Skip to main content

జానారెడ్డికి గవర్నర్‍గిరీ?

జనమెరిగిన నాయకుడు జానారెడ్డికి….. రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉంటారనే పేరుంది. నియాజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి మనసుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే బలమైన కోరిక ఆయనలో ఉంది. కాంగ్రెస్ కు అధికారం వస్తే ముఖ్యమంత్రి రేసులో ముందుండే వ్యక్తి ఆయనే. గతంలోనే ఆయన తన కుమారుడికి మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ ఇప్పించాలని గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ అవకాశం రాలేదు. అలాంటి జానారెడ్డి బీజేపీలో చేరతారా? కమలనాథులు జానాకు గవర్నర్ పదవి ఆఫర్ చేశారా.. ? లేక జానారెడ్డినే తనకు గవర్నర్‍గిరీ కావాలని, తన కుమారుడికి నాగార్జునసార్ ఉపఎన్నిలల్లో టికెట్ ఇవ్వాలని అడిగారా? రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే టాపిక్ చర్చనీయాంశంగా మారింది. 

నాగార్జునసాగర్ ఎంఎల్ఏ నోముల నరసింహయ్య ఆకస్మిక మరణంతో జానారెడ్డి భవిష్యత్ రాజకీయాలపై చర్చకు దారితీసింది. సాగర్ కు జరిగే ఉపఎన్నిలను తమకు అనుకూలంగా మార్చుకోవటం ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని మరోమారు చాటి చెప్పాలని చూస్తున్న బీజేపీ నేతలు.. అందుకు సాగర్లో తగిన నాయకుడు జానారెడ్డే కాబట్టి ఆయన్ను ఎలాగైనా తమ పార్టీలోకి లాగాలని గట్టి ఎత్తులే వేస్తున్నట్టు సమాచారం. ఢిల్లీ బాసులు ఈ విషయంపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారని, వారికీ ఆయన కొన్ని షరతులు పెట్టారన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. నిజంగా ఆయన షరతులు పెట్టారా? కాంగ్రెస్ కు బై చెప్పేందుకు సిద్దపడ్డారా? అంటే రాజకీయాలలో ఏదైనా జరిగే ఆవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. 

జానారెడ్డి రాజకీయాల్లో ఉద్దండుడు. మొదట టీడీపీలో కొనసాగిన ఆయన.. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు. మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. 2009 లో ఉమ్మడి రాష్ట్రంలోనూ 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఆయన నాగార్జునసాగర్ నుంచి ఎన్నికయ్యారు. తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యహరించారు. అంతకుముందు చిలుకూరు నియోజకవర్గంగా ఉన్న ప్రాంతమే నేటి నాగార్జునసాగర్. అంతకుముందు నాలుగుసార్లు ఆయన అక్కడి నుంచి ఎన్నికయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య చేతిలో ఓడిపోయారు. నాటినుంచి రాజకీయాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు జానా. అప్పుడప్పుడు గాంధీ భవన్ లో జరిగే కాంగ్రెస్ సమావేశాలకు హాజరవుతుంటారు. నోముల మరణంతో తిరిగి జానారెడ్డి పాత్ర పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆయన ఉప ఎన్నికల్లో పోటీచేస్తారా? లేక కుమారుడైన రఘువీర్ రెడ్డిని పోటీకి పెడతారా? అదికూడా ఏపార్టీ నుంచి... బీజేపీనా, లేక కాంగ్రెస్సా.. ఇలా పరిపరివిధానా జానా భవితవ్యంపై చర్చలు సాగుతున్నాయి. మరోవైపు.. తాను పోటీ చేయబోనని, రాహుల్ గాంధే స్వయంగా వచ్చి చెప్పినా పోటీకి ససేమీరా అంటున్నారని నియోజకవర్గంలో ప్రజలు చెప్పుకుంటున్నారు. సాగర్ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా బలం లేదు. కాంగ్రెస్ కు బలం ఉన్నా ఇప్పుడున్న పరిస్థితిలో అది గెలుపుకు సరిపోతుందా.. అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. బీజేపీ 2500 ఓట్ల మార్కు నుంచి టీఆర్ఎస్ ను ఢీకొట్టే శక్తిగా ఎదుగుతుందా? ఒకవేళ ఇక్కడ బీజేపీ గెలిస్తే మాత్రం రాష్ట్రంలో అనూహ్య రాజకీయ పరిణామాలు ఖాయంగా సంభవిస్తాయంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ సీనియర్ ను బీజేపీలోకి తీసుకోవడం వరకైతే ఇబ్బందేం లేదు కానీ.. ఆ పార్టీ నుంచి వచ్చే జానాలాంటి వ్యక్తులకు గవర్నర్ గిరీ కట్టబెట్టడం జరిగే పనేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి. 

Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

అలుపెరుగని పోరాట యోధుడు పద్మాచారి

తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు పద్మాచారి 62వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లో ఉన్న ఆఫీసర్స్ మెస్ లో తెలంగాణ ఉద్యోగులు, ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆయన మరింత కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యోగుల సంఘానికి పద్మాచారి చేసిన సేవలు మరువలేనివని. ఏ చిరు ఉద్యోగికి ఆపద వచ్చినా ఆపద్బాంధవుడిలా ముందుండి సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడే యోధుడు అని ఏసీపీ (సీసీఎస్) కె.ఎం కిరణ్ కుమార్ అన్నారు. రెండేళ్ల క్రితమే పద్మాచారి పదవీ విరమణ పొందారు. ఉద్యోగులందరూ మళ్లీ పద్మాచారిని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. పద్మాచారి 61 సంవత్సరాలు పూర్తి చేసుకుని 62వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మాసబ్ ట్యాంక్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.  ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ కె.ఎం. కిరణ్ కుమార్ ఎ.సి.పి(సి.సి.ఎస్) మాట్లాడుతూ... పద్మాచారి లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ ఉద్యోగుల సంఘానికి గౌరవాధ్యక్షులుగా పని చేయటం, ఉద్యోగుల సమస్యలు ఎంత జటిలంగా ఉన్నప్పటిక...