Skip to main content

Posts

Showing posts from December, 2019

సింగరేణి ఏరియా ఎమ్మెల్యేల్లో గుబులు

వారంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలు...కానీ నియోజక వర్గాల్లోకి వెళ్ళాలి అంటే భయపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తమకు ఇబ్బందిగా మారిందని ఆ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఇంతకీ ఇబ్బందులు పడుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు... ఏ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన వారు గుర్రుగా ఉన్నారు. మరి ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఒకే ఒక నిర్ణయం తమకు ఇబ్బందులు తెస్తున్నాయని వారంతా బాధపడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో యూనియన్లు ఉండొద్దని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ...ఆర్టీసీ యూనియన్లను రద్దు చేసి యూనియన్ ఆఫీసులకు తాళాలు వేయడంతో ఆ ప్రభావం తమపైన పడిందంటున్నారు గులాబీ పార్టీ  ఎమ్మెల్యేలు. అంతేకాదు సింగరేణి కార్మికులకు ఎన్నికలు నిర్వహించకుండా ఆలస్యం చేయడంతో సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోందని భయపడుతున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, ఇల్లందు, కొత్తగూడెం, రామగుండం, భూపాల పల్లి, నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సింగరేణి కార్మికులకు ఎన్నికలు నిర్వహిస్తే బాగుండని అనుకుంటున్నారు.