Skip to main content

వీకెండ్ స్టోరీ- ఆధునిక ఆదర్శ హిందూ వివాహం ఇదే

హిందూ సమాజ వ్యవస్థ ఎంత సంక్లిష్టమైందో... అంత సానుకూలమైంది కూడా. అయితే అనుకూలతలు అటుంచి కేవలం సంక్లిష్టతలు మాత్రమే ఎత్తిచూపే ప్రబుద్ధులు తమ దుర్బుద్ధిని మార్చుకోవాల్సిన సందర్భాలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. అందుకు కరీంనగర్‍లో జరిగిన తాజా పెళ్లే ఓ ఉదాహరణ. 

డిసెంబర్ 23వ తేదీన కరీంనగర్ లో జరిగిన సహస్ర-మహేశ్‍ల పెళ్లి కులాతీత ఆధునిక హిందూ ఆదర్శ వివాహానికి ఓ ఆనవాలుగా నిలిచిపోతుంది. ఎందుకంటే పెళ్లికూతురు, పెళ్లికొడుకు, పెళ్లిపెద్దలు.. ఇలా ముగ్గురూ మూడు సామాజికవర్గాలకు చెందినవారు కావడం విశేషం. సహస్ర (ముదిరాజ్), మహేశ్ (మేరు)తో పాటు పెళ్లిపెద్దలైన రాజ్‍కుమార్-అన్నపూర్ణ (విశ్వబ్రాహ్మణ) వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవారు. వీరెవరూ రక్త సంబంధీకులు కాకపోయినా, అమ్మాయి-అబ్బాయిల కులపెద్దల మద్దతు కోసం ఎదురుచూడకుండా.. కేవలం అమ్మాయి-అబ్బాయి కుటుంబాలతో ఉన్న పాత పరిచయం, స్నేహాన్నే ఆత్మబంధంగా భావించి యువజంటను ఒక్కటి చేశారు. ఖర్చులకు వెనుకాడకుండా బంధువర్గం, ఉద్యోగ స్నేహితులు.. ఇలా అందరూ మెచ్చేలా అంగరంగ వైభవంగా సహస్ర పెళ్లిబాధ్యతలు పూర్తి చేశారు. నేటి కాలానికి అవసరమైన అసలైన హిందూ ఆదర్శ వివాహాన్ని ఆచరించి చూపారు. 

IMP Story: దేవతా విగ్రహాల విధ్వంసం ఆగేదెపుడు?

IMP Story: జీవుల్ని చంపని మాంసాహారం వచ్చేసింది

పెళ్లిపెద్దలు: అన్నపూర్ణ-రాజ్‍కుమార్

సహ ఆహ్వానించినవారు: సరిత-రాము 

కన్యాదాతలు: లక్ష్మి-సమ్మయ్య

నవ దంపతులతో రాజ్ కుమార్ అండ్ ఫ్యామిలీ
నవ దంపతులతో సరిత-రాము అండ్ ఫ్యామిలీ

లక్ష్మీనారాయణ చూపిన ఆప్యాయతే బాధ్యత తీసుకునేలా చేసింది

ఈ పెళ్లి బాధ్యతల గురించి రాజ్‍కుమార్ ఇలా వివరించారు. పెళ్లికూతురు తండ్రి లక్ష్మీనారాయణతో తనకు చిన్నప్పటి నుంచే సాన్నిహిత్యం ఉందని.. తాను, తన మిత్రులకు ఆయన ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. కరీంనగర్ పోలీస్ హెడ్‍క్వాటర్స్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసిన లక్ష్మీనారాయణ.. తాము యువకులుగా ఉన్నప్పుడు సమాజం పట్ల, హిందూ ధర్మం పట్ల మెలగాల్సిన పద్ధతుల గురించి చక్కగా చెప్పేవాడని, ప్రతి సంవత్సరం వినాయక చవితికి వంతులేసుకొని విగ్రహాలు తీసుకురావడం, అన్నప్రసాదాల బాధ్యతలు పంచుకోవడం గురించి లక్ష్మీనారాయణ ఒక కుటుంబ పెద్దలా ఉండి తమను సంఘటితం చేశాడని, ప్రతి వినాయక చవితిని ఘనంగా నిర్వహించేలా ప్రోత్సహించాడని చెప్పారు. ఆయన ఎంకరేజ్ చేసిన ప్రతి యువకుడు కూడా దేవుడి దయవల్ల అందరూ జీవితంలో చక్కగా సెటిలయ్యారని ఆనాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. అలా లక్ష్మీనారాయణ ఇప్పుడు తమ మధ్య లేకపోయినా.. తమ కుటుంబాల మధ్య విడదీయరాని ఓ ఆత్మబంధంగా మారిపోయాడని, ఆ జ్ఞాపకాల గాఢత వల్లే సరితను కూతురిగా, చెల్లెలుగా భావించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామని రాజ్‍కుమార్ చెప్పారు. 

నవ జంటను అభినందిస్తున్న సీఐ మాధవి


మహేశ్ ను పెళ్లి కొడుకు చేసే కార్యక్రమంలో అన్నపూర్ణ-రాజ్ కుమార్ (ముందురోజు)

ఇక సహస్ర అక్క, బావ అయిన సరిత-రాము ఈ పెళ్లి కోసం బాగా శ్రమించారని, భారమని భావించకుండా అన్నింటికీ బాధ్యత వహించి, మహేశ్ తల్లిదండ్రులు కూడా సంతృప్తి చెందేలా లాంఛనాలు పూర్తి చేశారని, ఎక్కడా లోటు రాకుండా వ్యవహరించారని రాజ్‍కుమార్ చెప్పారు. 

లక్ష్మీనారాయణ మూడో కూతురైన సహస్ర వివాహం కులాతీతంగా, హైందవ ధర్మాన్ని పూర్తిగా అనుసరించి జరగడంతో అందరూ సంతోషించడమే గాక కార్య నిర్వాహకులను అభినందించారు. 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

అలుపెరుగని పోరాట యోధుడు పద్మాచారి

తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు పద్మాచారి 62వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లో ఉన్న ఆఫీసర్స్ మెస్ లో తెలంగాణ ఉద్యోగులు, ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆయన మరింత కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యోగుల సంఘానికి పద్మాచారి చేసిన సేవలు మరువలేనివని. ఏ చిరు ఉద్యోగికి ఆపద వచ్చినా ఆపద్బాంధవుడిలా ముందుండి సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడే యోధుడు అని ఏసీపీ (సీసీఎస్) కె.ఎం కిరణ్ కుమార్ అన్నారు. రెండేళ్ల క్రితమే పద్మాచారి పదవీ విరమణ పొందారు. ఉద్యోగులందరూ మళ్లీ పద్మాచారిని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. పద్మాచారి 61 సంవత్సరాలు పూర్తి చేసుకుని 62వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మాసబ్ ట్యాంక్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.  ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ కె.ఎం. కిరణ్ కుమార్ ఎ.సి.పి(సి.సి.ఎస్) మాట్లాడుతూ... పద్మాచారి లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ ఉద్యోగుల సంఘానికి గౌరవాధ్యక్షులుగా పని చేయటం, ఉద్యోగుల సమస్యలు ఎంత జటిలంగా ఉన్నప్పటిక...