Skip to main content

మొబైల్ జర్నలిజం-రూరల్ డెవలప్మెంట్ పై ముగిసిన శిక్షణ తరగతులు

రూరల్ డెవలప్మెంట్ అండ్ మీడియా కవరేజి,  డాక్యుమెంటేషన్ పై ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్) ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగిన ఆన్లైన్ శిక్షణా తరగతులు ముగిశాయి. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో గల సెంటర్ ఫర్ డాక్యుమెంటేషన్ అండ్ కమ్యూనికేషన్ కు సారథ్యం వహిస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆకాంక్ష ఏడు రోజుల శిక్షణా తరగతులను విజయవంతంగా నిర్వహించారు. ఇలా దేశ స్థాయిలో జరగడం ఇదే తొలిసారి. రూరల్ రిపోర్టింగ్, అభివృద్ధి కార్యక్రమాల డాక్యుమెంటేషన్ పై వివిధ విభాగాల్లో నిపుణులైన ప్రొఫెసర్ల చేత క్లాసులు ఇప్పించామని ఆకాంక్ష చెప్పారు.

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, రూరల్ డెవలప్మెంట్, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఫ్యాక్ట్ చెకింగ్, వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులపై గ్రామీణులకు అవగాహన కల్పించడం, జియో ఇన్ఫర్మేటిక్స్ అప్లికేషన్స్ ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టడం,  మహిళా సాధికారతను ఏ విధంగా త్వరితగతిన సాధించాలి, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను ఉపయోగించుకోవడం ఎలా, గ్రామాల్లో మీడియా పోషించాల్సిన పాత్ర, కొత్త పుంతలు తొక్కుతున్న మొబైల్ జర్నలిజాన్ని గ్రామాల్లో అప్లై చేయడం ఎలా, మొబైల్ జర్నలిజానికి ఉపయోగపడే అధునాతనమైన యాప్స్ ఏమున్నాయి, వాటికి ఉపయోగపడే పరికరాలు ఎక్కడ లభిస్తాయి, వాటిని ఎలా సేకరించుకోవాలి... ఇలా అనేక రంగాల్లో సమగ్రమైన అవగాహన కల్పించేందుకు తాము ప్రయత్నించామని ప్రొఫెసర్ ఆకాంక్ష చెప్పారు. ఆన్లైన్ క్లాసులకు 450 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో జర్నలిజం బ్యాగ్రౌండ్ ఉన్న, ఫ్రీలాన్సర్లుగా పనిచేస్తున్న 179 మందిని తాము ఎంపిక చేశామని అయితే 18 రాష్ట్రాల నుంచి 26 మంది జర్నలిస్టులు  ఈ క్లాసులకు హాజరయ్యారని ఆకాంక్ష చెప్పారు. ఈ 26 మంది ద్వారా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మరింత మందికి శిక్షణ తరగతులు నిర్వహించి గ్రామసీమల రూపురేఖలు సమూలంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ శిక్షణ తరగతులు ఈ విధంగా విజయవంతం కావడానికి డాక్టర్ నరేంద్ర కుమార్ ఐఏఎస్ ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. దీనికి కోఆర్డినేటర్ గా డాక్టర్ వెంకటమల్లు తాడబోయిన వ్యవహరించినట్లు ఆకాంక్ష చెప్పారు. అలాగే ఈ కార్యక్రమం మరింత ముందుకు వెళ్ళడానికి ప్రధాన మీడియా సంస్థల తోడ్పాటు తమకు ఎంతో అవసరం అన్నారు.

Comments

Popular posts from this blog

ఆవు పేడతో చెప్పులు.. త్వరలో మార్కెట్‍లోకి

Main Story:   జానారెడ్డికి గవర్నర్‍గిరీ? Also Read:   పాక్ మెడలు వంచిన రోజు ఇదే   Also Read:   ఎంఐఎంతో పొత్తుకు తహతహ ఇందుకేనా? Weekend story:  హండ్రెడ్ పర్సెంట్ హరామ్ Weekend Story:   ఇలాంటి పెళ్లిళ్లతో హిందూ వ్యవస్థకు ఢోకా లేదు ఆవు పేడ ఏంటి.. చెప్పుల తయారీ ఏంటి.. అనుకుంటున్నారు కదా. మీరు వింటున్నది నిజమే. దీన్నిబట్టి చూస్తే రానున్న రోజుల్లో ఆవుకు మంచి డిమాండే ఉంటుందని ఊహించవచ్చు. హైదరాబాద్ లో ఉంటున్న అమిత్ భట్నాగర్ దాదాపు 20 ఏళ్లకు పైగా పంచగవ్య చికిత్స విషయంలో పని చేస్తున్నారు. తాను తలపెట్టిన ఈ మహాయజ్ఞంలో చాలా మంది గో ప్రేమికులు, ఆత్మీయ సహచరులు పాలుపంచుకుంటున్నారని భట్నాగర్ చెబుతారు . ఆవు విసర్జితాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సద్వినియోగం చేయాలన్నదే అమిత్ భట్నాగర్ సంకల్పం. హైదరాబాద్ తో పాటు పాత కరీంనగర్ జిల్లాలోని మంథనిలో వీరి ఆధ్వర్యంలో గోశాలలు నడుస్తున్నాయి. అంతేకాదు.. రాజస్తాన్ లో వీరి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో గో ఉత్పాదనల ప్రాజెక్టు నడుస్తోంది.  వీరి రీసెర్చ్ వల్లే ఆవు పేడ నుంచి అనేక కొత్త రకాల ఉత్పాదనలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే ఆవు పేడ నుంచి అందరూ ఆశ్చర్యపోయేలా కాగితాన్ని తయారు చేశా

విశ్వబ్రాహ్మల ఆకలి కేకలు వినండి

పనికి ముందుండి తిండికి వెనకుండే విశ్వబ్రాహ్మలను ఆదుకోవాలని, ఈ సమాజ నిర్మాణంలో వారి పాత్రను గుర్తించి కష్టకాలంలో ఆదుకోవాలని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు, ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ - విశ్వకర్మ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చేపూరి లక్ష్మణాచారి ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. కరోనా విజృంభించి, లాక్ డౌన్ విధించిన తరువాత అందరికంటే ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులే జీవనోపాధి కోల్పోయారని, పనులు చేయించుకునేవారు లేక జీవనోపాధి కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. కిరాయి ఇళ్లు, ఇరుకైన ఇళ్లలో పిల్లాపాపలతో జీవించడం ఎంతో కష్టంగా ఉందని, తెలంగాణ ఆవిర్భావానికి ముందు కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇకనైనా పూర్తి చేసి పేదలకు కనీస వసతులు సమకూర్చాలని లక్ష్మణాచారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం సిద్ధించి ఆరేళ్లు పూర్తయినా విశ్వబ్రాహ్మలకు ఎలాంటి ప్రభుత్వ పథకాలూ అందలేదన్నారు. ఎన్నికలకు ముందు రుణాలు ఇస్తామన్న కేసీఆర్ ఎన్నికలు పూర్తయ్యాక కనీసం తాము పెట్టుకున్న అప్లికేషన్ల స్టేటస్ ఏంటో కూడా తెలిపే పరిస్థితి లేదన్నారు. కనీసం తమకు లోన్లు ఇచ్చినా ఏదో రకంగా ఈ కరోనా కష్టకాలాన్ని అధిగమించేవారమన్నారు

వీకెండ్ స్టోరీ- ఆధునిక ఆదర్శ హిందూ వివాహం ఇదే

హిందూ సమాజ వ్యవస్థ ఎంత సంక్లిష్టమైందో... అంత సానుకూలమైంది కూడా. అయితే అనుకూలతలు అటుంచి కేవలం సంక్లిష్టతలు మాత్రమే ఎత్తిచూపే ప్రబుద్ధులు తమ దుర్బుద్ధిని మార్చుకోవాల్సిన సందర్భాలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. అందుకు కరీంనగర్‍లో జరిగిన తాజా పెళ్లే ఓ ఉదాహరణ.  డిసెంబర్ 23వ తేదీన కరీంనగర్ లో జరిగిన సహస్ర-మహేశ్‍ల పెళ్లి కులాతీత ఆధునిక హిందూ ఆదర్శ వివాహానికి ఓ ఆనవాలుగా నిలిచిపోతుంది. ఎందుకంటే పెళ్లికూతురు, పెళ్లికొడుకు, పెళ్లిపెద్దలు.. ఇలా ముగ్గురూ మూడు సామాజికవర్గాలకు చెందినవారు కావడం విశేషం. సహస్ర (ముదిరాజ్), మహేశ్ (మేరు)తో పాటు పెళ్లిపెద్దలైన రాజ్‍కుమార్-అన్నపూర్ణ (విశ్వబ్రాహ్మణ) వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవారు. వీరెవరూ రక్త సంబంధీకులు కాకపోయినా, అమ్మాయి-అబ్బాయిల కులపెద్దల మద్దతు కోసం ఎదురుచూడకుండా.. కేవలం అమ్మాయి-అబ్బాయి కుటుంబాలతో ఉన్న పాత పరిచయం, స్నేహాన్నే ఆత్మబంధంగా భావించి యువజంటను ఒక్కటి చేశారు. ఖర్చులకు వెనుకాడకుండా బంధువర్గం, ఉద్యోగ స్నేహితులు.. ఇలా అందరూ మెచ్చేలా అంగరంగ వైభవంగా సహస్ర పెళ్లిబాధ్యతలు పూర్తి చేశారు. నేటి కాలానికి అవసరమైన అసలైన హిందూ ఆదర్శ వివాహాన్ని ఆచరించి చూపారు.