Skip to main content

చంద్రబాబు ప్రయత్నాలు ఢిల్లీలో ఫలించలేదా?

చంద్రబాబుకు అక్కడ ఢిల్లీలో ద్వారాలు మూసుకుపోయాయా? ఆయన ఎంత ప్రయత్నించినా అమిత్ షా మనసు కరగలేదా? తన కష్టాలు తీరాలన్నా, పార్టీ మీద నీలినీడలు తేలిపోవాలన్నా బలమైన జాతీయ పార్టీ అండ కావాలని కోరుకున్న బాబుకు.. కమలనాథుల నుంచి సరైన రెస్పాన్స్ రాలేదట. ఆ విషయం కన్ఫామ్ అయ్యాకనే ఆయన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ వైపు మళ్లీ ప్రయాణం మొదలుపెట్టడం ఖాయంగా మారిందట. మరి ఆ విశేషాలేంటి?

మొక్క ఎదగాలంటే పందిరి కావాలి. పందిరి లేకపోతే ఎంత మంచి మొక్క అయినా కూడా ఎదగడం ఆగిపోతుంది. అయితే ఒకప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు అచ్చం మొక్కలాగే మారిపోయిందట. మరి మొక్కలాంటి పార్టీకి ఎవరో ఒకరు నీరు పోయాల్సిందే. ఎవరో ఒకరి చెయ్యి అందించాల్సిందే. బాబు అందుకోసమే కొన్ని నెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ప్రాంతీయ పార్టీగా తెలంగాణలోనే కాదు.. అటు ఆంధ్రాలోనూ ఇప్పుడు టీడీపీ తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోయింది. తెలంగాణలో అయితే దాదాపుగా అదృశ్యమయ్యే పరిస్థితి నెలకొంది. తెలంగాణ టీడీపీలో అసలు కీలక నేతలెవరూ లేకుండా పోయారంటే అతిశయోక్తి కాదు. పట్టణాల్లో, గ్రామాల్లో అక్కడక్కడా సానుభూతిపరులు, పాత కేడర్ ఉన్నా.. బాబు చేస్తున్న నిర్వాకం వల్ల వారు మనసు మార్చుకొని ఇతర పార్టీల్లో సెటిలైపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయనేది ఆరా తీస్తే.. ఔరా అంత చరిత్ర ఉన్న పార్టీకి ఇంతటి దుర్దశ పట్టిందా.. అంటూ మనసు వికలమైపోతుందంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. బీజేపీ మీద ఆశలు పూర్తిగా వదిలేసుకున్నారట. మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరే విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారనే అభిప్రాయాలు, వ్యాఖ్యలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ పార్టీ అండ తనకు అవసరమని ఆయన భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైతే కమలం పార్టీ ఆయన్ని నిరాకరిస్తోందని.. ఇదే వైఖరిని కొనసాగిస్తే కాంగ్రెస్‌ పంచన చేరేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారంటున్నారు రాజకీయ పరిశీలకులు. తాను కాంగ్రెస్ వైపు వెళ్లడానికి వెనుకాడేది లేదని చెప్పడానికే.. ఇక్కడ తెలంగాణలో పోటీ నుంచి విరమించుకున్నారని.. బాబు పొలిటికల్ డెసిషన్లో అది శ్యాంపిల్ మాత్రమేనని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబునాయుడు బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఆ సమయంలో ప్రతిపక్షాలతో ఉమ్మడి కూటమి ఏర్పాటులో ఆయనే క్రియాశీల పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా జరిగిన ప్రతిపక్ష పార్టీల సభల్లోనూ పాల్గొన్నారు. బీజేపీ కేంద్రంలో ఓడిపోతుందనే ధీమాతోనే ఆయన అలా చేశారంటారు. ఆ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, కేంద్రంలో ప్రతిపక్షాలు ఘోర ఓటమి చవిచూశాక... ప్రధాని మోడీ కరుణా కటాక్షం కోసం చంద్రబాబు చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తి కాదు. తాను తీవ్రంగా నిందించిన మోడీని ప్రసన్నం చేసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించడం లేదు. ఒకవేళ అప్పటినుంచే బీజేపీతో సరైన మైత్రిని కొనసాగిస్తూ ఉన్నట్టయితే బాబుకు ఈ పరిస్థితి ఎదురై ఉండేది కాదన్న అభిప్రాయాలు కూడా కొందరి నుంచి వినిపిస్తున్నాయి. అయితే జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సింది చూడాలనే ఆపత్కాల అవస్థలో పడిపోయారట చంద్రబాబు.

మరోవైపు ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా బ్లాక్‌గా ఏర్పడ్డాయి. అవేవీ టీడీపీని పట్టించుకోవడం మానేశాయి. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు బీజేపీకి దగ్గరవడం వల్లే కీలకమైన ప్రతిపక్షాలన్నీ బాబును ప్రతిపక్ష నేతగా గుర్తించడం మానేశాయట. ఈ నేపథ్యంలో బాబు ప్లాన్‌ బీ ని రెడీ చేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌కు దగ్గర కావడం ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోదలచారట. అందుకే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లోపాయికారీగా మద్దతిచ్చేందుకు నిర్ణయించారని తెలుస్తోంది. ఆంధ్రా సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్‌కు పడితే, ఆ పార్టీ గెలుపు ఈజీ అవుతుంది. కీలకమైన తెలంగాణపై పట్టు సాధిస్తే, 2024 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే... కేంద్రస్థాయిలో మళ్లీ చక్రం తిప్పే అవకాశం తనకు లభిస్తుందనేది చంద్రబాబు ప్లాన్ బి లోని సూత్రమట. జగన్‌ తనపై వరుసగా కేసులు పెడుతుండటంతో బాబుకు ఇప్పుడు కేంద్రం అండ అవసరం అవుతోంది. తాను ఎంత చేరువ అవుతున్నా బీజేపీ నుంచి రక్షణ అందడం లేదు. అందుకే ఆయన హస్తానికి స్నేహ హస్తం అందించేందుకు రెడీ అయిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే, ఆంద్రాలో కూడా ఆ పార్టీకి కొన్ని సీట్లు కేటాయించే ఆలోచన చేస్తున్నారట చంద్రబాబు.

అయితే చంద్రబాబు ఆలోచనలు, వ్యూహాలు వాస్తవాలకు చాలా దూరంగా ఉంటాయని ఆ పార్టీలోని పలువురు సీనియర్లే చెబుతున్నారు. మరి చంద్రబాబు ఈసారి కాంగ్రెస్ వైపు వెళ్తే.. ఆ పథకం కూడా ఉల్టాపల్టా అయిపోతే.. బాబు మళ్లీ ఏం చేస్తారన్న ఆందోళన సీనియర్ల నుంచి వ్యక్తమవుతోంది. చంద్రబాబు మాత్రం.. బయటికొచ్చినా.. జైల్లో ఉన్నా.. ప్లాన్ బిలు, ప్లాన్ సిలు రచిస్తూనే ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత