Skip to main content

ఆదిశంకరాచార్యుడి విజయంలో అసలు రహస్యం

(2530వ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)

 


ద్వాపరయుగ అంతంలో ధర్మ సంరక్షణకు కురుక్షేత్రంలో జరిగిన సంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం ఆహుతి అయింది. భగవాన్ శ్రీకృష్ణుడు రక్షించిన ధర్మం ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. క్రమంగా దేశమంతటా జాతి విరుద్ధమైన ప్రవృత్తులు ప్రబలిపోయాయి. దేశం పతనం వైపు వేగంగా పరుగులిడుతుంది. ఇలాంటి సమయంలో దేశాన్ని సరియైన దిశవైపు నడిపించడానికి తీవ్ర ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ ప్రయత్నాలకు ఆధారం వేదాలు. వేదాల్లోని అంతరార్థ సత్యాన్ని తిరిగి ప్రకటించడం కోసం 3 కొత్త దర్శనాలు వెలుగులోకి వచ్చాయి. 1. పతంజిల యోగ దర్శనం, 2. జైమిని మీమాంస దర్శనం, 3. బాదరాయణ వేదాంత దర్శనం. 



 

వేదాల్లోని కర్మకాండకు వ్యతిరేకంగా భగవాన్ శ్రీకృష్ణుడే పూనుకున్నాడు. కర్మకాండపై భాగవత ధర్మం తిరుగుబాటు చేసింది. దేశంలోని సాంఘిక వ్యవస్థకు దెబ్బ  తాకకుండా ఇంద్రుడు మొదలైన దేవతల పూజలు మాన్పించాడు శ్రీకృష్ణుడు. వేదాల మీద, వైదిక వ్యవస్థ మీద సంపూర్ణ ఆదర భావం కూడా చూపించాడు. అక్కడి నుండి భాగవత ధర్మం యొక్క ప్రభావం క్రమంగా పెరుగుతున్నది. ఆ మూడు దర్శనాలతో కొత్తపుంతలు తొక్కించింది. బాదరాయణుడు వేదాల్లోని జ్ఞానకాండను వెలికితీసి పరమ జ్ఞానోద్భవమైన అద్వైతాన్ని ప్రతిపాదించాడు. ఆ తరువాత కాలంలో అనేక మంది మహాపురుషులు లోకకల్యాణం కోసం బాదరాయణ వేదాంత దర్శనాన్ని ఆదర్శంగా తీసుకునే పనిచేశారు. కలియుగంలో ప్రారంభమై సుమారుగా 1200 సంవత్సరాల తరువాత ఈ దేశంలో బుద్ధభగవానుడు జన్మించాడు. బుద్ధ భగవానుడు ప్రారంభించిన బౌద్ధం వైదిక కర్మకాండపై పెద్దఎత్తున తిరుగుబాటు చేసింది. ఆ తిరుగుబాటు అంతటితో ఆగకుండా కర్మకాండకు వేదాలు, బ్రాహ్మణులే మూలమని భావించి దాన్నుంచి బయటికి వచ్చి కొత్త పంథాలో పయనించడం ప్రారంభించింది. బౌద్ధం ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల్లో విస్తరించింది. అదే సమయంలో దేశంలో వైదిక కర్మకాండ కూడా ఎంతగా పెరిగిపోయిందంటే ప్రజల మానసిక సత్ప్రవర్తన కంటే యజ్ఞయాగాదులే గొప్పవని భావించేవారు. ధర్మశాస్త్రజ్ఞల మనసుల్లో కూడా దయ, శాంతి, అక్రోధం, అహింసల స్థానంలో క్రౌర్యం, క్రోధం, హింస ఆక్రమించాయి. క్షమ అంటే పిరికిితనం కింద లెక్కించబడింది. ఈ పరిస్థితులు భారతదేశంలో వివిధ సంప్రదాయాల మధ్య సంఘర్షణలకు తెరలేపింది. అవి క్రమంగా విస్తరిస్తూ దేెశంలో గందరగోళ పరిస్థితులు నిర్మాణం అవుతున్నాయి.  ఈ పరిస్థితులు చక్కదిద్ది దేశంలో ఒక భావ సమైక్యతను నిర్మాణం చేయవలసిన ఒక చారిత్రక అవసరం ఏర్పడింది. ఆ ఆవశ్యకతను పూరించడానికి జన్మించినవారు ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులు కలియుగం 2593 సంవత్సరంలో జన్మించారు. ఈ ఏప్రిల్ 28కి ఆదిశంకరులు జన్మించి 2529 సంవత్సరాలు పూర్తయి 2530లో ప్రవేశిస్తుంది. ఆదిశంకరులు కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించారు. తల్లి ఆర్యాంబ, తండ్రి శివగురువు. వైశాఖ మాసం శుక్లపంచమి రోజున జన్మించారు. అతి  చిన్నవయసులోనే వేదవేదాంగాలు ఔపోశన పట్టేశారు. ఆ వయసులోనే బాలబోధ సంగ్రహం అనే గ్రంథం కూడా రచించారు. ఇట్లా 2500 సంవత్సరాలకు పూర్వం జన్మించిన శంకరాచార్యులను ఇప్పుడు మనం ఎందుకు స్మరించుకోవాలి... వారి 32 సంవత్సరాల జీవితం మనకిచ్చే ప్రేరణ ఏంటి.. ఆదిశంకరులు అంత చిన్న వయసులోనే భారతదేశమంతటా ఆసేతు హిమాచలం పర్యటించి దేశంలోని వివిధ సంప్రదాయాలను సమన్వయపరుస్తూ షణ్మతాలను ప్రతిపాదించారు. షణ్మత స్థాపనాచార్య అనే బిరుదుపొందారు. దేశంలో పంచాయతన పూజ పద్ధతిని ప్రవేశపెట్టారు. శంకరాచార్యులవారు బాదరాయణుడి నుంచి అద్వైత సిద్ధాంతం గ్రహించి దానిని దేశమంతా స్థిరపరిచారు. శంకరాచార్యులవారి యొక్క అద్భుత విజయం వెనుక ఉన్న పరంపరను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 

 



 


 

శంకరాచార్యులకు పూర్వం బాదరాయణుని కుమారుడు శుకదేవుడు వేదాంత దర్శనమును వ్యాఖ్యానించి బోధించడం ప్రారంభించారు. శుకదేవుని శిష్యుడైన గౌడపాదులు దాన్ని కొసాగించారు. గౌడపాదులవారు దక్షిణ భారతదేశానికి చెందినవారు. వారు  ప్రారంభంలో పతంజలి మహర్షి వద్ద విద్యను అభ్యసించారు. ఆ తదుపరి గౌడపాదుుల శిష్యులయ్యారు. అక్కడ మహా భాష్యం చదువుకున్నారు. కొంతకాలం తరువాత బదరికాశ్రమం చేరి వేదాంతం అధ్యయనం చేశారు. ఆ  గౌడపాదుని శిష్యుడే గోవిందపాదులు. వారు తన విద్యాభ్యాసం పూర్తయిన తరువాత నర్మదా నది ఒడ్డున అమరకాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని వేదాంత విద్యను బోధించసాగారు. ఆదిశంకరులు తన గ్రామంలో విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. తల్లి అనుమతి తీసుకొని అమరకాంతం చేరుకున్నారు. అమరకాంతంలో గోవిందపాదుల శిష్యులయ్యారు. శంకరుని ప్రతిభా పాటవాలు చూసి గోవిందపాదులు తన జ్ఞానమంతా శంకరునికి పంచారు. అంతేకాక తన గురువైన గౌడపాదుల దగ్గరకు తీసుకెళ్లారు. గౌడపాదులు శంకరునిలో సనాతన ధర్మ రక్షకుణ్ని చూసి విధిపూర్వకంగా సన్యాస ధర్మం ఉపదేశించారు. శంకరాచార్యులు గౌడపాదుల వద్ద  అధ్యయనం చేస్తూనే మరో పక్క అనేక భాష్యాలు రచించసాగారు. వారి భాష్యాలలో జగత్ప్రసిద్ధి పొందినవి ప్రస్థాన త్రయంపై రాసిన భాష్యాలు. ప్రస్థాన త్రయాలు అంటే 1.ఉపనిషత్తులు, 2.వేదాంత సూత్రాలు, 3.భగవద్గీత. ఇట్లా శంకరాచార్యులు సుశిక్షితులైన తరువాత ఒక శుభ ముహూర్తాన వేదాంత ప్రచారానికి దిగ్విజయ యాత్ర ప్రారంభించారు. దేశంలో వైదిక కర్మకాండ, భాగవత  ధర్మం సమన్వయపరచి అద్వైత సిద్ధాంతాన్ని పరిపుష్టం చేశారు. అట్లా దేశంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక చైతన్యం నింపారు. ఈ పని దేశమంతా చేసేందుకు యోగ్యులైన శిష్యులను ఎంపిక చేసుకోవడం ఒక పెద్దపని. ఆ పని గురించి కాశి చేరుకుననారు. కాశీ చదువుల తల్లికి కేంద్రం. అక్కడ గొప్ప గొప్ప పండితులున్నారు. వాళ్లతో క్రమంగా చర్చలు ప్రారంభించారు. శంకరాచార్యులవారి ప్రతిభా సామర్థ్యాలు  కాశీ పండితులు గుర్తించారు. క్రమంగా వారి అనుయాయులుగా మారిపోయారు. కాశీ నుంచి శంకరాచార్యులవారు ఆ రోజుల్లో మీమాంస దర్శనంలో ఉద్దండ పండితులైన కుమారిల భట్టు శిష్య గణాన్ని తనవైపు తీసుకుని వస్తే తన విజయానికి ఎదురులేదని భావించి కాశీ నుంచి ఆ పని గురించి బయల్దేరారు. ప్రారంభంలో ప్రతిష్టానపురంలో ఉన్న ప్రభాకరాచార్యులను నేరుగా వారి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. శంకరుని వాగ్ధాటికి శాస్త్రాలపై వారికున్న అవగాహనకు ప్రభాకరాచార్యులు వారి ముందు నతమస్తకులైనారు. ఇక్కడే ఇంకొక విచిత్ర సన్నివేశం జరిగింది. ప్రభాకరాచార్యులుగారి కొడుు పృథ్వీధరుడు అని ఉన్నాడు. పృథ్వీధరుడు సర్వజ్ఞాని. కానీ మూగవాడిలాగా ఉన్నాడు. అతనిలో ఉన్న అలౌకిక జ్ఞానాన్ని గమనించిన శంకరాచార్యులు పృథ్వీధరుడితో నెమ్మదిగా మాటలు కలిపి అతన్ని ప్రతిభా సామర్థ్యాలు గుర్తించి అష్టామలకుడు అనే పేరుతో తన ప్రముఖమైన శిష్యులుగా మలచుకున్నారు. ఆ తదుపరి కుమారిలభట్టు యొక్క శిష్యులలో ఉద్దండపండితుడైన మండనమిశ్రుని దగ్గరికి వెళ్లాడు. వారిరువురి మధ్య అనేక రోజులు శాస్త్ర చర్చలు జరిగాయి. చివరికి మండనమిశ్రుడు శంకరులవాదాన్ని అంగీకరించి ఆయన శిష్యులుగా మారిపోయారు. ఇదంతా చూసిన మండనమిశ్రుని సహధర్మచారిణి భారతి శంకరాచార్యులతో వాదన  చేసేందుకు సిద్ధపడింది. శంకరులు  అక్కడే ఉండి ఆ తల్లితో వాదన చేయాల్సి వచ్చింది. ఆ వాదనలో చివరికి ఆ తల్లి కూడా శంకరుని సామర్థ్యాన్ని అంగీకరించి తన భర్త సన్యాసానికి అంగీకరించింది. దీనితో శంకరాచార్యుల పనిలో ఒక ప్రముఖ ఘట్టం పూర్తయినట్లు. 

 


 

అక్కడి నుంచి శంకరాచార్యులవారు నేరుగా బౌద్ధులను ఎదుర్కొనేందుకు తక్షశిలకు చేరుకున్నారు. బౌద్ధుల ఉద్దండ పండితులతో శాస్త్ర చర్చలు, వాదోపవాదాలు హోరాహోరీగా జరిగాయి. ఆ రోజుల్లో బౌద్ధం ఒక రూఢీవాదంగా మారి స్వ, పర భేదాలు మరచిపోయి వ్యవహరిస్తోంది. దాని కారణంగా విదేశీయులతో కూడా ముప్పు ముంచుకొచ్చింది. ఆ విదేశీయులు బౌద్ధం స్వీకరించి భారత్ ను ఆక్రమించుకునేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. భారత్ లో ప్రాచీన సంప్రదాయాలు బలమైన వ్యవస్థ. వాటిని బలహీనం చేస్తేనే భారతదేశం యొక్క సాంఘిక వ్యవస్థ బలహీనపడుతుంది. తద్వారా ప్రజల్లో స్వాతంత్రేచ్ఛ నశిస్తుంది. ఈ లక్ష్యసాధనకు జరుగుతున్న ప్రయత్నాలను శంకరాచార్యులు వమ్ము చేశారు. తమ పూర్వుల మీద గౌరవం నశించినప్పుడు తమ జన్మభూమితో సంబంధాలు లేనిచోట వ్యతిరేకాత్మకమైన జాతీయ భావాలు ఉత్పన్నం కావటం స్వాభావికం. దేశమంటే మమత్వం లేకుండానే బౌద్ధం దేశాంతరాలకు వెళ్లింది. బౌద్ధులకు తమ  దేశ బంధువుల కంటే బౌద్ధ ధర్మ బంధువులే కావాల్సిన వారయ్యారు. దానితో దేశానికి చాలా సమస్యలొచ్చాయి. అందుకే శంకరాచార్యులవారు బౌద్ధ అనుయాయుల్లో ఈ దేశమంటే మమత్వం నిర్మాణం చేయటానికి ప్రయత్నించి సఫలమయ్యారు. బౌద్ధులతో జరిగిన శాస్త్ర చర్చల్లో విజయం సాధించి అక్కడి నుంచి కశ్మీరంవైపు బయల్దేరారు. కశ్మీరంలో శారదా మాత అనుగ్రహాన్ని సంపాదించుకొని అక్కడ పండితులతో అద్వైత సిద్దాంత చర్చలు జరిపి వారిని కూడా కలుపుకున్నారు. అక్కడి నుంచి తాంత్రిక విద్యలకు ప్రధాన కేంద్రమైన అస్సాం చేరుకున్నారు. అస్సాంలో తాంత్రీక పండితుల ద్వారా అనేక చిక్కు సమస్యలు ఎదుర్కొన్నారు. వారి ప్రయత్నాలన్నీ వమ్ము చేసి పూర్తిగా తనతో కలిపేసుకున్నారు. 

 



 

ఇట్లా  శంకరాచార్యులు ఆసేతు హిమాచలం మానస సరోవరం వరకు కాలినడకన ప్రయాణించి వేదాంత దర్శనంతో అద్వైత సిద్ధాంతంతో దేశంలో హిందూ ధర్మాన్ని శక్తిమంతం చేశారు. శంకరాచార్యుల ప్రయత్నం వల్ల దేశం ఒక ప్రక్క రూఢీవాదంలో పడిపోకుండా మరోప్రక్క నాస్తికవాదంలో కూరుకుపోకుండా భారతదేశాన్ని కాపాడారు. ఈ భావాలు నిరంతరం జాగృతంగా ఉండేందుకు దేశంలో 4 మూలలా నాలుగు పీఠాలు స్థాపించారు. వాటిని శంకర పీఠాలుగా మనం వ్యవహరిస్తుంటాం. 1. దక్షిణాన శృంగేరి, 2. ఉత్తరాన బదిరి, 3. తూర్పున పూరి, 4. పడమర ద్వారిక. తన శిష్యులను ఆ పీఠాలకు అధిపతులను చేశారు. ఆ పీఠాలు అప్పటి నుండి ఈ దేశంలో అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నాయి. ఈ దేశ చరిత్రకు కూడా సాక్షీభూతంగా నిలబడ్డాయి. అట్లా శంకరాచార్యులను అందరూ జగద్గురువుగా ప్రకటించారు. అటువంటి ఆధ్యాత్మికవేత్త శంకరులు తన 32 వ ఏటనే ఈ లోకాన్ని విడిచిపెట్టారు. 


 

ఆ తదుపరి కాలంలో ప్రపంచంలో క్రైస్తవం, ఇస్లాం, ఎడారి మతాలు పుట్టుకొచ్చాయి. అందులో 8వ శతాబ్దంలో అరేబియా మీది నుండి చెలరేగిన తుపానుకు యూనాన్, ఈజిప్టు, స్పెయిన్, పరిష్యా వంటి పెద్దపెద్ద దేశాలు సముూలంగా విధ్వంసమైనాయి. భారతదేశం మీద కూడా చాలా తీవ్రమైన దాడులు జరిగాయి. అయితే ఇస్లాం భారతదేశానికి వచ్చి సముద్రపు ఒడ్డునే దెబ్బతిని వెళ్లిపోయింది. కానీ దాని తరువాత ఇస్లాం రాజకీయ ఆక్రమణలు చాలా పెరిగిపోయాయి. ఈ దేశాన్ని జయించి వందల సంవత్సరాలు పరిపాలించి ఈ దేశాన్ని ఇస్లామీకరణ చేసేందుకు ప్రయత్నం చేశారు. భారతదేశం ఆ శక్తులతో శతాబ్దాలుగా పోరాటం చేసి తన అస్తిత్వాన్ని కాపాడుకుంది. ఆ పోరాటం ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఎడారి మతాల అల్లోకల్లోలాన్ని ఎదుర్కొనేందుకు ఆధ్యాత్మిక శక్తి, ధీశక్తి ఈ దేశంలో నిర్మాణం చేసినవారు ఆదిశంకరాచార్యులు. ఈ రోజున మన దేశం ఎదుర్కొంటున్న ఎడారి మతాలు, పాశ్చాత్య ఆలోచనలు ఈ రెండింటి నుంచి బయటపడాలి. మధ్యేమార్గంలో ప్రయాణం చేస్తూ తిరుగులేని తన ఆధ్యాత్మిక శక్తి, ధీశక్తితో భారతదేశం మళ్లీ జగద్గురువు కావాలి. సిందు నది నుండి బ్రహ్మపుత్ర వరకు, సేతువు నుండి శీతాచలం వరకు విస్తృతమైన మన మాతృభూమిలో గౌరవము, స్వాభిమానము నిర్మాణం చేయాలి. ఎడారి మతాల అనుయాయులైనవారు ఈ దేశం ఎడల మమత్వాన్ని కోల్పోయి ఉన్నారు. అలాగే పాశ్చాత్య సిద్ధాంతాల ప్రభావంలో ఉన్నటువంటివారు ఈ దేశం ఎడల ఒక వైర భావంతో వ్యవహరిస్తూ ఈ దేశాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు శక్తులలో ఈ దేశం ఎడల భక్తి, శ్రద్ధలను నిర్మాణం చేయటం అనేది ఇప్పుడు మన ముందున్న పెద్దసవాలు. ఆ కార్యాన్ని పూర్తి చేసేందుకు శంకరాచార్యులవారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ మార్గంలో మనం ప్రయాణించి మళ్లీ ఈ దేశాన్ని జగద్గురువుగా నిర్మాణం చేయాలి. 

 

- రాంపల్లి మల్లికార్జునరావు

  9440912192

Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత