Skip to main content

ఫేస్ బుక్-జియో బంధంతో ట్విట్టర్ కు కష్టకాలమేనా?


దేశీయ టెలికాం రంగానికి ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న జియో టెలికాం పంచన ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ చేరడంతో రానున్న రోజుల్లో భారతీయ మార్కెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఫేస్ బుక్  రూ. 43, 574 కోట్లు (5.7 బిలియన్ డాలర్లు) మొత్తాన్ని జియో టెలికాంలోకి పంపింగ్ చేస్తోంది. జియోలో దాదాపు 10 శాతాన్ని ఫేస్ బుక్ వాటాగా పొందుతుంది. దీంతో ఫేస్ బుక్ చేతిలో ఉన్న వాట్సాప్ కూడా జియో చేపట్టబోయే ఆపరేషన్స్ కి బాసటగా నిలుస్తాయి. టెలికాం విభాగంలో ఇప్పటికే అగ్రభాగాన ఉన్న జియో.. తాజాగా డిజిటల్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. జియో మార్ట్ పేరుతో వినియోగదారులకు నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీకి భారీ ఎత్తున ప్లాన్ చేసిన ధీరూబాయి అంబానీ తనయుడు... అతిత్వరలోనే ఫేస్ బుక్, వాట్సాప్ ల సహకారంతో ఆ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించబోవడం ఖాయంగా మారింది. జియో మార్ట్ పేరుతో రిటైల్ వ్యాపారాన్ని మైక్రో లెవల్లోకి తీసుకెళ్లనున్నట్టు దాదాపు 6 నెలల క్రితమే ముఖేశ్ బయటపెట్టుకున్నారు. అది కాస్తా ఇప్పటికి రూపం దాల్చింది. ఫేస్ బుక్ కి భారీ సంఖ్యలో ఉన్న ఖాతాదారుల వివరాలు, అలాగే వ్యక్తిగత సమాచారం కోసం వాట్సాప్ మీద ఆధారపడుతున్న భారతీయుల సంఖ్య ప్రపంచమార్కెట్ లోనే అతిపెద్దది.


Also Read: ముంబైలో మొదలైంది.. హైదరాబాద్ వైపు కదిలింది


                    ట్విట్టర్ ను నిషేధించాలంటున్న కంగనా


 
ఈ డాటాబేస్ మీద కన్నేసిన ముఖేశ్ అంబానీ... తాను చేపట్టబోతున్న రిటైల్ మార్కెట్ అండ్ డోర్ డెలివరీకి అద్భుతంగా పనికొస్తుందని అంచనా వేశారు. టెలికాం రంగంలో అగ్రగామిగా ఉంటూ తిరుగులేని రీతిలో దూసుకుపోతున్న జియో కూడా తనకు ఎంతో ఉపకరిస్తుందని ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ భావించారు. ఉభయతారకంగా ఉండే వ్యాపార ప్రయోజనాల రీత్యా ఈ ఇద్దరూ చేతులు కలపడంతో భారతీయ రిటైల్ మార్కెట్ స్వరూప స్వభావాలు మారిపోతాయంటున్నారు.కరోనా కష్టాల నుంచి దేశం బయటపడేనాటికే అందుకు అవసరమైన ఆపరేషన్స్ డ్రైవ్ చేసేందుకు డాటాబేస్ ను ఉపయోగించుకునే పనిలో ముఖేశ్ కంపెనీలోని ఇంజినీర్లు తలమునకలై ఉన్నారు. అంటే ప్రజలు, ప్రభుత్వాలు కరోనాకు పరిమితమై కాలక్షేపం చేస్తున్న సమయంలో.. ఆ తరువాతి దేశ ఆర్థిక చిత్రపటాన్ని ముఖేశ్ కల గంటున్నారన్నమాట. ఇవాళ్టి ముఖేశ్ ప్రకటనలో ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పడం, ఈ ఒప్పందం చిన్న వ్యాపార సంస్థలకు, స్టార్టప్స్ కి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పడం గమనించాల్సిన అంశం. వీరి ఒప్పందంతో చెల్లింపుల దగ్గర నుంచి భారీ సూపర్ మార్కెట్ యాజమాన్యాలు కూడా ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నాయి.  


ట్విట్టర్ కి కష్టకాలమేనా?


ఫేస్ బుక్-జియో ఒప్పందంతో.. సోషల్ మీడియాలో మరో దిగ్గజం లాంటి ట్విట్టర్ కు కష్టకాలం తప్పదా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ట్విట్టర్ మీద చాలా కాలంగా దేశవ్యతిరక ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొన్న మార్చి 2న తన  సోషల్ మీడియా అకౌంట్లు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ వంటివాటిని వదిలేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పిన మోడీ దేశవ్యాప్తంగా చర్చకు తెర లేపారు. తన అకౌంట్ల ద్వారా ప్రజాసేవలో, స్వచ్ఛంద సేవలో ఎలాంటి పేరు ప్రఖ్యాతులు లేకుండా కొనసాగుతున్న సామాన్య మహిళలకు పోస్టు చేసే అవకాశాన్నిచ్చారు. చదువుకున్న, దేశవ్యతిరేక భావజాలాన్ని విస్తరించేందుకే ఎక్కువగా ఉపయోగపడుతున్న సోషల్ మీడియాతో సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదన్న చర్చకు మోడీ వీలు కల్పించారు. అయితే దేశ వ్యతిరేక పోస్టింగ్ లను ట్విట్టర్ మాత్రం కావాలనే ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలు కూడా ఎప్పట్నుంచో ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవల అరుంధీరాయ్ లాంటి సెలబ్రిటీ రైటర్ కూడా డీడబ్ల్యూ లో పాల్గొన్న చర్చలో ఒక భాగాన్ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది. అందులో మోడీ మత విద్వేషాలు చిమ్ముతున్నారని, కరోనా టైమ్ ను ముస్లిం జాతిని హననం చేసేందుకే ఉపయోగించుకుంటున్నారంటూ తీవ్రంగా ఆరోపించింది. ఆమె అకౌంట్ ఇప్పటికీ ట్విట్టర్లో ఉంది. అలాగే బాలీవుడ నటి కంగనా రనౌత్ చెల్లెలు రంగోలీ చేసిన పోస్టింగ్ కు ఆబ్జెక్షన్ చెప్పిన ట్విట్టర్ వెంటనే ఆమె అకౌంట్ ని తొలగించింది. మెడికల్ టెస్టులకు సహకరించనివారిని కాల్చిపారేయాలని రంగోలీ వ్యాఖ్యానించింంది. అది నేరుగా ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన కామెంటే అంటూ చాలా మంది ఫిర్యాదులు చేసేసరికి ట్విట్టర్ యాజమాన్యం అకౌంట్ ను నిలిపివేసింది. దీంతో కంగనా రనౌత్ ట్విట్టర్ ని ఇండియాలో నిషేధించాలంటూ మోడీకి విజ్ఞప్తి చేసింది. ట్విట్టర్ ఇలా పక్షపాతంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి కాబట్టి... అంబానీతో జత కట్టిన ఫేస్ బుక్ ని వదిలేసి రేపటి రోజుల్లో ట్విట్టర్ భరతం పట్టే అవకాశాల్లేకపోలేదు. 





 


 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత