అత్యంత వెనుకబడిన కులాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి మెప్పించిన కె.సి.కాళప్ప జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య నిరాడంబరంగా జరిగాయి. ఆదివారం హైదరాబాద్ బండ్లగూడలోని తన స్వగృహంలో కాళప్ప 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంబీసీల్లోని పలు కులాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. తమ కులాల అభ్యున్నతి కోసం కాళప్ప చేసిన కృషిని అంతా గుర్తు చేసుకున్నారు. కాళప్ప అనారోగ్యానికి గురైన తరువాత ఎంబీసీ ఎజెండా చలనం లేకుండా పోవడంపై పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం వరకు కాళప్ప పూర్తి ఆరోగ్యంగా ఉండి యావత్ ఎంబీసీల ఎజెండాను పరుగులు పెట్టించిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించి.. అందుకోసం సామాజిక అధ్యయనం చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టారు. ఆ సమయంలో బీసీల్లో ఉన్న మోస్ట్ బ్యాక్వార్డ్ క్యాస్ట్స్ (ఎంబీసీ) కు కూడా సమన్యాయం, సహజ న్యాయం జరగాలనే బలమైన వాయిస్ వినిపించారు కాళప్ప. బీసీల్లో ఉన్న దాదాపు నూటపాతిక కులాల్లో కేవలం 5
BHAGYANAGAR POST (BNP) news/views website is pride of Telugu People. It has un-detachable heartly bond with both the Telugu States. BNP covers Greater Hyderabad Political developments besides the cultural richness and social forwardness of Telangana and Andhrapradesh. Especially it contributes the dynamic political dimensions of Telugu Leaders.