Skip to main content

Posts

Showing posts with the label CINEMA

ఆదిపురుష్ కాదు.. ఆద్యంతం వికార పురుష్

నాలుగు దశాబ్దాల క్రితం దూరదర్శన్లో మహాభారత్ వచ్చినప్పుడు ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయి చూశారు. ఆ తరువాత రామాయణం వచ్చినప్పుడూ అంతే మైమరచిపోయి ఆస్వాదించారు. కొన్నేళ్లుగా వస్తున్న తాజా మహాభారత్ కు కూడా ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. ఇతిహాస ఇతివృత్తాలపై ఎందరు ఎన్నిసార్లు సినిమా తీసినా ఆదరించే భారతీయులు.. తాజా ఆదిపురుష్ పై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఇంత బతుకూ బతికి ఇంటెనక చావడాన్ని ఎవరూ ఇష్టపడరు. వినడానికి చేదుగా ఉన్నా, జీర్ణించుకోవడానికి కఠినంగా ఉన్నా.. ఆదిపురుష్ సినిమా దేశవ్యాప్తంగా వెలగబెడుతున్న నిర్వాకం మాత్రం ఇదే విషయాన్ని రూఢి చేస్తుందంటున్నారు సినీ అభిమానులు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ డిజాస్టర్ ను జీర్ణం చేసుకోలేకపోతున్నారు. బాహుబలి వంటి సినిమాతో తెలుగు సినిమా రేంజ్ ని, తన ఇమేజ్ ని అమాంతం పెంచుకున్నాడు ప్రభాస్. ఆదిపురుష్ కూడా అంతకుమించి అనేంతగా ఉంటుందని అంతా ఊహించారు. సనాతన భారతీయ సాహితీ సాంస్కృతిక విలువలకు ఆదిపురుష్ లో పట్టం కడతారని.. అంతర్జాతీయ రేంజ్ కు ఎదిగిన తెలుగు సినిమా.. తాజా సినిమాతో కొత్తపుంతలు తొక్కుతుందని ఆశపడ్డారు. అయితే అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి అన్నట్టుగా ఆదిపురుష...

పేరుకు తగినట్టుగానే ఆయన రారాజు-చిరంజీవి

తెలుగు చిత్రసీమలో మరో పాతతరపు ధ్రువతార నింగికేగింది. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నటుడిగా సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న కృష్ణంరాజు.. అటు రాజకీయాల్లోనూ మంచిపేరు తెచ్చుకున్నారు. అయితే రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఎన్నో సేవలు అందించాలనే తహతహ ఆయనకు ఉన్నా.. అందుకు తగిన సహకారం దొరకలేదనే అసంతృప్తికి లోనైనట్టు చెబుతారు. ఏ పార్టీలో ఉన్నామన్నది కాకుండా.. ఏం చేశామన్నదే ఆయన ఫిలాసఫీగా ఉండేదని.. అయితే రాజకీయాల్లో ఉండే అనేక రకాల ఒత్తిళ్లు, పరిమితుల కారణంగా.. ఏ పార్టీలో కూడా కృష్ణంరాజు పూర్తిగా ఒదిగి ఉండలేకపోయారన్న అభిప్రాయాలున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రేక్షకులకు తన విలక్షణమైన నటనను అపురూపమైన జ్ఞాపకంగా అందించారు కృష్ణంరాజు. 1940 జనవరి 20వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో పుట్టిన కృష్ణంరాజు పూర్తి పేరు.. ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. తెలుగు ప్రేక్షకులకు ఓ భారీ నట విగ్రహంగా మాత్రమే తెలిసిన కృష్ణంరాజులో బహుముఖీనమైన అభిరుచులు, ఆకాంక్షలు ఉన్నాయి. సుదీర్ఘమైన జీవిత ప్రయాణంలో అనేక పాత్రలను ఎంతో విజయవంతంగా పోషించినట్టు ఆయన సినీ ప్రస్థానం చెబుతుంది. తెలుగునేలపై స్వేచ్ఛా పోరాటాల సమయంలో తనదైన మ...

పవన్‎కు, చంద్రబాబుకు చెక్ పెట్టేశారా?

జూనియర్ ఎన్టీఆర్, బీజేపీ నేత అమిత్ షా భేటీ రాజకీయవర్గాల్లో చాలా ఆసక్తి రేపుతోంది. వారేం మాట్లాడుకున్నారన్నది బయటకు పొక్కకపోయినా.. కచ్చితంగా రాజకీయ ప్రాధాన్యమైన అంశాలు చర్చకు వచ్చి ఉంటాయని అంతా భావిస్తున్నారు. అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధహస్తుడనే పేరున్న అమిత్ షా.. తన విలువైన సమయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో షేర్ చేసుకోవడం అనేక కోణాల్లో చర్చనీయాంశంగా మారింది.  బీజేపీ టాప్ లీడర్, టాప్ స్ట్రాటజిస్ట్ అమిత్ షా.. నోవోటెల్ హోటల్లో ప్రముఖ తెలుగు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తో డిన్నర్ చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. టీడీపీ గెలుపు కోసం, దగ్గరి బంధువైన చంద్రబాబు కోసం ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీతో పాటు చంద్రబాబునాయుడుతో కూడా ఆయన ఎడం పాటిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఎన్టీఆర్ ను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టాకే.. పవన్ కల్యాణ్ తో చెట్టపట్టాలు వేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఈ క్రమంలో తన సినిమా ప్రాజెక్టుల్లో బిజీగా ఉంటూ.. రాజకీయాల్లో పూర్తి నిశ్శబ్దం పాటిస్తున్న ఎన్టీఆర్.. అమిత్ షా ను కలవడం ఏపీ రాజకీయాల్లో దుమారం ...

కవులకు, సామాజికవేత్తలకు ఉగాది పురస్కారాలు

నటనం, నాట్యం... కళారూపం ఏదైనా దానికి ప్రేరణ మాత్రం కవిత్వమే. కవి హృదయం ఆవిష్కరించిన పొందికైన మాటలే కళాకారులు కట్టిన గజ్జెలకు ప్రాణం పోస్తాయి. నాట్యగత్తెలకు ప్రేరణనిస్తాయి. అలాంటి కవిత్వానికి పెద్దపీట వేసే ఉద్దేశంతో, కవులను సన్మానించుకునే సంకల్పంతో చిదంబర నటరాజ కళానిలయం వ్యవస్థాపకురాలు, నృత్యగురువు మంజుల ఉగాది పురస్కారాలు అందజేశారు. ప్రముఖ కవులకు, ప్రముఖులైన కవితాభిమానులకు శాలువాలు కప్పి సన్మానించి తన కవిత్వ సేవను చాటుకున్నారు. చిదంబర నటరాజ కళానిలయం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పలువురు కవులు, సామాజిక కార్యకర్తలకు ఉగాది పురస్కారాలు అందజేశారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సముద్రాల వేణుగోపాలాచారి, ప్రముఖ సినీ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ నటుడు  సమీర్, నిలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ (రిటైర్డ్) డాక్టర్ రామకృష్ణ, బి.కేశవులు, మురహరి,  విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు   చేపూరి లక్ష్మణాచారి, కేశంపేటకు చెందిన ఎం.సతీశ్ హా...

శ్యామ్ సింగ్ రాయ్ - ఏం ఖర్మ రా భాయ్

చిత్రం ఏమంత దరిద్రంగా వుంది??? బానే తీశారు కదా.... నటన, కథ, నాట్యం, సంగీతం, సాహిత్యం అన్నీ బానే వున్నాయి కదా.. గొప్ప చిత్రం కాకపోయినా అసహ్యంగా అయితే లేదు కదా అనే అనుమానం మనకు రాక మానదు.. నిజమే సాంకేతికంగా అన్నీ బానే వున్న చిత్రమే.... అందునా నాని చిత్రం....సాయి పల్లవి లాంటి నాట్యం నటన అద్భుతంగా చేసే నటి వున్న చిత్రం అన్నీ సమపాళ్లలో వున్న చిత్రమే. కాకపోతే వొచ్చిన చిక్కల్లా అనసరంగా పెట్టిన రెండు విషయాలు.  1. కమ్యూనిజం. 2. హిందూ ద్వేషం. అనవసరంగా పెట్టారు అనేకన్నా కావాలనే పెట్టినట్టు అనిపించింది. అందుకే పొరబాటు అయితే పోనీలే అని వొదిలెయ్యొచ్చు కానీ కావాలని చేస్తే మాత్రం తగ్గేదెలే.. అందుకే ఈ విశ్లేషణ.. అసలు నేను దీనికి విశ్లేషణ రాయకూడదు అనుకున్నా. రాసినా రెండే రెండు ముక్కల్లో ముగించెయ్యాలి న్యాయంగా.  కానీ మరీ రెండు ముక్కల్లో అయితే సదరు దర్శకుని సంగతి అంచనా వెయ్యటం కష్టం కదా, అందుకే ఇలా... మొట్ట మొదటగా కొన్ని విషయాలు చెప్పేసి తర్వాత చిత్రం గూర్చి చర్చించుకుందాం. 1. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద జోక్ ప్రజాస్వామ్య దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉండి, అది ఎన్నికల్లో పాలుపంచ...

అద్భుతమైన సినిమా - చెత్త మెసేజ్

శ్యామ్ సింగారాయ్ సినిమా చాలా మంచి కళాత్మక విలువలున్న సినిమా. చిత్రీకరణ, ఫోటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. ఈ సినిమాలో నాని టైటిల్ రోల్ కు న్యాయం చేశాడు. హీరోయిన్ సాయి పల్లవి కూడా బాగా నటించింది. మంచి పాత్ర ను ఎంచుకోడంలో సాయి పల్లవి ఎప్పుడూ ముందుంటుంది. ఈ సినిమాకు హైలెట్ హీరో నాని పాత్ర శ్యామ్ సింగరాయి , చాలా హుందాగా ఉంది పాత్ర. హీరోయిన్ డాన్స్ బాగా చేసింది. కథక్ నృత్యం చేస్తూ ఒక సీన్ లో ఆమె చేసే నాట్యం ఎక్సలెంట్ గా ఉంది. ఆ పాత్రకు ఆమె సరిపోయింది.  కథ విషయానికి వస్తే, హీరో సినిమా డైరెక్టర్. 2020 లోమొదటి సినిమా తీసి హిట్ సాధిస్తాడు. అతను పేరు సాధిస్తాడు. అనుకోకుండా అతను ఒక కేసులో  ఇరుక్కుని పోతాడు. ఆ కేసు నుండి బయట పడడానికి అతన్ని, సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్తే, ఆమె అతని ద్వారా చాలా విషయాలు తెలుసుకొంటుంది. సినిమా 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళి శ్యామ్ సింగరాయ్ దగ్గరకు వెళుతుంది. అతను ఒక బెంగాల్ కవి, అతని తల్లి తెలుగామే, కాబట్టి తెలుగు కూడా వస్తుంది. హీరో , 4 అన్నతమ్ముల్లో చిన్నోడు. వారిది ఉన్నత కుటుంబం, అభ్యుదయ భావాలు కలిగిన అతడు నాస్తికుడు, దేవుని నమ్మడు. కులానికి, మతాలకు వ్యతిరేకంగ...

తెలంగాణలో మరాఠీ సినిమా - ఓ శుభారంభం

మూస కథలు, పసలేని కథనాలు, మూడు పాటలు, ఆరు ఫైట్లు అనే ట్రెండు నుంచి తెలుగు ఇండస్ట్రీ కాస్త దారి మళ్లినట్టు కనిపిస్తున్నా.. నూతన పోకడలు, లో-బడ్జెట్ లోనే సృజనాత్మకమైన ప్రయోగాలు అనే కేటగిరీస్ లో మాత్రం దాదాపు శూన్యమనే చెప్పాలి. తిమింగలాల వంటి బడాబాబులు ఏలుతున్న తెలుగు ఇండస్ట్రీలో ప్రయోగాలతో కూడిన లో-బడ్జెట్ సినిమాలకు ఇంకా సమయం రాలేదన్న నిరాశ అంతటా ఆవరించిన ఉన్న సమయంలో నూతన తరానికి మలయసమీరం లాంటి ఓ శుభవార్త వినిపిస్తోంది.  తొలితరం తెలంగాణ పోరాటయోధుడు కేశవరావు జాదవ్ మనవడు అయిన సత్యనారాయణరావు జాదవ్ రచయితగా, డైరెక్టర్ గా, నిర్మాతగా తెలంగాణ గడ్డ మీద మరాఠీ సినిమా పూర్తి చేశారు. పతీమజాకరామతీ (నా మొగుడు చిలిపికృష్ణుడు అని  తెలుగులో సమానార్థం) విడుదలకు సిద్ధమైన క్రమంలోనే లాక్ డౌన్ రావడం వేరే విషయం. అయితే 2, 3 నెలల్లో లాక్ డౌన్ ఎత్తేసి సినిమా హాల్స్ తెరిస్తే దీపావళి కానుకగా పతీమజాకరామతితో పాటు శెగావచరాజా అనే మరో సినిమాను కూడా విడుదల చేయనున్నట్లు సత్యనారాయణరావు జాదవ్ చెప్పారు. ఒకవేళ లాక్ డౌన్ తెరవడం కుదరకపోతే ఓటీటీ (ఓవర్ ద టాప్) ప్లాట్  ఫామ్ లో ఉన్న దాదాపు 160 చానల్స్ లో విడుదల చేసేందుకు...

ట్విట్టర్ ను నిషేధించాలంటున్న కంగనా

బాలీవుడ్ భామ కంగనా రనౌత్ అపర కాళికావతారం ఎత్తింది. ఈ ట్విట్టర్ పిట్ట గొంతు పిసికేయాలని ప్రధాని నరేంద్రమోడీ సర్కారుతో వినమ్రంగా వేడుకుది. సోషల్ మీడియా పోస్టుల్లో కూడా పక్షపాతం చూపిస్తే.. అలాంటి సామాజిక మాధ్యమాలు అరాచకాలు సృష్టిస్తాయి మహా ప్రభో... తక్షణమే ట్విట్టర్ గాణ్ని నిషేధించిపారెయ్యండి... అంటూ ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో రికార్డు చేసింది.  ఉన్న భావస్వేచ్ఛను హుందాగా వాడుకునేవారితో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అదే భావస్వేచ్ఛను ఉపయోగించుకొని చేసిన సామాన్య కామెంట్లకు కూడా లౌకికత్వం మంటగలిసిపోతోందని ఇల్లెక్కి లొల్లి చేసే వాళ్లతో వేగడం ఎవరికైనా సాధ్యమేనా? ఈ విషయంలోనే కంగనాకు కాలుకొచ్చింది. తబ్లిగీ జమాత్ కు వెళ్లినవారికి వైద్య పరీక్షలు చేసేందుకు డాక్టర్లు, వారిని కన్విన్స్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినా కొందరు తబ్లిగీ తమ్ముళ్లు.. తమను కాపాడేందుకే ప్రభుత్వాధికారులు ఎడతెరిపి లేని ప్రయత్నాలు చేస్తున్నారని గ్రహించక.... వారి మీద దాడులకు తెగబడుతున్నారు. దీనిమీదనే కంగనా చెల్లెలు.. రంగోలీ తన ట్విట్టర్ అకౌంట్ లో డాక్టర్ల మీద, పోలీసుల మీద దాడులకు తెగబడుతున్నవారిని కాల్చేపారే...