, సన్మానపత్రం అందజేశారు. శాలువాలతో సత్కరించారు.  ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ శాంతా బయోటెక్నిక్స్ ద్వారా హెపటైటిస్-బి తో పాటు అనేక వ్యాధులకు వ్యాక్సిన్లకు

వీవీఐఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా చేపూరి

విశ్వబ్రాహ్మణ - విశ్వకర్మ ఐక్య సంఘం  (వీవీఐఎస్) గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా చేపూరి లక్ష్మణాచారిని నియమిస్తూ ఆ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన ఆ సంఘం ముఖ్యనేతల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. గత మార్చిలో జరిగిన ఎన్నికల్లో చేపూరి హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. విశ్వబ్రాహ్మణుల సమస్యలపై చేపూరి ఎంతోకాలంగా పోరాడుతున్నారు. యువతరానికి తనదైన పంథాలో అవగాహన కల్పిస్తూ... కుల సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర నాయకత్వం.. తమ సంఘాన్ని గ్రేటర్ హైదరాబాద్ లో మరింత పటిష్టం చేసేందుకు లక్ష్మణాచారికి చాలా కీలకమైన బాధ్యతలు కట్టబెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. విశ్వబ్రాహ్మణ సమాజం కోసం తాను పడుతున్న తపనను, తన శక్తి-సామర్థ్యాలను, రాష్ట్ర నాయకత్వం మీద తనకు గల విశ్వాసాన్ని గుర్తించి, తనకు చాలా ముఖ్యమైన బాధ్యతలు అప్పగించిన ఎర్రోజు భిక్షపతికి ఈ సందర్భంగా చేపూరి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర నాయకత్వం అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్

ఈటల కోటలో గెల్లు గెలుపు ఖాయమేనా?

అంచనాలకు అందనిదే రాజకీయం. ఊహించని పరిణామాలు జరిగే వేదికే ఎన్నికల రణక్షేత్రం. అందులోనూ తెలంగాణ ఉద్యమకారుడిగా పరిచయమై, టీఆర్ఎస్ లో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈటల రాజేందర్ ను ఢీకొట్టడం అంటే ఆషామాషీ కాదు. అలాంటి ఈటలను హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎదుర్కొనేందుకు అత్యంత సామాన్యుడైన గెల్లు శ్రీనివాస్ ను కేసీఆర్ ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే అనూహ్యమైన పాచికలు వేసి శత్రువు అంచనాలు తల్లకిందులు చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఆయన మస్తిష్కమే వినూత్న ఆలోచనల కర్మాగారం. ఏ ఆలోచన వెనుక ఏ పరమార్థం దాగి ఉందో తెలుసుకోవడం సాధారణ రాజకీయ నాయకులకు సాధ్యం కాదు. అలాంటి ఓ వినూత్నమైన ఎన్నికల ఎత్తుగడే గెల్లు శ్రీనివాస్ ఎంపిక.  టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సాధనకు అసలు సిసలు చిరునామా. ఆ ఉద్యమ తోటలో పూసిన ఒక పువ్వే గెల్లు శ్రీనివాస్. అత్యంత సామాన్యమైన యాదవ కుటుంబం నుంచి వచ్చిన గెల్లు శ్రీనివాస్ ను ఈటల మీదికి పోటీకి దింపడం, హుజూరాబాద్ లో ప్రజాభిప్రాయాన్ని టీఆర్ఎస్ కు క్రమంగా అనుకూలంగా మార్చుకోవడం, అందుకోసం తన పార్టీ పరివారం యావత్తునూ హుజూరాబాద్ కు రప్పించడం, ఈటల క్యాంపులో అతిశయించిన ఆత్మవిశ్వాసం వెన్ను విరవడం

వీరబ్రహ్మేంద్రస్వామినే అటకాయిస్తున్న ప్రబుద్ధులు

తెెలుగునాటనే కాకుండా యావత్ దక్షిణ భారతదేశంలోనే కాలజ్ఞాన కర్తగా, భవిష్యత్ దార్శనికుడిగా సకల సమాజం చేత పూజలందుకునే యుగపురుషుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మాత్రమే. అలాంటిది తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో సాక్షాత్తూ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకే ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కుంటాల మండలం కల్లూరు గ్రామంలో మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్రస్వామికి 40 ఏళ్లకు పైగా పూజలు జరుగుతూ వచ్చాయి. అయితే స్వామివార్ల విగ్రహాలు జీర్ణావస్థకు చేరుకోవడంతో.. అలాంటి విగ్రహాలకు పూజలు చేయరాదన్న నియమాల కారణంగా ఆ విగ్రహాలను పక్కన పెట్టారు. అలా దాదాపు తొొమ్మిదేళ్లుగా వీరబ్రహ్మేంద్రస్వామి నిత్యపూజలు ఆగిపోయాయి. స్వామివార్ల విగ్రహాలు మళ్లీ పునఃప్రతిష్టించడానికి అవసరమైన వనరుల కొరత కారణంగా ఆ  విషయం వాయిదా పడుతూ వస్తోంది. అయితే అదే విగ్రహాలున్న చోట ఖాళీగా ఉంచడం ఎందుకని కొన్ని సంవత్సరాల క్రితమే దేవీ నవరాత్రులకు అంకురారోపణ చేశారు. దాదాపు తొమ్మిదేళ్లుగా ప్రతియేటా దేవీ నవరాత్రులు జరుపుకుంటున్నారు.  ఇటీవల కల్లూరు గ్రామంలోని విశ్వబ్రాహ్మణులు వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ, శివలింగం, గణపతి, స

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆగేది లేదు-ఎర్రోజు భిక్షపతి

ఏ నాయకుడు ఏ పేరుతో ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆగేది లేదని, విశ్వబ్రాహ్మణ జాతి అభ్యున్నతి కోసం మడమ తిప్పకుండా పోరాడతానని, ఈ ప్రయాణంలో జాతి రత్నాల్లాంటివారు కూడా అడ్డుకున్నా ప్రజల మద్దతుతో ముందుకెళ్తానని విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి కరాఖండిగా తేల్చేశారు. సెప్టెంబర్ 5న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద జరిగిన రాష్ట్ర స్థాయి బహిరంగ సభలో భిక్షపతి తన వైఖరిని ప్రజలందరికీ విడమరచి చెప్పారు. గత పదేళ్లుగా కులసంఘంలో పని చేస్తూ జాతి అభివృద్ధి కోసం పాటు పడుతున్నానని, అన్ని రంగాల్లో వెనుకబడ్డ విశ్వబ్రాహ్మలకు ఏం చేయాలో తనకంటూ కొన్ని స్థిరమైన అభిప్రాయాలున్నాయన్నారు. 30 ఏళ్లకు పైగా విశ్వబ్రాహ్మణ కుల సంఘం పేరుతో పనిచేస్తున్న కొందరు పెద్దలు ఇప్పటివరకు ఏం చేశారో ఏ ఒక్కరికీ తెలియదన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఉనికి చాటుకునేందుకే సంఘాల పేరుతో అమాయకులైన విశ్వబ్రాహ్మలను మోసం చేస్తున్నారని, ఆ మోసాలను ప్రశ్నిస్తున్నందువల్లే తన మీద కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారాలు  సాగిస్తున్నాయన్నారు. అయితే కులం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పదేళ్లుగా తాను కుల సంఘాల్లో చురుగ్గా పన