Skip to main content

Posts

Showing posts from April, 2022

కవులకు, సామాజికవేత్తలకు ఉగాది పురస్కారాలు

నటనం, నాట్యం... కళారూపం ఏదైనా దానికి ప్రేరణ మాత్రం కవిత్వమే. కవి హృదయం ఆవిష్కరించిన పొందికైన మాటలే కళాకారులు కట్టిన గజ్జెలకు ప్రాణం పోస్తాయి. నాట్యగత్తెలకు ప్రేరణనిస్తాయి. అలాంటి కవిత్వానికి పెద్దపీట వేసే ఉద్దేశంతో, కవులను సన్మానించుకునే సంకల్పంతో చిదంబర నటరాజ కళానిలయం వ్యవస్థాపకురాలు, నృత్యగురువు మంజుల ఉగాది పురస్కారాలు అందజేశారు. ప్రముఖ కవులకు, ప్రముఖులైన కవితాభిమానులకు శాలువాలు కప్పి సన్మానించి తన కవిత్వ సేవను చాటుకున్నారు. చిదంబర నటరాజ కళానిలయం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పలువురు కవులు, సామాజిక కార్యకర్తలకు ఉగాది పురస్కారాలు అందజేశారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సముద్రాల వేణుగోపాలాచారి, ప్రముఖ సినీ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ నటుడు  సమీర్, నిలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ (రిటైర్డ్) డాక్టర్ రామకృష్ణ, బి.కేశవులు, మురహరి,  విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు   చేపూరి లక్ష్మణాచారి, కేశంపేటకు చెందిన ఎం.సతీశ్ హా...

కొత్తగా తయారవుతున్న మావోయిస్టుల హిట్ లిస్ట్

ఎన్.ఐ.ఎ... నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అంతర్గత శాంతిభద్రతల కోసం నిరంతరం పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ. తీవ్రవాదులు, ఉగ్రవాదుల కదలికలపై పూర్తి నిఘా పెట్టి వారిని మట్టుపెట్టే పకడ్బందీ సంస్థ. దాని వెబ్ సైట్ లో వివరాలు కూడా ఎప్పటికప్పుడు అప్-డేట్ చేస్తూంటారు. అయితే కొందరు కీలకమైన మావోయిస్టు నేతలు చనిపోయి చాలాకాలం అవుతున్నా.. వారి పేర్లను మాత్రం ఇంకా తొలగించలేదు. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్.కె... ఆయన మావోయిస్ట్ కేంద్రకమిటీ సభ్యుడిగా పని చేశారు. ఇక యాపనారాయణ అలియాస్ హరిభూషణ్. ఈయన మావోయిస్ట్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. అయితే గత సంవత్సరమే వారు చనిపోయారు. అయినా ఎన్.ఐ.ఎ మాత్రం వారి పేర్లను ఇంకా మోస్ట్ వాంటెడ్ జాబితాలోనే ఉంచింది.  ఆర్కే, హరిభూషణ్ తో పాటు మరికొందరు తెలుగువారు కూడా ఎన్.ఐ.ఎ. హిట్ లిస్టులో ఉన్నారు. ఈ సంవత్సరం మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నవారిపై రివార్డులు పెరుగుతాయని పోలీసు శాఖ చెబుతోంది. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్లవారీగా తాజా లిస్టును ఎన్.ఐ.ఎ. సేకరిస్తోంది. తాజా లిస్టులో ఇంకా ఎవరున్నారనేది ఆసక్తికరంగా మారింది. యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌.. తెలంగాణలోన...

కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా?

తెలంగాణ నూతన సచివాలయం దాదాపుగా పూర్తయింది. వచ్చే దసరా నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని సర్కారు భావిస్తోంది. దేశంలోనే అత్యంత అధునాతన పరిజ్ఞానంతో వందేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నిర్మాణ బాధ్యతలను షాపూర్ జీ పల్లోమ్జీకి అప్పగించారు. ఇక ఖర్చు విషయానికొస్తే... మొదట 400 కోట్లతో పూర్తవుతుందనుకున్నారు. కొద్ది రోజుల‌కే ఆ అంచ‌నాల‌ు 619 కోట్లకు పెరిగాయి. ఆరు ఫ్లోర్లు, ఆరు లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ నిర్మాణానికి 400 కోట్ల రూపాయలు అవుతుందని తొలుత లెక్క‌లు క‌ట్టారు. అయితే ఆ తరువాత ఒక ఫ్లోర్ పెంచారు.. అంటే మరో లక్ష చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యం యాడ్ అయింది. దీంతో అంచనా వ్యయం ఏకంగా 219 కోట్ల రూపాయలు పెరిగింది. ఇక పనులు పూర్త‌య్యే నాటికి వెయ్యి కోట్లు దాటే అవకాశం ఉందంటున్నారు అధికారులు.  సచివాలయ నిర్మాణం ప్రారంభం నుంచి కరోనాతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాజిటివ్ కేసులు విపరీతంగా పెరగడంతో బిహార్, ఒడిశా , ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల నుండి రెండు వేల మందికి పైగా కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో పనులు కొద్ది రోజులు మందకొడిగా జర...

'తానా' కవి సమ్మేళనానికి ఎంపికైన జె.వి.కుమార్ చేపూరి

తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు"  పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత”  అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.  Also Read:  కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, మ...

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వ...

18 రోజుల్లో 5 కేసులు సీబీఐకి అప్పగించిన హైకోర్టు

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ముఖ్యంగా శాంతిభద్రతల విషయంలో అక్కడి ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని, అందుకనే కేవలం 18 రోజుల్లో 5 కేసులను హైకోర్టు సీబీఐకి అప్పగించిందంటున్నారు నిపుణులు. ఫైర్ బ్రాండ్ సీఎం మమతా బెనర్జీ పరిపాలనా శైలి వివాదాస్పదంగా మారుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ అధ్వానంగా తయారైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన 18 రోజుల్లో కోల్ కతా హైకోర్టు 5 కేసులను సీబీఐకి అప్పగిస్తూ విచారణకు ఆదేశించడం అరుదైన విషయమని, ఇలాంటి పరిస్థితి గతంలో ఏ రాష్ట్రంలో కూడా తలెత్తిన దాఖలాల్లేవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 వరకు 5 కేసులను కోల్ కతా హైకోర్టులోని వేర్వేరు డివిజన్ బెంచ్ లు సీబీఐకి అప్పగిస్తూ దర్యాప్తుకు ఆదేశించాయి. ఆ 5 కేసుల్లో కొన్ని గతంలో సింగిల్ జడ్జి విచారించిన కేసులు కూడా ఉండండం గమనార్హం. తాజాగా మంగళవారం నదియా జిల్లాలో ఓ మైనర్ పై జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసును హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐకి అప్పగిస్తూ ఆదేశించడం మమతకు రాజకీయంగా ఇబ్బందికరంగా పరిణమించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 14 ఏళ్ల బాలికపై ...

ఇమ్రాన్ ఇండియాను ఎందుకు పొగిడాడు?

పాపం.. పాక్ లో ఇమ్రాన్ పరిస్థితి పైనే ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. తాను గెలిచి దేశాన్ని ఓడించాడా? లేక తాను ఓడి దేశాన్ని గెలిపిస్తున్నాడా? ఈ చిక్కు ప్రశ్నలకు మూలాలెక్కడున్నాయో మనకే కాదు.. ఇమ్రాన్ కి కూడా అర్థం కావడం లేదు. అలాగే ఇండియా మీద ప్రశంసలు ఆయనకు కలిగిన జ్ఞానోదయాన్ని సూచిస్తున్నాయా.. లేక పాము చచ్చినా పగ మాత్రం చావదన్న జాతి నైజాన్ని సూచిస్తున్నాయా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి. భారత రాజకీయాలపై పాకిస్తాన్ కు ఆసక్తి ఉన్నట్టే.. పాక్ రాజకీయాలపై కూడా భారత ప్రజల్లో ఆసక్తి ఉంటుంది. పాక్ ను పక్కలో బల్లెంలా సగటు భారతీయుడు ఎలా భావిస్తాడో.. భారత్ ను డిస్టర్బ్ చేయాలన్న దుర్బుద్ధి అక్కడి ఎక్కువ మంది పౌరుల్లో ఉంటుంది. దీనిక్కారణమేంటో అందరికీ తెలిసిందే. ద్విజాతి సిద్ధాంతం మీద దేశాన్ని బలవంతంగా విడగొట్టారన్న ఫీలింగ్ భారతీయుల్లో బలంగా పాతుకుపోయి ఉండడమే. అటు వాళ్లూ అంతే. ఇండియాను వాళ్లు ఏనాడూ పొరుగుదేశంగా చూడలేదు. ఇండియాతో శాశ్వత జాతివైరమే వారి దృష్టిలో శాశ్వతమైన ఎజెండా. కాబట్టి ఈ రెండు పొరుగు దేశాల వ్యవహారాల్లో శత్రుబద్ధమైన వైఖరి అలా దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. ఇమ్రాన్ కూడా అందుకు మినహాయింప...

భారత్-రష్యా స్ట్రాంగ్ అయితే అమెరికా ఏం చేస్తుంది?

రష్యా-భారత్ మైత్రీ బంధం బలపడితే అమెరికా ఏం చేస్తుంది? మనతో స్నేహపూర్వకంగా ఉన్న అమెరికా ఆ స్నేహబంధాన్ని తెంచుకునే సాహసం చేస్తుందా? అసలు అమెరికా లాంటి అగ్రరాజ్యాలు అంతర్జాతీయ అంశాలను శాసించాలనుకోవడం ఎంతవరకు క్షేమకరం? అలాంటి అవాంఛనీయ జోక్యాలకు ఆస్కారం ఇవ్వకుండా రష్యా-భారత్ ఏదైనా ఉపాయం కోసం అన్వేషిస్తున్నాయా? నిన్న రష్యా విదేశాంగ మంత్రి భారత్ లో పర్యటించాక ఈ అంశాల మీదనే చర్చ జరుగుతోంది.  రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్న క్రమంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఇండియాలో పర్యటించడమే కాక.. ఇండియా మీద సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారు. ఇండియాకు ఎలాంటి సాయమైనా చేసేందుకు, ఎలాంటి సరుకైనా అందించేందుకు ఎంతదూరమైనా వెళ్తామన్నారు. మరి.. ప్రపంచానికే పెద్దన్నగా భావించే అమెరికాకు ఈ అంశం మింగుడు పడుతుందా? భారత్-రష్యా చెట్టపట్టాలేసుకుంటే అగ్రరాజ్యపు ఆధిపత్యానికే మచ్చ కదా? ఇలాంటి తరుణంలో అమెరికా స్పందిస్తున్న తీరు దేనికి సంకేతం? రానున్న రోజుల్లో ఇండియా దౌత్య సంబంధాలు ఎలా ఉంటాయి? ఇప్పటివరకూ భారత్ ను నమ్మకమైన దేశంగా భావిస్తున్న అమెరికా.. ఇకనుంచి అనుమానించడం మొదలెడుతుందా? ర...