Skip to main content

Posts

Showing posts from February, 2020

ఆ గాంధీని మించిన ఘనుడు ఈ గాంధీ

పాకిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చినవాళ్లు, బంగ్లాదేశ్ నుంచి కంచె దాటి హైదరాబాద్ కు వచ్చి కూలీపనులు చేసుకుంటున్నవాళ్లు, ఏ కూలీ దొరక్కపోతే ఆవారా పనుల్లో అయినా బిజీగా ఉన్నవారు, బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాలు రేప్పొద్దున ఏ కష్టం వచ్చినా ఆరికపూడి గాంధీని కలవాలని నా సూచన. అలా కలిస్తే ఆయన దగ్గరుండి అన్నీ చూసుకుంటారు. తినడానికి తిండే కాదు.. ఉండడానికి వసతి, కాపురం చేసుకోవడానికి పెళ్లి సంబంధాలు, ముసలివాళ్లయ్యాక వృద్ధాశ్రమాల్లో చేర్పించడం, అదీ వీలు కాకపోతే వృద్ధాప్య పింఛన్లయినా సమకూర్చే దొడ్డమనసు ఆయనది. రేపో మాపో జనభా లెక్కల కోసమో, శాశ్వత పౌరసత్వ ధ్రురువీకరణ కోసమో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఇల్లిల్లూ తిరిగినప్పుడు.. అక్రమ వలసదారుల ఆచూకీ బయటపడకుండా పోదు కదా. అప్పుడు అలాంటివాళ్లంతా వరుస కట్టి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీని ఆశ్రయించాలని.. భవిష్యత్తులో నిరాశ్రయులు కాబోయేవారందరికీ సవినయంగా నేను మనవి చేస్తున్నా.  ఎందుకంటే ఈ గాంధీ మనకాలపు గాంధీ. గతకాలపు గాంధీ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం. ఆయన నిరాడంబరతను, బాపూ అనదగ్గ పర్సనాలిటీని చరిత్ర సాక్షిగా ఆవాహన చేసుకొని ఆదర్శమూర్తిగా కొనియాడుతున్న

ఇది దేశ వ్యతిరేక చర్యా?  సీఏఏ వ్యతిరేక చర్యా?

- అల్లర్లలో అసువులు బాసిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్, తుపాకీతో కాల్పులు జరుపుతున్న ఆందోళనకారుడు   సీఏఏ వ్యతిరేక ఆందోళనలు శ్రుతి మించుతున్నాయి. నిరసన మాటున అసహనం హద్దు మీరుతోంది. సీఏఏ ను వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ పంతం పట్టిన ఆందోళనకారులు ఢిల్లీని రణరంగంగా మార్చేశారు. మూడు రోజులుగా షాహీన్ బాగ్ లో నిరసనకారులను ప్రజాస్వామ్య పద్ధతిలో దారికి తెచ్చుకునేందుకు నేరుగా సుప్రీంకోర్టే రంగంలోకి దిగింది. నిరసన అనేది ప్రజాజీవితానికి భంగం కలిగించరాదన్న సుప్రీంకోర్టు కండిషన్ తో అది క్లియర్ అయిన సమయంలోనే.. ట్రంప్ భారత్ లో పర్యటించడం.. దాన్నే అదనుగా తీసుకున్న ఆందోళనకారులు జఫ్రాబాద్, మౌజ్ పూర్-బాబర్ పూర్ మెట్రో స్టేషన్లలో హడలెత్తించారు. సీఏఏకు, దేశానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ దుకాణాలపై రాళ్లు విసరడం, రాకపోకలకు అంతరాయం కలిగించారు. నిరసనకారులు పలు దుకాణాలను, మాల్స్ ను తగులబెట్టారు. మంటల్లో చిక్కుకొని పలు షాపులు దగ్ధమయ్యాయి. అటు ఫైర్ సిబ్బందిని కూడా సహాయ చర్యలు చేపట్టకుండా అడ్డుకోవడం ఆందోళన రేపుతోంది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకురావడం పోలీసుల తరం కాలేకపోయింది.  గుంపును చెదరగొట్టేందుకు లాఠీచార్జీ, గాల్ల

మత స్వేచ్ఛ ఎలా ఉంటదో చెప్పవా ట్రంప్.. ప్లీజ్

  భారత్ లో మత స్వేచ్ఛపై ట్రంప్ మాట్లాడతాడట. మత స్వేచ్ఛపై ఏం మాట్లాడతావు? భారత్ లో మత స్వేచ్ఛ ఉందంటావా? లేదంటావా? అమెరికా కన్నా ఎక్కువుందంటావా ?  లేక అసల్లేదంటావా ? ఏ దేశంలో అమల్లో ఉన్న మత స్వేచ్ఛను ప్రామాణికంగా తీసుకొని భారత్ లో మతస్వేచ్ఛను కొలుస్తావు బాస్?     పేరులో ఇస్లామిక్ నేచర్ ఉన్నా, వేషధారణలో ఇస్లామిక్ కల్చర్ కనిపించినా భూతద్దం పెట్టి ఒళ్లంతా సెర్చ్  చేసే అమెరికాధీశుడు భారత్ లో మత స్వేచ్ఛ మీద మాట్లాడతాడట. మెక్సికో నుంచి వచ్చే శరణార్థులను అడ్డగించేందుకు నువ్వు ముళ్ల కంచెలు నాటుకుంటావు. అయినా అక్రమ వలసలు వరదలా పారుతుంటే 24 గంటల సెక్యూరిటీని అమలు చేసుకుంటావు. యూరోప్, మధ్య ప్రాచ్య దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా విపరీతమైన ఆంక్షలు పెడతావు.      ఎయిర్ పోర్టుల్లో తలపాగా చుట్టుకున్న సిక్కును చూసినా ముస్లిం పౌరుడేమోనని జడుసుకుంటావు. క్లీన్ షేవ్ తో ఉన్న మా స్మార్ట్ హీరో భారతీయుడు కమల్ హాసన్ ని చూసినా పేరులో హసన్ ధ్వనిస్తుంది కాబట్టి బట్టలు విప్పించి మరీ ముస్లింను కాదని చెప్పేదాకా వదలిపెట్టకుండా.. ఇండియాలో హిందువును అని చెప్పని కమల్ చేత నువ్వు మాత్రం... నేను హిందువునే మొర్రో అని గొ

వార్తల్లోకెక్కిన వెయ్యేళ్ల నాటి విష్ణుమూర్తి విగ్రహం

  భారత్ ప్రాచీన దేశం. పేరుకు తగినట్టే పురాతన విగ్రహాలకు, ప్రాచీన సంస్కృతికి, వెల కట్టలేని సాంస్కృతిక వైభవానికి మన దేశం పెట్టింది పేరు. పైన ఫొటోలో చూస్తున్న విగ్రహం విష్ణుమూర్తిది. అనంత పద్మనాభస్వామి అనగానే కేరళలో ఉన్నాడనే అందరూ గుర్తు చేసుకుంటారు. కానీ అలాంటి అనంత శయనుడి విగ్రహాలు దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. దాదాపు అలాంటి భంగిమలోనే మధ్యప్రదేశ్ లోని బాంధవగఢ్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. విగ్రహానికి అంతా నాచుపట్టి, నిరాదరణకు గురైన స్థితిలో ఉంది. కానీ విగ్రహం ఒరిజినాలిటీ మాత్రం చెక్కుచెదరకుండా ఉండడంతో సందర్శకులను ఆకర్షిస్తోంది. ఇది వెయ్యేళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్నారు. పార్కుకు వచ్చే సందర్శకులు ఈ విగ్రహాన్ని చూసి, ఆ పుణ్యస్థలానికి పునర్వైభవం తేవాలని కోరుతున్నారు.   

హైకోర్టు చీఫ్ జస్టిస్ కు తీన్మార్ మల్లన్న లేఖ

తెలంగాణ సర్కారు మీద దాదాపు 3, 4 ఏళ్లుగా పాత్రికేయ యుద్ధం చేస్తున్న తీన్మార్ మల్లన్న హైకోర్టు చీఫ్  జస్టిస్ కు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులు తనను టార్గెట్ చేశారని, తన ప్రతి కదలిక పైనా నిఘా ఉంచారని, తనకే కాకుండా తన బంధువులకు, తన సన్నిహితులకు సైతం పోలీసులు ఫోన్లు చేసి ఇబ్బందిపెడుతున్నారని ఫిర్యాదు చేశారు. కనుక తనపై కొనసాగుతుున్న ఈ నిఘాను ఎత్తివేసి, ప్రైవసీకి భంగం కలిగించకుండా తెలంగాణ పోలీసులను ఆదేశించాలని ఆ లేఖలో కోరారు.  ఇటీవల జరిగిన హుజూర్ నగర్ బైఎలక్షన్లో మల్లన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అంతకుముందు, ఆ తరువాత, ఇటీవలి కాలంలో కూడా మల్లన్న తెలంగాణ సర్కారులో జరుగుతున్న రెవిన్యూ అక్రమాలను వివిధ సందర్భాల్లో వెలుగులోకి తీసుకొచ్చారు. సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థినులపై జరుగుతున్న లైంగిక వేధింపుల అంశాన్ని స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. తాను ఇలా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వార్తా కథనాలు ప్రసారం చేస్తున్నందుకే తనపై పోలీసు వేధింపులు కొనసాగుతున్నాయని మల్లన్న చీఫ్  జస్టిస్ కు  రాసిన లేఖలో పేర్కొన్

ముంబైలో మొదలైంది.. హైదరాబాద్ వైపు కదిలింది

దేశంలో అగ్రగామి వాణిజ్యవేత్తగా, ప్రపంచంలోని వంద ప్రభావశీలుర జాబితాలో ఒకడిగా వెలుగొందుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ వ్యాపారంలో వైరి వర్గాలను ఊచకోత కోస్తున్నారు. ముఖేశ్ మొదలుపెట్టిన ఊచకోత మరింత తీవ్రరూపం దాలుస్తోంది. భారతీయ మార్కెట్లో ఓ నూతన శకాన్ని కూడా ఆరంభించడం ఖాయమన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. టెలికాం రంగంలో ఓ మోస్తరు కంపెనీలను సైతం జియో బిస్తరు సర్దుకునేలా  చేసిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రీ డాటా ఆఫర్ తో ఇండియా ప్రజానీకాన్ని అంతర్జాల ప్రియులుగా మార్చేసిన జియో… అది ఇస్తున్న పోటీకి భారతీ ఎయిర్ టెల్, ఐడియా-వొడాఫోన్ వంటి పెద్ద కంపెనీలను బేజారెత్తిస్తోంది. బకాయిలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఉన్న ఆ రెండు కంపెనీలు కేంద్ర సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో ఈ రంగంలో జియో అప్రతిహతంగా దూసుకెళ్లడానికి ఆటంకాలేవీ లేవనే చెప్పాలి.  టెలికాం రంగంలో బీభత్సం సృష్టిస్తున్న రిలయన్స్.. ఈ-కామర్స్ లోనూ అడుగు పెట్టేందుకు కొన్నేళ్ల క్రితమే పెద్దఎత్తున కసరత్తు చేసింది. ఆ విషయం మార్కెట్ కు ఇంకా బయటకు పొక్కకముందే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి టాప్ ఈ-కామర

జన్మకో శివరాత్రి.. ఎందుకన్నారో తెలుసా?

    హిందువులు జరుపుకునే పండుగల్లో శివరాత్రికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. వైరాగ్యంలో ఉండే ప్రాధాన్యతను గ్రహించడం, దానివైపు ఆకర్షితులు అవడమే శివరాత్రిలోని వైశిష్ట్యం. ప్రతిరోజూ, ప్రతి క్షణం నేను, నాది, నా  వాళ్లు అనే తామసిక భావనలతో అహంకార పూర్ణులుగా సంచరిస్తున్న మానవ ప్రపంచం.. కనీసం ఈ రోజైనా నేనేమీ కాదు, నాది ఏదీ లేదు, నేను ఓ నిమిత్తమాత్రుణ్ని, కేవలం పాత్రధారిని అనే స్వచ్ఛమైన భావం వైపు తీసుకెళ్లేదే ఈ శివరాత్రి. అందుకే ప్రతి పండుగలోనూ ఏదో ఒక ఇష్టమైన పదార్థంతో జిహ్వను తృప్తి పరచుకునే హిందువులు.. ఈ రోజు మాత్రం నిరాహారంగా ఉండడంలో అర్థం కూడా అదే. ఈ శివరాత్రి సందర్భంగా ఆ పండుగ వైశిష్ట్యంతో పాటు కొన్ని ప్రాచీన గాథలేమున్నాయో తెలుసుకుందాం.    ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ, ఇంకేమీ చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నా సరే తనెంతో సంతోషిస్తానని చెబుతాడు.    చెప్పిన దాని ప్రకారం,  ఆ రోజు పగలంతా నియమనిష్ఠలతో ఉపవాసంతో గడిపి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని  మొదట పాలతో,  తర్వాత పెరుగుతో,  ఆ తర్వాత నేతితో,  ఆ తర్వాత తేనెతో  

15 నిమిషాలు.. 15 కోట్లు.. ప్రమాదం ముంచుకొస్తోంది

Photo Credit: ANI, Public Radio International, Swarajya పదిహేను నిమిషాలు టైమిస్తే హిం.... లను ఊచకోత కోసేస్తాం. ఈ దేశంలో ముస్లింలు 15 కోట్ల మంది ఉన్నారు గుర్తుంచుకోండి. వాళ్లంతా రోడ్ల మీదికొస్తే వంద కోట్ల మంది కూడా ఏం చేయలేరు.. మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి. ఈ రెండు డైలాగులు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (ఎంఐఎం) నేతల నుంచి వచ్చాయి. మొదటిది కొన్నేళ్ల క్రితం అక్బరుద్దీన్ నోటి నుంచి వచ్చిందైతే.. రెండో వార్నింగు ఈ మధ్యాహ్నం, కాసేపటి క్రితమే (20--2-2020) కర్నాటకలో జరిగిన ఒక మీటింగ్ లో అసదుద్దీన్ సమక్షంలోనే ఆ పార్టీ మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ నోటి నుంచి వెలువడింది. కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని రాజకీయ నేతల గురించి మాట్లాడుకోవడం వృథా. కానీ.. అన్నీ ఉండీ అన్నీ మూసుకునే జర్నలిస్టుల గురించి, వారి మౌనం గురించి మాట్లాడుకోవాల్సిన తరుణం మాత్రం ఇదే.  15 నిమిషాలు టైమిస్తే ఒకడు కోటానుకోట్ల మందిని ఊచకోత కోసేస్తానని బహిరంగ సమావేశంలోనే అంటాడు. మేం 15 కోట్ల మందిమి ఉన్నాం.. ఏమనుకుంటున్నారో అంటూ ఇంకొకడు హుంకరిస్తాడు. టెక్నికల్ గా వీళ్లంతా ఈ దేశ పౌరులే కానీ.. ఎథికల్ గా వీళ్లు టెర్రరిస్టులకు

భైంసా ఘటన చెబుతున్నదేంటి?

Photo Credit: vskbharat.com భైంసాలో సంక్రాంతికి ముందు జరిగిన అమానవీయమైన, అతి జుగుప్సాకరమైన కృత్యాన్ని ఓ సాధారణ ఘటనగా చూడాలా? లేక పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న ఓ వర్గపు పైశాచిక చర్యగా భావించాలా? అంతేకాదు.. ఈ చర్య  నుంచి ప్రభుత్వాలు గానీ, ఫోర్త్ ఎస్టేట్ లో కీలకమైన స్తంభంగా చెప్పుకుంటున్న మీడియా గానీ నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది  ఏమైనా ఉందా? ముందుగా ప్రభుత్వ స్పందనను స్థూలంగా విశ్లేషిద్దాం. భైంసా ఘటనను బయటికి రాకుండా చూడడానికి తెలంగాణ సర్కారు విఫలయత్నం చేసింది. అయితే సోషల్ మీడియా పుణ్యాన ఆలస్యంగా అయినా అక్కడేం జరిగిందో ప్రపంచానికి తెలిసిపోయింది. ఏ అంశం ప్రపంచానికి తెలియరాదని ప్రభుత్వం కోరుకుందో.. అదే అంశాన్ని ప్రపంచం మొత్తానికి చేరవేసిన సిద్ధు అనే జర్నలిస్టు ఇప్పుడో సాహసిగా ప్రజల ముందు నిలబడ్డాడు. నిజానిజాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టేందుకు ప్రయత్నించిన ప్రభుత్వపెద్దల పక్షపాత నైజం గంపగుత్తగా బయటపడింది. అంతా తెలిసిపోయాక, దాచడానికి ఏమీ మిగలని సందర్భంలో, నిందితులను, దుండగులను ఇప్పటికైనా గుర్తించిన దాఖలాలు లేని క్రమంలో ప్రభుత్వానిది, పోలీసులది నూటికి నూరు శాతం వైఫల్యంగానే ప్రజల ముందు

భైంసా ఘటన నుంచి ఎవరు ఏం నేర్చుకోవాలి?

Photo Credit: vskbharat.com భైంసాలో సంక్రాంతికి ముందు జరిగిన అమానవీయమైన, అతి జుగుప్సాకరమైన కృత్యాన్ని ఓ సాధారణ ఘటనగా చూడాలా? లేక పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న ఓ వర్గపు పైశాచిక చర్యగా భావించాలా? అంతేకాదు.. ఈ చర్య  నుంచి ప్రభుత్వాలు గానీ, ఫోర్త్ ఎస్టేట్ లో కీలకమైన స్తంభంగా చెప్పుకుంటున్న మీడియా గానీ నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది  ఏమైనా ఉందా? ముందుగా ప్రభుత్వ స్పందనను స్థూలంగా విశ్లేషిద్దాం. భైంసా ఘటనను బయటికి రాకుండా చూడడానికి తెలంగాణ సర్కారు విఫలయత్నం చేసింది. అయితే సోషల్ మీడియా పుణ్యాన ఆలస్యంగా అయినా అక్కడేం జరిగిందో ప్రపంచానికి తెలిసిపోయింది. ఏ అంశం ప్రపంచానికి తెలియరాదని ప్రభుత్వం కోరుకుందో.. అదే అంశాన్ని ప్రపంచం మొత్తానికి చేరవేసిన సిద్ధు అనే జర్నలిస్టు ఇప్పుడో సాహసిగా ప్రజల ముందు నిలబడ్డాడు. నిజానిజాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టేందుకు ప్రయత్నించిన ప్రభుత్వపెద్దల పక్షపాత నైజం గంపగుత్తగా బయటపడింది. అంతా తెలిసిపోయాక, దాచడానికి ఏమీ మిగలని సందర్భంలో, నిందితులను, దుండగులను ఇప్పటికైనా గుర్తించిన దాఖలాలు లేని క్రమంలో ప్రభుత్వానిది, పోలీసులది నూటికి నూరు శాతం వైఫల్యంగానే ప్రజల ముందు