Skip to main content

బీ అలర్ట్.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో లక్షలాది కేసులు

ప్రపంచ మానవాళిని కరోనా ఓ కుదుపు కుదిపింది. దాని ప్రభావం 2022 వరకు ఉంటుందని, కేవలం ఐదారు నెలలకే ఈ సమస్య సమసిపోయేది కాదని అప్పట్లోనే కొందరు నిపుణులు అన్నారు. అదే నిజమవుతోందిప్పుడు. అయితే థర్డ్ వేవ్ గా చెప్పుకునే ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతి గురించి ఆరోగ్య నిపుణులు కాసింత పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ప్రముఖ విద్యావేద్ద, మెడికల్ ఆంత్రోపాలజీ నిపుణుడు వాసిరెడ్డి అమర్నాథ్ ఏమంటున్నారో చూడండి. 


ముంబై , ఢిల్లీ నగరాల్లో ఓమిక్రాన్ వేవ్ మొదలయ్యింది. తెలంగాణ లో కూడా కేసులు పెరగడం ప్రారంభం అయ్యింది. ఎన్ని టెస్ట్ లు చేస్తారు అనే దాన్ని బట్టి కేసులు రోజుకు కొన్ని రెట్లు పెరుగుతూ జనవరి చివరి కల్లా లక్షల్లోకి చేరవచ్చు. ఒమిక్రాన్ ఎవరినీ వదలదు . అందరికీ సోకుతుంది. 

ప్రపంచ వ్యాప్తంగా డేటా చూస్తే..  
1. ఓమిక్రాన్ సోకిన వారిలో నూటికి తొంబై మందికి ఎలాంటి లక్షణాలు వుండవు . మిగతా పదిమందికి అతి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటాయి . ఇది సూపర్ మైల్డ్. 
2. ఓమిక్రాన్ చంపదు. ఎలాంటి మందులు వాడకుండానే లక్షలాది మంది ఓమిక్రాన్ సోకిన వారు కోలుకున్నారని దక్షిణాఫ్రికా డాక్టర్ లు తెలియచేసారు . తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ లు ఓమిక్రాన్ రోగులకు కేవలం విటమిన్ మాత్రలు అంటే బి , సి , డి విటమిన్  మాత్రలు మాత్రమే ఇచ్చినట్టు చెప్పారు .
౩. జలుబు , గొంతులో గరగర , కొద్ది పాటి ఒంటి నలత దీని లక్షణాలు . కొంత మందికి ఒకటి రెండు రోజులు జ్వరం ఉండవచ్చు . రెండు మూడు రోజుల పాటు వేడి నీళ్లు తాగడం , గొంతు లో గరగర ఆంటే సోర్ త్రోట్  తగ్గించడం కోసం వేడి నీళ్లలో ఉప్పు వేసి నోట్లో పోసుకొని తల పైకెత్తి గార్గిల్ చేయడం , వేడి పాలల్లో పసుపు వేసుకొని తాగడం , లేదా అల్లం పసుపు కొద్ది పాటి సుగంధ ద్రవ్యాల తో చేసిన కషాయాన్ని రోజుకు ఒకటి లేదా రెండు  సార్లు టీ లాగా తాగడం చెయ్యాలి . సాధారణంగా లక్షణాలు  రెండు రోజుల్లో తగ్గిపోతాయి . జ్వరం ఉంటే డోలో 650 ఒకటి రెండు రోజులు వాడొచ్చు .  తగ్గని పక్షం లో డాక్టర్ ను సంప్రదించవచ్చు . ఆసుపత్రి లో చేరాల్సిన అవసరం ఉండదు . ఆక్సిజన్ అవసరం ఏర్పడదు . రుచి వాసన పోదు .

ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది జలుబు లాంటిది . ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోండి . ఒకటి రెండు రోజులు విశ్రాంతి చాలు . దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం ఓమిక్రాన్ సోకినవారు ఇంట్లోనే ఉండాలి అనే రూల్ తీసేసింది . సోకినా బయటకు వెళ్లొచ్చు . అందరికీ టెస్ట్ లు చేయడం,  ఒక వ్యక్తికి పాజిటివ్ వస్తే అతని కుటుంబ సబ్యులకు కూడా టెస్ట్ లు చేయడం లాంటివి అవసరం లేదని ఆ ప్రభుత్వం నిర్ణయించింది . ఇక్కడ మన ప్రభుత్వాలు ఎలాంటి నియమాలను తెస్తాయో చూడాలి . భాద్యత కలిగిన పౌరులుగా ప్రభుత్వ నియమాలను పాటిద్దాము . ఇలాంటివి మార్చ్ తరువాత ఇక ఉండవు.

కేసులైతే రోజుకు లక్షల్లో ఉంటాయి . కానీ ఆసుపత్రి కి వెళ్ళడాలు, అంబులెన్సు లు ఇలాంటి వి కనబడవు . టెస్ట్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు . చేసుకోకపోయినా నష్టం లేదు . రెండు మూడు   రోజుల్లో లక్షణాలు తగ్గిపోతాయి. ఓమిక్రాన్ వేవ్ చాలా ఉదృతంగా ఉంటుంది . అంటే కేసుల సంఖ్య  బట్టి ఉదృతం . అంతే కానీ డేంజర్ కాదు . ఓమిక్రాన్ వల్ల ప్రాణ నష్టం ఉండదు . కేసులు పెరుగుతున్నప్పుడు భయపెట్టే ప్రచారానికి దూరంగా ఉండాలి . భయం పెరిగితే స్ట్రెస్ వస్తుంది . అది గుండెపోటుకు దారి తీయొచ్చు .

ఓమిక్రాన్ కరోనా యొక్క శాంత స్వరూపం . ఓమిక్రాన్ దేవుడు లేదా ప్రకృతి ఇచ్చిన అద్భుత వాక్సిన్ . ప్రాణాలు తీయదు. పైగా ఆంటీ బాడీ లు,  టి సెల్స్ రక్షణ నిస్తుంది . ఆంటే కరోనా వేవ్ కు ఇది చివరి దశ . ఫిబ్రవరి కల్లా ఓమిక్రాన్ వేవ్ ముగుస్తుంది . మార్చ్ నుండి ఇక మన జీవితం లో లాక్ డౌన్ లు,  కట్టడి లాంటివి ఏమీ వుండవు . 2020 లో ప్రారంభం అయిన { చైనా లో 2019 లోనే } కోవిద్ 19 ముగింపు దశ లో మనం ఉన్నాము. ఆంటే ఇది కరోనా పాండెమిక్ నుంచి ఎండెమిక్ దశకు మారే సందర్భం . పండెమిక్ ఆంటే వ్యాధి వేగంగావిస్తరిస్తూ    ప్రాణహాని కలిగించే దశ . ఎండెమిక్ ఆంటే ప్రాణాలు హరించదు. మన చుట్టూరా ఎప్పటికీ ఉంటుంది .

మొదటి ప్రపంచ యుద్ధ ముగింపు కాలం లో,  ఆంటే 1918 లో స్పానిష్ ఫ్లూ మొదలయ్యింది . ఆ పాండెమిక్ లో అనేక మంది చనిపోయారు . కానీ రెండేళ్లకు అది ఎండెమిక్ గా మారిపోయింది . ఆ వైరస్ పోలేదు . H1N1 ఇన్ఫ్లుఎంజా- A  వైరస్ ఇంకా మన చుట్టూరా వుంది . అది  జలుబు కలుగ చేస్తుంది . మనం ఇన్నాళ్లు,  ఆంటే కరోనా రాక ముందు జలుబుకు భయపడ్డామా ? లేదు కదా . ఇప్పుడు కరోనా కూడా అలాగే అయిపొయింది . ఓమిక్రాన్ ఇక ఎప్పటికీ పోదు . మనకు సోకుతూనే ఉంటుంది . సోకినా భయపడాల్సింది ఏమీ లేదు .

జనవరి ఫిబ్రవరి నెలల్లో లక్షలాది కేసులు రావొచ్చు . ఆ నంబర్స్ చూసి భయపడొద్దు.

లక్షలాది ఓమిక్రాన్ కేసులు ఉన్నా అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో పాఠశాలలు కళాశాలలు నడుస్తూనే  వున్నాయి . కానీ మన దేశం లో పరిస్థితి వేరు . ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలు మూసెయ్యాలని ఆదేశం జారీ  చేసింది . దీని దారిలో ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం నడవొచ్చు . ఏదైనా ప్రభుత్వం ధైర్యంగా విద్య సంస్థలను నడపాలి అని భావిస్తే వాటి పై ఒత్తిడి పెరుగుతుంది . పాఠశాలలు , కళాశాలలు క్లోజ్ చేసే  దాక ఊరుకోరు . ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయో చూడాలి .

సంక్రాంతి సెలవుల తరువాత కొన్ని రోజులు కేవలం ఆన్లైన్ తరగతులు మాత్రమే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం  ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ లో సంక్రాంతి తరువాత కొద్ది రోజులపాటు విద్యాసంస్థలు మూసేస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఆ ప్రభుత్వం విద్య సంస్థలను నడపాలి అని పట్టుదలతో వ్యవహరించడం వల్ల మొదటి రెండు వేవ్ ల మధ్య సుమారుగా నాలుగు నెలలు ఆంధ్రప్రదేశ్ లో విద్య సంస్థలు నడిచాయి . మన దేశం లో ఇలా బోల్డ్ గా వ్యవహరించిన ఏకైక రాష్ట్రం ఏపీ. దాని వల్లే ఆంధ్ర ప్రదేశ్ పిల్లల పై కోవిద్ ప్రభావం తక్కువ . ఢిల్లీ లాంటి రాష్ట్రాలు సుమారుగా రెండుళ్లుగా బడులని మూసేసాయి . దీని వల్ల  పిల్లలకు అపార నష్టం జరిగింది  .

ఏది ఏమైనా మార్చ్ కి తిరిగి బడులు తెరుచుకొంటాయి . పరీక్షలు రద్దు  అయిపోతాయి అనే మూడ్ లో పిలల్లు వున్నారు . ఈ సారి పదవ తరగతి , ఇంటర్ లాంటి పరీక్షలు తప్పక జరుగుతాయి. పిలల్లకు చెప్పండి . చదువు గాడి తప్పితే తీవ్ర నష్టం. మిగతా క్లాసుల కు కూడా పరీక్షలు జరుగుతాయి . ఓమిక్రాన్ వేవ్ ఎంత వేగంగా వస్తుందో ఆంటే వేగం గా పోతుంది . మార్చ్ తరువాత ఇక పిల్లల చదువుకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. 2022  అందరి జీవితాల్లో వెలుగులు నింపబోతోంది. కేసులు, కట్టడి లాంటి మాటలు మార్చ్ తరువాత మనకు వినబడవు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 

Comments

Popular posts from this blog

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తో...