తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు పద్మాచారి 62వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లో ఉన్న ఆఫీసర్స్ మెస్ లో తెలంగాణ ఉద్యోగులు, ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆయన మరింత కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యోగుల సంఘానికి పద్మాచారి చేసిన సేవలు మరువలేనివని. ఏ చిరు ఉద్యోగికి ఆపద వచ్చినా ఆపద్బాంధవుడిలా ముందుండి సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడే యోధుడు అని ఏసీపీ (సీసీఎస్) కె.ఎం కిరణ్ కుమార్ అన్నారు. రెండేళ్ల క్రితమే పద్మాచారి పదవీ విరమణ పొందారు. ఉద్యోగులందరూ మళ్లీ పద్మాచారిని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. పద్మాచారి 61 సంవత్సరాలు పూర్తి చేసుకుని 62వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మాసబ్ ట్యాంక్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ కె.ఎం. కిరణ్ కుమార్ ఎ.సి.పి(సి.సి.ఎస్) మాట్లాడుతూ... పద్మాచారి లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ ఉద్యోగుల సంఘానికి గౌరవాధ్యక్షులుగా పని చేయటం, ఉద్యోగుల సమస్యలు ఎంత జటిలంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల పక్షాన నిలబడి సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాడే యోధుడు పద్దన్న దొరకడం నిజంగా ఉద్యోగులు చేసుకున్న అదృష్టమని కొనియాడారు. ఈ వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రవీందర్ కుమార్, సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నాయకులు, బ్రహ్మశ్రీ కె.ఎం. కిరణ్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్, (సిసిఎస్) హైదరాబాద్, డాక్టర్ వి. గుణశేఖర్ రిటైర్డ్ డిఐజి, ఇ.వెంకటాచారి (అదనపు కలెక్టర్ హైదరాబాద్), ఎల్.ఎన్.చారి (అదనపు కలెక్టర్, రెవిన్యూ) మరియు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు పద్మాచారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Post a Comment
Your Comments Please: