Skip to main content

Posts

Showing posts from July, 2019

<అసదుద్దీన్ కి తమ్ముడే తలనొప్పి>

తమ్ముడంటే ఎలా ఉండాలి? రాముడికి లక్ష్మణుడిలా ఉండాలి. అన్న గౌరవాన్ని పెంచేలా తమ్ముడు నడుచుకోవాలి. కానీ.. అన్న నిర్మించుకుంటూ వస్తున్న గౌరవ-మర్యాదలను వెనుక నుంచి కూల్చేస్తూ రావడం... బాధ్యత గల తమ్ముడు చేయాల్సిన పనేనా? తండ్రి నుంచి సంక్రమించిన రాజకీయ వారసత్వాన్ని.... సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అన్న బిల్డప్ చేస్తూ వస్తుంటే... తమ్ముడు చేసే దుందుడుకు వ్యాఖ్యలు ఏ పరిణామాలకు దారితీస్తాయి? టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న మజ్లిస్ లో అన్నదమ్ముల మధ్య పొసగని అభిప్రాయాలతో భారీ మూల్యం తప్పదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.  దశాబ్దాలుగా పాతబస్తీలో పాగావేసిన మజ్లిస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తున్నట్లే కనిపిస్తోంది.  హైదరాబాద్ లో ఒవైసీ సోదరుల గురించి పరిచయం అక్కర్లేదు. తండ్రి సుల్తాన్ సలాఉద్దీన్ ఒవైసీ హయాంలో ఎంఐఎం ఓ వెలుగు వెలిగింది. ఆయన అనంతరం పార్టీని నడిపిస్తున్న అసదుద్దీన్, అక్బరుద్దీన్  ఒవైసీల ఆధ్వర్యంలో కూడా పార్టీ దూసుకుపోతోంది. అందులో నో డౌట్. అయితే సహోదరుల మధ్య వ్యవహారాల్లో మాత్రం కొన్ని భిన్న వైఖరులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.  అన్న అడుగుజాడల్లో అక్బర్ నడుస్తున్నట్లే కనిపిస్తున్

ఒవైసీ బ్రదర్స్ తో స్నేహం కేసీఆర్ కు సవాలేనా?

రాజకీయాల్లో ఒకరి నిర్లక్ష్యమే ఇంకొకరికి అవకాశంగా మారుతుంది. అవతలి వ్యక్తి అతి విశ్వాసమే ఇవతలి వ్యక్తికి ఆయుధం అవుతుంది. సంఖ్యాబలంతోనే సర్వత్రా నెగ్గుకొస్తానంటే కుదరదు. ప్రజల్లో పాదుకున్న సెంటిమెంట్లేంటో అర్థం చేసుకొని అడుగేయాలి. అలా కాకపోతే విపక్షం చేతిలోనే పరాభవం చవి చూడక తప్పదు. తెలంగాణలో వికసించేందుకు బీజేపీ శక్తినంతా ప్రయోగిస్తున్న సమయంలో... కేసీఆర్ విస్మరిస్తున్న కీలకమైన అంశాలేంటో చెప్పడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం.  తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ....స్వయంగా కేసీఆరే ఛాన్స్‌ ఇస్తున్నారా? కేసీఆర్ నిర్లక్ష్య వైఖరిని ఓట్ల రూపంలోకి మార్చుకునేందుకు బీజేపీ ఇప్పటికే స్కెచ్ రెడీ చేసిందా? మిత్రపక్షమైన ఎంఐఎం ఏం మాట్లాడినా కేసీఆర్ ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? తెలంగాణలో మతసామరస్యానికి ముప్పు వాటిల్లిందా? అక్బరుద్దీన్ హేట్ స్పీచ్‌పై టీఆర్ఎస్‌ వైఖరేంటి? మత విద్వేషాలను రెచ్చగొట్టేలా అక్బర్ చేసిన కామెంట్స్ ను కేసీఆర్ ఉపేక్షిస్తే...జరిగే పరిణామాలేంటి?  తెలంగాణ అంటే గంగా జమునా తెహజీబ్...కేసీఆర్ ఎక్కడ సభ పెట్టినా చెప్పే మాట ఇది. నిజానికి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే...తెలంగాణలో మతసామరస్యం చాలా ఎక్కువ. ఇది చాల

"జమిలి".. ప్రజాస్వామ్య ప్రస్థానానికి ఓ మజిలీ

జమిలి ఎన్నికల దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. మరి దేశమంతా అన్ని రాష్ట్రాలతో పాటు పార్లమెంట్ కు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మనకు ఎంతవరకు శ్రేయస్కరం? కేవలం ఖర్చు తగ్గించుకోవడం కోసమే జమిలికి వెళ్లాలా? లేక పరిపాలనా సౌలభ్యం అంతకంటే ముఖ్యమా? మొన్ననే ఎన్నికలు జరుపుకున్న తెలంగాణ గానీ, ఆంధ్రా గానీ.. పూర్తి కాలం ముగియకుండానే మరోసారి ఎన్నికలు ఎదుర్కోవాల్సి రావడం వల్ల కలిసొచ్చేది ఎవరికి? కష్టకాలం దాపురించేది ఎవరికి? ఇలా అన్ని వర్గాల దేశ ప్రజల్ని ప్రభావితం చేస్తున్న జమిలితో మిగిలేదేమిటి? మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవభారత ఎజెండాకు రూపమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  మోదీ 2022లో జమిలి ఎన్నికలకు వెళ్లబోతున్నారన్న సంకేతాలు  బలంగా వినిపిస్తున్నాయి.  లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది నవభారత ఎజెండాలో తొలి ప్రాధాన్య అంశం. దీన్ని  దృష్టిలో పెట్టుకుని దేశంలోని అన్ని వర్గాల ప్రజల మనసులూ గెలుచుకునేందుకు మోదీ వ్యూహ రచన చేస్తున్నారు. అంతేకాకుండా ద్రవ్య క్రమశిక్షణ పాటిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే ప్రబల ఆర్థికశక్తిగా మార్చాల

సంధ్యావందనమ్

.. శ్లో! యస్స్మరే ద్విశ్వకర్మాణం సానగాది యుతంవిభుం 'సృష్టిస్థిత్య స్తక ర్తారం -సబాహ్యాభ్యన్తరశ్శుచిః ఓం కేశ వాయస్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయస్వాహా ఓం"గోవిందాయనమః విష్ణ వేనమః మధు సూదనాయనమః త్రివిక్రమాయననుః వామనాయనమః శ్రీధ రాయనమః హృషీకేశాయనమః పద్మనాభాయనమః దామో దరాయనమః సఙ్కర్షణాయనమః వాసుదేవాయనమ్మ ప్రదక్షి మ్నా యనమః అనిరుద్దాయనమః పురుషోత్తమాయనమః అధో ఈ బాయనమః నారసింహాయనమః అచ్యుతాయనమః ఉపేన్గా యనమః హరయేనమః ఓం శ్రీకృష్ణాయనమః స్మృత్యాచమనం కృత్వా:  స్మృత్యాచమనం కృత్వా: ఉ తిష్ఠన్తు భూతపిశాచా ఏతే భూమిభారకా ప్ర తేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమార భౌ# తా!! భూతపిశాచములు ఇష్టం పొవ్ను వ నీ 3 భూతా! పిశిత మళ్నం తి పిశాచాః !! అనగా ధర్మమున గట్టువడక స్వేచ్ఛగా,