Skip to main content

భాగ్యలక్ష్మి ఆలయానికి ఇంపార్టెన్స్ అందుకేనా?

బీజేపీ నేతలు చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించుకోవడం చాలా ఇంట్రస్టింగ్ అంశంగా మారింది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచే హైదరాబాద్ ఓటర్లకు, బీజేపీ మద్దతుదార్లకు, హిందూ సమాజాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కూడా యోగి అమ్మవారిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఈసారి ప్రధాని మోడీ కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ దర్శించుకుంటారని భావించినా.. సమయాభావం వల్ల అది కుదరలేదని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. అంతకుముందు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా వినాయక నవరాత్రుల సమయంలో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. మరి.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. భాగ్యలక్ష్మి అమ్మవారినే ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకున్నారన్న ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. 

బీజేపీ నేతల హిడెన్ ఎజెండాలో హైదరాబాద్ పేరు మార్చే ప్రక్రియ ఉందన్న అభిప్రాయాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ నేతల సందర్శన కూడా అదే విషయాన్ని రుజువు చేస్తోంది. హైదరాబాద్ ను భాగ్యనగరంగా మార్చే అంశాన్ని బహిరంగంగా ప్రకటించకపోయినా.. బీజేపీ నేతల వ్యవహార శైలి మాత్రం అలాగే ఉందని నిపుణులు అంటున్నారు. చార్మినార్ వద్దనే గల భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రముఖ నేతలంతా దర్శించుకోవడం వల్ల భాగ్యలక్ష్మికి పాపులారిటీ వస్తుంది. జాతీయ మీడియా కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ పై ఫోకస్ చేస్తుంది. దీంతో చార్మినార్, హైదరాబాద్ వంటి అంశాలకు ప్రాధాన్యత క్రమంగా తగ్గుతుంది. ఇటు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యమైన సీట్లు గెల్చుకున్న బీజేపీ... జీహెచ్ఎంసీ కౌన్సిల్లో పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో కొంతవరకు ఇప్పటికే సఫలీకృతమైంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పరంగానూ ఎమ్మెల్యేల సంఖ్యా బలం పెంచుకునేందుకు కృషి చేస్తోంది. ఫలితంగా వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సిటీ మొత్తంగా వ్యాపించే పథకంతో ముందుకెళ్తోంది. ఈ అన్ని ఎన్నికల ఫలితాల ఆలంబనతో భాగ్యనగర్ మీద ఓ నిర్ణయం ఎప్పుడైనా తీసుకోవడానికి వీలుగా వ్యూహం రచిస్తోంది. మహారాష్ట్రలో శివసేన సంఖ్యాబలాన్ని తగ్గించి.. ఉద్ధవ్ చేతనే ఔరంగాబాద్ పేరు మార్చిన వైనాన్ని ఓసారి గుర్తు చేసుకోవాల్సిందే అంటున్నారు రాజకీయ నిపుణులు. 

అసలింతకీ.. భాగ్యలక్ష్మి అమ్మవారు కేవలం సెంటిమెంటేనా? లేక చారిత్రకంగా ఏదైనా ఇంపార్టెన్స్ ఉందా అన్న సందేహాలు కూడా ప్రజల్లోంచి వినిపిస్తున్నాయి. భాగ్యలక్ష్మి టెంపుల్ అనేది ఇటీవలి కాలంలో వచ్చిందేమీ కాదని, చార్మినార్ కట్టినప్పుడే అక్కడ అమ్మవారి ఆలయం ఉండేదని కొందరు స్థానికుల ద్వారా తెలుస్తోంది. కాబట్టి.. చార్మినార్ వైభవం కింద నలిగిపోతున్న భాగ్యలక్ష్మి అమ్మవారి అడుగుజాడల్ని మళ్లీ ఓసారి ప్రజలకు వివరించే ఉద్దేశంతో బీజేపీ నేతలు ముందుకెళ్తున్నారని స్థానికులు అంటున్నారు. అంతేకాదు.. చార్మినార్ నుంచి నగరం బయటకు వెళ్లడానికి అడుగున సొరంగ మార్గాలు కూడా ఉన్నాయని, స్వాతంత్య్రం వచ్చిన తరువాత వాటిని మూసివేశారని, ఆ సొరంగ మార్గాలపై అధ్యయనం చేయడానికి ఇటీవల కొద్ది నెలల క్రితం ఆర్కియలాజికల్ డిపార్టుమెంట్ అధికారులు సర్వే కోసం రంగంలోకి దిగినట్టు సమాచారం. అయితే అక్కడున్న కొందరు స్థానిక నాయకులు ఆర్కియలాజికల్ అధికారుల్ని బెదిరించి సర్వేను అడ్డుకున్నారని స్థానికులు చెబుతారు. ఒకవేళ ఆ ప్రక్రియ గనక పూర్తయితే బీజేపీ నేతల పేరు మార్చే ప్రక్రియకు మార్గం సులభమైనట్టేనని భావిస్తున్నారు. అందుకే బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు హైదరాబాద్ లో ఎప్పుడు పెద్ద ఉత్సవాలు జరిగినా.. చలో భాగ్యలక్ష్మి అంటూ పాత సెంటిమెంట్ దిశగా ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. 
బీజేపీ ఎజెండాలో అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఉందో.. అంతకన్నా ఎక్కువగా హిందూ సెంటిమెంట్ కే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. హిందూ సెంటిమెంట్లకు మూలం దేవాలయాలే. కాబట్టి దేవాలయాల పునరుద్ధరణ, దేవాలయాల సంస్కరణ, దేవాలయాలకు ప్రత్యేక ప్రతిపత్తి వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దేవాలయాల మీద ప్రభుత్వాల పెత్తనం తగ్గిస్తూ ఈ మధ్య కేంద్రం ఓ చట్టం కూడా తీసుకొచ్చింది. పలు రాష్ట్రాలు కూడా వివిధ స్థాయిల్లో చట్టం అమలు చేయడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో తెలంగాణకు తలమానికమైన హైదరాబాద్ లో టీఆర్ఎస్-మజ్లిస్ మైత్రీ బంధానికి గండి కొట్టేలా.. సామాజికవర్గాలకు అతీతంగా హిందూ ఓటర్లను తమవైపు ఆకర్షించుకునేలా భాగ్యలక్ష్మి టెంపుల్ ను ఎంచుకున్నట్టు చెబుతున్నారు. దీంతో భాగ్యలక్ష్మి టెంపుల్ రానున్న మరికొన్ని రోజుల్లో మరింత పాపులర్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు.

Comments

Popular posts from this blog

అన్ని సర్వేలూ అదే చెబుతున్నాయి.. ఒక్కటి తప్ప

ఓటరన్న తన పని తాను కానిచ్చేశాడు. తనను సంప్రదించిన పార్టీలతో ఏం మాట్లాడాలో అదే మాట్లాడాడు. మీట నొక్కాల్సిన చోట నొక్కాడు. నిశ్శబ్దంగా తన రొటీన్ వర్క్ లోకి వెళ్లిపోయాడు. మరి ఆ ఓటరు ఏ మీట నొక్కాడు.. ఎవరి మీటరు మార్చబోతున్నాడు.. ఎవరి తలరాత మారబోతుంది? మునుగోడులో ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏం చెబుతున్నాయి? ఆ కీలకమైన విషయాలు మీకోసం.  మునుగోడులో పరుగుపందెంలా మారిన ఉపఎన్నికలో హుజూరాబాద్ ఫలితం రిపీట్ కాకూడదన్న పట్టుదలతో టీఆర్ఎస్... మరో హుజూరాబాద్ లా మార్చేయాలన్న వ్యూహంతో బీజేపీ శ్రేణులు పనిచేశాయి. సర్వే సంస్థలు కూడా ఈ పోటీ తీవ్రతను అర్థం చేసుకొని.. అదే స్థాయిలో ఓటర్ల నాడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాయి. అత్యధిక సర్వే సంస్థలు టీఆర్ఎస్ గెలుస్తుందని అంచనా వేయగా.. ఒకటీ, అరా సర్వే సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి. ఆయా సర్వే సంస్థల రిపోర్టును ఆసరా చేసుకొని పార్టీలు కూడా గెలుపు తమదేననే ధీమాలో ఉన్నాయి.  థర్డ్ విజన్ రీసెర్చ్ నాగన్న ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ 48 నుంచి 51 శాతం ఓట్లు సాధిస్తుంది. బీజేపీ 31 నుంచి 35 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంటుందని పేర్కొంది. 13 నుంచి 15 శాత

శ్రీశైల క్షేత్రంలో ఫొటోలు తీయబడును

ఎంతో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడే గాక ప్రతి భారతీయుడు కూడా ఆసక్తి చూపుతాడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీశైల  మహా క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకే గాక అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే శ్రీశైలానికి ఉండే తాకిడి మామూలుగా ఉండదు. అయితే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఉన్నట్టుగానే శ్రీశైలంలో కూడా ఫొటోలు, వీడియోలు తీయరాదనే  నిబంధన  ఉంది. ఎవరైనా కెమెరాలతో, సెల్ ఫోన్లతో లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా చేస్తే వాటిని ఆలయ సిబ్బంది జప్తు కూడా చేస్తారు. భద్రతా కారణాల రీత్యా కూడా శ్రీశైలం విషయంలో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిబంధనలు మాత్రం పేరుకే స్ట్రిక్టుగా ఉన్నాయి గానీ.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనంటున్నారు భక్తులు.  ఎందుకంటే శ్రైశైలంలో దలారీ ఆనంద్ ను సంప్రదిస్తే ఎవరైనా, ఎక్కడైనా ఫొటో తీసుకోవచ్చు. అడిగినంత మొత్తం చెల్లిస్తే అమ్మవారి సన్నిధిలోనైనా, అయ్యవారి సన్నిధిలోనైనా.. ఎక్కడైనా సరే క్యాష్ పడేస్తే ఫొటో క్లిక

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో