Skip to main content

Posts

Showing posts from April, 2020

ఆఖరు కేజీ వరకు వరి కొనుగోలు చేస్తాం - మంత్రి వేముల

  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు చివరి కేజీ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ ఆందోళనకు గురికావద్దని, రాష్ట్ర రోడ్లు-భవనాలు,హౌసింగ్ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని, చెప్పుడు మాటలు విని ఎవరూ అధైర్య పడొద్దని మంత్రి భరోసా ఇచ్చారు.కరోనా వైరస్ వల్ల రైతులెవరూ ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటు చేశామని, నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతోందని, గురువారం ఒక్క రోజే 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉండగా.. అందుకు మొత్తం 355 కొనుగోలు కేంద్రాలకు పర్మిషన్ ఇచ్చామని, గురువారం 336 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరిగిందన్నారు.పెట్టుకున్న అంచనాకు 30 శాతం అంటే 1.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ 336 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 1.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, సేకరించిన వరి ధాన్యంలో 92% అంటే 1.68 లక్

పేదలకు సరుకులు పంచిన ప్రణవి ఫౌండేషన్

  లాక్ డౌన్ కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న నిరుపేద కూలీలు, ఉపాధి లేనివారికి ప్రణవి ఫౌండేషన్ తోడ్పాటునందించింది. జనతా కర్ఫ్యూ, ఆ తరువాత లాక్ డౌన్ కష్టాలు చుట్టుముట్టడంతో భోజన సదుపాయాలు కూడా కరువయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఉన్న పేదప్రజలు ఉండే కాలనీ మాణికేశ్వరీ నగర్, ఒడ్డెర బస్తీలో తాజాగా ప్రణవి ఫౌండేషన్ వంట సరుకులు అందజేసింది. బియ్యం, గోధుమపిండి, ఉల్లిగడ్డ, మిర్చి, పసుపు ఇత్యాది వంట సరుకులను ఫాండేషన్ సమకూర్చింది. ప్రణవి ఆధ్వర్యంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి విడతలవారీగా తాము వంటసరుకులు పంపిణీ చేస్తున్నామని, తమ ఫౌండేషన్ తో పాటు పేద ప్రజల సేవలో మరికొందరు ఔత్సాహికులు కూడా తమను ప్రోత్సహిస్తున్నారని ఫౌండేషన్ అధ్యక్షుడు జైన్ కుమార్  ఆచార్య వారికి కృతజ్ఞతలు చెప్పారు. లాక్ డౌన్ మరింతకాలం పొడిగించే అవకాశం కనిపిస్తున్నందున ఔత్సాహికుల నుంచి ఇదే తరహా స్ఫూర్తి కొనసాగాలని జైన్ కోరారు.  ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ జి.శ్రీకాంత్, ఇమ్రాన్, కె.వెంకటరమణ, జి.మోహన్, ఎస్.రాధాకృష్ణ, జి.ఆనంద్ ఆచార్య, రమేశ్ నాయ క్, సామేశ్ తదితరులు పాల్గొన్నారు. 

బిహార్ వలస కూలీలకు ఎంబీఎఫ్ ఆపన్న హస్తం

  లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం కావడం, ఉపాధి  అవకాశల్లేక నెల రోజుల పైగా గడవడంతో  వలస కూలీల ఇబ్బందులు నానాటికీ పెరుగుతున్నాయి. దీంతో మాతృభూమి ఫౌండేషన్ మరోసారి ముందుకొచ్చింది. లాక్ డౌన్ విధించిన నాటి నుంచి వరుసగా ఉపాధి కోల్పోయిన పేదలకు, మురికివాడల్లో ఉన్నవారికి, వలస కూలీలకు ఆహార సరుకులు అందజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 30వ తేదీన బిహార్ నుంచి వచ్చి చిక్కుకుపోయిన వలస కూలీలు 50 మంది సరుకులు అందజేశారు. హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ వద్ద పెద్దసంఖ్యలో కేంద్రీకృతమై ఉన్న వలస కూలీలను గుర్తించి వారికి ఈ సరుకులు అందజేసినట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు కె.కిరణ్ చెప్పారు.   తమ శక్తి మేరకు, ప్రజలకు తమ సేవలు అవసరం ఉన్నంతమేరకు స్పందిస్తామని కిరణ్ తెలిపారు.   

కష్టకాలంలో జర్నలిస్టులకు చేయూతనిస్తున్న పల్లె రవికుమార్

కరోనా కష్టకాలంలో మీడియా యాజమాన్యాల నుంచి, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఎలాంటి ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్న సగటు జర్నలిస్టుల  కోసం తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్ చేయూతనందిస్తున్నారు. తన పరిధిలో ఇప్పటికే చౌటుప్పల్, నల్గొండ వంటి కేంద్రాల్లో జర్నలిస్టులకు బియ్యం పంపిణీ చేసిన రవికుమార్, తాజాగా మునుగోడులో ఒక్కో జర్నలిస్టు కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. కరోనా సాకుతో మీడియా సంస్థలు ఇప్పటికే పలువురు జర్నలిస్టులను పక్కన పెట్టేశాయి. అటు ఫీల్డులో పనిచేసే రిపోర్టర్లు సైతం రోడ్డునపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ముందుకొచ్చి ఆహార సరుకులే కాక, తక్షణావసరాల కోసం డబ్బు కూడా వారి అకౌంట్లలో జమ చేయాలని, జర్నలిస్టు కమ్యూనిటీ కూడా పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది మాదిరే కరోనా బారిన పడుతున్నారని, అలాంటివారి కోసం మీనమేషాలు లెక్కించరాదని రవికుమార్ పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా కూడా అదే విజ్ఞప్తిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి చేశారు.  ఈ కార్యక్రమంలో TJF రాష్ట్ర నాయకుడు పోగుల ప్రకాష్, జిల్లా నాయకులు ఈదులకంటి కైలాష్, తిరందాస్ శ్రీనివాస్, తీరు

ఆదిశంకరాచార్యుడి విజయంలో అసలు రహస్యం

(2530వ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)   ద్వాపరయుగ అంతంలో ధర్మ సంరక్షణకు కురుక్షేత్రంలో జరిగిన సంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం ఆహుతి అయింది. భగవాన్ శ్రీకృష్ణుడు రక్షించిన ధర్మం ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. క్రమంగా దేశమంతటా జాతి విరుద్ధమైన ప్రవృత్తులు ప్రబలిపోయాయి. దేశం పతనం వైపు వేగంగా పరుగులిడుతుంది. ఇలాంటి సమయంలో దేశాన్ని సరియైన దిశవైపు నడిపించడానికి తీవ్ర ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ ప్రయత్నాలకు ఆధారం వేదాలు. వేదాల్లోని అంతరార్థ సత్యాన్ని తిరిగి ప్రకటించడం కోసం 3 కొత్త దర్శనాలు వెలుగులోకి వచ్చాయి. 1. పతంజిల యోగ దర్శనం, 2. జైమిని మీమాంస దర్శనం, 3. బాదరాయణ వేదాంత దర్శనం.  Readable: మీ ఇంటికే ఫుడ్ - డయల్...   వేదాల్లోని కర్మకాండకు వ్యతిరేకంగా భగవాన్ శ్రీకృష్ణుడే పూనుకున్నాడు. కర్మకాండపై భాగవత ధర్మం తిరుగుబాటు చేసింది. దేశంలోని సాంఘిక వ్యవస్థకు దెబ్బ  తాకకుండా ఇంద్రుడు మొదలైన దేవతల పూజలు మాన్పించాడు శ్రీకృష్ణుడు. వేదాల మీద, వైదిక వ్యవస్థ మీద సంపూర్ణ ఆదర భావం కూడా చూపించాడు. అక్కడి నుండి భాగవత ధర్మం యొక్క ప్రభావం క్రమంగా పెరుగుతున్నది. ఆ మూడు దర్శనాలతో కొత్తపుంతలు తొక్కించింది. బాదరాయణు

మీ ఇంటికే ఫుడ్ - కాల్ టు...

  గ్రేటర్ హైదరాబాద్ లో అందరికీ ఆహారం అందించేందుకు తెలంగాణ సర్కారు కొత్త తరహా ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దాని ప్రకారం 040-21111111 ల్యాండ్ లైన్ నెంబర్ కు కాల్ చేయాలి. అక్కడ రికార్డయ్యాక వారు మరో సెల్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ దగ్గరే కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫుడ్ ఎక్కడికి చేర్చాలి అనే వివరాలు అడిగి నోట్ చేసుకుంటారు. ఆ నెంబర్లు  9154170990 లేదా 9154170991 కు డయల్ చేయాల్సి ఉంటుంది. లేదా నేరుగా ఇదే నెంబర్ కు డయల్ చేసినా ఆహారం అందించాల్సిన అడ్రస్, వివరాలు తీసుకుంటారు. మధ్యాహ్న భోజనం కోసం ఉదయం 10 గంటల వరకు కాల్ చేయాలి. అలాగే సాయంత్రం భోజనం కోసం 4 గం. వరకు కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది.    ఆ తరువాత ఇచ్చిన అడ్రస్, ఫోన్ నెంబర్ ను బట్టి అన్నపూర్ణ క్యాంటీన్ సిబ్బంది.. సమీపంలోని సెంటర్ కు వచ్చి కాల్ చేస్తారు. ఆ కాల్ ను అనుసరించి ఫుడ్ ప్యాకెట్ తీసుకోవాల్సి ఉంటుంది.   

ఆకలేస్తోందా.. కాల్ 040-21111111

  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆకలైనవారికి అన్నం రెడీగా ఉందంటున్నారు టీఆర్ఎస్ సీనియర్ లీడర్ కల్వకుంట్ల కవిత. ఇందుకోసం ఒక హెల్ప్ లైన్ తీసుకొచ్చామని, ఆ నెంబర్ ని అందరికీ తెలిసేలా పాపులరైజ్ చేయాలని ట్విట్టర్ ద్వారా ఆమె కోరారు. భోజనం అవసరం ఉన్నవారు  040-21111111 (040-2 ఏడు ఒకట్లు) నెంబర్ కి కాల్ చేస్తే భోజనం ఏర్పాట్లు జరుగుతాయని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నదని, హైదరాబాద్ లాంటి పెద్దనగరంల ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించరాదని కవిత ఆకాంక్షించారు. ఆహారం నేరుగా అందుకునే అవకాశం లేనివారు ఈ నెంబర్ కు డయల్ చేయడం ద్వారా ఆకలి తీర్చుకోవచ్చని ట్వీట్ చేశారు కవిత.    Related Link: మీ ఇంటికే ఫుడ్ - కాల్ టు...  

అనాథల పాలిట ఆత్మబంధు మాతృభూమి ఫౌండేషన్

  కరోనా విజృంభణతో లాక్  డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి అల్లాడుతున్న అనాథలు, పేదలు, వృద్ధులు, బిచ్చగాళ్లకు నేనున్నానంటూ ముందుకొచ్చింది మాతృభూమి ఫౌండేషన్. ఎంబీఎఫ్  ఆధ్వర్యంలో లాక్ డౌన్ విధించిన రోజు నుంచి అంటే నెల రోజులుగా ఆహార పదార్థాల పంపిణీ నిరాటంకంగా చేస్తున్నామని ఆ సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ కోటర్ కిరణ్ చెప్పారు. శనివారం  గచ్చిబౌలి, ఇందిరానగర్ బస్తీలో 60 మందికి ఆహార సామగ్రి అందజేశారు. అలాగే మే5 వరకు ఆకలితో ఉన్నవారికి భోజన సదుపాయాలు సమకూరుస్తామని చెప్పారు. గడిచిన 30 రోజుల్లో దాదాపు 30 వేల మందికి భోజనం, మరో 500 మందికి ఆహార సామగ్రి అందించినట్లు చెప్పారు.     లాక్ డౌన్ కారణంగా బాగోగులు చూసే దిక్కులేని  బిచ్చగాళ్లకు, వృద్ధులకు భోజన సదుపాయాలు కూడా చేస్తున్నామని కిరణ్ చెప్పారు. మాతృభూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నామని చెప్పారు. తమ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ లోని  విజయనగరం, రాజమండ్రి, కృష్ణా, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు జిల్లాల్లో... అలాగే తెలంగాణలోని వికారాబాద్, నల్గొండ, ఖమ్మం, హైద్రాబాద్ జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.      తమ ఫౌండేషన్ విద్యాభివృద్ధికి

ఎంబీసీల ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ

కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయి ఉసూరుమంటున్న పేదలు, బడుగుల కోసం పాతబస్తీ, ఉప్పుగూడ-లలితాబాగ్ లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జాతీయ ఎంబీసీ సంఘం అధ్యక్షుడు కె.సి.కాళప్ప గారి ఆదేశాల మేరకు... చాంద్రాయణగుట్ట కన్వీనర్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ చేపూరి లక్ష్మణాచారి, వలబోజు రవికిరణ్, తోట శ్రీనివాసాచారి, షణ్ముఖాచారి ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ జరిగింది. తమ పరిధిలోని ఓల్డ్ సిటీ ప్రజలకు  ఎలాంటి ఇబ్బంది కలగ కూడదని బియ్యం పంపిణీ చేసినట్లు లక్ష్మణాచారి చెప్పారు. లలితా బాగ్, కాళికా  నగర్, మారుతి నగర్, ఉప్పుగూడ, తానాజీ నగర్, భయ్యాలాల్ నగర్,  శివాజీ నగర్ లోని పేదలకు బియ్యం పంచినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దాసోజు లక్ష్మణాచారి, వీరేష్ చారి,బాణాల బ్రహ్మచారి, తిప్పర్తి రాజుచారి, మురళిగుప్తా, నోముల హరిగోపాల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ వర్కర్స్ కు ఆహారసరుకులు పంపిణీ

మేడ్చల్ జిల్లా తెలంగాణ జాగృతి యూత్ కో-కన్వీనర్ అజయ్ గౌడ్ పుట్టిన రోజు సందర్భంగా మునిసిపల్ వర్కర్స్ కు, అలాగే ఇతరవర్గాల్లోని పేదలకు బియ్యం, కూరగాయలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మల్లంపేట్ 22వ వార్డు  కార్పొరేటర్ సంధ్యాహన్మంతరావు, మేడ్చల్ తెలంగాణ జాగృతి యూత్ కన్వీనర్ పడాల మనోజ పాల్గొన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఆశయాలను... ఈ విధంగా ముందుకు తీసుకెళ్తునందుకు సంతోషంగా ఉందని సంధ్య, మనోజ అభిప్రాయపడ్డారు. కరోనా విజృంభిస్తున్న క్రమంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండి ఆరోగ్యాలు కాపాడుకోవాలని, ముప్పు తొలగిపోయేంతవరకు జాగ్రత్తగా ఉండాలని పిలువునిచ్చారు. ఇప్పుడు రంజాన్ కూడా ఉన్నందున హైదరాబాద్ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. 

హేపీ రంజాన్ కు ఏడు సూత్రాలు

  ప్రపంచమంతా రంజాన్ కు సిద్ధమైంది. ఒక నెల రోజుల పాటు ఉపవాస దీక్షలతో ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే కరోనా అనే మహమ్మారి మన పక్కనే పొంచి ఉన్న కారణంగా పండుగ సంబరంలో పడిపోయి జాగ్రత్తలు విస్మరించరాదని నిపుణులు సూచిస్తున్నారు. హేపీ రంజాన్ కోసం ఈ కింది సూత్రాలు పాటిస్తే పండుగ ఆనందాన్ని మన కుటుంబ సభ్యులకు పంచిన వారమవుతాం.  1) రంజాన్ ప్రవేశించింది కాబట్టి.. పండుగ కోసం కరోనా రూల్స్ ని మినహాయిద్దాం అన్న తలంపు చేయరాదు. 2) ప్రార్థనలు ఇళ్లలోనే ఉండి చేసుకోవాలి. మసీదుల్లోకి వెళ్లి ప్రార్థనలు చేయాలన్న ఆలోచన చేయరాదు. 3) ఏ ఒక్కరు మసీదులోకి వెళ్లినా ఇంకొకరు రూల్స్ బ్రేక్ చేయడానికి అవకాశం ఇచ్చినవారవుతారు. అది పూర్తిగా వాతావరణం చెడగొడుతుంది. 4) మనం పండుగ సంబరాన్ని ఆస్వాదించాలంటే కరోనా నుంచి సురక్షితంగా ఉండాలి. కాబట్టి ఎవరో బలవంతంగా రూల్స్ రుద్దుతున్నారని కాకుండా స్వచ్ఛందంగా రూల్స్ ని పాటించాలి. 5) బయట కలుషితమైన వాతావరణం ఉన్నప్పుడు ఇంటి నుంచే ప్రార్థన చేసుకోవాలన్న ప్రవక్త సూచనలు గుర్తు తెచ్చుకొని ఆ మార్గాన్ని అవలంబించాలి. ఇటీవల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ లైవ్ లో మాట్లాడిన

సీతను అడవికి పంపడంలో చాకలి పాత్ర ఎంత?

రామాయణం లాంటి మహా ఇతిహాసంలో కొన్ని అపరిపక్వమైన అల్లికలు, జాతి నిందాపూర్వక వ్యాఖ్యానాలు కాలక్రమంలో చేరిపోయాయి. కొంచెం మనసు పెట్టి ఆలకిస్తే వాటి మూలాలను బట్టబయలు చేయొచ్చు. అలాంటి ఒక అనుమానమే ప్రస్తుతం డీడీ భారతిలో వస్తున్న రామాయణాన్ని వీక్షించడం ద్వారా తీరింది. అది నా లాంటి జిజ్ఞాసువులు ఎందరికో ఉపయోగపడుతుందని రాయాలనిపించింది.  జాతి నింద ఏముంది? తెలుగువాడికి తెలిసిన రామాయణంలో సీతమ్మను అడవికి పంపిన ఘటన అపరిపక్వంగా ఉంది. ఆ నోటా ఆ నోటా తనదాకా వచ్చిన మాటను ఆధారం చేసుకొని రాముడు సీతను అడవికి పంపినట్టు లవకుశ వంటి రామాయణానికి సంబంధించిన సినిమాల ద్వారా, పాటల ద్వారా విన్నాం. అది నిజమని ఇప్పటికీ భ్రమిస్తున్నాం. "చాకలి నింద" కారణంగా రాముడు సీతను అడవి పంపాలన్న ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడన్నది మనకున్న అవగాహన. ఇప్పుడు కాస్త విడమరచి ఆలోచించే శక్తి ఉన్న టైమ్ లో… 33 ఏళ్ల క్రితం భారత ప్రజల్ని ఉర్రూతలూపిన ఉత్తర రామాయణాన్ని పరిశీలనగా వీక్షించే అవకాశం ఏర్పడింది కాబట్టి.. ఆ అభిప్రాయం తప్పనిపిస్తుంది.  వృత్తాంతాన్ని పరిశీలిద్దాం రాముడు లంకా విజయం తరువాత పుష్పక విమానంలో అయోధ్య రావడం, పట్టాభిషేకం చేసుకొన

ఫేస్ బుక్-జియో బంధంతో ట్విట్టర్ కు కష్టకాలమేనా?

దేశీయ టెలికాం రంగానికి ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న జియో టెలికాం పంచన ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ చేరడంతో రానున్న రోజుల్లో భారతీయ మార్కెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఫేస్ బుక్  రూ. 43, 574 కోట్లు (5.7 బిలియన్ డాలర్లు) మొత్తాన్ని జియో టెలికాంలోకి పంపింగ్ చేస్తోంది. జియోలో దాదాపు 10 శాతాన్ని ఫేస్ బుక్ వాటాగా పొందుతుంది. దీంతో ఫేస్ బుక్ చేతిలో ఉన్న వాట్సాప్ కూడా జియో చేపట్టబోయే ఆపరేషన్స్ కి బాసటగా నిలుస్తాయి. టెలికాం విభాగంలో ఇప్పటికే అగ్రభాగాన ఉన్న జియో.. తాజాగా డిజిటల్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. జియో మార్ట్ పేరుతో వినియోగదారులకు నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీకి భారీ ఎత్తున ప్లాన్ చేసిన ధీరూబాయి అంబానీ తనయుడు... అతిత్వరలోనే ఫేస్ బుక్, వాట్సాప్ ల సహకారంతో ఆ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించబోవడం ఖాయంగా మారింది. జియో మార్ట్ పేరుతో రిటైల్ వ్యాపారాన్ని మైక్రో లెవల్లోకి తీసుకెళ్లనున్నట్టు దాదాపు 6 నెలల క్రితమే ముఖేశ్ బయటపెట్టుకున్నారు. అది కాస్తా ఇప్పటికి రూపం దాల్చింది. ఫేస్ బుక్ కి భారీ సంఖ్యలో ఉన్న ఖాతాదారుల వివరాలు, అలాగే వ్యక్తిగత సమాచారం కోసం వా

డాక్టర్ల నుంచి మొదటి ప్రమాద హెచ్చరిక

ఓపికకు కూడా హద్దుంటుంది కదా. అదే ఇప్పుడు ముందుకొస్తోంది. కరోనా విజృంభణకు బ్రేకులు వేసేందుకు ముందువరుసలో ఉండి పోరాడుతున్న వైద్యసిబ్బందిలో నిరసన సెగలు రగులుతున్నాయి. కరోనా పాజిటివ్ బారిన పడిన కొందరు వ్యక్తులు, హైడింగ్ లో ఉండడమే కాక.. పోలీసుల ద్వారా ఐడెంటిఫై అయ్యాక డాక్టర్లు వెళ్లినా కూడా విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. విచక్షణ కోల్పోయి వైద్యుల మీద దారుణంగా దాడులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో, నిజామాబాద్ లో జరిగినా ప్రభుత్వం వైపు నుంచి చెప్పుకోదగ్గ చర్యలు లేకపోవడం వైద్యసిబ్బందిలో ఆందోళనకు కారణమవుతోంది. ఆ రెండు సంఘటనల తరువాత కూడా OGH వైద్యుడిపై రక్తం వచ్చేలా కొట్టిన ఘటన జరిగింది. వైద్య సిబ్బంది మీద దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న సర్కారు ప్రకటనలు కంటితుడుపు చర్యలుగానే మిగిలిపోయాయి. అటు యూపీలో కూడా డాక్టర్ అగర్వాల్ పై, అతని అనుచరులు, డ్రైవర్ పై విచక్షణ లేకుండా దాడి చేశారు. మీ ప్రాణాలు కాపాడేందుకే వచ్చామని చెబుతున్నా మూర్ఖత్వం తలకెక్కిన పాజిటివ్ రోగులు వాళ్ల వెహికల్ పై రాళ్లవర్షం కురిపించారు. చివరికి రోగులు ఉండాల్సిన హాస్పిటల్ బెడ్ మీద డాక్టర్లు ఉండాల్సి వస్తోంది. Al

తండ్రి అంత్యక్రియలకు హాజరు కాకండి

Photo Credit: NP News24 యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి తన కర్తవ్య నిష్టను ప్రదర్శించారు. 71 ఏళ్ల తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ ఆస్పత్రిలో మరణించిన సమయంలో కరోనా వైరస్ కట్టడికి సంబంధించి ఉన్నత స్థాయి సమీక్షలో పాల్గొన్న యోగి... మంగళవారం ఉత్తరాఖండ్ లో జరిగే తన తండ్రి అంత్యక్రియలకు సైతం తన అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరు కావద్దని, లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా విజృంభిస్తున్న క్రమంలో ప్రజలందరూ దీన్ని పాటించాలన్నారు. ఈ నిర్ణయంతో యోగి వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలోనే గాక జనరల్ మీడియాలోనూ ప్రశంసలు కురుస్తున్నాయి. Also Read: వదిలేస్తే వల్లకాడే - ఈ లెక్కలే సాక్ష్యం                   తండ్రి అంత్యక్రియలకు యోగి దూరం ఇక సెక్యులరిస్టులుగా చెప్పుకునే కొంతమంది సూడోలు ఇటీవల మర్కజ్ కు వెళ్లివచ్చిన కోవిడ్ పాజిటివ్ కేసులపై దుమారం రేగినప్పుడు యోగి ఆదిత్యనాథ్ లాక్ డౌన్ ఉన్న సమయంలోనే అయోధ్యకు వెళ్లాడని, దాన్నెందుకు విస్మరించారని అక్కసు బయట పెట్టుకున్నారు. తబ్లిగీ జమాత్ కు హాజరైనవారివల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని అన్ని పేపర్లు, అన్ని రిపోర్టులు వెల్లడిస్తున్నా... దాన్ని పట్టిం

తండ్రి అంత్యక్రియలకు యోగి దూరం

Photos Credit: OBN, NP News24 ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు పితృవియోగం సంభవించింది. 71 ఏళ్ల వయసున్న ఆనంద్ సింగ్ బిష్ట్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చనిపోయారు. కిడ్నీ సంబంధ సమస్యలతో ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే తండ్రి మరణవార్త తెలిసే సమయానికి అక్కడ యూపీలో సీఎం ఆదిత్యనాథ్ కోవిడ్-19 లాక్ డౌన్ అమలుకు సంబంధించిన సమీక్షా సమావేశంలో ఉన్నారు. రేపు ఉత్తరాఖండ్ లోని పౌరీ జిల్లాలో తండ్రి అంత్యక్రియలు జరుగుతాయి. అయితే తండ్రి మరణం తనకు ఎంతో దుఃఖదాయకమని, తండ్రి లేని లోటును ఎవరూ పూడ్చలేరని, తాను తలపెట్టిన అన్ని కార్యక్రమాలకు తండ్రి ప్రోత్సాహం లభించిందని యోగి ఎంతో ఆవేదనతో చెప్పారు. అయినా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కరోనా కష్టకాలంలో తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని, శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించాలని, లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత తాను కుటుంబ సభ్యుల్ని కలుస్తానని ఆదిత్యనాథ్  చెప్పడం విశేషం. తన తండ్రి కర్తవ్య నిర్వహణ గురించి చెప్పిన అంశాలనే తాను పాటిస్తున్నానని, తండ్రికి ఇచ్చే నివాళి తన విధ్యుక్త ధర్మ నిర్వహణలోనే ఉందని యోగి చాలా సాదాసీదాగా  చెప్పడం విశేషం. 

వదిలేస్తే వల్లకాడే - ఈ లెక్కలే సాక్ష్యం

Photo: Job Vacancy కేంద్రప్రభుత్వం గానీ, రాష్ట్రాల ప్రభుత్వాలు గానీ కరోనా పేరుతో ప్రకటిస్తున్న రోజువారీ పాజిటివ్ కేసుల లెక్కలు నమ్మకానికి బదులు అపనమ్మకాన్ని పెంచుతున్నాయి. క్వారంటైన్ చేసినా, ఐసోలేషన్లో ఉంచినా, కంటైన్మెంట్ తో కట్టడి చేసినా... కరోనా అనే ఉపద్రవం రోజురోజుకూ పెరుగుతుందే తప్ప ఆగిన దాఖలాలు ఇప్పటికైతే కనిపించలేదు. ఉదాహరణకు ప్రభుత్వం చెప్పిన లెక్కల్నే పరిశీలిద్దాం. మన దేశంలో మిలియన్ ప్రజలకు (10 లక్షలకు) 268 మందిని పరీక్షిస్తున్నారు. ఆ మేరకు రోజుకు దాదాపు 1000 కొత్త కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో రోజువారీ సగటు పరీక్షలు 375. ఆంధ్రాలో రోజువారీ సగటు పరీక్షలు 539. మరణాల రేటులో కూడా జాతీయ సగటు కన్నా తెలంగాణ సగటు భేషుగ్గా ఉందంటూ, ఆంధ్రా సగటు భేషుగ్గా ఉందని మనకు మనమే సంతృప్తి పడుతున్నాం. అది మన అల్పత్వానికి పరాకాష్ట. అదే మన దేశంలో టెస్ట్ కిట్లు సరిపడినన్ని ఉండి ఇంకా ఎక్కువ పరీక్షలు నిర్వహించినట్టయితే ఎక్కువ కేసులు బయటపడతాయి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ పరీక్షలకు 311 మంది చొప్పున పాజిటివ్ కేసులు నమోదవుతుంటే మన దేశంలో (20 తేదీ నాటికి) మిలియన్ పరీక్షలకు 13 మంది చొప్పున బయట పడ

వేదాస్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ

  కరోనా సృష్టించిన కల్లోలంతో నిరుపేదలు, రోజు కూలీలు అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ వంతు బాధ్యతగా విశ్వకర్మ ఎంప్లాయీస్ డెవలప్ మెంట్ అండ్ సర్వీసెస్ అసోసియేషన్ (వేదాస్ అసోసియేషన్) హైదరాబాద్ కమిటీ ముందుకొచ్చింది. అంబర్ పేట, పటేల్ నగర్ లో ఉన్న విశ్వబ్రాహ్మణల్లోని పేద కుటుంబాలకు 5 కిలల బియ్యం, పప్పు, కారం వంటి నిత్యావసర సరుకులను అందజేశారు. హైదరాబాద్ కమిటీ అధ్యక్షులు అర్నోజి జైన్ కుమార్ ఆచార్య, కార్యదర్శి ఎన్. సుధాకరాచారి ఇందుకోసం పూనుకున్నారు. పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ అనేది లాక్ డౌన్ ఎత్తేసేవరకు కొనసాగుతుందని, వేదాస్ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ కుటుంబాలకే గాక ఇతర వర్గాల్లోని నిరుపేదలకు కూడా అందిస్తామని చెప్పారు. సామాజిక దూరాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తున్న దృష్ట్యా తామే ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకులు అందజేస్తామని చెప్పారు. వేదాస్ రాష్ట్ర అధ్యక్షుడు అలుగోజు కుమారస్వామి ఆకాంక్ష మేరకు తాము హైదరాబాద్ లో ఈ కార్యక్రమం తీసుకున్నామని, ఇది నిరంతరం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వేదాస్ రాష్ట్ర మీడియా వింగ్ ఇంచార్జి రమేశ్ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక వేదాస్ నాయకుడు సామేశ్

చైనా పెట్టుబడులకు ఇండియా చెక్

Photo: cnn.com కరోనా పుణ్యమా అని భారత్ ఆలస్యంగానైనా కళ్లు తెరిచింది. మన సరిహద్దుల్ని ఆనుకునే ఉన్న డ్రాగన్ కంట్రీ కుట్రపూరితమైన ఆర్థిక సామ్రాజ్యవాదానికి తొలి చెక్ పెట్టింది. కరోనా మహమ్మారిని కట్టడి చేస్తున్న ఆపరేషన్లో భాగంగానే హుటాహుటిన ఎఫ్.డి.ఐ పాలసీని సవరించింది. దీని ప్రకారం మన దేశ సరిహద్దులు ఆనుకొని ఉన్న దేశాలు ఇకపై నేరుగా భారత్ లోని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం గానీ, పెట్టుబడులు పెట్టడం గానీ చేయడానికి వీల్లేదు. అలాగే భారత్ లోని కంపెనీలు కూడా యాజమాన్య హక్కుల బదలాయింపులు గానీ, కంపెనీల విస్తరణ గానీ, నూతన భాగస్వాములు, పెట్టుబడుల సేకరణ విషయంలో మన సరిహద్దుల్ని ఆనుకొని ఉన్న దేశాలతో కుదుర్చుకోవాలంటే భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. తాజా ఎఫ్.డి.ఐ నిబంధనల సవరణ ప్రధానంగా చైనాను, అది విసిరే ఆర్థికపరమైన పెను సవాళ్లను ఎదుర్కోవడానికేనని భావిస్తున్నారు.    చైనాను పూర్తిగా నమ్మి పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచి ఇటలీలోని దేశీయ ఇండస్ట్రీని చేజేతులా నాశనం చేసుకున్న ఆ దేశం.. చాలా ఆలస్యంగా ఆ విషయాన్ని గుర్తించింది. కరోనా విజృంభించి శవాల దిబ్బగా మారిన తరుణంలోనే ఇటలీ పునరాలోచనలో పడింది. ఇటలీతో పాటు

ట్విట్టర్ ను నిషేధించాలంటున్న కంగనా

బాలీవుడ్ భామ కంగనా రనౌత్ అపర కాళికావతారం ఎత్తింది. ఈ ట్విట్టర్ పిట్ట గొంతు పిసికేయాలని ప్రధాని నరేంద్రమోడీ సర్కారుతో వినమ్రంగా వేడుకుది. సోషల్ మీడియా పోస్టుల్లో కూడా పక్షపాతం చూపిస్తే.. అలాంటి సామాజిక మాధ్యమాలు అరాచకాలు సృష్టిస్తాయి మహా ప్రభో... తక్షణమే ట్విట్టర్ గాణ్ని నిషేధించిపారెయ్యండి... అంటూ ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో రికార్డు చేసింది.  ఉన్న భావస్వేచ్ఛను హుందాగా వాడుకునేవారితో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అదే భావస్వేచ్ఛను ఉపయోగించుకొని చేసిన సామాన్య కామెంట్లకు కూడా లౌకికత్వం మంటగలిసిపోతోందని ఇల్లెక్కి లొల్లి చేసే వాళ్లతో వేగడం ఎవరికైనా సాధ్యమేనా? ఈ విషయంలోనే కంగనాకు కాలుకొచ్చింది. తబ్లిగీ జమాత్ కు వెళ్లినవారికి వైద్య పరీక్షలు చేసేందుకు డాక్టర్లు, వారిని కన్విన్స్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినా కొందరు తబ్లిగీ తమ్ముళ్లు.. తమను కాపాడేందుకే ప్రభుత్వాధికారులు ఎడతెరిపి లేని ప్రయత్నాలు చేస్తున్నారని గ్రహించక.... వారి మీద దాడులకు తెగబడుతున్నారు. దీనిమీదనే కంగనా చెల్లెలు.. రంగోలీ తన ట్విట్టర్ అకౌంట్ లో డాక్టర్ల మీద, పోలీసుల మీద దాడులకు తెగబడుతున్నవారిని కాల్చేపారేయాలన

2022 వరకు సామాజిక దూరం పాటిస్తేనే మనుగడ - హార్వర్డ్ యూనివర్సిటీ

Photo Credit: Shiksha.com సామాజిక దూరాన్ని పూర్తి నిక్కచ్చిగా అమలు చేస్తేనే కరోనా వైరస్ ను శాశ్వతంగా నిర్వీర్యం చేయగలమని, పరిమిత దినాల పాటు లాక్ డౌన్ పాటించి ఆ తరువాత పాత పద్ధతుల్లోనే ఉంటామంటే కుదరదని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు నిర్వహించిన తాజా అధ్యయనం చెబుతోంది. హార్వర్డ్ యూనివర్సిటీ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇమ్యూనాలజీ అండ్ ఇన్పెక్షియస్ డిసీసెస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు ఎం.కిస్లర్, యోనాతన్ హెచ్. గ్రాడ్ అనే ఇద్దరు ప్రొఫెసర్లు కరోనా విజృంభణ, వ్యాప్తి, దాని జీవితకాలంపై అధ్యయనం చేశారు.  వైరస్ సోకిన వ్యక్తి కేవలం 14 రోజులో, లేక 21 రోజులో క్వారంటైన్ లో ఉన్నంతమాత్రాన వైరస్ పూర్తిగా పోవడం సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడు మందు గానీ, టీకా గానీ రానందువల్ల అది రావడానికి నెలల నుంచి ఏళ్లు  కూడా పట్టే అవకాశం ఉన్నందువల్ల వైరస్ వ్యాప్తి జరగకుండా చూడడమే మార్గం తప్ప.. పాజిటివ్ బారిన పడి కోలుకున్న వ్యక్తిలో వైరస్ లేనట్టు భావించరాదని హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 పై పనిచేసే మందుకోసం ఇప్పుడే పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి.. అది రావడానికి చాలా టైమ్ పడుతుంది. దాదాపు ఏడాది నుంచి 2 ఏ

కరోనాకు బ్రేకులో కేరళ సక్సెస్.. కారణం ఇదే

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింటు. నిజమే కేరళ సర్కారు కరోనాకు బుల్లెట్ దించినట్టే అనిపిస్తుంది. ఫస్ట్ పాజిటివ్ కేస్ కేరళలోనే నమోదైనా... కరోనా వ్యాప్తిని అరికట్టడంలో అందరిచేతా శెభాష్ అనిపించుకుంటోంది. సీఎం అంటే అతనేరా బుజ్జీ అనిపించుకుంటున్నాడు పినరాయ్ విజయన్. ఏప్రిల్ ఫస్టున 123 కొత్త కేసులు నమోదవగా అనుమానిత లక్షణాలున్న వ్యక్తుల్ని గుర్తించి హాస్పిటల్లో చేర్పించినవారి సంఖ్య 622. అదే సంఖ్యను ఏప్రిల్ 17వ తేదీన పరిశీలిస్తే.. 17న నమోదైన కొత్త కేసులు 84 ఉంటే.. పాజిటివ్ అనుమానిత లక్షణాలుండి హాస్పిటల్ కు తరలించినవారి సంఖ్య 526 గా నమోదైంది. అంటే ఈ పక్షం రోజుల్లో కొత్త అనుమానిత కేసుల సంఖ్యను దాదాపుగా వందకు తగ్గించి, పాజిటివ్ గా గుర్తించినవారిని దాదాపు 40 తగ్గించారు. ఇదే చిత్తశుద్ధి ఇంకా ప్రదర్శిస్తే కొత్త పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు అనుమానించి హాస్పిటల్లో చేర్చేవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుందంటున్నారు.  ఇక హోమ్ ఐసోలేషన్ లో పెట్టి... నిరంతర పర్యవేక్షణలో ఉన్నవారి సంఖ్య ఏప్రిల్ ఫస్టు నాటికి లక్షా 63 వేల 508 ఉంటే... అదే సంఖ్యను 17వ తేదీనాటికి 78,454 కు తగ్గించగలి

లాక్ డౌన్.. ఓ వీక్ పాయింట్

Photo Credit: HansIndia కరోనా విజృంభణ అనేది లాక్ డౌన్ పొడిగించాలన్న డిమాండ్ ను ముందుకు తీసుకొస్తే... రెక్కాడితే డొక్కాడని కూలీలు, వలస కార్మికుల్లో మాత్రం నైరాశ్యాన్ని పెంచింది. ఇప్పటికే పనుల్లేక, పస్తులు ఉండలేక అన్నమో రామచంద్రా అంటున్న వలస కూలీలకు లాక్ డౌన్ పొడిగింపు అనేది అశనిపాతంలా తాకింది. అందుకే అటు ముంబైలోని బాంద్రాలో వేలాది మంది ఒక్కసారిగా బయటికొచ్చారు. బెంగళూర్, జైసల్మేర్, పుణే.. ఇలా దేశం నలుమూలలా వలస కార్మికులు రోడ్డెక్కారు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా వేలాది మంది రోడ్డెక్కారు. సొంతూళ్లకు వెళ్లి ఉన్నదేదో తిని కాలం గడుపుదాం అనుకొని పిల్లాపాపలతో, తట్టాబుట్టలతో బయల్దేరారు. అయితే వారు అలా బయల్దేరడం అనేది కేవలం వలస కూలీల ఫెయిల్యూర్ కాదు. కరోనా అనేది వారి వ్యక్తిగత సమస్య కూడా కాదు. ఇది మనందరి కలెక్టివ్ సమస్య. ఇది సామాజిక సమస్య. ఇది సామూహిక సమస్య. ఇందులో ఏ ఒక్కరు ఫెయిలైనా అందరి ఫెయిల్యూరే. కాబట్టి వలస కూలీలు భరోసా కోల్పోవడం అనేది అందరి ఫెయిల్యూర్.  Also Read: ఎవరి తలరాతలు మార్చడానికి ఈ గీతలు?                   అగ్గితోటి కడగడమే అందరికీ క్షేమకరం ఈ స్పృహ ఎందుకనో మనలో చాలా మంది పెద్దవాళ్లకు,

ఎవరి తలరాతలు మార్చడానికి ఈ గీతలు?

దేశద్రోహం కేసులో బెయిల్ రాకపోతే ముస్లింల పట్ల వివక్ష అవుతుందా? కౌంటర్ కరెంట్స్ అనే ఒక వెబ్ సైట్ ఉంది. అందులో వేసిన తాజా కార్టూనే ఇది. కరోనా అనే ముద్ర వేసి ముస్లింలను చంపుతున్నట్టుగా మీర్ సుహైల్ ఖాద్రి అనే వ్యక్తి ఈ కార్టూన్ వేశాడు. అతను యాక్టివిస్టో, హ్యూమినిస్టో, రెవల్యూషనిస్టో.. ఇంకే ఇజాన్ని మోస్తున్నాడో తెలీదు గానీ.. బయటి ప్రపంచం మాత్రం జర్నలిస్టుగానే భావిస్తుంది. దేశంలో శాంతి-సౌభ్రాతృత్వాలు కోరుకునే జర్నలిస్టు ఎవరైనా ఇలాంటి కార్టూన్లు వేయడానికి సాహసించడు. ప్రపంచం సంగతి ఎలా ఉన్నా.. భావావేశాలు, సెంటిమెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే మన భారత్ లో మాత్రం రెండు వర్గాలకు సంబంధించిన విషయాన్ని చాలా బాధ్యతాయుతంగా డీల్ చేస్తారు. అలాగే చేయాలి కూడా.  కానీ కౌంటర్ కరెంట్స్ అనే వెబ్ సైట్ యాజమాన్యం మాత్రం అలాంటి జాగ్రత్తలు పాటించకుండానే జనం మీద విషం చిమ్ముతోంది. షార్జీల్ అనే వ్యక్తి మార్చి 11 నుంచి ఇప్పటివరకు వారి బంధువులను, మిత్రులను, ఆఖరుకు లాయర్ ను కూడా కలుసుకోలేకపోయాడు. ఎవ్వరితోనూ మాట్లాడలేకపోయాడు. ఇది పూర్తిగా మానవ హక్కులకు విరుద్ధం. కరోనా విజృంభిస్తున్న ప్రమాదకర పరిస్థితుల్లోనైనా షార

వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక ప్రపంచ నాయకుడు

అనుసరించేవాడు ఫాలోయర్. నడిపించేవాడు లీడర్. ప్రపంచాన్నంతా అమెరికా శాసిస్తుంటే.. అమెరికాను ఇండియా శాసించకపోయినా ఫాలో అయ్యేలా మాత్రం చూసుకుంటోంది. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకొని, ఎక్కడేం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న అమెరికా... పూర్తిగా ఇండియా మీద ఆధారపడిందనేందుకు ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. ఇటీవల కరోనా విజృంభించి మానవాళికి ముప్పుగా పరిణమించిన క్రమంలో ధనిక దేశాలు చాలావరకు ఇండియా వైపే చూశాయి. ఇండియా మీదనే ఆశలు పెట్టుకున్నాయి. అమెరికా కూడా ఆ జాబితాలోనే ఉండడం అందరం చూసిందే. అమెరికా ఏ స్థాయిలో ఇండియా మీద పూర్తి భరోసాగా ఉందనేందుకు ఇంతకన్నా చెప్పుకోదగ్గ నిదర్శనం అవసరం లేదు.అమెరికా పాలసీకి, పరిపాలనకు అద్దం పట్టే వైట్ హౌస్.. ఇండియాను ప్రముఖంగా ఫాలో అవుతోంది. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.  Also Read: చంద్రుడి మీద మైనింగ్ కి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్.. ద వైట్ హౌస్ కు 2 కోట్ల 16 లక్షల పైచిలుకు ఫాలోయర్స్ ఉండగా.. అది మాత్రం కేవలం 19 మందిని మాత్రమే ఫాలో అవుతోంది. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఐదున్నర కోట్లకు పైగా ఫాలోయర్స్ ఉండ

చంద్రుడి మీద మైనింగ్ కి ట్రంప్ గ్రీన్ సిగ్నల్

Photo- GETTY (మానవ సహిత మిషన్ కోసం నాసా సిద్ధమవుతోంది. 2020లో మినీ రోవర్లు పంపాలని నిర్ణయించింది) ఆస్తులు పోగేసుకోవడానికి, ఆధిపత్యం నిలుపుకోవడానికి సరిహద్దులతో పనేంటి? భూగోళం మీద ఆధిపత్యాన్ని ఎప్పుడో సాధించిన అమెరికా చంద్ర మండలాన్ని కూడా కబ్జా చేసుకోవాలని చూస్తోంది. ప్రపంచమంతా ఇల్లు కదలకుండా కరోనా గురించి కథలుకథలుగా చెప్పుకుంటుంటే... ట్రంప్ ఆలోచన చంద్రమండలాన్ని చుట్టేస్తోంది. చంద్రుడి మీద మైనింగ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు ముహూర్తం కూడా ఖరారైనట్లు ఫోర్బ్స్ వెబ్ సైట్ ఓ కథనాన్ని డొమైన్లో పోస్ట్ చేసింది.  ఆ కథనం ప్రకారం 2024లో ఆర్టెమిస్ 3 (Artemis 3 mission) చంద్రుడి దక్షిణ ధ్రువం మీద కాలుమోపుతుంది. 55 ఏళ్ల క్రితం చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాములు అడుగుపెట్టినట్టుగానే మళ్లీ 2024లో కూడా అడుగు పెట్టబోతున్నారు. ఈసారి ఒక మహిళా వ్యోమగామి కూడా తొలిసారిగా అడుగు పెట్టి చరిత్ర సృష్టించబోతోంది. అలాగే ఒక మేల్ ఆస్ట్రొనాట్ కూడా ఈ మిషన్లో భాగం పంచుకోబోతున్నారు. నాసా ఇందుకోసం పూర్తి ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. అయితే ఈసారి చంద్రమండల యాత్రలో అమెరికా కాకుండా మరో దేశం ఏదీ కూడా భాగం పంచుకోవడం లేదు. ఈ యాత్