Skip to main content

జానారెడ్డి బీజేపీలో చేరడం ఖాయమేనా?

కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జూనారెడ్డి బీజేపీలో చేరడం ఖాయమేనా అంటే.. పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటే అంతకంటే వేరే ఆప్షన్ కూడా ఆయనకు లేదని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. దేశమంతా కాంగ్రెస్ దెబ్బతిన్న క్రమంలో ఢిల్లీలో ఆయనకంటూ పెద్దదిక్కు ఎవరూ లేకపోవడం ఆయనకు పెద్దమైనస్ పాయింట్. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాక.. ఆ స్థానాన్ని రేవంత్ చేత భర్తీ చేద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ ఎంపిక కూడా దాదాపుగా ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే రేవంత్ దూకుడును, పోకడను, రాకడను ససేమిరా అంటున్న సీనియర్లు మాత్రం రేవంత్ వస్తే తాము పార్టీలో ఉండే ప్రశ్నే లేదని భీష్మించుక్కూర్చున్నారు. రేవంత్ వస్తే తమ ప్రాధాన్యత అసలు ఏమాత్రం లేకుండా పోతుందని, ఇన్నాళ్లూ ఉనికి చాటుకున్న పార్టీలో అసలు ఉనికే లేకుండా పడిఉండడం తమ వల్ల కాదని వారంటున్నారు. అందుకే దాదాపు గత ఏడాదిన్నరగా రేవంత్ టీ-పీసీసీ అనౌన్స్ మెంట్ ను తొక్కి పెట్టినట్లు సమాచారం. అయితే గ్రేటర్ ఫలితాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుపడే సూచనలేవీ కనిపించకపోవడంతో ఇదే అదనుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ప్లేస్ ను రేవంత్ చేత భర్తీ చేయడాన్ని జీర్ణించుకోలేని నేతలు పార్టీకి సామూహికంగా గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ పరిస్థితులను ఏమాత్రం సరిదిద్దే స్థితిలో లేని అధిష్టానం మధ్యేమార్గంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా పీసీసీ చీఫ్ గా ప్రకటించే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలున్నాయి.

 

ఇక జానారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా, సీనియర్ నేతగా నియోజకవర్గంలో మంచి గుర్తింపే కాక తెలంగాణవ్యాప్తంగా ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు. పైగా ఆయనకు పర్సనల్ గా ఢిల్లీ రాజకీయాల్లో పని చేయాలన్న ఆలోచన ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆయన మనోభీష్టం తీరాలంటే కాంగ్రెస్ లో సాధ్యమవుతుందా అన్నది ఎవరైనా సులభంగానే అర్థం చేసుకోవచ్చు. మరి ఢిల్లీలో అడుగు పెట్టాలంటే ఏం చేయాలి? ప్రత్యామ్నాయ పార్టీ వైపు అడుగులు వేయాలి. ఈ కారణంగానే ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తన కోరిక తీరాలన్నా.. కొడుకు రఘువీర్ రెడ్డికి రాజకీయ భవిష్యత్ కల్పించాలన్నా బీజేపీ తప్ప మరో మార్గం కనిపించడం లేదని జానా భావిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. 

మరోవైపు తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాన్ని ప్రజలకు అందిద్దామని కంకంణం కట్టుకున్న బీజేపీ అధిష్టానం అందుకోసం ఎక్కడిదాకానైనా వెళ్లేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేతలైన జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, శ్రీధర్ బాబు లాంటి వారిని లాగేసేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత