Skip to main content

విజయ్ దివస్: పాక్ మెడలు వంచిన రోజు ఇదే

పాకిస్తాన్ కుత్సిత బుద్ధికి భారత్ తిరుగులేని రీతిలో జవాబిచ్చింది. మానవత్వాన్ని మరచిన పాక్ సేనలు బంగ్లాదేశ్ మీద జరిపిన దారుణ కాండకు తగిన గుణపాఠం చెప్పింది. అవకాశం దొరికిన ప్రతిసారీ ముస్లిం దేశాల తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే పాక్ అసలు బండారం బయటపడింది. బంగ్లాదేశ్ ముస్లిం దేశమే అయినప్పటికీ.. తూర్పు పాకిస్థాన్ కు సంబంధించిన భూభాగపు ప్రజలపై విపరీతమైన కక్షతో పశ్చిమ పాకిస్తాన్ కు చెందిన సైనికులు వచ్చి కేవలం తమ భాషను ఆమోదించని కారణంగా వేలాది మందిని చంపడమే కాకుండా తమ మతానికే చెందిన అక్షరాల లక్షకుపైగా మహిళలను రేప్ చేసినట్లుగా తెలిసి... అప్పటి భారత ప్రభుత్వం ఈ రాక్షసత్వాన్ని చూస్తూ ఉండలేకపోయింది. బంగ్లాదేశ్ కు సహకారం అందించి, సైనికులను పంపించి దుర్మార్గాలకు పాల్పడిన పశ్చిమ పాకిస్తాన్ కు సంబంధించిన 93 వేల మందికిపైగా దుష్ట సైనికులను ప్రాణాలతో బంధించింది. భారతదేశపు గడ్డపై మోకాళ్ళపై కూర్చుండబెట్టింది.. పాక్ పాలకుల్ని తలదించుకునేలా చేసింది. ఆ రోజే డిసెంబర్ 16, 1971 "విజయ్ దివస్". 

Also Read: ఆవు పేడతో చెప్పుల తయారీ


1971లో జరిగిన ఆ నాటి యుద్ధం భారత ఉపఖండం రూపురేఖలనే మార్చేసింది. తూర్పు పాకిస్తాన్ కాస్తా బంగ్లాదేశ్ అనే కొత్త దేశంగా ఆవిర్భవించింది. ఇదంతా ‘కేవలం యుద్ధం’ ద్వారానే జరగడం గమనార్హం. తూర్పు పాకిస్తాన్ విముక్తి కోసం జరిగిన యుద్ధమే ప్రపంచ పటం మీద బంగ్లాదేశ్ అనే కొత్త దేశానికి ఊపిరి పోసింది. ఆపరేషన్ కాక్టస్ లిల్లీ అనే కోడ్ భాషతో సైనిక సంఘర్షణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలించింది. భారతదేశాన్ని ప్రపంచ సైనిక పటంలో నిలిపిన యుద్ధం కూడా ఇదే. ఆపరేషన్ సెర్చ్‌లైట్ పేరుతో బంగ్లాదేశ్‌లో పాక్ యోజనాబద్దంగా జరిపిన మారణహోమంగా చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాదు.. పాక్ దుర్నీతి ఎలాంటిదో ప్రపంచానికి ఆనాడే మరోసారి చాటిచెప్పిన వార్ కూడా ఇదే. మెజారిటీ హిందూ ప్రజలున్న ఢాకాపై పాక్ సేనలు విరుచుకుపడ్డాయి. రాబర్ట్ పేన్ అనే అమెరికన్ జర్నలిస్టు..  ఆనాడు ఏడు వేల మంది ప్రజలు పాక్ సేనల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారన్నాడు.  పాకిస్తాన్ సైన్యం వారి తొత్తులైన రజాకార్ల వల్ల ఇంకెందరో అమాయకులు ఈ మారణహోమంలో బలయ్యారు. అంతేకాదు.. పాక్ మిలిటరీ దాదాపు 4 లక్షల మంది మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు చరిత్రలో రికార్డయింది. ఈ మారణహోమం కారణంగా ఆనాడే కోటి మంది బంగ్లాదేశ్ పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భారత్ కు పారివచ్చారు. ఈ శరణార్థులలో ఎక్కువ మంది హిందువులే కావడం గమనించాల్సిన అంశం. ఢాకాలోని హిందువుల భూములను స్వాధీనం చేసుకుని ముస్లింలకు బహుమతిగా ఇవ్వడం ద్వారా బెంగాలీ రైతులను శాంతింపజేయగలమని కుట్ర పన్నారు పాక్ పాలకులు. ఇది రైతాంగాన్ని ఆకట్టుకోలేదు.. సరికదా.. శరణార్థులు వరదలా వచ్చి భారతదేశంలో ఆశ్రయం పొందారు. ఫలితంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం శరణార్థుల సమస్యతో తీవ్రమైన ఇబ్బందులు పడింది. ఈ అపారమైన భారాన్ని భారత ప్రభుత్వమే స్వీకరించింది. 


మరోవైపు భారత దళాలు పాకిస్తాన్ పై పూర్తి స్థాయిలో దాడి చేశాయి. ఇందులో భారత త్రివిధదళాలు అన్ని వైపుల నుండి పాకిస్తాన్ పై భారీ సమన్వయంతో ఏకకాలంలో భూమి, సముద్రం, ఆకాశ మార్గాల్లో దాడులు చేశాయి. ఈ యుద్ధంలో భారతదేశం ముందు రెండు లక్ష్యాలున్నాయి. ఒకటి.. తూర్పువైపు ఢాకాను కాపాడటం, రెండు.. పశ్చిమం వైపు పాకిస్తాన్ భారత్ భూభాగంలో అడుగు పెట్టకుండా నిరోధించడం. 1971 లో పాకిస్తాన్ సృష్టించిన సంక్షోభానికి భారతదేశం చక్కని సైనిక పాటవంతో  విజయవంతమైన ముగింపునిచ్చింది. 1971 యుద్ధంలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, పూర్తి  ప్రణాళికబద్దంగా సాక్ష్యాధార సహితంగా మన వీరులు యుద్ధాన్ని నడపడమే. 16 డిసెంబర్ 1971 న పాకిస్తాన్ సైన్యం ఢాకాలోని రామ్నా కోర్సులో లొంగిపోయింది. దీన్నే భారతదేశంలో విజయ్ దివస్ గా జరుపుకుంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అతిపెద్ద లొంగుబాటుచర్య ఇదే కావడం విశేషం. సుమారు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు, పారా మిలిటరీ సైనికులు ఇతర జవాన్లు భారత్ కు లొంగిపోయారు.  1971 యుద్ధం ఫలితంగా తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా స్వాతంత్ర్యం పొందింది. పశ్చిమంలో  స్వాధీనం చేసుకున్నసుమారు 5,795 చదరపు మైళ్ల భూమిని భారత దళాలు సిమ్లా ఒప్పందం తరువాత సద్భావనతో తిరిగి పాకిస్తానుకు ఇచ్చాయి.


Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

'తానా' కవి సమ్మేళనానికి ఎంపికైన జె.వి.కుమార్ చేపూరి

తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు"  పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత”  అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.  Also Read:  కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, ముఖపుస్తకం (ఫేస్ బుక్) ఛానల్ ల