Skip to main content

Posts

Showing posts with the label TELANGANA

ఔను.. అది "సామాజిక విశ్వరూప మహాసభ"

తేదీ: 11-11-2023, శనివారం, సాయంత్రం (నరక చతుర్దశి నడుస్తున్న సమయం) అది చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక శుభ ముహూర్తం.  దళితజాతిలోని మాదిగ బిడ్డలకు సామాజిక న్యాయం జరగబోతోంది అనడానికి పునాదులు పడిపోయిన పుణ్య తిథి. 14 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని మించి నడుస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాటం అంతిమ ఘట్టానికి చేరిందన్న సంకేతం వెలువడిన అద్భుత సందర్భం.  హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఒక చారిత్రక సన్నివేశానికి వేదికగా మారింది. దేశవ్యాప్తంగా మరో భారీ నిర్ణయానికి అంకురారోపణం జరిగిపోయింది. ఇక ఆవిష్కారమే తరువాయి. అదే ఎస్సీ వర్గాలు, అందులోని ఉపకులాల వాటాలు తేల్చే విభజన విషయం.  మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ఆ సంస్థ అధినేత, అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడమే గాక.. వాటికి నేతృత్వం వహించిన మందకృష్ణ మాదిగ మాట్లాడిన తీరు అపురూపం, ఆయన ఆవిష్కరించిన స్వప్నం రేపటి రాజకీయాలను కీలక మలుపు తిప్పనున్న ఒక ఉద్విగ్నభరిత సచిత్ర దృశ్యరూపం. 20 నిమిషాలకు పైగా మందృష్ణ మాట్లాడింది ఒక మామూలు ప్రసంగం కాదు. తన ...

కేసీఆర్ హ్యాట్రిక్ ఆశలు ఫలించేనా?

తెలంగాణలో ఈ మధ్య వినిపిస్తున్న శబ్దం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ హ్యాట్రిక్ మాత్రమే. ముఖ్యమంత్రిగా కేసీఆర్ మూడోసారి పవర్ పగ్గాలు చేపడతారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే గాక.. యావత్ దక్షిణ భారతదేశంలోనే ఓ సరికొత్త రికార్డు సృష్టిస్తారన్న అంచనాలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. అటు బీఆర్ఎస్ కేడర్ నుంచైతే.. ఫిర్ ఏక్ బార్ - కేసీఆర్ సర్కార్.. అంటూ ఉత్సాహపూరిత నినాదాలు వినిపిస్తున్నాయి. అటు కేసీఆర్ బహిరంగ సభల్లోనూ కేసీఆర్ ప్రసంగాలకు, ఆయన వివరిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వ్యక్తమవుతోంది.  కేసీఆర్ లో మూడు రకాల షేడ్స్ కనిపిస్తాయంటారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ స్థాపించే కంటే ముందు సాధారణ రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ఓ ఉద్యమానికి నేతృత్వం వహించిన నేతగా ఆయనలో అతి గాఢమైన రెండో ఛాయ కనిపిస్తుంది. పార్టీ స్థాపించిన 14 ఏళ్లకు.. తాను స్వప్నించిన స్వరాష్ట్రాన్ని సాకారం చేసుకొని దేశంలో ఏ నాయకుడికీ లేనంత గాఢమైన ప్రొఫైల్ ను సొంతం చేసుకున్నారు. తెలంగాణ సాకారంతో దేశమంతటా ఆయన పేరు మార్మోగిపోయిందంటే అతిశయోక్తి కాదు. అప్పటికి బీజేపీ ఆ...

చంద్రబాబు ప్రయత్నాలు ఢిల్లీలో ఫలించలేదా?

చంద్రబాబుకు అక్కడ ఢిల్లీలో ద్వారాలు మూసుకుపోయాయా? ఆయన ఎంత ప్రయత్నించినా అమిత్ షా మనసు కరగలేదా? తన కష్టాలు తీరాలన్నా, పార్టీ మీద నీలినీడలు తేలిపోవాలన్నా బలమైన జాతీయ పార్టీ అండ కావాలని కోరుకున్న బాబుకు.. కమలనాథుల నుంచి సరైన రెస్పాన్స్ రాలేదట. ఆ విషయం కన్ఫామ్ అయ్యాకనే ఆయన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ వైపు మళ్లీ ప్రయాణం మొదలుపెట్టడం ఖాయంగా మారిందట. మరి ఆ విశేషాలేంటి? మొక్క ఎదగాలంటే పందిరి కావాలి. పందిరి లేకపోతే ఎంత మంచి మొక్క అయినా కూడా ఎదగడం ఆగిపోతుంది. అయితే ఒకప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు అచ్చం మొక్కలాగే మారిపోయిందట. మరి మొక్కలాంటి పార్టీకి ఎవరో ఒకరు నీరు పోయాల్సిందే. ఎవరో ఒకరి చెయ్యి అందించాల్సిందే. బాబు అందుకోసమే కొన్ని నెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ప్రాంతీయ పార్టీగా తెలంగాణలోనే కాదు.. అటు ఆంధ్రాలోనూ ఇప్పుడు టీడీపీ తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోయింది. తెలంగాణలో అయితే దాదాపుగా అదృశ్యమయ్యే పరిస్థితి నెలకొంది. తెలంగాణ టీడీపీలో అసలు కీలక నేతలెవరూ లేకుండా పోయారంటే అతిశయోక్తి కాదు. పట్టణాల్లో, గ్రామాల్లో అక్కడక్కడా సానుభూత...

కాసాని జ్ఞానేశ్వర్ పయనం వెనకాల

మా దుకాణం మా ఇష్టం. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తెరుస్తాం.. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మూస్తాం. మీకేమైనా అభ్యంతరమా? అన్నట్టుగా ఉందట టీడీపీ హైకమాండ్ వైఖరి. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేసి ఉనికి చాటుకుంటేనే కదా.. పార్టీకి భవిష్యత్తు ఉండేది? మరి పార్టీ భవితవ్యాన్ని కూడా చంద్రబాబు పక్కన పెట్టారా? పోటీ చేస్తామన్న కాసాని జ్ఞానేశ్వర్ ను.. సైలెంట్ చేయించి టీడీపీ పోటీ చేయడం లేదని ప్రకటించడంలో ఆంతర్యమేంటి? జ్ఞానేశ్వర్ రాజీనామా నుంచి ఓటర్లకు ఏం సంకేతం వెళ్తోంది? టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేయడం.. టీ-రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి ఉండే ఫాలోయింగ్ గురించి మాట్లాడుకోవాల్సింది పెద్దగా ఏమీ లేదు. కానీ.. దాని వెనకాల చంద్రబాబు నడుపుతున్న మంత్రాంగం ఎంత లోతైందనే విషయమే సంచలనంగా మారిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. కొంతమంది జ్ఞానేశ్వర్ రాజీనామాను హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. రాజీనామా వెనకాల బీఆర్ఎస్ కు ఆయన రాజీపడిపోయారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ జ్ఞానేశ్వర్ చెబుతున్న వాదనలు వింటే చంద్రబాబు తెరంగేట్రం ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చంటున్నార...

కాంగ్రెస్ లో రేవంత్ "రెడ్ రాజకీయం"

టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏది అనుకున్నారో అదే చేశారా? ఎవరికి టికెట్ ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో.. ఆయన మైండ్ లో ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకొని ఉన్నారా? తన సొంత నిర్ణయం మేరకే రెండో జాబితాలో టికెట్లు వచ్చాయని.. అంతకు మించి సమన్యాయం గానీ, సామాజిక న్యాయానికి గానీ అందులో చోటే లేదంటున్నారు.. టికెట్ దక్కని నిరాశావహులు. టికెట్ దక్కనివారు ఆ అక్కసుతో మాట్లాడతారని అర్థం చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో పూర్తిగా రేవంత్ మార్కే కనిపిస్తోందని.. ఆయన రెడ్డి సామాజికవర్గం నేతల విషయంలో పక్షపాతం చూపారన్న అసంతృప్తి బలపడుతోంది.  టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తాను అనుకున్నదే చేస్తారు తప్ప.. ఇతరులు చెప్పింది చేయరని ఇప్పుడు నిరూపించుకున్నారు. టీ-కాంగ్రెస్ రెండో లిస్టును యథాలాపంగా పరికించినా ఆ విషయం అర్థమవుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈనెల 15న టీ-కాంగ్రెస్ మొదటిజాబితాలో 55 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేశారు. రెండో జాబితాలో 45 స్థానాలను క్లియర్‌ చేశారు. దీంతో టీ-కాంగ్రెస్ ఇప్పటివరకు వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది. రెండో జాబితాలోని 45 స్థానాల్లో అగ్రవర్ణాలకు పెద్దపీట వేశ...

మంత్రి నిరంజన్ రెడ్డి గెలుపు కోసం కేసీఆర్ భారీ స్కెచ్

ఆ నియోజకవర్గంలో ఓట్లు చీలకుండా ఉండేందుకు బీఆర్ఎస్ అధిష్టానం వేసిన ఎత్తుగడ ఫలిస్తుందా? ఆ నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న మంత్రికి... మొన్నటివరకు బలమైన ప్రత్యర్థిగా ఉన్న ఆ నాయకుడు కూడా ఇప్పుడు జత కావడం మంత్రికి కలిసొస్తుందా? తనకు కలిసి రావడం కోసం మంత్రి ఈ స్కెచ్ వేశారా? లేక అవతలి పార్టీని దెబ్బ తీయడానికే ఆయన్ని కలుపుకున్నారా? సుదీర్ఘమైన అనుభవం, ప్రజలతో మంచి కనెక్షన్ ఉన్న ఆ నాయకుడు కారెక్కితే బీఆర్‍ఎస్‍ కు భారీ మెజారిటీ ఖాయమా? మొన్నటివరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు కారు పార్టీలో కలిసి మెలిసి తిరగడానికి కారణమేంటి? బీఆర్‍ఎస్‍ లో చేరిన ఆ నేత లక్ష్యమేంటి? గులాబీ బాస్‍ ఇచ్చిన ఆఫర్‍ ఏంటి? Read this: కాంగ్రెస్ లో రేవంత్ "రెడ్ రాజకీయం" Read this: హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం వనపర్తి జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ నాయకుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి.. టీడీపీని వీడి బీఆర్ఎస్ లోకి వచ్చారు. రావులను బీఆర్‍ఎస్‍లోకి తీసుకు రావడం వెనుక అధికార బీఆర్‍ఎస్‍ అధిష్టానం ఎంతో పకడ్బందీగా...

హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం

హైదరాబాద్ లో జ్యోతిష్యం, యోగ శాస్త్రం నేర్పేందుకు ఓ కొత్త యూనివర్సిటీ ప్రారంభమైంది. జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీ పేరుతో అమెరికాలోని ఫ్లోరిడాలో ఇప్పటికే నడుస్తున్న ఆ యూనివర్సిటీకి హైదరాబాద్ లో అనుబంధ శాఖ ఏర్పడింది. జేకేఆర్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించి గత 12 ఏళ్లుగా ఔత్సాహికులకు జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన విజ్ఞానాన్ని అందిస్తున్న ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ కు ఫ్లోరిడా యూనివర్సిటీవారు గుర్తింపునిచ్చారు. దీంతో ఫ్లోరిడాలోని జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీకి అనుబంధంగా హైదరాాబాద్ లో ఓ బ్రాంచ్ ఏర్పడిందని, ఆ బ్రాంచ్ కార్యకలాపాలను విజయదశమి శుభ సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ప్రకటించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో గల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో యూనివర్సిటీ లోగో, బ్యానర్ ను ఓపెన్ చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు రాజా చెప్పారు.  Read This: పవన్ మాజీ భార్య తాజా కామెంట్లు Read This:  కాంగ్రెస్ లో రేవంత్ "రెడ్ రాజకీయం" జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన శాస్త్రాలను ఔత్సాహికులకు ప్రపంచ స్థ...

మధుయాష్కీ, పొన్నం టికెట్ల పరిస్థితి ఇదే

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సీనియర్లను లైట్ తీసుకుంటున్నారా? చాలా మంది సీనియర్ల రాజకీయ భవిష్యత్ డైలమాలో పడినట్టేనా? మొదటి లిస్టులో సీనియర్ల పేర్లు కనిపించకపోవడానికి కారణం అదే అంటున్నారు విశ్లేషకులు. ఇక రెండో జాబితా సీట్లలో పోటీ విపరీతంగా ఉండడంతో టికెట్లు దక్కే సంభావ్యత అనుమానంలో పడిందన్న ఆందోళన సీనియర్ల నుంచి వ్యక్తమవుతోంది.  టీ-కాంగ్రెస్ లో సీనియర్లంటే ఒకప్పుడు వారు చెప్పిందే వేదం. ఆ మాటకొస్తే.. ఎవరు రాసుకున్న వేదం వారిదే... అన్నట్టుగా ఉండేది పరిస్థితి. పార్టీ పగ్గాలన్నీ ఢిల్లీలోని హైకమాండ్ గుప్పిట్లో ఉండడంతో.. లోకల్ పీసీసీ చీఫ్ లు గానీ, పార్టీ ఇతర పోర్ట్ ఫోలియోల మాటలకు గానీ పెద్దగా చెల్లుబాటు అయ్యేది కాదు. ఢిల్లీలో వారు చెప్పిందే ఫైనల్ కాబట్టి.. ఇక్కడ వీరి మాటలకు పెద్దగా ప్రయారిటీ ఉండేది కాదు. అయితే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి పగ్గాలు కట్టబెట్టాక క్రమంగా రీతి-రివాజు మారుతూ వచ్చింది. తొలుత రేవంత్ ను కూడా పాత పద్ధతుల్లోనే గూట్లో చెక్కేందుకు ప్రయత్నించారు. అయితే హైకమాండ్ ను ఒప్పించకొని, మెప్పించుకున్న రేవంత్.. రాష్ట్ర పార్టీ మీద క్రమంగా అదుపు సాధించారు. రేవంత్ కు రాహుల్ స్వేచ్ఛ...

టి-కాంగ్రెస్ లో ఎన్నడూ లేని జోష్.. కారణం ఇదే

తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ ఏ రేంజ్ లో ఉందంటే.. గెలుపుకు అర అంగుళం దూరంలోనే ఉన్నామన్న ఫీలింగ్ లో వారంతా ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అధికారం అందుకోవడం ఖాయమైపోయిందన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. సమన్వయ కమిటీ చైర్మన్ గా ఉన్న సీనియర్ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తన సంతోషాన్ని, ఆనందాన్ని లోపలే దాచుకోవాల్సి ఉండగా.. బహుశా ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతోనో ఏమో గానీ.. సీఎం కుర్చీ మీద కర్చీఫ్ వేసుకునే ప్రయత్నం చేశారు జానా. మరి జానాలాగే మరికొందరు సీనియర్లు కూడా ఇదే వాయిస్ వినిపిస్తారా? కాంగ్రెస్ లో సీనియర్లకు ఎదురవుతున్న పరిస్థితులేంటి? టీ-కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలకు ముందే 6 గ్యారెంటీ పథకాల హామీతో జనంలోకి చొచ్చుకుపోతోంది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల 55 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో టీ-పీసీసీ తొలి జాబితా విడుదల చేసింది. అయితే అందులో సీనియర్లకు చోటు దక్కకపోవడంతో వారిలో నైరాశ్యం అలముకుందన్న వార్తలు కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. రెండో జాబితా బయటకు రావాల్సి ఉన్నా.. తొలి జాబితాలోనే తమకు చోటు లేనప్పుడు.. ఇంక రెండో జాబితాలో ఎక్కణ్నుంచి ఉంటుందన్న నైరాశ్య...

మంత్రి గంగుల అండ్ టీంపై అవినీతి ఆరోపణలు

కంచే చేనే మేస్తే.. ఆ కాపు ఏం చేయాలి? రక్షణగా నిలవాల్సిన వ్యవస్థే పక్షపాతం చూపి తప్పుకుంటే ఎవర్ని ఆశ్రయించాలి? ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే కబ్జాలకు తెగబడి.. బెదిరింపులకు పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలి? కరీంనగర్ లోని ఓ బాధిత రైతు.. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తెర లేపిన భూ కబ్జా భాగోతంతో బెంబేలెత్తిపోతున్నాడు. కరీంనగర్ లో ఉండలేక, ఉంటే బతుకుతానన్న గ్యారెంటీ లేక హైదరాబాద్ పారిపోయి వచ్చానంటున్నాడు. తన గోడును ఎవరికి చెప్పుకున్నా ఫలితం కనిపించడం లేదంటూ.. హైదరాబాద్ లో మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు.  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే భూములకు రక్షణ దొరుకుతుందనుకున్న సామాన్య ప్రజలకు.. అలాంటి భరోసా ఏమీ కనిపించడం లేదన్న విమర్శలు చాలా తీవ్రంగా వినిపిస్తున్నాయి. అందుక్కారణం పార్టీ పేరు చెప్పుకునో లేదా ఏదో ఒక అధికారి పేరు చెప్పుకునో మాఫియారాయుళ్లు భూములు కబ్జా చేయడం లేదిప్పుడు... ఏకంగా మంత్రులే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రంగంలోకి దిగుతున్నారట. రాష్ట్ర మంత్రి వర్గంలో చాలా కీలకమైన పోర్టుఫోలియో కలిగి ఉన్న బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ మీదనే ఈ ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంగుల పే...

పొగ తాగడానికి పొగ పెడుతున్న రుషి సునాక్

ఈ ప్రపంచం కరోనా అనే ఓ మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొంది. కానీ అంతకుమించిన మరో మహమ్మారి ప్రతి దేశాన్నీ పీడిస్తోంది. అయితే ఇప్పటిదాకా ఆ మహమ్మారిని ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు.  ఆ మహమ్మారిని తరిమేయడానికి, ఇంగ్లాండ్ నుంచి తరిమేయడానికి ఆ దేశ ప్రధాని రిషి సునాక్ కంకణం కట్టుకున్నారు. త్వరలో ఓ చట్టం కూడా తేబోతున్నారు. మరి రిషి తేబోతున్న చట్టానికి.. ఏపీలో మన జగన్ తీసుకొచ్చి వెనక్కి వెళ్లిన చట్టానికి తేడా ఏంటి?  Read this also: నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ప్రారంభం పొగ తాగుడు కారణంగా ప్రపంచంలో యేటా 80 లక్షల మంది చనిపోతున్నట్టు డబ్ల్యు.హెచ్.ఒ లెక్కలు కట్టింది. అందులో డైరెక్టుగా పొగాకు వినియోగం కారణంగా సంభవిస్తున్న మరణాలు ఏటా 70 లక్షలట. అంటే సిగరెట్ తాగని, పొగాకు బారిన పడనివారు కూడా దాని పరోక్ష ప్రభావం చేత ఏటా 10 లక్షల మంది చనిపోతున్నారన్నమాట. అంటే ఈ 70 లక్షల మంది స్మోకర్ల కారణంగా వారు వదిలే పొగ పీల్చి.. పాపం అమాయకులైన నాన్ స్మోకర్లు మరో 13 లక్షల మంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు ప్రపంచం తీవ్రంగా భయపడాల్సిన అతిపెద్ద పాండమిక్ ఇదే అయిందంటున్నారు ప్రపంచ క్యాన్సర్ న...

నిరంజన్‎రెడ్డి బర్త్ డే వేడుకల సందర్భంగా ప్రత్యేక సంచిక

తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న, ముఖ్యమంత్రికి అత్యంత నమ్మకస్తుడైన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 64వ బర్త్ డే వేడుకలు ఆత్మీయుల మధ్య ఎంతో హుందాగా, సాదాసీదాగా జరిగాయి. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఉదయం నుంచీ బీఆర్ఎస్ కార్యకర్తలు, నిరంజన్ రెడ్డి అభిమానులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిరంజన్ రెడ్డి ఎన్నికయ్యాక జిల్లా రూపురేఖలు మారిపోయాయని.. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగించాలని ఆయన అభిమానులు ఆకాంక్షించారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని భాగ్యనగర్ పోస్ట్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. మేగజైన్ మేనేజింగ్ ఎడిటర్ రాఘవరెడ్డి ఆయన్ని ప్రత్యేకంగా అభినందించారు. వచ్చే ఎన్నికల్లోనూ నిరంజన్ రెడ్డి తన విజయ ప్రస్థానాన్ని కొనసాగించాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. ఆయన బర్త్ డే వేడుకల సందర్భంగా పెద్దసంఖ్యలో అభిమానులు వనపర్తికి తరలి రావడంతో పట్టణమంతా సందడి వాతావరణం నెలకొంది.  Also Read: నిరంజన్ రెడ్డి గెలుపు కోసం కేసీఆర్ స్కెచ్ Also Read: మంత్రి గంగుల అండ్ టీంపై అవినీతి ఆరోపణలు

భారతీయ నారీ శక్తిని బయటపెట్టిన తాజా రిపోర్ట్

ఆడపిల్లలు అనేక సందర్భాల్లో నిరూపించుకున్నారు... తాము ఎందులోనూ, ఎవరితోనూ తీసిపోమని. అయినా పురుషాధిక్య సమాజం.. మహిళల మీద ఆంక్షలు విధించింది. మహిళల మేలు కోసమేనని ఒకసారి.. మహిళలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇస్తే గనక మగాళ్ల పని ఖతం.. అనే పేరుతో ఇంకోసారి.. ఇలా అనేక కోణాల్లో మహిళల్ని అణచివేయడమే పనిగా పెట్టుకున్నారు. అయితే తాజాగా విడుదలైన ఓ సర్వే మాత్రం.. మహిళల్లో దాగున్న పారిశ్రామిక నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆ రిపోర్టు ఏం చెబుతోంది? దాన్నుంచి మనవాళ్లు నేర్చుకోవాల్సిన అంశాలేంటి?  ఆడవాళ్లకు చెప్పించే చదువు దగ్గర నుంచి, వారికి సొంతంగా ఏదైనా బాధ్యతలు అప్పగించేదాకా.. ప్రతిచోటా వారికి ద్వితీయ ప్రాధాన్యమే దక్కుతోంది. అయితే ఈ మధ్య ఇలాంటి అభిప్రాయాల్లో మార్పులు జరిగినా.. ఆ మార్పులు రావాల్సిన స్థాయిలో మాత్రం రాలేదు. అందువల్ల ఆకాశంలో సగం అని గౌరవించుకునే మనమే.. వారి అవకాశాలకు గండి కొట్టేశాం. ఫలితంగా దేశ ఆర్థిక ఎదుగుదలలో వారి పాత్ర తగ్గిపోయింది. దాని ప్రభావం కొన్ని తరాల దాకా పాకిందంటే అతిశయోక్తి కాదు. అయితే మహిళలను ప్రోత్సహించే వ్యక్తులు, సంస్థల సంఖ్య క్రమంగా పెరుగుతున్నా.. వారికి ఇవ్వాల్సిన ప...

రజాకార్ మూవీలో ఏముంది?

ఇప్పుడు ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన సమయంలో జరిగిన పోరాటాలు... ఆ తరువాత భారత్‌పై జరిగిన దాడులను భావి తరాలకు తెలియజేసేలా కొందరు నిర్మాతలు, దర్శకులు సినిమాలను రూపొందించడం ట్రెండ్‌గా వస్తోంది. అలాంటి సినిమాలలో కొన్ని ప్రశంసలు అందుకుంటే... మరికొన్ని విమర్శలపాలవుతున్నాయి. ఆ కోవకు చెందినవే ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ సినిమాలు. ఇప్పుడిక ఆ జాబితాలో రజాకార్ మూవీ చేరిపోయింది. భారత స్వతంత్రం అనంతరం తెలంగాణలో రజాకార్ల అరచకాలను తెలిపేలా ఈ మూవీ రూపొందుతుంది. అయితే ఇటీవల రిలీజ్ అయిన టీజర్ మాత్రం దుమ్ము రేపుతోంది. సెప్టెంబర్ 17... తెలంగాణ విమోచన దినోత్సవం రోజున రిలీజ్ అయిన రజాకార్ మూవీ టీజర్ తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఈ మూవీతో మరో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. 1.42 నిమిషాల నిడివి గల ఈ టీజర్ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. రాష్ట్ర ప్రజలను రెండు వర్గాలుగా విడదీసేందుకే ఈ మూవీని తీస్తున్నారని కొందరు ఆరోపిస్తుండగా... లేదు లేదు... ఇదో పీరియాడి...