Skip to main content

Posts

Showing posts from May, 2023

రైతు సమస్యలు పరిష్కరించకపోతే పెను ప్రమాదమే

రైతు సమస్యలు పరిష్కరించకపోతే సమాజం అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అది జరగకుండా ఉండేందుకు మీడియా చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని, రైతుల కోసం పనిచేసే సంస్థలు సంఘాలు ముఖ్యంగా బి కే ఎస్ - భారతీయ కిసాన్ సంఘ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు రైతుల కోసం ఎంతో శ్రమించాల్సి ఉందని సీనియర్ జర్నలిస్ట్ తాటికొండ రమేష్ బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రచార ఆయామ్ సమావేశము BKS రాష్ట్ర కార్యాలయం రాజపుత్ రెసిడెన్సి లో *ప్రాంత ప్రచార ప్రముఖ్  ల్యాగల శ్రీనివాస్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ శ్రీ సుదర్శన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ రమేష్ బాబు రాకల్లోకం యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ రాక సుధాకర్ హాజరయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ సమాచార విప్లవం వచ్చిన తర్వాత ప్రజలకు నేరుగా సమాచారం అందడం వలన ప్రజలు విజ్ఞానవంతులైనారు, కానీ సమాచారం అనేది పుస్తకాల రూపంలో పత్రికలు రూపంలో ఇంటర్నెట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నేడు అవసరమైన దానికంటే ఎక్కువ అందుబాటులో ఉన్నది. కానీ సరియైన సమాచారం  వినియోగించుకొని నూతనంగా

గ్రామ దేవతల కొలుపుతో పరవశిస్తున్న కమాన్‎పూర్

పెద్దపల్లి జిల్లా కమాన్‎పూర్ మండల కేంద్రంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. ఎవర్ని పలకరించినా గ్రామ దేవతల ఆరాధనా పారవశ్యంతో తడిసిముద్దయిన ఆనందమే తాండవిస్తోంది. కమాన్‎పూర్‎లో దాదాపు వారం రోజులపాటు జరిగే బొడ్రాయి ప్రతిష్టాపనా మహోత్సవం ఎంతో ఉత్సాహంగా జరుగుతోంది. భూలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవార్లను గ్రామ ప్రజలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో, సామూహిక వేడుకగా జరుపుకుంటున్నారు.  బొడ్రాయి ప్రతిష్టాపనా కార్యక్రమం అనేది దాదాపుగా తరానికి ఒకసారి జరుపుకుంటారని పెద్దల ఉవాచ. ఒకసారి అలాంటి వేడుక జరిగిన తరువాత మళ్లీ 3, 4 దశాబ్దాల తరువాత గానీ జరుపుకోవడం కుదిరే పని కాదంటారు అనుభవజ్ఞులు. దేశమైనా, గ్రామమైనా ఒక మనిషితో సమానమేనని భారతీయుల తాత్విక చింతన చెబుతుంది. మానవ ఆకారానికి నాభి ఎలాగైతే నవ నాడులకూ ఒక కేంద్ర బిందువుగా ఉంటుందో.. అలాంటిదే గ్రామానికి బొడ్రాయి కూడా. గ్రామం మధ్యలోనే ఈ శిలలను ఏర్పాటు చేస్తారు. అమ్మవార్ల అదే రూపాలను చెక్కబొమ్మలుగా తీర్చిదిద్ది ఉత్సవ విగ్రహాలుగా ఊరేగించడం ఆనవాయితీ. అమ్మవార్ల శుభాశీస్సులు, కరుణా కటాక్షాలు ప్రజలందరి మీదా సమానంగా ప్రసరించాలని వేడుకుంటారు. ఆ తరువాత ఊరంతా సామూహికంగా