ఢిల్లీలో రెండేళ్లుగా అక్రమంగా ఉంటున్న ఓ చైనీయుడి ఉదంతం వెలుగుచూసింది. జు-ఫీ అనే చైనా దేశీయుడు రెండేళ్లుగా గ్రేటర్ నోయిడాలో అత్యంత విలాసవంతమైన ఓ క్లబ్ నిర్వహిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్‌కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వాధికారుల కళ్లు కప్పి నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఓ ఐపీఎస్ అధికారి అనుమానంతో దాని మీద అధికారులు రైడ్ చేయడంతో విషయం వెలుగుచూసింది. జు-ఫీతో పాటు నాగాలాండ్ కు చెందిన పెటిఖ్రినో అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మరో ముగ్గురు ఇండియన్స్, ఒక చైనీయుడు తప్పించుకొని పారిపోయారు. క్లబ్బులో 70 రూములు, అత్యాధునిక సీసీటీవీలు అమర్చారు. ఫేక్ వీసా డాక్యుమెంట్లతో జు-ఫీ ఇక్కడే తిష్టవేసి ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సైన్యాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి దేశ రహస్యాలు సేకరించే పనిలో జు-ఫీ ఉన్నాడన్న అనుమానాలతో విచారిస్తున్నారు. అయితే మూడు రోజులుగా విచారణ సాగుతున్నా జు-ఫీ నోరు విప్పడం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి ఇప్పటికే విలువైన సమాచారం చేరవేసి ఉంటాడని భావిస్తున్నారు. చైనా నుంచి ఇండియాకు, ఇండియా నుంచి చైనాకు రావాలంటే.. కేవలం 20 వేలు ఖర్చు చేస్తే సరిపోతుందని జు-ఫీ చెప్పినట్లు విచారణాధికారులు అంటున్నారు.
వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా? మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో
Comments
Post a Comment
Your Comments Please: