Skip to main content

Posts

Showing posts from April, 2021

అసహాయులైన విశ్వకర్మలకు సరుకులు పంచిన వేదాస్

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఉపాధి లేక, పట్టించుకునేవారు లేక అల్లాడుతున్న నిరుపేద విశ్వకర్మలకు చేయూత అందించేందుకు  వేదాస్ అసోసియేషన్ ముందుకొచ్చింది. వేదాస్ రాష్ట్ర అధ్యక్షుడు అలుగోజు కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి నాగాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జనార్దనాచారి సహకారంతో గ్రేటర్ హైదరాబాద్ శాఖ నాయకుడైన జైన్ కుమార్ ఈ సరుకుల పంపిణీ నిర్వహించారు. హైదరాబాద్ లో మూడు నిరుపేద కుటుంబాలను ఎంచుకొని వారికి మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులతో పాటు నగదు కూడా అందించారు. అంబర్ పేటకు చెందిన దివ్యాంగుడైన రవీందర్ కుటుంబానికి నిత్యావసర వస్తువులతో పాటు రూ. 2 వేల నగదు, వృద్ధులైన రెండు జంటలకు కూడా అదే తరహాలో నిత్యావసర సరుకులతో పాటు మొత్తం 7 వేల నగదును అందించారు.  వేదాస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ప్రోత్సాహంతోనే తాము ఈ కార్యక్రమానికి పూనుకున్నామని, ఇందుకు సహకరించిన వేదాస్ సభ్యులు, నాయకులు అందరికీ జైన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర సహాయాధ్యక్షుడు కౌలే జగన్నాథం, అదే సంఘానికి చెందిన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కమ్మరి మహేశ్, ప్ర

తెలంగాణలో విశ్వబ్రాహ్మలకు ఒరిగింది శూన్యం

విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఖమ్మం జిల్లాకు చెందిన బ్రహ్మశ్రీ ఆకారపు శ్రీనివాస్ విశ్వకర్మను నియమించారు. ఆదివారం జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు, బీజేపీ నాయకుడు తల్లోజు ఆచారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేసినట్లు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షుడు విశ్వనాథుల పుష్పగిరి చెప్పారు. అనంతరం ఆకారపు శ్రీనివాస్ విశ్వకర్మ మాట్లాడుతూ విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ను తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బలోపేతం చేస్తానని, విశ్వకర్మ సమాజపు పూర్వ వైభవానికి, సంస్కృతీ పరిరక్షణకు, సాధికారత కోసం అహర్నిశలు కృషి చేస్తానని, విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ లక్ష్యాలకు అనుగుణంగా ఎల్లవేళలా విశ్వకర్మలందరికి అందుబాటులో ఉంటానని ప్రమాణం చేశారు. సాధించుకున్న తెలంగాణలో విశ్వకర్మలకు ఒరిగింది ఏమీ లేదని, ప్రభుత్వ పథకాలు సైతం విశ్వకర్మ సమాజానికి చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఎందరో విశ్వకర్మలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదని, తమ కుల సమాజంలో చైతన్యం తీసుకురావడానికి తనవంతు పాత్ర తప్పకుండా పోషిస్తానని శ్రీనివాస్ విశ్వకర్మ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప్పుగూడ విశ్వబ్