Skip to main content

Posts

గ్రేటర్ పోల్: ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్

డిసెంబర్ 1న జ‌రిగే జీహెచ్ఎంసీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  మొత్తం ఓటర్ల సంఖ్య 74,44,260:  పురుషులు 38,76,688, స్త్రీలు 35,65 896, ఇతరులు 676 మొత్తం వార్డుల సంఖ్య 150 పోటీ చేసే అభ్యర్థులు 1122:      టి.ఆర్.ఎస్ 150, బి.జె.పి 149,  కాంగ్రెస్ 146,  టి.డి.పి 106,  ఎం.ఐ.ఎం 51,  సి.పి.ఐ 17,  సి.పి.ఎం 12,  రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు 76,  స్వతంత్రులు 415 ఫ్లయింగ్ స్క్వాడ్ ల సంఖ్య  60,  స్టాటిక్ సర్వీలియన్స్ టీమ్ ల సంఖ్య 30 పోలింగ్ సిబ్బంది 48,000 రిటర్నింగ్ అధికారులు 150 సహాయ రిటర్నింగ్ అధికారులు 150 సాధారణ పరిశీలకులు 14 వ్యయ పరిశీలకులు 34 మైక్రో అబ్జర్వర్ లు 1729, వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు 2277 మొత్తం బ్యాలెట్ బాక్స్ ల సంఖ్య 28683 పోస్టల్ బ్యాలెట్లకై అందిన దరఖాస్తులు 2831 డిసెంబర్ 1న ఉ. 5:30గంట‌ల వ‌ర‌కు ఎన్నిక‌ల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలి. 6 గంట‌ల‌కు పోలింగ్ ఏజెంట్లు హాజ‌రుకావాలి. ఉ. 6 నుండి 6:15 మ‌ధ్య మాక్ పోలింగ్ జ‌రుగుతుంది. ఉ. 6:55 గంట‌ల‌కు బ్యాలెట్ బాక్స్ లను సీల్ చేయ‌డం జ‌రుగుతుంది.  ఉ. 7గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభం. సా. 6గంట‌ల‌కు పోలింగ్ పూర

వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్ లైన్ టికెట్లు

తిరుమల వేంకటేశ్వరస్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో టికెట్లను అందుబాటులో ఉంచుతుంది. డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి రోజు 20 వేల టిక్కెట్లను జారీ చేస్తామని చెప్పారు. Readable:   గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై సర్వేలు ఏం చెబుతున్నాయి?                          హైదరాబాద్ లో రోహింగ్యాలు.. కన్ఫామ్

గ్రేటర్ ఎన్నికలపై సర్వేలు ఏం చెప్తున్నాయి?

గ్రేటర్ ఎన్నికలు జాతీయ అంశంగా మారడంతో అందరి దృష్టీ హైదరాబాద్ మీదనే పడింది. ఎవరు గెలుస్తారు.. ఎవరు గ్రేటర్ పీఠాన్ని ఏలుతారు.. అనేది అందరి మదనీ తొలుస్తున్న అంశం. అందరికన్నా ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, దాని మిత్రుడైన ఎంఐఎం కు మరింత అవసరమైన సబ్జెక్టు. దీని మీద గ్రౌండ్ సర్వేలు కూడా పలు ప్రైవేట్ సంస్థలు చేస్తున్నాయి. నవంబర్ మొదటి నుంచి ఆయా సంస్థలు క్షేత్ర స్థాయిలో పనిచేసి రిపోర్టులను రికార్డు చేస్తున్నాయి. రాజకీయ వ్యాఖ్యానాలు, వేడి పుట్టించే కామెంట్లు వాతావరణాన్ని గంభీరంగా మారుస్తూ... ప్రజల నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.  ఈ క్రమంలో అందుబాటులో ఉన్న సంస్థల రిపోర్టులు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు.  Also Read:  రోహింగ్యాల మీద హడావుడిగా ప్రెస్‍మీట్ ఎందుకు పెట్టినట్టు?                          ఒవైసీలతో స్నేహం కేసీఆర్ కు సవాలేనా? ఈ వీడియోలో ఇంకా పూర్తి వివరాలు, విశ్లేషణ ఉన్నాయి. చూడండి.  

రోహింగ్యాల మీద హడావుడిగా ప్రెస్‍మీట్ ఎందుకు పెట్టినట్టు?

హైదరాబాద్ లో రోహింగ్యాల అంశం మరోసారి పెద్ద దుమారమే రేపుతోంది. రాచకొండ సీపీ మహేశ్ భాగవత్ ప్రెస్ మీట్ పెట్టి వారి సంఖ్య ఎంతుందో హడావుడిగా ప్రకటించాల్సి రావడమే.. కేసీఆర్ సర్కారులో కలవరం ఏ స్థాయిలో రేగుతుందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్‍లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాల మీద, పాకిస్తాన్, బంగ్లాదేశీ చొరబాటుదార్ల పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చాలెంజ్ చేయడంతో తేనెతుట్టెను కదిపినట్టయింది. సర్జికల్ స్ట్రయిక్స్ కామెంట్స్ తో ఎంఐఎం, టీఆర్ఎస్ మిత్రులు ఉలిక్కిపడ్డారు. అయితే ఉలికిపాటు బయటికి కనిపించనీయకుండా.. అసలు రోహింగ్యాలు కేంద్రం పరిధిలోని అంశం... దానికి రాష్ట్రంతో సంబంధమేంటని కేటీఆర్ బంతిని అవతలికి తోసేయగా.. మిత్రుడైన అసదుద్దీన్ రోహింగ్యాలకు ఓటర్ ఐడీ, ఆధార్ కార్డుల్లాంటివి ఒక్కటన్నా ఇచ్చినట్టు రుజువు చేయాలని సవాల్ విసిరారు.  ఈ క్రమంలో హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నారని కిషన్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ లో ప్రకటించిన మరుసటి రోజే రాచకొండ సీపీ పత్రికాముఖంగా ప్రకటించడం సంచలనం రేపుతోంది. రోహింగ్యాలపై తాము దృస్టి సారించామని, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4835 మంది రోహింగ్యాలు ఉన్

మాదిగ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‍లో ఒత్తిడి తేవాలి

మాదిగ రిజర్వేషన్ల అమలు కోసం అమరులైనవారికి తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఘనంగా నివాళులర్పించింది. వారి కుటుంబాలకు టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఇటుక రాజు ఉడతా భక్తిగా సాయం చేసి వారికి ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. సికింద్రాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీ-ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, నాయకులు, అమరవీరుల బంధువులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రిజర్వేషన్ల సాధనకు వాతావరణం అనుకూలిస్తున్నదని, సుప్రీంకోర్టు ఈమధ్య రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్రాలే పూర్తి చేసుకోవచ్చని చెప్పడం శుభ పరిణామమని ఇటుక రాజు ఆనందం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం రచించి డ్రాప్టింగ్ కమిటికి ఇచ్చిన రోజున తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఐదో వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సుప్రీంకోర్టులో ఐదుగురితో కూడిన దర్మాసనం.. వర్గీకరణ ప్రక్రియను రాష్ట్రాలే పూర్తి చేసుకోవచ్చన్న సూచనను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. 29 రాష్ట్రాల్లో ఎస్సీల్లో 108 కులాలు ఉన్నాయని కొన్ని కులాలకు రిజర్వేషన్లు అందడం లేదని, వర్గీకరణ జరిగితే కింది కులాలకు కూడా ఫలాలు అందుతాయని రాజు ఆకాంక్షించారు.  జనాభా నిష్పత్తి ప్రకారం కులాలకు రిజర్వేషన్ల పంపిణీ జరగాలని డాక

గద్గద స్వరంతో మాట్లాడిన గౌడ్‍సాబ్: ఏమన్నాడంటే..

తెలంగాణ తొలి శాసనమండలి చైర్మన్ గా పనిచేసిన స్వామిగౌడ్ ను తెలంగాణ పౌరులకు, ముఖ్యంగా ఉద్యమంతో ఏ కాస్త సంబంధం ఉన్నవారికైనా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరిన స్వామిగౌడ్... తాజాగా ప్రెస్ మీట్ లో మనసువిప్పి మాట్లాడారు. పార్టీలో తనకు జరిగిన అవమానం నుంచి ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్.. ఎంఐఎంతో రాజీపడిపోయి వ్యవహరిస్తుండడం వరకు అనేక అంశాలను మీడియాతో ఖుల్లంఖుల్లా పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన గొంతు తడబడటం గమనించాల్సిన అంశం. అత్తగారింటి నుంచి తల్లిగారింటికి వచ్చినట్లయిందని.. తాను చిన్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన అంశాన్ని గుర్తు చేసుకోవడం విశేషం.  స్వామిగౌడ్ లేవనెత్తిన అంశాలు: 1) తెలంగాణ ఉద్యమంలో గజ్జె కట్టి పాటపాడిన కళాకారులు ఎక్కడ? 2) వలస పాలకుల దమననీతికి వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పనిచేసిన పాత్రికేయుల జాడెక్కడ? 3) తెలంగాణ ఉద్యమాన్ని భుజాలకెత్తుకొని కష్టనష్టాలకోర్చిన ఉద్యమకారులు ఇప్పుడెక్కడ ఉన్నారు? 4) ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తిని తీర్చిండి. వారిని పిలిచి ఎందుకు మాట్లాడడం లేదు? 5) నా నియోజకవర్గంలో,

అంబేద్కర్ చిత్రపటానికి జగన్ నివాళులు

రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాసాహెబ్ అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో బాబాసాహెబ్‌ డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి  సీఎం జగన్ తో పాటు మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, పలువురు ఉన్నతాధికారులు నివాళులర్పించారు.