Skip to main content

ఉద్యమ జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో  తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్‌) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం గత ప్రభుత్వం విఫలం చెందిన నేపథ్యంలో ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు, నూతనోత్తేజంతో యువ జర్నలిసులను కూడా కలుపుకొని పోయేందుకు కృషి చేస్తున్నట్లు టీయూజేఎస్‌ కన్వీనర్‌ ఎం.ఎం.రహమాన్‌ ముఖ్యమంత్రికి వివరించారు.  ముఖ్యమంత్రి తమ విజ్ఞప్తికి స్పందించి లోగో ఆవిష్కరిస్తూ ఈ సంఘాన్ని అత్యున్నత ప్రాధాన్యతలో గుర్తించాలని, అక్కడికక్కడే సమాచార శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసినందుకు సీఎంకు రహమాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, సీఎంఓం చీఫ్‌ పీఆర్‌ఓ అయోధ్యరెడ్డిలకు సంఘం నేతలు ధన్యవాదాలు తెలిపారు.  

ఈ కార్యక్రమంలో నేతలు మునీర్‌, కందుకూరి రమేష్‌బాబు, యాటకర్ల మల్లేష్‌, పసూనూరి రవీందర్‌, తాటికొండ రమేష్‌బాబు, సాదిక్‌, కాసిపేట నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

యూనియన్ లోగో ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Read this also: యాభై రోజుల్లోనే రేవంత్ కు పాస్ మార్కులు

Comments

Popular posts from this blog

వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి

మహా మహోపాధ్యాయ, బహుభాషావేత్త, వేద వేదాంగవేత్త, రాష్ట్రపతి సన్మాన విభూషిత, శతాధిక గ్రంథకర్త, ప్రాచీన వాఙ్మయ వ్యాఖ్యత పెదపాటి నాగేశ్వరరావు సహస్ర పూర్ణ చంద్ర దర్శన మహోత్సవం చూడముచ్చటగా ముగిసింది. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన పెదపాటి వేయి పున్నముల దర్శన మహోత్సవానికి తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చివరి రోజు ఘట్టం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో సంప్రదాయబద్ధంగా జరిగింది. 1941లో గుంటూరు జిల్లాలో జన్మించిన పెదపాటి.. ఆనాడు ఉన్న అనేక వ్యతిరేక పరిస్థితులను ఎదురీది.. భాషలో, వేదాధ్యయనంలో, శిల్పశాస్త్రంలో ఎంతో కృషి చేశారని మధుసూూదనచారి కొనియాడారు. ఈనాటి యువకులను చదివించడానికి, అన్ని అవసరాలూ సమకూర్చడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నా పిల్లలు మాత్రం ఓ లక్ష్యం అంటూ లేకుండా ఉన్నారని ఆవేదన చెందారు. అందుకు భిన్నంగా పెదపాటి నాగేశ్వరరావు.. అననుకూల పరిస్థితులను అధిగమించి మహా పండితుడై కేవలం విశ్వబ్రాహ్మణ కులస్తులు మాత్రమే గాక యావత్ తెలుగుజాతి గర్వించే స్థాయికి ఎదిగారన్నారు.  Also Read:  విమోచనమా? విద్రోహమా? సమైక్యతా దినోత్సవమా? అలాంటి మహా పండితుడికి తగిన గుర్తి

బీజేపీ విజయానికి దూసుకొస్తున్న కొత్త నినాదం

ప్రతి జాతీయ ఎన్నికలోనూ సరికొత్త నినాదంతో విజయాలు నమోదు చేస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం. మోడీ, అమిత్ షా నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ విపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఆ పార్టీ.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మరింత వినూత్నంగా ప్రచారానికి ప్లాన్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోవాలని భావిస్తున్న బీజేపీ ఈసారి సృజనాత్మకమైన కన్సల్టెంట్లను రంగంలోకి దింపుతోంది.  అందులో భాగంగా బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ ప్రచార బాధ్యతలను ప్రముఖ కన్సల్టెంట్ దుర్గా స్థపతి చేపట్టారు. హైదరాబాద్ హైకోర్టులో అడ్వొకేట్ గా పనిచేస్తూ రాజకీయ కన్సల్టెంట్ గా కొనసాగుతున్న దుర్గాస్థపతి ఆచార్యకు ఈటల రాజేందర్ తమ పార్టీ జాతీయ స్థాయి ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఈ క్యాంపెయిన్ లో భాగంగా "యూత్ విత్ మోడీ - బూత్ విత్ మోడీ" అనే ఆకర్షణీయమైన ఎన్నికల నినాద అస్త్రాన్ని ఈటల ఆవిష్కరించారు. అలాగే "ఈటలతో మనమందరం -  అవుతుంది ప్రతి ఇల్లూ రామమందిరం" అనే మరో ఆకర్షణీయమైన క్యాప్షన్ ని కూడా సోషల్ మీడియాలోకి వదిలారు ఈటల. ఈ నినాదాలు అర్థవంతంగా ఉండడమే గాక.. ఎంతో ఆకట్టుకుంటున్నాయని, ప్రజల్ని ఆలోచింపజేస్తాయన్న నమ్మకం తనకు

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత