Skip to main content

లేటు వయసులో రతన్ టాటా కొత్త ప్రాజెక్టు

లాభాపేక్షతో కాకుండా మానవీయ కోణంలో ఆలోచించే ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరో కొత్త కాన్సెప్టును అనౌన్స్ చేశారు. ఒంటరిగా బతుకులు వెళ్లదిస్తూ.. తమకోసం ఎవరూ లేక, తాము ఎవరికీ పట్టక తమలో తామే కుమిలిపోయే సీనియర్ సిటిజన్ల కోసం ఓ స్టార్టప్ సంస్థను ప్రారంభించారు. గుడ్ ఫెలోస్ పేరుతో ఈ స్టార్టప్ సంస్థ ఇప్పటికే ముంబైలో ప్రారంభమైంది. ముంబైలో పైలట్ ప్రాజెక్టు మాదిరిగా 20 మంది వృద్ధులకు సపర్యలు చేస్తూ.. వారికి శేష జీవితం ఎంతో ఆనందంగా సాగేలా ప్రాజెక్టు పనిచేస్తోంది. తదుపరి ఫేజ్ లో పుణే, చెన్నై, బెంగళూరుల్లో సేవలు ప్రారంభిస్తామన్నారు రతన్. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా వృద్ధుల కోసం పని చేసే యువకుల్ని తీసుకుంటారు. వారితో ఎంజాయ్ చేస్తూ, ఆడుతూ పాడుతూ.. మెరుగైన సమయం కేటాయించడం ఈ వర్క్ లో ముఖ్యోద్దేశం. క్యారమ్స్, చెస్ లాంటి ఇన్-హౌజ్ గేమ్స్ ఆడించడం, అవసరమైతే సీనియర్ సిటిజన్ల పక్కనే నిద్రించడం చేయాల్సి ఉంటుంది. ఈ స్టార్టప్ కోసం రతన్ టాటా పెద్దమొత్తంలోనే పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఎంతమొత్తం పెడుతున్నారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఆలనాపాలనాకు నోచుకోని వీధికుక్కల పట్ల కూడా రతన్ టాటా ఎంతో శ్రద్ధ చూపిస్తారు. తాజాగా ఆసరా లేని వృద్ధుల కోసం తన మదిలో మెదుల్తున్న ఆలోచనల్ని ఎంతో జాగ్రత్తగా పట్టాలమీదికి ఎక్కిస్తున్నారు రతన్‎టాటా. గుడ్ ఫెలోస్ ను శంతను నాయుడు ప్రారంభించారు. శంతనునాయుడు టాటా ఆఫీసులో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. 2018 నుంచి శంతనునాయుడు.. రతన్ కు సహాయకుడిగా ఉన్నారు. శంతను ఐడియాలజీ, కమిట్మెంట్ వంటి అంశాలతో తాదాత్మ్యం చెందిన రతన్.. తనలాగే ఒంటరి వృద్ధుల ఆనందం కోసం ఏదైనా చేయాలని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఇక గుడ్ ఫెలోస్ పనితీరు గురించి పూర్తిగా తెలియాలంటే ఇంకొద్ది కాలం వేచి ఉండాల్సిందే. 

Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.  జూన