Skip to main content

Posts

Showing posts from June, 2020

వామ్మో! కరోనా టెస్టుల కోసం ఇంత పెద్ద క్యూనా?

కరోనా పాజిటివ్ కేసులు రోజుకు దాదాపు వెయ్యికి చేరుకోవడంతో మరోసారి లాక్ డౌన్ విధిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ప్రభుత్వం సీరియస్ గా చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్య ఇలా ఉంటే అసలు టెస్టుల కోసం ఎంత మంది క్యూలో ఉన్నారో చూస్తే జడుసుకోవాల్సిందే. సికింద్రాబాద్, తిరుమలగిరిలో విజయా డయాగ్నొస్టిక్స్ ముందు టెస్టుల కోసం ఎంత మంది లైన్ కట్టారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.  అంతేకాదు.. అసలు అనుమానంతో క్యూలో ఉన్నవారి సంగతలా ఉంచితే.. క్యూలో ఉన్నవారికే కరోనా ఉంటే అది లేనివారికి కూడా సోకే పరిస్థితి దాపురించింది. ఎవరు దీన్ని ఆపాలి.. ఎలా ఆపాలి... ఎక్కడ బ్రేక్ పడుతుందో ఆ దేవుడికే తెలియాలని సామాన్య ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 

కరోనా కొమ్ములు విరిచే కిల్లర్- వీడియో

భారతీయ ఆయుర్వేదం అనే అమ్ములపొదిలో గాండీవాల్లాంటి అనేక చిట్కాలున్నాయి. అందులో ఒకటే పసుపుకొమ్ముల ఆవిరి. పసుపుకొమ్ముల ఆవిరి ఎలా చేయాలంటే.. ఒక పాత్రలో నీళ్లు తీసుకొని అందులో తగినన్ని పసుపుకొమ్ములు వేసి బాగా మరిగించాలి. ఆ ఆవిరిని బాగా పట్టాలి. కరోనా రాకుండా నిరోధించడానికి ఇది అద్భుతంగా పని చేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.  ఆవిరి పట్టడం ఇలా.. ఆవిరి పట్టడంలోనే మనకు మంచి రిలీఫ్ వస్తుంది. ముక్కునుండి పీల్చుకొని నోటిద్వారా 3 సార్లు, నోటి నుంచి పీల్చుకొని ముక్కుద్వారా 3 సార్లు.. ఇలా మార్చి మార్చి ఒక పదిసార్లు పడితే యాంటీ బ్యాక్టీరియాతో కూడిన వేడిఆవిరి ఊపిరితిత్తుల్లోకి, ముక్కు నాళాలు, శ్వాసకోశ నాళాల గుండా వెళ్తుంది. ఆవిరి వేడికి కరోనా వైరస్ చనిపోతుంది. వాస్తవానికి కరోనా అనేది వైరస్ కూడా కాదని, అది కేవలం ప్రొటీన్ మాత్రమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. అది సింగిల్ గా ఉన్నప్పుడు నిర్జీవం.. ఏమీ చేయదు. ఆ వైరస్ కాస్తా మన చేతుల నుంచి ముక్కు, నోరు, కళ్లు.. ఇలాంటి అవయవాల ద్వారా లోపలికి వెళ్తే అది శ్వాసకోశ నాళాలు లేదా ఆహారవాహిక ద్వారా గోడలకు అంటుకుంటుంది. దానికుండే కొమ్ముల కారణంగా అది ఆ గోడలకు పట్టుకుని

బై డాడీ - ఆఖరి మాటల సెల్ఫీ వీడియో

ప్రాణం విడుస్తూ ఓ యువకుడు తీసిన వీడియో తెలుగు మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ చెస్ట్ హాస్పిటల్ లో కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటున్న యువకుడికి అకస్మాత్తుగా వెంటిలేటర్ తీసేశారని స్వయంగా బాధితుడే సెల్ఫీ వీడియో తీసుకొని తండ్రిని ఉద్దేశించి చివరిమాటలు మాట్లాడటం రాష్ట్రంలో కరోనా భయంకర రూపం దాలుస్తున్న విషయాన్ని కళ్లకు కట్టింది. డాడీ.. నాకు ఊపిరాడ్తలేదు డాడీ.. వద్దనంగా వెంటిలేటర్ తీసిండ్రు. మూడు గంటలైతంది డాడీ.. నా గుండె ఆగిపోయింది. కిడ్నీ ఫెయిలైంది. ఊపిరొక్కటే ఆడ్తంది.. ఇప్పుడు అది గూడ అయిపోయింది డాడీ.. బాయ్ డాడీ.. బాయ్. ఇవీ ఆ యువకుడి చివరి మాటలు.  కరోనా ఉధృతిని, దాని వ్యాప్తిని అత్యంత ముందుచూపున్న నేతలుగా పేరున్నవారు కూడా అంచనా వేయలేకపోయారు అనడానికి ఇది మరో నిదర్శనం. మొన్న 28 ఏళ్ల యువ జర్నలిస్టు మనోజ్ గాంధీలో చికిత్స సరిగా అందక చనిపోవడం మరుపునకు రాకముందే మరో నవయువకుడు కరోనా కోరలకు చూస్తూ చూస్తూ బలైపోవడం ప్రజలకు జీర్ణం కాని విషయం. కరోనా అనేది తెలంగాణకు రమ్మన్నా రాదు.. నీ దండం బెడ్తా రావే అంటె గూడ రాదు.. అన్న మాటల్ని ఓసారి మననం చేసుకుంటే మన నేతలు కరోనా విషయంలో ఎ

రేవంత్ డిమాండ్- తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని లేకపోతే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. టెస్టులు పెంచాలని ఐసీఎంఆర్ చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వం చేసే అంతంత మాత్రం టెస్టుల్లోనే రాష్ట్రంలో 32.1 శాతం మేరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో కరాళ నృత్యం చేస్తుందో ఈ పర్సెంటేజీలే నిదర్శనం అన్నారు. లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం కాంగ్రెస్ ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వెనుక కేసీఆర్ ఒత్తిడే ఉందని, ప్రభుత్వ, ప్రైవేటు వైద్య వ్యవస్థలను సమీకృతం చేసి కరోనాను ఎదుర్కొనే ప్రణాళిక రచించాలని రేవంత్ సూచించారు. కరోనా విషయంలో కేసీఆర్ సర్కారు మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వీఐపీల ప్రాణాలకు ఇస్తున్న విలువ పేద-మధ్యతరగతికి ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం కంటే స్మశానానికి వెళ్లడం మేలు అన్న నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వస్తున్నారన్నారు. సీతక్క సలహా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఎగ

మూడు, నాలుగు రోజుల్లో కరోనా వ్యూహం ఖరారు-కేసీఆర్

జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజులపాటు తిరిగి లాక్ డౌన్ విధాంచాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం చెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీ లేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, దాని నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. Also Read: బై డాడీ - ఆఖరి మాటల సెల్ఫీ వీడియో వైద్యఆరోగ్య శాఖ

పీవీని స్మరించుకున్న తెలంగాణ జనత

  భారతదేశానికి ఓ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ఓ మారుమూల గ్రామంలో పుడతాడని, అందులోనూ భారత ప్రధాని వంటి అత్యున్నత పదవికి పోటీపడే ఉత్తరభారతంలోని ఉన్నతమైన కుటుంబాల రాజకీయ పోటీని తట్టుకొని.. దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని కాబోయే వ్యక్తి పుడతాడని ఎవరైనా ఊహించగలరా? కానీ పాములపర్తి వేంకట నరసింహారావు అలియాస్ పీవీ నరసింహారావు విషయంలో అది నిజమైంది. ప్రజలందరూ ముద్దుగా పిలుచుకునే పీవీ రాజనీతి దేశంలోనే కాదు.. ఖండాంతరాలు కూడా వ్యాపించింది. ఎందుకంటే.. ఆయనకు అంత ఖ్యాతి వ్యక్తిగతమైన స్వచ్ఛత, సౌశీల్యతల వల్ల వచ్చింది కాదు. దేశ ప్రజలు మెచ్చిన పాలనా సంస్కరణలు, ఆర్థిక సంస్కరణల వల్ల వచ్చింది. రాజకీయ చాణిక్యుడు... భారత ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు. ప్రాంతం ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యం అనే సిద్ధాంతంతో పాలన సాగించిన రాజనీతికోవిదుడు.. తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్ది పట్టాలెక్కించిన ప్రధాని ఆయన. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలపాటు విజయవంతంగా నడిపించి రికార్డు సృష్టించిన ప్రధాని కూడా ఆయనే.  వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్మాబాయి,  సీతారామారావు

ఓ కోతిని కొట్టి చంపి, మరో కోతిని ఉరేసి.. వైరల్ వీడియో

  ప్రకృతి మీదనే ఆధారపడి బతుకుతున్న మనిషి.. ఆ ప్రకృతి వైవిధ్యాన్ని మాత్రం కాపాడటం లేదు. పైగా మూగజీవాల పాలిట రాక్షసుడిగా మారుతున్నాడు. కరోనా వంటి మహమ్మారి మానవాళిని శాసిస్తున్నా కూడా ఇతర ప్రాణుల పట్ల కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. మానవత్వం మరచి అడవి జంతువుల  కన్నా హీనంగా వ్యవహరిస్తున్నాడు.  ఖమ్మం జిల్లా జిల్లా వేంసూర్ మండలంలో మానవ సమాజం అసహ్యించుకునేలా ఓ కోతిని ఉరేసి చంపారు కొందరు ప్రబుద్ధులు. సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యం చక్కర్లు కొడుతున్నా కూడా సంబందిత అటవీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.పైగా ఇదేంటని ప్రశ్నించినవారికి దురుసుగా సమాధానం ఇస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం అమ్మపాలెం గ్రామంలో ఈ ఘటన జరిగింది.  సాధు వెంకటేశ్వరావు, పాస్టర్ జోసెఫ్ రాజ్ ఇళ్ళ సమీపంలో ఓ నీటి తొట్టిలో వానరం పడిపోయి కొట్టుమిట్టాడుతోంది. మానవతా దృక్పథంతో కోతిని కాపాడాల్సిన వారిద్దరూ వానారాన్ని కర్రలతో కొట్టి చంపి బయట పడేశారు. చనిపోయిన వానరం వద్దకు మరికొన్ని కోతులు రావటంతో జోసెఫ్ రాజ్, వేంకటేశ్వరావు మరో కోతిని పట్టుకుని సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసి కుక్కలతో కరిపిస్తు హతమార్చారు

జయశంకర్ ను స్మరించుకున్న నేతలు, విశ్వబ్రాహ్మలు

  నువ్వు నాయకుడు అవుదామనుకున్న ప్రతిరోజూ నీకు పదిమంది వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉంటారు. అదే నువ్వు పది మంది నాయకులను తయారు చేస్తే నీ లక్ష్యానికి వాళ్లంతా తోడుగా నిలిచి  నిన్ను నాయకుడిని చేస్తారు. - కొత్తపల్లి జయశంకర్, ప్రొఫెసర్ ------------------ యావత్ తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సమావేశాలు జరిగాయి. అయితే లాక్ డౌన్ కారణంగా పెద్దఎత్తున సభలు, సమావేశాలను ఎవరూ ఏర్పాటు చేయకపోయినా.. పలువురు టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఇతర యాక్టివిస్టులు, అటు విశ్వబ్రాహ్మణ సంఘాల నేతలు విడివిడిగా ఎవరి ఇళ్లలో వారే నివాళులు అర్పించి జయశంకర్ సార్ తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి విజయం సాధించి ప్రజలకు అప్పగించి అనంత లోకాలకేగిన జయశంకరుడు ఆశించిన ఫలాలు మాత్రం సమాజానికి అందడం లేదని, జయశంకరుడి జాతికే చెందిన విశ్వకర్మలు మరీ అణచివేతకు గురవుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ జాతి స్వేచ్ఛ కోసం పోరాడిని జాతి ప్రజలే ఇవాళ ఆకలితో అలమటిస్తున్నారని పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.  ఆచార్య జయశంకర్ సార్‌కు నివాళుర్పించిన రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాం

జయశంకర్ సార్ స్ఫూర్తితో పోరాటాన్ని కొనసాగిద్దాం

తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఉప్పుగూడలో స్థానిక విశ్వబ్రాహ్మణులు జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ కోసం సర్వస్వాన్ని అర్పించడమే గాక, ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న జయశంకర్ సార్ సేవలను కొనియాడారు. ఆయన జీవితంలో తెలంగాణ సాకారాన్ని చూడకపోయినా... కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రావడం చూసి ఆయన ఎంతో ఆనందించారని సమావేశానికి హాజరైన సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఆ విధంగా తెలంగాణను ఇక ఎవరూ ఆపలేరని అందరితో చెప్పిన జయశంకర్ సార్.. అదే ఆత్మవిశ్వాసంతో కడదాకా ఉన్నారన్నారు.  ఆయన మాత్రమే గాక తెలంగాణ కోసం తొలిసారి బలపీఠమెక్కి.. ఉద్యమాన్నని రగిలించిన శ్రీకాంతాచారి వంటి ఎందరో విశ్వకర్మల త్యాగాల ఫలితంగానే తెలంగాణ సాధ్యమైందని గుర్తు చేసుకున్నారు. అలాంటి విశ్వకర్మల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో అదే విశ్వకర్మలు ఇవాళ ఆకలితో అలమటిస్తున్నారని, అయినా అన్ని వర్గాలకు ఎంతో కొంత సాయం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మాత్రం విశ్వకర్మల పట్ల వివక్ష చూపుతుందని విమర్శించారు. ఇకనైనా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సమాజం పోరాటాలకు ముందుకొచ్చి తమ హక్కులు సాధించుకోవాలని పిలుపుని

కొత్త కమిటీలతో విస్తరిస్తున్న విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్

దేశ చరిత్ర నిర్మాతలైన విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మలకు వారి నేపథ్యంపై సంపూర్ణమైన అవగాహన కల్పించేందుకు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ పని చేస్తోందని, ఈ క్రమంలో ఆ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తున్నామని వీకేసీ జాతీయ కార్యదర్శి జైన్ కుమార్ ఆచార్య చెప్పారు. ఇందులో భాగంగా తెలంగాణలో నియోజకవర్గ స్థాయిలో ఆ సంస్థ కమిటీలు వేస్తున్నామని ఆచార్య జైన్ తో పాటు వీకేసీ రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిళ్ల వేణుఆచార్య చెప్పారు. తాము ఎంపిక చేసిన నాయకులకు నియామక పత్రాలు అందజేశామని వారన్నారు. వీకేసీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దాసోజు నాగభూషణం, గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్లుగా సింగోజు శశిధర్, మామిడాల వెంకీ ఆచార్య, గ్రేటర్ హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా చెలకుర్తి విష్ణు, గ్రేటర్ హైదరాబాద్ గోషామహల్ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా చెన్నోజు ప్రదీప్ కుమార్ తదితరులను నియమించినట్లుగా వారు చెప్పారు. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న బాధ్యులు భాగ్యనగర్ పోస్టుతో మాట్లాడుతూ విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ అభివృద్ధికి, విశ్వకర్మీయుల్లో చైతన్యానికి తమవంతుగా కృషి చేస్తామని చెప్పారు. తమపై నమ్మకం ఉంచి కీలకమైన బాధ్యతలు అప్పగించ

రోడ్డు మీద పడ్డ అత్యంత వెనుకబడ్డ కులాలు

- కె.సి.కాళప్ప, జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు     9848451544   భారత ప్రజలకు స్వాతంత్య్రం రాకముందు కులవృత్తులు చేసుకునే ప్రజలు ఎంతో గౌరవంగా బతికారు. ఆదాయం పెద్దగా లేకపోయినా సమాజమంతా వారి వృత్తుల మీదనే ఆధారపడి నడిచినందువల్ల ఆయా వృత్తి కులాల్లో ఆకలికేకల జాడ కనిపించలేదు. ఉన్నంతలో సంతృప్తిగానే కుటుంబాలు వెళ్లదీసుకున్నారు. మిగతా ఉన్నతవర్గాలతో, ధనవంతులతో పోల్చుకుంటే వారు పేదరికంలోనే  ఉన్నప్పటికీ స్వయంసమృద్ధిగానే వృత్తిపని సమాజం బతికింది. ఈ పరిస్థితి స్వాతంత్య్రం తరువాత దాదాపు నాలుగు దశాబ్దాలపాటు కూడా కొనసాగింది. 1990ల్లో ఆర్థిక సంస్కరణలు మొదలైన తరువాత వృత్తిపని సమాజంలో ఒక్కసారిగా పెనుమార్పులు సంభవించాయి. చేతివృత్తులు రోజురోజుకూ పూర్తిగా కనుమరుగైపోతూ విశాల ప్రపంచం నుంచి అనేక అవసరం లేని వస్తువులు సైతం మన ఇళ్లను ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో మన దేశ చేతివృత్తులు చేసుకునే ప్రజలకు ఆదరువు లేకుండాపోయింది.  ఈ పరిస్థితులు ఇలా ఉంటే కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ఐదో దఫా లాక్ డౌన్ నడుస్తోంది. లాక్ డౌన్ లో సడలింపుల కారణంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది. ఇప్పటికే రెండు నెలలకు పైగా ఉ

విశ్వబ్రాహ్మల ఆకలి కేకలు వినండి

పనికి ముందుండి తిండికి వెనకుండే విశ్వబ్రాహ్మలను ఆదుకోవాలని, ఈ సమాజ నిర్మాణంలో వారి పాత్రను గుర్తించి కష్టకాలంలో ఆదుకోవాలని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు, ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ - విశ్వకర్మ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చేపూరి లక్ష్మణాచారి ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. కరోనా విజృంభించి, లాక్ డౌన్ విధించిన తరువాత అందరికంటే ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులే జీవనోపాధి కోల్పోయారని, పనులు చేయించుకునేవారు లేక జీవనోపాధి కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. కిరాయి ఇళ్లు, ఇరుకైన ఇళ్లలో పిల్లాపాపలతో జీవించడం ఎంతో కష్టంగా ఉందని, తెలంగాణ ఆవిర్భావానికి ముందు కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇకనైనా పూర్తి చేసి పేదలకు కనీస వసతులు సమకూర్చాలని లక్ష్మణాచారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం సిద్ధించి ఆరేళ్లు పూర్తయినా విశ్వబ్రాహ్మలకు ఎలాంటి ప్రభుత్వ పథకాలూ అందలేదన్నారు. ఎన్నికలకు ముందు రుణాలు ఇస్తామన్న కేసీఆర్ ఎన్నికలు పూర్తయ్యాక కనీసం తాము పెట్టుకున్న అప్లికేషన్ల స్టేటస్ ఏంటో కూడా తెలిపే పరిస్థితి లేదన్నారు. కనీసం తమకు లోన్లు ఇచ్చినా ఏదో రకంగా ఈ కరోనా కష్టకాలాన్ని అధిగమించేవారమన్నారు.

పోరాట యోధులకు ప్రశంసా పత్రాలు

కోవిడ్-19 వైరస్ విసిరిన సవాలును ఎదుర్కొనేందుకు ముందు వరుసలో ఉండి పోరాడిన యోధులను ప్రోత్సహించేందుకు ప్రణవి ఫౌండేషన్ ముందుకొచ్చింది. అన్నార్తుల ఆకలిబాధలు తీర్చినవారైనా, నగదు సాయం చేసి ఆదుకున్నవారైనా, స్లమ్ ఏరియాల్లో ఉండే పేదలకు అందుబాటులో ఉండి అవగాహన కల్పించినవారైనా.. ఇలా ముందువరుసలో ఉండి తమదైన కర్తవ్యం స్వచ్ఛందంగా నిర్వహించినవారిని భుజం తట్టి ప్రోత్సహిస్తున్నట్టు ప్రణవి ఫౌండేషన్ అధ్యక్షులు జైన్ కుమార్ చెప్పారు. ఇందుకోసం ప్రజాసేవలో స్వచ్ఛందంగా పనిచేసిన ఎవరైనా తాము పనిచేసినట్టు రుజువుగా చూపే ఒక ఫొటోతో పాటు వారి పాస్ పోర్టు సైజు ఫొటోను కూడా తమకు మెయిల్ చేయాలని కోరారు. అదే మెయిల్ ఐడీకి ప్రశంసాపత్రాన్ని పంపిస్తామన్నారు. మెయిల్ ఐడీ- pranavifoundation@gmail.com గా చెప్పారు.  ఇదే క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ, మెకానికల్ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆరకంటి కృష్ణయ్యకు జైన్ కుమార్ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కుటుంబాన్ని, వ్యక్తిగత పరిమితులను లెక్కలోకి తీసుుకోకుండా కరోనాకు వ్యతిరేకంగా పోరాడారని జైన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జి.శ్రీకాంత్ కూడా పాల్గొన్నార

మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తారా? 

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. మరో దఫా లాక్ డౌన్ మరింత పకడ్బందీగా విధించడం తప్ప మార్గం లేదని అనేక వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయం మీద అటు సోషల్ మీడియాలో సైతం విపరీతంగా ప్రచారం సాగుతోంది. మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తే తప్ప ప్రజలకు రక్షణ లేదని, కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతన్న క్రమంలో లాక్ డౌనే శరణ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అటు కేంద్రం కూడా ఇదే విషయాన్ని సీరియస్ గా చర్చిస్తోందని, జూన్ 15 తరువాత గానీ, కాస్త అటుఇటుగా గానీ లాక్ డౌన్ విధించడం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ఈ క్రమంలోనే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని.. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మకూడదని ప్రజలకు సూచించింది. ఏదైనా నిర్ణయం తీసుకుంటే కేంద్రం ప్రభుత్వమే స్వయంగా వెల్లడిస్తుందంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో మరో దఫా సంపూర్ణ లాక్ డౌన్ వార్తలు పుకార్లేనని తేల్చినట్లయింది.  ఆందోళనకరంగా కేసులు భారత్ లో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. రోజుకు 9 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడల

ప్రభుత్వం ఇవ్వకపోతే ఏం.. మేమున్నాం..

మీడియా పట్ల పూర్తి వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కారు మీద విమర్శలేం చేయకుండానే పలువురు సెలబ్రిటీలు, సీనియర్ జర్నలిస్టులు తమ చేతనైన సాయం చేస్తామని ముందుకొచ్చారు.  నా వంతు సాయంగా రూ. 25 వేలు       - పోసాని కృష్ణ మురళి, నటుడు జర్నలిస్ట్ మనోజ్ మృతి కి చింతిస్తున్నా. నా తరుపున 25 వేల  రూపాయల ఆర్థిక సహాయంజేస్తా. సినిమా షూటింగ్స్ ప్రారంభమయితే మళ్ళీ రూ. 25 వేలు సహాయం చేస్తా. మీడియా ప్రజలందరికీ సర్వీస్ చేసే రంగం. సినిమా పరిశ్రమ కూడా మనోజ్ కుటుంబానికి సహాయం చేయాలి. నా వంతు సాయం రూ. 10 వేలు - సీనియర్ జర్నలిస్టు, దేవరకొండ కాళిదాస్ కరోనా సమయంలో జర్నలిస్టులను విస్మరిస్తున్నారని మొదటినుంచీ నెత్తి, నోరు కొట్టుకొని చెబుతూనే ఉన్నాం. అనుకున్నంతా జరిగింది. ఇంకా జరిగే అవకాశాలూ ఉన్నాయి. డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులతో పాటు ఫ్రంట్ వారియర్లుగా జర్నలిస్టులూ పనిచేస్తున్నారు.. అయితే వారికివ్వాల్సిన  ప్రోత్సాహకాలు మాత్రం  కల్పించబడలేదు.  ఈ విషయాన్ని స్వయంగా సీఎం గారిని అడిగితే మీడియా అకాడమీ నుంచి ఎలాంటి అభ్యర్థనా రాలేదని బహిరంగంగా ప్రెస్ మీట్ లోనే చెప్పారు. లోపం ఎక్కడ జరిగిందనేది ఇక్కడ ప్రధ

మనోజ్ లాస్ట్ మెసేజ్

  ఎప్పుడూ ఏదో ఒక మెసేజ్ ఇచ్చే జర్నలిస్టు మనోజ్ ఫోన్ ఇక మోగదు. ఫోన్ మీద మెసేజ్ టైప్ చేసే వేళ్లు చలనం లేకుండా పడి ఉన్నాయి. టీవీలో ఫోన్-ఇన్ లేదా లైవ్ ఇచ్చే ఆ గొంతు శాశ్వతంగా వినపడదు. ఆ మొహం ఇక శాశ్వతంగా కనపడదు. రిపోర్టర్ గా స్క్రీన్ మీద నీట్ గా కనిపించే మనోజ్... ఆఫ్ లైన్లో ఇచ్చే మెసేజ్ లు చాలా విలువైనవి. ఇలాంటి క్రైమ్ రిపోర్టర్లు సేకరించే సమాచారమే చానల్ యాజమాన్యాలను కవరేజ్ విషయంలో ముందుంచుతుంది. ఆ వేగమే, ఆ ఎక్స్ క్లూసివ్ నెస్సే రిపోర్టర్లను ఉన్నకాడ ఉండనీయదు. ఏదో  కొత్త కబురు తేవాలి.. ఇంకేదో ఎవరికీ తెలియని విషయాన్ని తన చానల్లో, తన ద్వారా ప్రజలకు చేరవేయాలి... తానేంటో నిరూపించుకోవాలి... మేనేజ్ మెంట్ దగ్గర గుడ్ బుక్స్ లో చోటు సంపాదించుకోవాలి... బ్యూరో చీఫ్, ఇన్ పుట్ ఎడిటర్, ఎడిటర్, చైర్మన్ లకు తానిచ్చే ఇన్ పుట్స్ కీలకమని తెలియాలి. అందుకోసమే ఏ జెన్యూన్ జర్నలిస్టయినా ఎన్ని మైళ్లయినా పరుగులు తీస్తాడు. అదే చేశాడు మనోజ్. ఆ పరుగులు తీస్తున్న క్రమంలోనే కన్నుమూశాడు. మనోజ్.. జర్నలిజం వృత్తిలో భాగంగా మేనేజ్ మెంట్ కు అవసరమైన ఇతర కీలకమైన పనులే చేసేవాడని తెలుస్తోంది. అంటే మేనేజ్ మెంట్ కు చాలా దగ్గరి మనిషన