Skip to main content

Posts

Showing posts with the label AP

రైతు సమస్యలు పరిష్కరించకపోతే పెను ప్రమాదమే

రైతు సమస్యలు పరిష్కరించకపోతే సమాజం అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అది జరగకుండా ఉండేందుకు మీడియా చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని, రైతుల కోసం పనిచేసే సంస్థలు సంఘాలు ముఖ్యంగా బి కే ఎస్ - భారతీయ కిసాన్ సంఘ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు రైతుల కోసం ఎంతో శ్రమించాల్సి ఉందని సీనియర్ జర్నలిస్ట్ తాటికొండ రమేష్ బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రచార ఆయామ్ సమావేశము BKS రాష్ట్ర కార్యాలయం రాజపుత్ రెసిడెన్సి లో *ప్రాంత ప్రచార ప్రముఖ్  ల్యాగల శ్రీనివాస్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ శ్రీ సుదర్శన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ రమేష్ బాబు రాకల్లోకం యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ రాక సుధాకర్ హాజరయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ సమాచార విప్లవం వచ్చిన తర్వాత ప్రజలకు నేరుగా సమాచారం అందడం వలన ప్రజలు విజ్ఞానవంతులైనారు, కానీ సమాచారం అనేది పుస్తకాల రూపంలో పత్రికలు రూపంలో ఇంటర్నెట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నేడు అవసరమైన దానికంటే ఎక్కువ అందుబాటులో ఉన్నది. కానీ సరియైన సమాచారం  వినియోగించుకొని నూతనంగా

వీరభద్ర విజయం - ఒక పర్ఫెక్ట్ సర్జికల్ స్ట్రయిక్

సర్జికల్ స్ట్రయిక్ అంటే 2016లో భారతదేశం పాకిస్తాన్ మీద చేసిందే అనుకుంటారు అందరూ. కానీ అది ఓ కొనసాగింపు మాత్రమే. అలాంటి సర్జికల్ స్ట్రయిక్, అంతకన్నా ప్రమాదకరమైంది, అంతకన్నా ఎన్నో రెట్ల భయంకరమైంది భారతీయ పురాణ కాలంలోనే జరిగింది. ఆ సర్జికల్ స్ట్రయిక్ నిర్వహించిన రుద్రమూర్తే వీరభద్రస్వామి. బహుశా దాన్ని మొట్టమొదటి సర్జికల్ స్ట్రయిక్ గా భావించవచ్చేమో.  శత్రువు చేతిలో జరిగిన అవమానానికి ప్రతీకారమే సరైన చర్య. అవమానించడానికి శత్రువే కానక్కర లేదు. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామ అయినా సరే.. అవమానించాడంటే శత్రువు కిందే లెక్క. సాక్షాత్తూ పరమశివుడు కూడా అదే సూత్రాన్ని పాటించాడు. అల్లుణ్ని అవమానించడానికే దక్ష ప్రజాపతి యజ్ఞం తలపెట్టాడట. తండ్రి పిలవకపోయినా ఓ గొప్ప కార్యాన్ని, శుభకార్యాన్ని తలపెట్టాడు కాబట్టి వెళ్లొస్తానని శివుని దగ్గర బలవంతంగా అనుమతి తీసుకొని వెళ్లిపోయింది పార్వతి. దుర్బుద్ధితోనే యజ్ఞం తలపెట్టిన దక్షుడు.. కూతురు ముందే అల్లుణ్ని దారుణంగా అవమానించాడు. శివుడికి కూతురును ఇచ్చి పెళ్లి చేయడమే ఇష్టం లేని దక్షుడు.. కూతురే ఇష్టపడి చేసుకోవడంతో ఏమీ అనలేకపోయాడు. కానీ అల్లుడి మీద, అల్లుడి పేదరికం

అన్ని సర్వేలూ అదే చెబుతున్నాయి.. ఒక్కటి తప్ప

ఓటరన్న తన పని తాను కానిచ్చేశాడు. తనను సంప్రదించిన పార్టీలతో ఏం మాట్లాడాలో అదే మాట్లాడాడు. మీట నొక్కాల్సిన చోట నొక్కాడు. నిశ్శబ్దంగా తన రొటీన్ వర్క్ లోకి వెళ్లిపోయాడు. మరి ఆ ఓటరు ఏ మీట నొక్కాడు.. ఎవరి మీటరు మార్చబోతున్నాడు.. ఎవరి తలరాత మారబోతుంది? మునుగోడులో ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏం చెబుతున్నాయి? ఆ కీలకమైన విషయాలు మీకోసం.  మునుగోడులో పరుగుపందెంలా మారిన ఉపఎన్నికలో హుజూరాబాద్ ఫలితం రిపీట్ కాకూడదన్న పట్టుదలతో టీఆర్ఎస్... మరో హుజూరాబాద్ లా మార్చేయాలన్న వ్యూహంతో బీజేపీ శ్రేణులు పనిచేశాయి. సర్వే సంస్థలు కూడా ఈ పోటీ తీవ్రతను అర్థం చేసుకొని.. అదే స్థాయిలో ఓటర్ల నాడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాయి. అత్యధిక సర్వే సంస్థలు టీఆర్ఎస్ గెలుస్తుందని అంచనా వేయగా.. ఒకటీ, అరా సర్వే సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి. ఆయా సర్వే సంస్థల రిపోర్టును ఆసరా చేసుకొని పార్టీలు కూడా గెలుపు తమదేననే ధీమాలో ఉన్నాయి.  థర్డ్ విజన్ రీసెర్చ్ నాగన్న ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ 48 నుంచి 51 శాతం ఓట్లు సాధిస్తుంది. బీజేపీ 31 నుంచి 35 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంటుందని పేర్కొంది. 13 నుంచి 15 శాత

పేరుకు తగినట్టుగానే ఆయన రారాజు-చిరంజీవి

తెలుగు చిత్రసీమలో మరో పాతతరపు ధ్రువతార నింగికేగింది. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నటుడిగా సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న కృష్ణంరాజు.. అటు రాజకీయాల్లోనూ మంచిపేరు తెచ్చుకున్నారు. అయితే రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఎన్నో సేవలు అందించాలనే తహతహ ఆయనకు ఉన్నా.. అందుకు తగిన సహకారం దొరకలేదనే అసంతృప్తికి లోనైనట్టు చెబుతారు. ఏ పార్టీలో ఉన్నామన్నది కాకుండా.. ఏం చేశామన్నదే ఆయన ఫిలాసఫీగా ఉండేదని.. అయితే రాజకీయాల్లో ఉండే అనేక రకాల ఒత్తిళ్లు, పరిమితుల కారణంగా.. ఏ పార్టీలో కూడా కృష్ణంరాజు పూర్తిగా ఒదిగి ఉండలేకపోయారన్న అభిప్రాయాలున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రేక్షకులకు తన విలక్షణమైన నటనను అపురూపమైన జ్ఞాపకంగా అందించారు కృష్ణంరాజు. 1940 జనవరి 20వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో పుట్టిన కృష్ణంరాజు పూర్తి పేరు.. ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. తెలుగు ప్రేక్షకులకు ఓ భారీ నట విగ్రహంగా మాత్రమే తెలిసిన కృష్ణంరాజులో బహుముఖీనమైన అభిరుచులు, ఆకాంక్షలు ఉన్నాయి. సుదీర్ఘమైన జీవిత ప్రయాణంలో అనేక పాత్రలను ఎంతో విజయవంతంగా పోషించినట్టు ఆయన సినీ ప్రస్థానం చెబుతుంది. తెలుగునేలపై స్వేచ్ఛా పోరాటాల సమయంలో తనదైన ముద్ర

విలీనమా? విమోచనమా? విద్రోహమా? సమైక్యతా దినోత్సవమా?

తెలంగాణలో రసవత్తరమైన రాజకీయ అంకానికి తెర లేచింది. భారత ఉపఖండంలో తెలంగాణ విలీనాంశం అనేది ఓ కీలకమైన ఘట్టం. అయితే ఆ ఘట్టాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు కొన్ని పక్షాలు ప్రయత్నిస్తుండగా.. అదే ఘట్టాన్ని ఆసరా చేసుకొని తమ రాజకీయ అవసరాలు తీర్చుకున్న పక్షాలు కూడా ఉన్నాయి. తెలంగాణ విలీనంతో కొన్ని వర్గాలు తమ ఉనికి కోల్పోతామని ఆందోళన చెందితే.. మరికొన్ని వర్గాలేమో సెంటిమెంట్లు గాయపడే అంశంగా పరిమితం చేస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణలో విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఉద్యమ నేతగా అనేక వేదికల మీద చెప్పిన కేసీఆర్.. తన మాట నిలుపుకోవడం లేదంటూ... బీజేపీ కేంద్ర సర్కారు ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తామని డిక్లేర్ చేయడంతో... ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది.  Also Read:  భారతీయుడి శౌర్య 'ప్రతాపం'.. స్పెషల్ స్టోరీ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని.. అధికారిక ఉత్సవంగా నిర్వహించాలన్న డిమాండ్.. ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. కేంద్రంలోని మోడీ సర్కారు సెప్టెంబర్ 17 రోజున పరేడ్ గ్రౌండ్స్‎లో విమోచన దినోత్సవాన్ని కేంద్ర సర్కారు ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తామని, ఆ కార్యక్రమానికి తమరు క

చేతులు కడిగారా? చేతులు కలిపారా?

ఊరక రారు మహానుభావులన్నట్లు ఢిల్లీ నుండి ఓ పెద్దాయన వచ్చాడు. చాలా పెద్ద రాచకార్యానికి వచ్చిన ఆ పెద్దాయన.. జూనియర్ ను పిలిపించుకొని ముచ్చటించాడు. పెద్దవాళ్లు పెద్దపెద్ద టాపిక్‎లు మాట్లాడుకోవాలి గానీ.. కుర్రాళ్లతో మాట్లాడుకునే టాపిక్స్ ఏముంటాయబ్బా.. అని గల్లీ లెవల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. అసలే ఆ పెద్దాయనకు అగ్గిపుల్ల స్వామి అనే పేరొకటి ఉంది. మరి అలాంటప్పుడు కాక మీదున్న కుర్రాణ్ని అగ్గిపుల్ల స్వామి కలిస్తే.. అగ్గి రాజుకోకుండా ఎలా ఉంటుంది?  Also Read:  పవన్‎కు, చంద్రబాబుకు చెక్ పెట్టేశారా? Also Read:  వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి కేంద్రహోంమంత్రి అమిత్ షా.. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ల భేటీపై తెలుగు రాజకీయాల్లో రేగిన చర్చ రచ్చ రచ్చ అవుతోంది. ఈ మీటింగ్ పై ఎవరికి తోచినవిధంగా వారు మాట్లాడుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు అబ్బురపడి ఆయన్ని పిలిపించుకుని అమిత్ షా శెభాష్ అంటూ కితాబిచ్చారని పైకి చెబుతున్న మాటలు.. కామెడీగా తేలిపోతున్నాయి. అదే నిజమైతే మరి రామ్‎చరణ్ ను, సినిమా దర్శకుడు రాజమౌళిని ఎందుకు పిలవలేదన్న ప్రశ్నలకు బీజేపీ నేతల దగ్గర సమాధానం దొరకటం లేదట. ఏమో మాకేం తెలుస

పవన్‎కు, చంద్రబాబుకు చెక్ పెట్టేశారా?

జూనియర్ ఎన్టీఆర్, బీజేపీ నేత అమిత్ షా భేటీ రాజకీయవర్గాల్లో చాలా ఆసక్తి రేపుతోంది. వారేం మాట్లాడుకున్నారన్నది బయటకు పొక్కకపోయినా.. కచ్చితంగా రాజకీయ ప్రాధాన్యమైన అంశాలు చర్చకు వచ్చి ఉంటాయని అంతా భావిస్తున్నారు. అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధహస్తుడనే పేరున్న అమిత్ షా.. తన విలువైన సమయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో షేర్ చేసుకోవడం అనేక కోణాల్లో చర్చనీయాంశంగా మారింది.  బీజేపీ టాప్ లీడర్, టాప్ స్ట్రాటజిస్ట్ అమిత్ షా.. నోవోటెల్ హోటల్లో ప్రముఖ తెలుగు స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తో డిన్నర్ చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. టీడీపీ గెలుపు కోసం, దగ్గరి బంధువైన చంద్రబాబు కోసం ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీతో పాటు చంద్రబాబునాయుడుతో కూడా ఆయన ఎడం పాటిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఎన్టీఆర్ ను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టాకే.. పవన్ కల్యాణ్ తో చెట్టపట్టాలు వేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఈ క్రమంలో తన సినిమా ప్రాజెక్టుల్లో బిజీగా ఉంటూ.. రాజకీయాల్లో పూర్తి నిశ్శబ్దం పాటిస్తున్న ఎన్టీఆర్.. అమిత్ షా ను కలవడం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపు

ఉర్రూతలూగించే ఉయ్యాలవాడ వీరగాథ (సచిత్రంగా)

భార‌త స్వ‌ాతంత్ర్య పోరాట‌ తొలి గ‌ర్జ‌న ఆయన‌ది. సీమ పౌరుషానికి ప్ర‌తీక ఆయ‌న‌. ఆయ‌న పేరు చెబితే ఇంకా మీసం మొలవని కిశోరాలు కూడా మూతి మీద చెయ్యేసుకుని పొంగిపోతారంటే అతిశయోక్తి కాదు. ఆయనే.. ర‌వి అస్త‌మించ‌ని బ్రిటిష్ సామ్రాజ్య‌పు కోట‌ల‌కు బీట‌లు పెట్టిన సీమ సింహం ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. అద్భుతమైన ఆయన పోరాటానికి చ‌రిత్ర‌లో ప్రముఖ స్థానం దక్కకపోవచ్చు గానీ.. రాయల‌సీమ గ్రామాల్లో ఆయ‌న కీర్తి అజ‌రామ‌రం. ఆజాదీ అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఆ వీరుడి వీర‌గాథ ప్రస్తుత కాలానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. Also Read: వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి Also Read:  భారతీయుడి శౌర్య ప్రతాపం మహారాణా ఉయ్యాలవాడ పేరు చెబితేనే నరనరానా ఉద్యమ స్ఫూర్తి రగులుతుందంటారు రాయలసీమ ప్రజలు. ఆయన పోరాట పటిమ, పౌరుష పరాక్రమాల గురించి స్థానిక భాషలో పాటలు కట్టి పాడుకుంటారు. ఇప్పటికీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పతనంపై పాటలు వినిపిస్తుంటాయి. భ‌ర‌త‌మాత దాస్య‌శృంఖ‌ల విముక్తి కోసం తెల్ల దొర‌ల‌పై తెగ‌బ‌డిన ఖ‌డ్గం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది. తెల్ల‌టి గుర్రం.. చేతిలో నాట్య‌మాడే క‌త్తి.. పౌరుషానికి ప్ర‌తీక‌గా మెలితిరిగిన మీసం.. సీమ‌లో పౌరుషాగ

భక్తుల డిమాండ్‎కు తలొగ్గిన శ్రావణభార్గవి

ఒకసారి పాపులారిటీ వస్తే.. దానికి బోనస్ గా నిర్లక్ష్యం కూడా వస్తుందా? అయితే ప్రజల నుంచి నిరసన ఎదురైతే.. ఎంతో కష్టపడి సంపాదించుకున్న పాపులారిటీ కూడా పేకమేడల్లా కూలిపోక తప్పదు. గాయని శ్రావణభార్గవి విషయంలో కూడా అదే జరిగిందంటున్నారు.. శ్రీవారి భక్తులు. ఇటీవల ఆమె పాడి నటించిన అన్నమయ్య కీర్తన వివాదానికి కేంద్ర బిందువైంది. ఆమె పాటపై అన్నమయ్య వంశీకులు తీవ్ర్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీడియోను డిలీట్ చేయాలని కోరారు. అయినా ఆమె మాత్రం వెనక్కు తగ్గలేదు. తన పాటలో అసభ్యత ఏముందని ఎదురు ప్రశ్నించింది కూడా. ఆ వివాదం చినికిచినికి గాలివానగా మారి... అన్నమయ్య కుటుంబ సభ్యులు న్యాయపోరాటానికీ సిద్ధమయ్యారు. అటు వెంకన్న భక్తులు కూడా శ్రావణభార్గవికి వార్నింగ్ ఇచ్చారు. ఆమెను తిరుమలలో అడుగుపెట్టనీయం అంటూ హెచ్చరించారు. ఇలా అన్ని వైపుల నుంచీ విమర్శలు రావడంతో శ్రావణ భార్గవి ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు. ఆలస్యంగానైనా తన యూట్యూబ్ చానల్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేయాల్సి వచ్చింది. ఆమె మంచి గాయని కావడంతో వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అది కాస్తా వివాదాస్పదం అయ్యాక మరింత వ్యూస్ వచ్చే అవకాశం పెరిగింది. కానీ తప్పనిసరి పరిస్థి

వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి

మహా మహోపాధ్యాయ, బహుభాషావేత్త, వేద వేదాంగవేత్త, రాష్ట్రపతి సన్మాన విభూషిత, శతాధిక గ్రంథకర్త, ప్రాచీన వాఙ్మయ వ్యాఖ్యత పెదపాటి నాగేశ్వరరావు సహస్ర పూర్ణ చంద్ర దర్శన మహోత్సవం చూడముచ్చటగా ముగిసింది. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన పెదపాటి వేయి పున్నముల దర్శన మహోత్సవానికి తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చివరి రోజు ఘట్టం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో సంప్రదాయబద్ధంగా జరిగింది. 1941లో గుంటూరు జిల్లాలో జన్మించిన పెదపాటి.. ఆనాడు ఉన్న అనేక వ్యతిరేక పరిస్థితులను ఎదురీది.. భాషలో, వేదాధ్యయనంలో, శిల్పశాస్త్రంలో ఎంతో కృషి చేశారని మధుసూూదనచారి కొనియాడారు. ఈనాటి యువకులను చదివించడానికి, అన్ని అవసరాలూ సమకూర్చడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నా పిల్లలు మాత్రం ఓ లక్ష్యం అంటూ లేకుండా ఉన్నారని ఆవేదన చెందారు. అందుకు భిన్నంగా పెదపాటి నాగేశ్వరరావు.. అననుకూల పరిస్థితులను అధిగమించి మహా పండితుడై కేవలం విశ్వబ్రాహ్మణ కులస్తులు మాత్రమే గాక యావత్ తెలుగుజాతి గర్వించే స్థాయికి ఎదిగారన్నారు.  Also Read:  విమోచనమా? విద్రోహమా? సమైక్యతా దినోత్సవమా? అలాంటి మహా పండితుడికి తగిన గుర్తి

భాగ్యలక్ష్మి ఆలయానికి ఇంపార్టెన్స్ అందుకేనా?

బీజేపీ నేతలు చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించుకోవడం చాలా ఇంట్రస్టింగ్ అంశంగా మారింది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచే హైదరాబాద్ ఓటర్లకు, బీజేపీ మద్దతుదార్లకు, హిందూ సమాజాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కూడా యోగి అమ్మవారిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఈసారి ప్రధాని మోడీ కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ దర్శించుకుంటారని భావించినా.. సమయాభావం వల్ల అది కుదరలేదని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. అంతకుముందు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా వినాయక నవరాత్రుల సమయంలో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. మరి.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. భాగ్యలక్ష్మి అమ్మవారినే ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకున్నారన్న ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.  బీజేపీ నేతల హిడెన్ ఎజెండాలో హైదరాబాద్ పేరు మార్చే ప్రక్రియ ఉందన్న అభిప్రాయాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ నేతల సందర్శన కూడా అదే విషయాన్ని రుజువు చేస్తోంది. హైదరాబాద్ ను భాగ్యనగరంగ

కవిసార్వభౌముడు కలలో కనిపించి...

సహధర్మచారిణి గంగాదేవితో నాగేశ్వరరావుగారు చరిత్ర అనేది మంచి-చెడుల సమ్మిశ్రమం. మంచి చేసినవారిని అనుసరించాలని పాజిటివ్ థింకర్స్ చెప్తే... చెడు చేసినవారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని, వాళ్లు ఈ భూమ్మీద ఉండటానికి అర్హులు కారని అందుకు విరుద్ధమైన వర్గమంతా చెప్తుంది. ప్రపంచమంతా ఈ రెండు మార్గాల్లోనే ప్రయణిస్తోంది. అయితే ఆ రెండు మార్గాలు  సర్వకాలాల్లోనూ పరిపూర్ణమైనవి  కాకపోవచ్చు. ఎందుకంటే వాటిలో ఎవరి ఆచరణ మార్గం వారిదే. ఒకరితో ఒకరికి పని ఉండదు. ఎవరి ఫాలోయర్లను వారు తయారు చేసుకుంటారు.  ఎవరి శిబిరాన్ని వారు పోటాపోటీగా భర్తీ చేసుకుంటారు. దీనివల్ల సమాజం "వర్గ విభజన"కు గురవుతుందే తప్ప.. సామాజిక సమరసతకు అవకాశం ఉండదు. ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రజలు మంచి, చెడుల గురించి మాట్లాడుకునే అవకాశం ఉండదు. మరి అది ఎలా సాధ్యం? అది జరగాలంటే ఏం చేయాలి? దానికి ఒకటే పరిష్కారం. అదేంటంటే.. అందరికీ అన్నీ తెలియజేయడమే.  Also Read:  భాగ్యలక్ష్మి ఆలయానికి ఇంపార్టెన్స్ అందుకేనా? ఎవరు ఏ మంచి చేశారో ప్రజలకు తెలియాలి? ఎవరి ద్వారా చెడు జరిగిందో కూడా ప్రజలకు తెలియాలి. నిజానికి ఇది చాలా బాధ్యతతో కూడుకున్న పని. తమ పూర్వీకుల

కొత్తగా తయారవుతున్న మావోయిస్టుల హిట్ లిస్ట్

ఎన్.ఐ.ఎ... నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అంతర్గత శాంతిభద్రతల కోసం నిరంతరం పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ. తీవ్రవాదులు, ఉగ్రవాదుల కదలికలపై పూర్తి నిఘా పెట్టి వారిని మట్టుపెట్టే పకడ్బందీ సంస్థ. దాని వెబ్ సైట్ లో వివరాలు కూడా ఎప్పటికప్పుడు అప్-డేట్ చేస్తూంటారు. అయితే కొందరు కీలకమైన మావోయిస్టు నేతలు చనిపోయి చాలాకాలం అవుతున్నా.. వారి పేర్లను మాత్రం ఇంకా తొలగించలేదు. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్.కె... ఆయన మావోయిస్ట్ కేంద్రకమిటీ సభ్యుడిగా పని చేశారు. ఇక యాపనారాయణ అలియాస్ హరిభూషణ్. ఈయన మావోయిస్ట్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. అయితే గత సంవత్సరమే వారు చనిపోయారు. అయినా ఎన్.ఐ.ఎ మాత్రం వారి పేర్లను ఇంకా మోస్ట్ వాంటెడ్ జాబితాలోనే ఉంచింది.  ఆర్కే, హరిభూషణ్ తో పాటు మరికొందరు తెలుగువారు కూడా ఎన్.ఐ.ఎ. హిట్ లిస్టులో ఉన్నారు. ఈ సంవత్సరం మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నవారిపై రివార్డులు పెరుగుతాయని పోలీసు శాఖ చెబుతోంది. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్లవారీగా తాజా లిస్టును ఎన్.ఐ.ఎ. సేకరిస్తోంది. తాజా లిస్టులో ఇంకా ఎవరున్నారనేది ఆసక్తికరంగా మారింది. యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌.. తెలంగాణలోని మహ