Skip to main content

లీగల్ అండ్ క్రైమ్ రిపోర్టింగ్ పై ముగిసిన 2 రోజుల వర్క్ షాప్

ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులకు లీగల్, క్రైమ్ రిపోర్టింగ్ లో మరింత లోతైన అవగాహన కల్పించేందుకు నిర్వహించిన రెండు రోజుల వర్క్ షాప్ కు మంచి రెస్పాన్స్ లభించింది. న్యాయ పంచాయతీలు మొదలుకొని కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులు, కోర్టు హియరింగ్స్ లో వెల్లడయ్యే ఆసక్తికరమైన అంశాలు, క్రైమ్ రిపోర్టింగ్ లో కీలకమైన అంశాలు, వివిధ రాష్ట్రాల పోలీసింగ్ లో ప్రజలకు కనిపించని కోణాలు, వాటిని వెలికి తీయాల్సిన పద్ధతులపై ఇండియా జస్టిస్ రిపోర్ట్స్-101 రిపోర్టర్స్ సంయుక్తంగా శని, ఆదివారాల్లో ఆన్ లైన్ వర్క్ షాప్ నిర్వహించాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల్లో పనిచేసిన పలువురు జర్నలిస్టులు, ఎన్జీవో సంస్థల నిర్వాహకులు, మాజీ డీజీపీ స్థాయి అధికారులు, సీబీఐ అధికారులు ఫ్యాకల్టీలుగా పాల్గొని జర్నలిస్టులకు మార్గదర్శనం చేశారు. 

దేశంలో సుమారు 44 మిలియన్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, అవి పరిష్కారానికి నోచుకోవాలంటే కోర్టు వ్యవహారాల డిజిటైజేషన్ తో పాటు పెద్దసంఖ్యలో స్టాఫ్ రిక్రూట్ మెంట్ చేసుకోవాల్సి ఉందని రిటైర్డ్ జడ్జి అజయ్ కుమార్ కుహర్ అన్నారు. అలాగే న్యాయమూర్తుల మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని, ఇది కేసుల పరిష్కారాన్ని ప్రభావితం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ గత ఐదారేళ్లుగా న్యాయమూర్తులు చాలా వేగంగా కేసులు క్లోజ్ చేయడం చెప్పుకోదగ్గ విషయమన్నారు. ప్రభుత్వాల్లో, వ్యవస్థల కార్యకలాపాల్లో వెలుగుచూడని అంశాలు బయటకు రావాలంటే ఆర్టీఐ ని మించిన మరో మార్గం లేదంటూ  దాన్ని ఏవిధంగా ఉపయోగించుకోవాలో సంజయ్ హజారికా వివరించారు. 

ఇక పోలీసు వ్యవస్థలో సెంట్రల్ రిక్రూట్ మెంట్, స్టేట్ రిక్రూట్ మెంట్ నుంచి పోలీసు చట్టాలు ఎక్కడ, ఎప్పుడు మొదలయ్యాయో దేవయాని శ్రీవాత్సవ అద్భుతంగా వివరించారు. దేశంలోనే అత్యద్భుత పనితీరు కనబరుస్తున్న పోలీసు డిపార్టుమెంటుగా కేరళ పోలీసు విభాగం పేరు తెచ్చుకుందని ఆ రాష్ట్ర మాజీ డీజీపీ జాకోబ్ పన్నూస్ వివరించారు. కేరళలో 2006లోనే కమ్యూనిటీ పోలీసింగ్ మొదలైందని, 1979లో పోలీస్ అసోసియేషన్స్ ప్రారంభం అయ్యాయని, ఇక 1959లోనే కేరళలో పోలీసు సంస్కరణల గురించి చర్చ మొదలైతే.. ఇతర రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే ఆ దిశగా ఆలోచిస్తున్నాయని జాకోబ్ అన్నారు. ఇక పోలీసులు, క్రైమ్ రిపోర్టర్లు ఒకరినొకరు అనుమానించడం, విషయ సేకరణ కోసం ప్రశ్నించడం ద్వారానే ప్రజలకు వివరాలు తెలుస్తున్నాయని, రిపోర్టింగ్ చేసే సమయంలో వాస్తవాలకు రంగులద్దకుండా ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే జర్నలిస్టులకు పోలీసు అధికారుల్లో మంచి గుర్తింపు ఉంటుందని విపుల్ ముద్గల్ వివరించారు. అలాగే మన పోలీసు వ్యవస్థకు ప్రజల్లో మంచిపేరు రావాలంటే ప్రభుత్వాలు ఎఫీషియెంట్ పోలీసింగ్ కోసం కాకుండా అకౌంటబుల్ పోలీసింగ్ కోసం కృషి చేయాలని ముద్గల్ అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులు చేసే ఏ ప్రజెంటేషన్ అయినా డాటాతోనే ఆకట్టుకుంటుందని, ఆ డాటాను ఎలా సేకరించాలో అవినాష్ సింగ్ వివరించారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్స్ నుంచి మాయాదారువాలా ఈ వర్క్ షాప్ ను పర్యవేక్షించగా, 101 రిపోర్ట్స్ నుంచి ఐశ్వర్యామూర్తి మోడరేటర్ గా వ్యవహరించారు.


Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

శ్రీశైల క్షేత్రంలో ఫొటోలు తీయబడును

ఎంతో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడే గాక ప్రతి భారతీయుడు కూడా ఆసక్తి చూపుతాడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీశైల  మహా క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకే గాక అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే శ్రీశైలానికి ఉండే తాకిడి మామూలుగా ఉండదు. అయితే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఉన్నట్టుగానే శ్రీశైలంలో కూడా ఫొటోలు, వీడియోలు తీయరాదనే  నిబంధన  ఉంది. ఎవరైనా కెమెరాలతో, సెల్ ఫోన్లతో లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా చేస్తే వాటిని ఆలయ సిబ్బంది జప్తు కూడా చేస్తారు. భద్రతా కారణాల రీత్యా కూడా శ్రీశైలం విషయంలో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిబంధనలు మాత్రం పేరుకే స్ట్రిక్టుగా ఉన్నాయి గానీ.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనంటున్నారు భక్తులు.  ఎందుకంటే శ్రైశైలంలో దలారీ ఆనంద్ ను సంప్రదిస్తే ఎవరైనా, ఎక్కడైనా ఫొటో తీసుకోవచ్చు. అడిగినంత మొత్తం చెల్లిస్తే అమ్మవారి సన్నిధిలోనైనా, అయ్యవారి సన్నిధిలోనైనా.. ఎక్కడైనా సరే క్యాష్ పడేస్తే ఫొటో క్లిక