Skip to main content

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి?

పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు. 

విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్చం సగం నరుడు, మరో సగం మృగంగా ఉందని.. అది నరసింహావతారాన్ని సూచించేదే అని అంటున్నారు. 

ఇక ఈజిప్టులోనైతే రాముడు, రావణుడు, సీత కార్వింగ్స్ తో పాటు పట్టణాల పేర్లు కూడా రామాయణ పాత్రలతో పోలి ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున పాల్గొన్న భారత సైనిక దళాలు వెనక్కి తిరిగివస్తుండగా.. ఈజిప్టు, లిబియా, ఇరాన్, ఇరాక్ వంటి ప్రాంతాల్లో రామాయణం నాటి కార్వింగ్స్, టెంపుల్స్ కనిపించాయట. పాతకాలంలో అచ్చంగా రాముణ్ని పోలిన విగ్రహం ఇరాక్ లోని కుర్దిస్తాన్ లో కనిపించిందట. ఇరాక్ లోని రణ్యా అనే సిటీ.. ఆ పక్కనే గిర్దే దేమా అనే కొండ మీద అతి ప్రాచీన దేవాలయం కనిపించిందట. అంతేకాదు.. అక్కడున్న ఇతర మరికొన్ని కొండప్రాంతాల్లో ప్రాచీన మానవుల అస్తికలు, మృత కళేబరాల ఆనవాళ్లు కనిపించాయట. అవన్నింటినీ లెక్కిస్తే అవి దాదాపు 250 మందికి చెందినవని నిర్ధారించారు. ఈ కార్వింగ్ ను చూస్తే.. రాముడు, ఆయన ముందు హనుమంతుడేనని కచ్చితంగా చెప్పవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఈ విషయం హైలైట్ కావడంతో.. అప్పటి డెన్మార్క్ దేశానికి చెందిన ఒక ఆర్కియాలజీ నిపుణుల బృందం ఆ కార్వింగ్స్ గురించి లోతైన అధ్యయనం చేసింద. 1957 నుంచి 59 మధ్య డానిష్ ఆర్కియలాజికల్ టీమ్.. ఇరాక్ దేశ అనుమతితో.. అక్కడి టీమ్ తో కలిసి స్టడీ చేసింది. దీంతో ఆ విగ్రహాలకు అతిప్రాచీన భారతీయ సనాతన ధర్మానికి చెందినవేనని నిర్ధారణ జరిగింది. 

అక్కడ కనిపించిన రాముడు, సీత, లక్ష్మణుడు వంటి ఆనవాళ్లను బట్టి.. వారు రామాయణ ఇతిహాసాన్ని తమ సంస్కృతిగా భావించేవారని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈజిప్టు అనే పేరే అజపతి అనే శబ్దానికి భ్రష్ట రూపంగా భాషావేత్తలు భావిస్తున్నారు. రాముని పూర్వీకుల్లో అజపతి అనే రాజు ఉండేవాడని.. ఆయనకు గుర్తుగానే ఈజిప్టుకు ఆ పేరు పెట్టారని నిర్ధారించారు. అంతేకాదు.. ఈజిప్టు రాజుల్లో రాంసెస్-1, రాంసెస్-2, రమేసిస్ వంటి పేర్లు గల పూర్వజులు ఉండేవారని అక్కడి ప్రాచీన చరిత్రలో నమోదై ఉంది. రామా ఈసుస్.. అంటే రాముడు అనే దేవుడు అని వివరణ ఇస్తున్నారు భాషావేత్తలు. కాబట్టి రాముణ్ని ఆనాటి కాలంలోనే వారు దేవుడిగా గుర్తించి కొలిచినట్టు అర్థం చేసుకోవచ్చు. 

యూరోప్ లోని ఇటలీవంటి మరిన్ని దేశల్లో ప్రాచీన రాముడికి సంబంధించిన బలమైన ఆనవాళ్లు కనిపించాయి. ఇటలీ క్యాపిటల్ సిటీ అయిన రోమ్.. రాముడి పేరేనని భారతీయ సంస్కృత పండితులు ఏనాడో నిర్ధారించారు. డెన్మార్క్ ఆర్కియలాజికల్ టీమ్ పేర్కొన్న కాలాన్నిబట్టి.. అది కచ్చితంగా రాముడి పేరేనని అనేక గ్రంథాల్లోనూ పేర్కొన్నారు. రోమ్ ను ఇప్పుడు R..O..M..Eగా రాస్తున్నా గతంలో R..O..M..A గా పేర్కొనేవారట. అలాగే ఉచ్చారణ కూడా రామా అనే చెప్పేవారట. ఇటలీ భాష రూల్స్ ప్రకారం ఓ అక్షరాన్ని ఆ అని అనేక సందర్భాల్లో ఇప్పటికీ ఉచ్చరిస్తారంటారు భాషావేత్తలు. ఆ విధంగా రోమ్ అనేది రామా అనే పేరే అంటున్నారు. సంస్కృతాన్ని ఇండో-యూరోపియన్ భాషలన్నిటికీ తల్లిగా మనవాళ్లే కాదు.. పాశ్చాత్య మేధావులు కూడా ఎప్పుడో తేల్చేసిన దరిమిలా రాముడి ఆనవాళ్లు ఎక్కడిదాకా వ్యాపించాయో అర్థం చేసుకోవాలంటున్నారు. 

రోమ్ నగరం రాముడి పేరు మీదనే నిర్మించారు అనడానికి మరో బలమైన ఆధారాన్ని ఆర్కియాలజిస్టులు నిర్ధారించారు. క్రీస్తు పుట్టక ముందు 753 సంవత్సరంలో రోమ్ నగరానికి బొడ్రాయి వేశారట. క్రీస్తు జన్మించిన 2వేల ఏళ్లను కూడా కలుపుకుంటే 2753 ఏళ్ల క్రితం ఏప్రిల్ 21న రోమ్ నగరానికి ఫౌండేషన్ వేసినట్టు రోమన్ కేలండర్లు పేర్కొంటున్నాయి. ఆ సంవత్సరం ఏప్రిల్ 21న శ్రీరామనవమి జరిగిందని పండితులు చెబుతున్నారు. రాముడు జన్మించినదానికి గుర్తుగానే రోమ్ నగరానికి బొడ్రాయి వేశారు అనడానికి ఇంతకన్నా నిర్ధారణ ఏం కావాలి అని అడుగుతున్నారు భాషావేత్తలు. అంతేకాదు.. డానిష్ ఆర్కియాలజిస్టుల తవ్వకాల్లో రామాయణ కాలాన్ని పోలిన పాత ఇళ్లు, వాటి గోడలపై రామాయణ పాత్రలు కనిపించాయట. రోమ్ రాముడి పేరు అనుకుంటే.. కచ్చితంగా దానికి అపోజిట్ లో రవెన్నా అనే పేరుతో ఇంకో నగరం కూడా ఉందట. రవెన్నా అనేది రావణుడి పేరుగా గ్రహించడానికి పెద్ద తెలివితేటలు కావాలా? 

రాముడి ఖ్యాతి అక్కడికే పరిమితం కాలేదు. రష్యా సమీపాన మంగోలియాలో రామాయణ కాలానికి సంబంధించిన చరిత్ర కనిపిస్తుంది. వోల్గా అనే విలేజ్ లో విష్ణుమూర్తి భారీ విగ్రహం కనిపించింది. రష్యాను రూస్ గా, రూసీగానూ కొంతకాలం క్రితంవరకు సంబోధించారు. రూస్ అంటే రుషులు ఉండే ప్రాంతంగా భాషావేత్తలు నిర్ధారించారు. రష్యాలో సీతా రివర్, రామా లేక్ లు చాలా ఉన్నాయట. మరింత ఆశ్చర్యకరంగా కామ, మోక్ష అనే నదులు కూడా రష్యాలో ఉన్నాయని నిర్ధారించారు. హిందూ పురాణాల్లో కనిపించే గండ భేరుండ పక్షులతో కూడిన లోగోను రష్యాలో మాత్రమే కాక సెర్బియా, క్రొయేషియా, యుగోస్లేవియా, ఆస్ట్రియా, ఇటలీ, స్పెయిన్, గ్రీస్ వంటి దేశాల్లో కూడా ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. 

రాముడి మీద రమల్లా పేరుతో ఇజ్రాయెల్ లో ఉన్న సిటీ ఎంత ఫేమసో అర్థం చేసుకోవచ్చు. ఇరాక్ లో రమాది, రందియా, రమేశే.. ఇలా అనేక పట్టణాలకు పెట్టింది రాముడి పేర్లేనని భాషావేత్తలు అనేక పుస్తకాల్లో ఉంటంకించి ఉన్నారు. రాముడికి ఉండే ఇలాంటి చరిత్రను బయటకు తీస్తూ.. ఆయా దేశాలు తమ ప్రాచీనతను మిస్సవకుండా గుర్తూ చేస్తూ ఆ రాముడి మూలాలు భారత్ లోనే ఉన్నాయని చెబుతూ.. నేటి కమలదళం అయోధ్యను అంతర్జాతీయ సిటీగా తీర్చిదిద్దుతోందంటున్నారు. ఆయా పట్టణాల్లో రాముడి పేర్లు ఉన్నాయంటే అక్కడ రాముడు పుట్టాడనే అర్థం కాదని.. రాముడి కీర్తి ప్రతిష్టలు, ఆయన ఆదర్శాలు ప్రపంచం నలుమూలలా వ్యాపించాయని అర్థం చేసుకోవాలంటున్నారు భాషావేత్తలు. ఇరాన్, ఇరాక్, ఈజిప్టు, రష్యా వంటి దేశాల్లో అక్కడ ఎప్పుడో విలసిల్లిన సంస్కృతిని ధ్వంసం చేసి ఎవరు ఏలాలని చూస్తున్నారో ఇండైరెక్టుగా అర్థం చేయించే ప్రక్రియ కొనసాగుతోందనే భావనలు వినిపిస్తున్నాయి. అలాంటి అన్నిటికీ అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపనతో జనవరి 22న జవాబు లభిస్తుందని.. ఆ తరువాత చోటు చేసుకోబోయే పరిణామాలన్నీ అయోధ్యను సెంటర్ పాయింట్ గా చేస్తాయని హిందూ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి ప్రపంచమంతా రామనామాన్ని వినిపించే ప్రయత్నం మాత్రం ఘనంగా సాగుతోందన్నమాట. 

By

T. Rameshbabu 

Comments

Post a Comment

Your Comments Please:

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత