Skip to main content

అన్ని సర్వేలూ అదే చెబుతున్నాయి.. ఒక్కటి తప్ప

ఓటరన్న తన పని తాను కానిచ్చేశాడు. తనను సంప్రదించిన పార్టీలతో ఏం మాట్లాడాలో అదే మాట్లాడాడు. మీట నొక్కాల్సిన చోట నొక్కాడు. నిశ్శబ్దంగా తన రొటీన్ వర్క్ లోకి వెళ్లిపోయాడు. మరి ఆ ఓటరు ఏ మీట నొక్కాడు.. ఎవరి మీటరు మార్చబోతున్నాడు.. ఎవరి తలరాత మారబోతుంది? మునుగోడులో ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏం చెబుతున్నాయి? ఆ కీలకమైన విషయాలు మీకోసం. 

మునుగోడులో పరుగుపందెంలా మారిన ఉపఎన్నికలో హుజూరాబాద్ ఫలితం రిపీట్ కాకూడదన్న పట్టుదలతో టీఆర్ఎస్... మరో హుజూరాబాద్ లా మార్చేయాలన్న వ్యూహంతో బీజేపీ శ్రేణులు పనిచేశాయి. సర్వే సంస్థలు కూడా ఈ పోటీ తీవ్రతను అర్థం చేసుకొని.. అదే స్థాయిలో ఓటర్ల నాడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాయి. అత్యధిక సర్వే సంస్థలు టీఆర్ఎస్ గెలుస్తుందని అంచనా వేయగా.. ఒకటీ, అరా సర్వే సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి. ఆయా సర్వే సంస్థల రిపోర్టును ఆసరా చేసుకొని పార్టీలు కూడా గెలుపు తమదేననే ధీమాలో ఉన్నాయి. 

థర్డ్ విజన్ రీసెర్చ్ నాగన్న ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ 48 నుంచి 51 శాతం ఓట్లు సాధిస్తుంది. బీజేపీ 31 నుంచి 35 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంటుందని పేర్కొంది. 13 నుంచి 15 శాతం ఓట్లతో కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంటుందని అంచనా వేసింది. బీఎస్పీ 5 నుంచి 7 శాతం ఓట్లు కైవసం చేసుకుంటుందని, ఇతరులు 2 నుంచి 5 శాతం ఓట్లు పొందే అవకాశం ఉందని థర్డ్ విజన్ అంచనా వేసింది. 

మరో సర్వే సంస్థ అయిన ఎస్.ఎ.ఎస్ గ్రూప్ కూడా టీఆర్ఎస్ అభ్యర్థే గెలుస్తారని అంచనా వేసింది. 41 నుంచి 42 శాతం ఓట్లతో టీఆర్ఎస్ గెలుస్తుందని, 35 నుంచి 36 శాతం ఓట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలుస్తుందని, కాంగ్రెస్ అభ్యర్థి 16న్నర నుంచి 17న్నర శాతం ఓట్లు పొందే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇక బీఎస్పీకి 4 నుంచి 5 శాతం ఓట్లు, ఇతరులకు ఒకటిన్నర నుంచి 2 శాతం ఓట్లు పోలవుతాయని అంచనా వేసింది. వీరు కాకుండా పలు ఇతర సర్వే సంస్థలు కూడా దాదాపు ఇదే రకమైన అంచనాతో రిపోర్టులు వెలువరించడం విశేషం. 

ఇక నేషన్ ఫ్యామిలీ ఒపీనియన్ ఎగ్జిట్ పోల్ కూడా అలాంటి రిపోర్టే ఇచ్చింది. 

టీఆర్ఎస్- 42.11 శాతం,  బీజేపీ-     35.17 శాతం,  కాంగ్రెస్-    14.07 శాతం,  బీఎస్పీ-     2.95 శాతం,  ఇతరులు-  5.70 శాతం

ప్రముఖ తెలుగు దినపత్రిక, జనంసాక్షి మీడియా సంస్థ మునుగోడు పల్స్ పట్టుకునేందుకు పెద్దఎత్తున కసరత్తు చేసింది. గతంలో హుజూరాబాద్ బైపోల్ లో పలు సర్వే సంస్థలు టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పగా.. జనంసాక్షి మాత్రం బీజేపీ గెలుస్తుందని కుండబద్దలు కొట్టింది. అలాంటి క్రెడిబిలిటీ సంపాదించుకున్న జనంసాక్షి ఈసారి కూడా అదే పద్ధతిలో పని చేసింది. జనంసాక్షి ఇచ్చిన రిపోర్టు ఇలా ఉంది. 

టీఆర్ఎస్: 45-52 శాతం,  బీజేపీ:     29-34 శాతం,  కాంగ్రెస్:    16-18 శాతం,  బీఎస్పీ:     4-5 శాతం

మునుగోడు బైపోల్ కోసం ప్రముఖ దినపత్రిక పోలీస్ నిఘా పటిష్టమైన సర్వే నిర్వహించింది. మునుగోడు మండలంలో బీజేపీదే పైచెయ్యిగా ఉంటుందని, చౌటుప్పల్ మండలంతో పాటు మున్సిపాలిటీలో పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా ఉందని, మున్సిపాలిటీలో మాత్రం బీజేపీ హవా హవా కొనసాగుతుందంటున్నారు. నారాయణపూర్ మండలంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ. కానీ కాంగ్రెస్‎దే పైచేయిగా ఉంటుంది. మర్రిగూడ మండలంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. స్వల్ప శాతంతో బీజేపీ ముందుంటుంది. చండూరులో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నా టిఆర్ఎస్ దే పైచేయిగా నిలుస్తుంది. నియోజకవర్గంలో 2018లో 2లక్షల 11వేల పైచిలుకు ఉన్న ఓట్లు నేడు కొత్తగా నమోదైన ఓటర్లతో 2,41,805 నమోదయ్యాయి. దీంతో అభ్యర్థుల గెలుపోటములను కొత్త ఓటర్లే తేల్చే అవకాశాలున్నాయి. మొత్తమ్మీద 2వేల నుండి 5 వేల ఓట్ల లోపు మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశాలున్నట్లు పోలీస్ నిఘా పత్రిక అంచనా వేస్తోంది. మెజారిటీలో 1000  ప్లస్ లేదా మైనస్ ఉండే చాన్సుంది. 

బీజేపీ: 36.9 శాతం,  టీఆర్ఎస్: 35.5 శాతం,  కాంగ్రెస్: 23.0 శాతం,  బీఎస్పీ: 3.2  శాతం,  ఇతరులు: 1.4 శాతం

మరో ప్రముఖ సర్వే సంస్థ అయిన ఆరా గ్రూపు టీఆర్ఎస్ 50 శాతానికి పైగా ఓట్లు నమోదు చేస్తుందని అంచనా వేసింది. 

2018 ఎన్నికల్లో మునుగోడులో 91.3 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి 93.13 శాతానికి పెరిగింది. అంటే 3.1 శాతం మంది ఓటర్లు అదనంగా ఓటుహక్కు వినియోగించుకున్నారన్నమాట. అయితే ఈ భారీ పోలింగ్ ప్రభుత్వం మీద వ్యతిరేకతనా లేక ప్రభుత్వానికి అనుకూలమా అన్నదానిమీదనే అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత