Skip to main content

గీ పట్నపోల్లకు ఏమైంది?

ఈ నగరానికి ఏమైంది.. అని తెలుగు ప్రజలంతా ఆశ్చర్యపోవాల్సిన సందర్భమిది. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీ పోరాడి మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని తహతహలాడాయి. గతంలో కంటే ఈసారైనా పోలింగ్ శాతం పెరుగుతుందని భావించారు. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. సగం కన్నా ఎక్కువ అనేదే ప్రజాస్వామ్యానికి మూల సూత్రం. మరి ప్రజల్లో 50 శాతం పోలింగ్ కానప్పుడు దాన్ని ప్రజాస్వామ్యంగా పరిగణించవచ్చా? అది మేలైన ప్రజాస్వామ్యమేనా అనే చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు? కేంద్రమో, రాష్ట్రాలో దీనికోసం పూనుకోవాల్సిన అవసరం లేదా?

(పాఠకులు ఇబ్బంది అనుకోకుండా తెలంగాణ స్లాంగ్ లో చదువుకోవాలని మనవి)

గీ పట్నపోల్లకు ఏమైంది? యూత్ పోరలు, సదువుకున్నోల్లు, జాబుల్ జేసేటోల్లు యాడ వోయిండ్రు? మొన్నటి సంది జెప్తనే ఉన్నం గదా... ఓట్లేసుడంటే ప్రజాస్వామ్య పండుగ అన్జెప్తన్నం గదా.. మల్లేమాయె. అరె.. మొన్న బీజేపీ పెద్దసార్లయితే ఓ మునుం బెట్టి పట్నానికచ్చిండ్రు గదా. అమిత్ సార్ గల్లీ మార్చ్ సౌండూ.. డిల్లీదాక పాకింది గదా. గా షో జూత్తెనైతే ఇగ హైదరాబాద్ జనం పోలింగ్ బూత్ ల కాడ లైన్ల మీద లైన్లు గట్టి ఓట్లకోసం పోటెత్తుతరు గావచ్చు అనుకున్నరు గదా. కనీ గసొంటి లెక్కలైతే యాడ నజర్ కు రాలే. అటు అమిత్ సారూ.. ఇటు అత్కార పార్టీ మంత్రులు, పెద్దపెద్ద లీడల్రు గల్లీలల్లనే టికానా వెట్టి అన్ని దగ్గరుండి సూస్కున్నరు. అయినా గూడ హైదరాబాద్ ఎలచ్చన్లు గింత అద్వానంగా తయారైనైయేంది? గీ ముచ్చటతోని పార్టీలన్ని గూడా పరేషాన్ల వడ్డయి. 

పల్లెలతోని టచ్చున్న పటాంచెరువసోంటి ఊర్లల్ల బగ్గనే పోలింగైంది. గీడ అమీర్ పేట, మాదాపూర్, కొండాపూర్ అసోంటి సాఫ్ట్ వేరోల్లు ఎక్వ మంది ఉండేకాడనేమో అద్వానంగా తయారైంది. పట్నంల సద్వుకున్న సార్ల తీరు జూసి అన్ని పార్టీల లీడల్రు గూడా.. ఇగ ఏడ్సుడొక్కటే తక్వవైతందాట. ఎందుకీల్లు గిట్ల తయారైండ్రు.. అన్ని గావాల్నంటరు... ఆకర్కు ఓటెయ్యరు.. ఓటెయ్యకపోతే ప్రజాస్వామ్యానికి అర్తమేంది? 20 శాతమో.. 30 శాతమో పోలైన పర్సెంటేజ్‍ను ప్రజాస్వామ్యం అన్జెప్పి సంకలు గుద్దుకొని సంబరపడ్దామా? గంత తక్వ పోలింగ్‍తోని మున్సిపల్ ఆపీస్ల గూసుండే లీడరు.. ఏంజేత్తె గాదాన్ని మనం అందరం ఆమోదించినట్టేనా? అండ్ల ప్రజాస్వామ్యం ఉన్నట్టేనా? గిసోంటి ఆలోశన్లు మేదావులల్ల, పార్టీలల్ల, ఎన్జీవోలల్ల మొదలైనయాట. మరి గసొంటప్పుడు తప్పకుంట ఓటేసే తీర్గ ఏమన్న కొత్త రూల్ దీస్కద్దామా? ఓటేసినోల్లకే నల్లా కనెచ్చను, ఓటర్ కారటు, రేషన్ కారటు ఉంటయని, లేకుంటే బంద్ జేత్తమని పెడ్తే ఎట్లుంటదీ.. అని గూడ సోచాయిస్తండ్రాట. మరి.. గీ ఎలచ్చన్ల ఎవల్ గెల్తరో సూసి.. రూలింగ్‍లకు వచ్చినోల్లు ఏం జేత్తరో సూద్దాం. 


Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

శ్రీశైల క్షేత్రంలో ఫొటోలు తీయబడును

ఎంతో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడే గాక ప్రతి భారతీయుడు కూడా ఆసక్తి చూపుతాడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీశైల  మహా క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకే గాక అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే శ్రీశైలానికి ఉండే తాకిడి మామూలుగా ఉండదు. అయితే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఉన్నట్టుగానే శ్రీశైలంలో కూడా ఫొటోలు, వీడియోలు తీయరాదనే  నిబంధన  ఉంది. ఎవరైనా కెమెరాలతో, సెల్ ఫోన్లతో లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా చేస్తే వాటిని ఆలయ సిబ్బంది జప్తు కూడా చేస్తారు. భద్రతా కారణాల రీత్యా కూడా శ్రీశైలం విషయంలో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిబంధనలు మాత్రం పేరుకే స్ట్రిక్టుగా ఉన్నాయి గానీ.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనంటున్నారు భక్తులు.  ఎందుకంటే శ్రైశైలంలో దలారీ ఆనంద్ ను సంప్రదిస్తే ఎవరైనా, ఎక్కడైనా ఫొటో తీసుకోవచ్చు. అడిగినంత మొత్తం చెల్లిస్తే అమ్మవారి సన్నిధిలోనైనా, అయ్యవారి సన్నిధిలోనైనా.. ఎక్కడైనా సరే క్యాష్ పడేస్తే ఫొటో క్లిక

రేవంత్ డిమాండ్- తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని లేకపోతే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. టెస్టులు పెంచాలని ఐసీఎంఆర్ చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వం చేసే అంతంత మాత్రం టెస్టుల్లోనే రాష్ట్రంలో 32.1 శాతం మేరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో కరాళ నృత్యం చేస్తుందో ఈ పర్సెంటేజీలే నిదర్శనం అన్నారు. లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం కాంగ్రెస్ ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వెనుక కేసీఆర్ ఒత్తిడే ఉందని, ప్రభుత్వ, ప్రైవేటు వైద్య వ్యవస్థలను సమీకృతం చేసి కరోనాను ఎదుర్కొనే ప్రణాళిక రచించాలని రేవంత్ సూచించారు. కరోనా విషయంలో కేసీఆర్ సర్కారు మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వీఐపీల ప్రాణాలకు ఇస్తున్న విలువ పేద-మధ్యతరగతికి ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం కంటే స్మశానానికి వెళ్లడం మేలు అన్న నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వస్తున్నారన్నారు. సీతక్క సలహా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఎ