Also Read: సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్
గ్రేటర్ ఎన్నికల ఫలితాలెలా ఉంటాయని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలకు నిరాశ తప్పడం లేదు. అలాంటివారు 3వ తేదీ సాయంత్రం వరకు వేచిచూడాల్సిందే. ఓల్డ్ మలక్ పేట బ్యాలెట్ పేపర్లో సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తు (కంకి కొడవలికి బదులు సుత్తె కొడవలి) అచ్చయ్యాయి. ఈ వార్త మీడియాలో హైలైట్ గా మారింది. దీంతో సీపీఎం నేతలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఫలితంగా ఓల్డ్ మలక్ పేట ఎన్నికను అధికారులు రద్దు చేశారు. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ కూడా ఎవరూ విడుదల చేయరాదని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. దీంతో 3వ తేదీన రీపోలింగ్ తరువాతే ఎగ్జిట్ పోల్ సర్వేలు విడుదలవుతాయి.
Also Read: గీ పట్నపోల్లకు ఏమైంది?
వాస్తవానికి దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న హైదరాబాద్ ఎన్నికలపై వోటర్ నాడి రికార్డు చేసేందుకు పలు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. విడతలవారీగా సర్వేలు నమోదు చేస్తూ ఆసక్తికరంగా మారుతున్న గ్రౌండ్ వివరాలను అంచనా వేస్తూ తుది నిర్ణయం వెలువరించేందుకు కసరత్తు చేస్తున్నాయి.
Comments
Post a Comment
Your Comments Please: